Bhupendra Yadav
-
పార్లమెంట్లో అదే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై ఏమాత్రం పట్టువీడడం లేదు. బుధవారం సైతం ఎంపీల నినాదాలు, నిరసనల కారణంగా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రం తీరుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్లదుస్తులతో హాజరయ్యారు. అదానీ ఉదంతంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేశారు. దాంతో సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఉభయ సభల్లో రగడ కొనసాగుతూనే ఉంది. ప్రమాదంలో ప్రజాస్వామ్యం బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు జేపీసీ కోసం నినాదాలు ప్రారంభించారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 దాకా వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమయ్యాక సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్ అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు–2023ను ప్రవేశపెట్టారు. తర్వాత కాంపిటీషన్(సవరణ) బిల్లు–2022 ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి ప్రకటించారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కాగా, పలువురు సభ్యుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం సభ నిర్వహించవద్దని నిర్ణయించారు. అదానీ–మోదీ భాయి భాయి రాజ్యసభలోనూ ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ‘మోదీ–అదానీ భాయి భాయి’ అంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణపై విచారణకు జేపీసీకి డిమాండ్ చేశారు. దాంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అటవీ(సంరక్షణ) సవరణ బిల్లు–2023పై జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో బీజేపీ ఎంపీలు అశోక్ బాజ్‌పాయ్, అనిల్ బలూనీ, సమీర్ ఓరావాన్, సీఎం రమేశ్, ఏఐటీసీ ఎంపీ జవహర్ సిర్కార్, బీజేడీ ఎంపీ ప్రశాంత్ నందా, ఎడీఎఫ్ ఎంపీ హిషే లాచూంగ్పా, ఏజీపీ ఎంపీ బిరేంద్ర ప్రసాద్ భైష్యాను సభ్యులుగా నియమించారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. -
ఈపీఎఫ్‌వో సభ్యులకు ఈ పాస్‌బుక్
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈ–పాస్‌బుక్ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. దీంతో సభ్యులు తమ ఖాతా వివరాలను మరింత గ్రాఫికల్‌గా చూసుకోవచ్చని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈపీఎఫ్‌వోకు సంబంధించి 63 ప్రాంతీయ కార్యాలయాల్లో (100కు పైగా ఉద్యోగులు ఉన్న) క్రెచే సదుపాయాలను సైతం మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఉద్యోగులు తమ పిల్లలను ఇక్కడ విడిచి విధులు నిర్వహించుకోవచ్చు. పిల్లల సంరక్షణ బాధ్యతను అక్కడి సిబ్బంది చూసుకుంటారు. -
అవినీతి అంతం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో గత ఎనిమిదిన్నరేళ్లుగా జరుగుతున్న అవినీతి అంతం కావాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఇప్పటికే తెలంగాణలోని యువత, ఉద్యోగులు, రైతులు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఏకమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కోరుతూ బీజేపీ ముందుకు దూసుకెళ్తోందని.. త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సమక్షంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డా.శ్రావణి సహా పలువురు బీజేపీలో చేరారు. డీకే అరుణ పార్టీ కండువా కప్పి శ్రావణిని పార్టీ లోకి ఆహ్వా నించగా, భూపేంద్ర యాదవ్ పార్టీ సభ్యత్వ రశీదును అందించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కోసం డా.శ్రావణి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఎంతో అభినందనీయమన్నారు. మోదీ సైన్యంలో సైనికురాలిగా పనిచేస్తా డా.శ్రావణి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితురాలినై బీజేపీలో చేరానన్నారు. జగిత్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మోదీ సైన్యంలో ఒక సైనికురాలిగా పనిచేసేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. డీకే అరుణ మాట్లాడుతూ బీజేపీలో పెద్ద నాయకులు, చిన్న నాయకులు అనే తేడా ఏదీ లేదని, ప్రజలతో మమేకమై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న అందరినీ బీజేపీ గుర్తిస్తుందని తెలిపారు. -
బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి
న్యూఢిల్లీ: జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో తనను అణచివేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం తనను ఓదార్చలేదన్నారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే.. -
కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం జగన్ భేటీ
-
వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి
-
కన్నీళ్లను తుడిచేది సీమ ఎత్తిపోతలే
సాక్షి, న్యూఢిల్లీ: తరతరాలుగా కరువుతో తల్లడిల్లుతున్న సీమ కడగండ్లు తీర్చేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి తాగునీరు అందించేలా రాయలసీమ ఎత్తిపోతల ఎంతో ఉపకరిస్తుందని పథకం ఆవశ్యకతను వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వేగంగా మంజూరు చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. బుధవారం ఢిల్లీలో భూపేంద్రయాదవ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం సందర్భంగా పర్యావరణ అనుమతులతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. ఏకపక్షంగా నీటి విడుదల.. కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆపరేషనల్ ప్రొటోకాల్స్, ఒప్పందాలు, ఆదేశాలను ఉల్లంఘించడంతో కృష్ణాపై వాటా హక్కుల్ని ఏపీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. 2021–22, 2022–23లో సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచే విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వినియోగించడం ప్రారంభించిందన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడంతో పాటు బోర్డుకు ఎలాంటి ఇండెంట్ లేకుండా... నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాకు అవసరం లేనప్పటికీ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందన్నారు. నీటి పారుదల అవసరాల్లో విద్యుదుత్పత్తి అన్నది కేవలం యాదృచ్ఛికంగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల దిగువ వరకు నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే కానీ పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యం కాదని కేంద్రమంత్రికి వివరించారు. లేదంటే పోతిరెడ్డిపాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నైకి తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతల మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.. తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3 టీఎంసీలు), దిండి పథకాల గురించి గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వినియోగించుకోవడం కూడా సాధ్యపడదన్నారు. ఈ పరిస్థితుల నేప«థ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఎస్) అమలు చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరునగరి సుజల స్రవంతికి సరఫరా చేయగలుగుతామన్నారు. నిబంధనలు, ప్రొటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రయోజనాలు ప్రమాదంలో పడకుండా కాపాడాలన్నారు. ప్రధాన కాలువకు నీటిని అందించేందుకే.. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర అధికారులతో సమగ్ర చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే అందించామన్నారు. ఇందుకోసం భూ సేకరణ చేయడం లేదని, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి 10 కి.మీ దూరంలో ఉండడంతో పాటు కేవలం ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని అందించడం కోసమే ఎత్తిపోతలను చేపడుతున్నట్లు సీఎం వివరించారు. వీలైనంత త్వరలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి.. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని సీఎంజగన్ వివరించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తికి అనువైన స్థలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, వీటిని ప్రోత్సహించేందుకు పాలసీ కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆ తరహా ప్రాజెక్టులకు ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు లాంటి చోట్ల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుమతులు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోసం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు లోయర్ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల (1,350 మెగావాట్లు) పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల ప్రగతికోసం చేపట్టిన ఆయా ప్రాజెక్టులన్నింటికీ అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 3 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు ‘‘ఏపీ 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ఉందని సీఎం జగన్ కేంద్రమంత్రికి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు తీరప్రాంతంలో 10 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 మార్చి నాటికి పోర్టు కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని అవసరమైన సమాచారాన్ని కూడా అందజేశామన్నారు. ఈ పనులను వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అనుమతులిచ్చి సహకారం అందించాలని కోరారు. -
పురుగుమందుల వాడకంపై టార్గెట్లు వద్దు
మాంట్రియల్: ప్రపంచవ్యాప్తంగా పంట సాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించే క్రమంలో లక్ష్యాలు విధించడం సరికాదని భారత్ పేర్కొంది. పెస్టిసైడ్స్ వాడకంపై విచక్షణను ఆయా దేశాలకే వదిలివేయాలని సూచించింది. వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వడాన్ని సమర్థించింది. జీవ వైవిధ్యంపై కెనడాలోని మాంట్రియెల్‌లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్(కాప్15) ఉన్నత స్థాయి సదస్సులో శుక్రవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడారు. పురుగుమందుల వాడకం తగ్గింపు విషయంలో ప్రపంచ దేశాలపై సంఖ్యాత్మక లక్ష్యాలను విధించడం తగదన్నారు. ఆ అంశాన్ని ఆయా దేశాలకే వదిలివేయాలని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులకు తగ్గించాలన్న గ్లోబల్ బయో డైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో 17% భారత్‌లోనే ఉండగా, కేవలం 2.4% భూభాగం, 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు సహా వ్యవసాయ రంగంపై భారత ప్రభుత్వం ఏటా 2.2 లక్షల కోట్లను సబ్సిడీగా ఇస్తున్నట్లు ఒక అంచనా. కాప్15 సదస్సుకు 196 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
బీసీల రిజర్వేషన్లు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, బీసీ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్లు ఢిల్లీలో కేంద్ర కార్మిక, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు సంబంధించిన 15 అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించామని తెలిపారు. విద్యా, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలని కోరినట్టు తెలిపారు. -
కేసీఆర్ పాలనపై జనం విరక్తి
నర్సాపూర్/ చౌటుప్పల్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు సీఎం కేసీఆర్ పాలనపై విరక్తితో ఉన్నారని కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్రయాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా పదవి పొందిన తర్వాత.. రాష్ట్రాన్ని పక్కనపెట్టి తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. దళిత బంధు వంటి పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని.. అవి కేవలం టీవీల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని భూపేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రజలకు చేరడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలన నచ్చకే: బండి సంజయ్ సీఎం కేసీఆర్ అరాచక, అవినీతి పాలన నచ్చకనే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ వైపు వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30 వేలకోట్ల నుంచి రూ.లక్షా 30వేల కోట్లకు పెంచి.. లక్ష కోట్లు కొట్టేశారని విమర్శించారు. సీఎం కుటుంబం దుబాయ్, అమెరికా, మస్కట్ వంటి దేశాలకు వేలకోట్ల రూపాయలు తరలించుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో పేదోళ్ల రాజ్యం కోసం బీజేపీ కృషి చేస్తోందని, అందరి భాగస్వామ్యంతో విజయం సాధిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ టెంట్ ఎగిరిపోతుంది మునుగోడులో బీజేపీ గెలుస్తుందని, టీఆర్ఎస్ టెంట్ ఎగిరిపోవడం ఖాయమని కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భూపేంద్రయాదవ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకోసమే తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. ప్రతి పల్లెకు అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించడమే బీజేపీ ధ్యేయమన్నారు. ఈటల సమక్షంలో బీజేపీలోకి మురళీయాదవ్ దంపతులు ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఆమె భర్త నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌తోపాటు పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, హైదరాబాద్‌కు చెందిన శ్యామ్ సుందర్ తదితరులు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేసే దాక తాము విశ్రమించబోమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎంతో మంది బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిపారు. మునుగోడు గడ్డ మీద కూడా ఎగిరేది కాషాయ జెండానేనని, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మీద ఎగిరే జెండా బీజేపీ జెండానేనని చెప్పారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు చరమగీతం పాడితేనే తెలంగాణ గోస తీరుతుందని వ్యాఖ్యానించారు. -
వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: వ్యవసాయం కాకుండా, 9 రంగాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో ఈ రంగాల్లో మొత్తం ఉపాధి అవకాశాలు 3.18 కోట్లకు పెరిగినట్టు కేంద్ర కార్మిక శాఖ త్రైమాసికం వారీ ఉపాధి సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం/రెస్టారెంట్, ఐటీ/బీపీవో, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ ఉద్యోగాలు వచ్చినట్టు తెలిపింది. ఇదీ చదవండి : Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో! 2021 జనవరి 1 నాటికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 3.08 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 3.18 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. కరోనా ఆంక్షల తొలగింపుతో ఆర్థికరంగ కార్యకలాపాలు ఊపందుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంఘటిత రంగంలో ఉపాధికి సంబంధించి కీలక సమాచారం కోసం త్రైమాసికం వారీగా ఉపాధి సర్వేను కేంద్ర కార్మిక శాఖ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 12,000 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ 9 రంగాల్లో కలిపి ఉపాధి అవాకాశాలు 2013–14 నాటి సర్వే నాటికి 2.37 కోట్లుగా ఉండడం గమనార్హం. తయారీలో ఎక్కువ.. ఈ గణాంకాల్లో అత్యధికంగా తయారీ రంగంలో 38.5 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత విద్యా రంగంలో 21.7 శాతం, ఐటీ/బీపీవో రంగంలో 12 శాతం, ఆరోగ్య రంగంలో 10.6 శాతం మందికి ఉపాధి కల్పన జరిగింది. ఈ నాలుగు రంగాల్లోనే 83 శాతం మంది పనిచేస్తుండడం గమనార్హం. -
భారతదేశం శ్రామికుడి శక్తి : ప్రధాని
తిరుపతి అర్బన్/తిరుపతి కల్చరల్: కార్మికుల సదస్సుకు పవిత్ర స్థలాన్ని వేదిక చేసుకోవడం అభినందనీయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తిరుపతి నగరంలోని తాజ్ హోటల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం, సహజవాయు శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ నేతృత్వంలో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గురువారం వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని తెలియజేశారు. భారతదేశం శ్రామికుల శక్తిగా అభివర్ణించారు. శ్రామికశక్తిని సామాజిక పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం శ్రామికుల సంక్షేమం, భద్రత కోసం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన, సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన తదితర పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది కార్మికులు దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఏడాదికి 28కోట్ల మందికి 400 ప్రాంతాల్లో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. దేశాన్ని ఒక్కటి చేయడంలో కార్మికుల పాత్ర అభినందనీయమన్నారు. గత 8 ఏళ్లుగా బానిసత్వం, పూర్వకాలపు చట్టాల రద్దుతోపాటు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా 29కార్మిక చట్టాలు, 4 సాధారణ చట్టాలుఘౠ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సాధికారత, కనీస వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. విజన్ 2047 నాటికి కార్మికశాఖ ప్రత్యేక ముందుచూపుతో నడుస్తుందని, ఎన్నో మార్పులతో కార్మికుడికి మంచి జరుగుతుందన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్పు చేయడానికి దోహదపడుతుందన్నారు. మహిళా కార్మికశక్తిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవన కార్మికుల సెస్ వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో పలు రాష్ట్రాలు రూ.38 వేల కోట్లు ఉపయోగించలేదన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నేతల అరెస్ట్ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న కార్మిక మంత్రుల జాతీయ సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ పి.మధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ సహా పలువురు నేతలు అరెస్టయిన వారిలో ఉన్నారు. -
పీరియడ్స్‌లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్‌లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
సంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలో బలపడుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో తొమ్మిది పరిశ్రమలలో దాదాపు 3.14 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందారని, ఇది సంఘటిత రంగంలో ఉపాధిలో పెరుగుతున్న ధోరణిని సూచిస్తోందని ఆయన ఒక ట్వీట్ చేశారు. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 3.10 కోట్లని తెలిపారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) సర్వే నివేదికలోని గణాంకాలను ఆయన ఉటంకించారు. గురువారం విడుదలైన నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తొమ్మిది రంగాలు– తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, వసతి/రెస్టారెంట్లు, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవల విభాగాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించి ఉపాధి డేటా ప్రాతిపదికన ఈ గణాంకాలు వెలువడ్డాయి. మొత్తం ఉపాధి రంగంలో ఈ తొమ్మిది రంగాల వాటా దాదాపు 85 శాతం. ► నివేదిక ప్రకారం అంచనా వేసిన మొత్తం కార్మికుల సంఖ్యలో దాదాపు 39 శాతం వాటాతో తయారీ రంగం మొదటి స్థానంలో నిలిచింది. తరువాత విద్యా రంగం 22 శాతంతో ఉంది. సమీక్షా కాలంలో తయారీ రంగంలో అత్యధికంగా 124 లక్షల మంది కార్మికులు ఉన్నారు. విద్యా రంగం 69.26 లక్షల మందిని కలిగిఉంది. ► వాటి తర్వాత ఐటీ/బీపీఓలు (34.57 లక్షలు), ఆరోగ్యం (32.86 లక్షలు), వాణిజ్యం (16.81 లక్షలు), రవాణా (13.20 లక్షలు), ఆర్థిక సేవలు (8.85 లక్షలు), వసతి/రెస్టారెంట్లు (8.11 లక్షలు), నిర్మాణ (6.19 లక్షలు) రంగాలు ఉన్నాయి. ► దాదాపు అన్ని (99.4 శాతం) విభాగాలు వేర్వేరు చట్టాల క్రింద నమోదయ్యాయి. ► మొత్తంమీద, దాదాపు 23.55 శాతం యూనిట్లు తమ కార్మికులకు ఉద్యోగ శిక్షణను అందించాయి. తొమ్మిది రంగాల్లో ఆరోగ్య విభాగంలోని 34.87 శాతం యూనిట్లు ఉద్యోగ శిక్షణను అందించగా, ఐటీ/బీపీఓల వాటా ఈ విషయంలో 31.1 శాతంగా ఉంది. ► కార్మిక మంత్రిత్వశాఖ నియంత్రణలో లేబర్ బ్యూరోతో ఈ సర్వే జరిగింది. వ్యవసాయేతర సంస్థల్లోని మొత్తం ఉపాధిలో ఎక్కువ భాగం ఈ తొమ్మిది ఎంపిక చేసిన రంగాలదే కావడం గమనార్హం. వ్యవస్థీకృత, అసంఘటిత విభాగాలలో ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహణ జరుగుతుంది. -
40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..?
న్యూఢిల్లీ: మధ్య తరగతి వేతన జీవికి భారీ నిరాశ. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5 నుంచి ఏకంగా 8.1 శాతానికి తగ్గుతోంది. ఇది దాదాపు 6 కోట్ల మంది సభ్యులపై ప్రభావం చూపనుంది. మార్చి 31తో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శనివారం నిర్ణయించింది. 4 దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు! 1977–78లో 8 శాతముండగా తర్వాత ఏటా కనీసం 8.25, ఆపైనే ఉంటూ వచ్చింది. రూ.76,768 కోట్ల అంచనా ఆదాయం ఆధారంగా తాజాగా వడ్డీని నిర్ణయించారు. దీపావళి నాటికి సభ్యుల ఖాతాల్లో కొత్త వడ్డీ జమవుతుంది. ప్రావిడెంట్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఇతర చిన్న పొదుపు పథకాలతో సమానంగా 8 శాతం కంటే తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖపై ఆర్థిక శాఖ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేటు 4 నుంచి 7.6 శాతం మధ్య ఉంది. రుణం, ఈక్విటీ నుండి వచ్చే ఆదాయాలను బట్టి వడ్డీ చెల్లింపును లెక్కిస్తారు. కరోనా దెబ్బ ఈపీఎఫ్వోఆదాయాన్ని కరోనా దెబ్బతీసింది. కోవిడ్ నేపథ్యంలో అధిక ఉపసంహరణలు, తక్కువ విరాళాలను ఈపీఎఫ్‌వో ఎదుర్కొంది. 2021 డిసెంబర్ 31 నాటికి అడ్వాన్స్ సౌకర్యం కింద రూ.14,310.21 కోట్లు అందించి 56.79 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. దీంతో 2019–20 చెల్లింపులు ఆలస్యమయ్యాయి. వడ్డీనీ రెండు వాయిదాలలో చెల్లించారు. 2021–22లో ఈపీఎఫ్వోరూ.3,500 కోట్ల లోటు నమోదు చేసింది. ఈపీఎఫ్‌వో కార్పస్ 13 శాతం పెరిగినా వడ్డీ ఆదాయం 8 శాతమే పెరిగినట్టు సమాచారం. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందనేందుకు వడ్డీ రేటు తగ్గడం నిదర్శనమని సీబీటీ సభ్యుడు ఏకే పద్మనాభన్ అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ దృష్ట్యా సామాజిక భద్రతతో కూడిన పెట్టుబడి సమతుల్యతను కొనసాగించడం తమ ప్రాధాన్యత అని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. जिस प्रकार की अंतरराष्ट्रीय परिस्थिति और equity बाज़ार की स्थिति बनी है, उसमें निवेश के साथ सामाजिक सुरक्षा को भी रखना है। हम बहुत हाई रिस्क वाले इंस्ट्रुमेंट को नहीं ले सकते है। वो मार्केट करने के लिए हम लोग नहीं है, हम मार्केट की एक स्थायित्व, सामाजिक सुरक्षा के लिए है। pic.twitter.com/b9P6FAEZKn — Bhupender Yadav (@byadavbjp) March 12, 2022 చదవండి: ఉద్యోగులకు బిగ్‌షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
‘అరణ్య’ రోదన!
వృక్ష భక్షణ, వన సంహారం గురించే ఎక్కువగా వినబడే దేశంలో అటవీ ఆచ్ఛాదన పెరిగిందనే కబురు ఊరటనిస్తుంది. గత రెండేళ్లలో 1,540 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించాయని తాజా నివేదిక చెబుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఈమధ్య విడుదల చేసిన భారత అటవీ స్థితిగతుల నివేదిక(ఐఎస్ఎఫ్ఆర్) ఎంతో ఆశావహమైన చిత్రాన్ని పరిచింది. మనిషికీ, మొక్కకూ ఉండేది పేగు బంధం లాంటిది. మరణించేవరకూ అనుక్షణం మనిషి సుఖసంతోషాలతో ముడిపడి, ఎడతెగని బంధంగా నిలిచేది ప్రకృతే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఎడాపెడా అడవులు నరకడమంటే పుడమి తల్లికి కడుపు కోతను మిగల్చడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో అడవుల విస్తరణకు ఈసారి ప్రధాన కారణమయ్యాయి. ఇందులో 647 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్ అగ్ర భాగాన ఉండగా తెలంగాణ(632 చదరపు కిలోమీటర్లు), ఒడిశా(537 చదరపు కిలోమీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 1987తో మొదలుపెట్టి ప్రతి రెండేళ్లకూ మన దేశం అటవీ భూముల సర్వే గణాంకాలను వెల్లడిస్తోంది. ఆ వరసలో ఇది 17వ నివేదిక. పౌరుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంచడానికి ఈ నివేదికలు అవసరం. దేశంలో కనీసం 33 శాతం భూభాగం అడవులతో నిండి ఉంటేనే పర్యావరణ సమతూకం సరిపోతుందని ఏడు దశాబ్దాలనాటి తొలి జాతీయ అటవీ విధానం లెక్కలేసింది. ఆ తర్వాతి కాలంలో పర్యావరణ చైతన్యం వెల్లివిరిసింది. 1988లో మలి జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించేనాటికి భూగోళం సురక్షితంగా ఉండటానికి అటవీ సంరక్షణ అత్యంత కీలకమైనదన్న అవగాహన ఏర్పడింది. కానీ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదారవాద విధానాల వల్ల నానాటికీ అడవులు తరిగిపోతున్న సంగతి చేదు నిజం. ఈ పరిస్థితిలో అడవుల విస్తీర్ణం పెరిగిందన్నది చల్లని కబురుకిందే లెక్క. కానీ తరచి చూస్తే వెల్లడవుతున్న వాస్తవాలు వేరు. పెరిగిన హరిత ఆచ్ఛాదనకన్నా దట్టమైన అరణ్యాలకు కలిగిన నష్టాలే అధికమని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో గత రెండేళ్లలో 1,643 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవులు నాశనమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చడానికి మూడో వంతు ప్రాంతంలో... అంటే 549 చదరపు కిలోమీటర్ల అటవీయేతర భూముల్లో త్వరితగతిన పెరిగే మొక్కలు నాటామని చెబు తున్నారు. అయితే సహజసిద్ధంగా పెరిగే అరణ్యాలతో ఇవి సాటిరాలేవు. పర్యావరణానికి వీటివల్ల కలిగే మేలు తక్కువ. ఈ సంగతిని ఏడేళ్లక్రితమే ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ సంస్థ ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) దృష్టికి తీసుకొచ్చింది. అడవి నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఆ నిర్వచనం అడవులతో పెనవేసుకుని ఉండే మొత్తం సాంస్కృతిక సంపదను ప్రతి ఫలించాలని సూచించింది. ఒకే రకమైన మొక్కలు పెంచుతూ, ఆ ప్రాంతాన్ని అడవిగా భావించ మనడం సరికాదని తెలిపింది. అడవి అంటే అందులో సహజసిద్ధంగా పెరిగే వైవిధ్యభరిత వృక్ష జాతులు, అక్కడ స్వేచ్ఛగా సంచరించే సమస్త జంతుజాలం... అన్నిటికీ మించి అడవిని అమ్మగా భావించుకుని, దాని ఆలంబనతో జీవనం సాగిస్తున్న ఆదివాసీలు. ఇంకా అక్కడి భూముల్లో సహజసిద్ధంగా ఏర్పడే వాగులు, వంకలు... అక్కడి నేలలో నిక్షిప్తమై ఉండే భూగర్భ జలాలు తదిత రాలు. ఆదివాసీలకు అక్కడుండే చెట్లపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. అవి ఇచ్చే పండ్లు, ఫలాల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి పరిజ్ఞానం ఉంటుంది. ఏదో ప్రాజెక్టు కోసం అడవిని సంహరించి, వాటి స్థానంలో మొక్కలు పెంచితే ఇవన్నీ తిరిగి యధాతథంగా వచ్చి చేరతాయా? ఆదివాసీల జీవితాలు మళ్లీ చిగురిస్తాయా? ప్రభుత్వాలు నిజాయితీగా ఆలోచించాలి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, సిక్కింలలో 1,020 చదరపు కిలోమీటర్ల నిడివిలోని అడవి ఈ రెండేళ్లలో కనుమ రుగైందని విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. దేశ అటవీ విస్తీర్ణంలో ఈశాన్య రాష్ట్రాల వాటా 23.75 శాతం. వాస్తవానికి ఈ రాష్ట్రాల్లో దట్టమైన అరణ్యాలున్నాయి. అద్భుతమైన జీవ వైవిధ్యతకు ఇది పుట్టిల్లు. కనుక ఇక్కడి అడవులు తరిగిపోతున్నాయంటే పర్యావరణవేత్తలు ఆందోళనపడతారు. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా అడవులకు శాపంగా మారుతున్నాయన్నది వాస్తవమే. కానీ మనిషి చేసే అపచారం కూడా ఉంది. కారణాలేమైనా అడవులు తరుగుతుంటే ఆ ప్రాంతంలోని కొండచరియలు విరిగి పడతాయి. నీటి వనరుల లభ్యత తగ్గుతుంది. ఈసారి నివేదిక విశిష్టతే మంటే... ఇందులో పులులు, సింహాలు ఉండే అభయారణ్యాల స్థితిగతులేమిటో చెప్పడం. 2030 నాటికి భూతాపం పెరగడం వల్ల అడవులపై దాని ప్రభావం గణనీయంగా పడవచ్చునని నివేదిక అంచనా వేస్తోంది. వీటన్నిటి సంగతలా ఉంచి అడవుల విస్తీర్ణత కొలిచేటపుడు కాఫీ ప్లాంటేషన్లు, కొబ్బరి, మామిడి, ఇతర ఫలసాయాన్ని అందించే తోటలు వగైరాలను అడవులుగా లెక్కేసే తీరు మారాలి. వందలాది రకాల వృక్షజాతులతో సహజసిద్ధంగా ఏర్పడే అరణ్యాలనూ, ఒకే రకం చెట్లతో నిండివుండే పండ్ల తోటలనూ సమానంగా పరిగణించడం వల్ల దేశంలో అడవులు పెరిగాయన్న అభిప్రాయం కలిగించవచ్చు. కానీ అది లక్ష్యసాధనకు ఏమాత్రం తోడ్పడదు. అందువల్ల పర్యా వరణానికి కలిగే ప్రయోజనం కూడా శూన్యం. -
హరితాంధ్రప్రదేశ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2021’ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం విడుదల చేశారు. ఇందులో గత రెండేళ్లలో ఏపీ 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల సాధించి టాప్‌లో నిలిచింది. 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో, 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. గత రెండేళ్లలో దేశంలోని మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల నమోదైందని నివేదిక వెల్లడించింది. ఇందులో అడవుల విస్తీర్ణం 1,540 చదరపు కిలోమీటర్లు, చెట్ల విస్తీర్ణం 721 చదరపు కి.మీ అని తెలిపింది. 2021లో దేశంలో మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లుండగా.. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతమని నివేదిక తెలిపింది. మొత్తం భౌగోళిక ప్రాంతంలో అత్యధిక అటవీ విస్తీర్ణమున్న రాష్ట్రాల్లో మిజోరం (84.53%), అరుణాచల్‌ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%), నాగాలాండ్ (73.90%) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కి.మీ ఉండగా.. 2019తో పోలిస్తే 17 చదరపు కి.మీ పెరుగుదల నమోదైందని తేలింది. దేశంలోని అడవుల్లో కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులుండగా, 2019తో పోలిస్తే 79.4 మిలియన్ టన్నుల పెరుగుదలగా గుర్తించారు. -
Team Modi: బాధ్యతల్లో కొత్త మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా చేరిన అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవియా తదితరులు తమకు కేటాయించిన శాఖల మంత్రులుగా గురువారం బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌కు అత్యంత కీలకమైన రైల్వే శాఖతోపాటు కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. రైల్వే, టెక్స్టైల్స్ శాఖల సహాయ మంత్రిగా దర్శనా విక్రమ్ జర్దోష్ చార్జ్ తీసుకున్నారు. అనురాగ్ ఠాకూర్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత కట్టబెట్టారని, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఠాకూర్ అన్నారు. ఇక గుజరాత్‌కు చెందిన మన్సుఖ్ మాండవియా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్, న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రిగా వీరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో సహాయ మంత్రులుగా ప్రతిమా భౌమిక్, ఎ.నారాయణస్వామి బాధ్యతలు తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్రసింగ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పురుషోత్తం రూపాల బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ సహాయ మంత్రిగా సుభాష్ సర్కార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ముంజపారా మహేంద్రభాయ్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్‌కుమార్ సింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, పునరుత్పాదక ఇంధన వనరులు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా భగవంత్ ఖుబా, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా భగవత్ కిషన్‌రావు కరాడ్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ బాధ్యతలు స్వీకరించారు. -
యడియూరప్పకు పదవీ గండం తప్పదా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు పలువురు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పలు రాష్ట్రాలకు బీజేపీ విస్తరిస్తోన్న నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతోన్న నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అదే బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేంద్ర యాదవ్ అనూహ్యంగా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర పర్యటనకు వెళ్లడంతో అక్కడి పార్టీ సీఎం యడియూరప్పకు పదవీ గండం తప్పదనే ప్రచారం ఊపందుకుంది. యడియూరప్పతో సహా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులకు కూడా భూపేంద్ర యాదవ్ పర్యటన గురించి చివరి నిమిషం వరకు తెలియకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే యడియూరప్పను ఇప్పటికిప్పుడు మార్చే ఆలోచనేమీ లేదని భూపేంద్ర యాదవ్ స్వయంగా ప్రకటించడంతో సమీప భవిష్యత్తులో ఆయన్ని మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడే అక్కడ రాష్ట్ర నాయకత్వ మార్పునకు సంబంధించి మొదటిసారి చర్చ మొదలయింది. అంతకుముందు నెల యడియూరప్ప ఢిల్లీకి రావడం కూడా అనుమానాలు దారితీసింది. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తానని యడియూరప్ప ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు ప్రకటించారు. అయితే దాన్ని ఇప్పటి వరకు నెరవేర్చలేక పోయారు. పార్టీ కేంద్ర నాయకత్వం సమ్మతి లేకపోవడం వల్లనే మంత్రివర్గాన్ని ఆయన విస్తరించలేక పోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర పార్టీ నాయకత్వాన్ని సంప్రతించి త్వరలో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాల్సిందిగా యడియూరప్పకు తన పర్యటన సందర్భంగా భూపేంద్ర యాదవ్ సూచించినట్లు తెల్సింది. తాను కూడా రాష్ట్ర కేబినెట్ విస్తరణపై పార్టీ ఇతర నాయకుల అభిప్రాయాలను కూడా ఆయన సేకరించి వెళ్లినట్లు తెలుస్తోంది. (చదవండి: యడియూరప్ప స్థానంలో యువ సీఎం!) -
ఉద్వేగానికి లోనయిన కార్తీక రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావించి చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి ‘గ్రేటర్’ ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నానని, తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండ కార్తీక ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం ధారబోశాను. కానీ నాకు ఇవ్వాల్సిన టికెట్‌ను ఆ పార్టీ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించింది. ఈసారి మేయర్ సీటు బీజేపీదే. ఓటమి భయంతోనే మంత్రి కేటీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు. అంతిమంగా బీజేపీనే విజయం వరిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఇక బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అన్నారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్ళ ఎక్కడని పేదలు అడుగుతున్నారు. వారికి కేసీఆర్ సర్కారు సమాధానం చెప్పాలి. అసలు మీరేం చేశారు’’అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్ మేయర్ పీఠం తమ పార్టీకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: గ్రేటర్ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం) కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ విజయం సాధించే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాషాయ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు వల వేస్తూ మంతనాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి పది గంటల తర్వాత బీజేపీ నాయకులు కాంగ్రెస్ అసంతృప్త నేతల ఇళ్ళకు వెళ్లినట్లు సమాచారం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఇళ్ళకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వారితో చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలతో పాటుగా సనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దేవి ప్రసాద్ నివాసానికి కూడా కాషాయ పార్టీ నేతలు వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి.(చదవండి: నేను ఫైటర్ని.. దేనికి భయపడను : కేసీఆర్) -
సరోగసీకి దగ్గరి బంధువులే కానక్కర్లేదు
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చనీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ తేల్చి చెప్పింది. 35–45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సరోగసీ తల్లులుగా దగ్గరి బంధువులే ఉండాలన్న నిబంధనను అద్దెగర్భాల తల్లులపై పరిమితులు సృష్టిస్తుందనీ, అందుకే దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. ఒంటరి స్త్రీలంతా సరోగసీకి అర్హులేననీ, భర్తలేకున్నా, భర్తతో విడిపోయినా, భర్త చనిపోయిన స్త్రీలకూ సంతానాన్ని పొందే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. భారతీయురాలైన 35–45 ఏళ్ల మధ్యవయస్సులో ఉన్న స్త్రీలు ఇందుకు అర్హులంది. అద్దెగర్భాన్ని వ్యాపారంగా మార్చొద్దని హెచ్చరించింది. లాభాపేక్షతో కాకుండా మాతృత్వపు విలువలను కాపాడేవిధంగా సరోగసీని అనుమతించాలని అభిప్రాయపడింది. సరోగసీ(రెగ్యులేషన్) బిల్లు–2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ బుధవారం నివేదికను సమర్పించారు. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బృందం సరోగసీ రెగ్యులేషన్ బిల్లులో పలు మార్పులను సూచించింది. ► అదేవిధంగా సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధనను కూడా కమిటీ సడలించింది. సంతానలేమిని కొత్తగా నిర్వచించిన కమిటీ పిల్లల కోసం ఒక జంట ఐదేళ్ళపాటు ఎదురుచూడడం చాలా ఎక్కువ కాలం అవుతుందని పేర్కొంది. ► ఇష్టమైన ఏ స్త్రీ అయినా సరోగసీ ద్వారా బిడ్డలను కనే అనుమతినివ్వాలనీ, అయితే అందుకు సంబంధించిన అన్ని విషయాలూ సరోగసీ చట్టప్రకారమే జరగాల్సి ఉంటుందనీ తెలిపింది. అలాగే అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్‌ను 36 నెలలకు పెంచాలని సూచించింది. ► పిల్లలు పుట్టని వారుసైతం సరోగసీ ద్వారా బిడ్డను పొందేందుకు ఐదేళ్ళు వేచి ఉండాలన్న నిబ«ంధనను తొలగించాలని అభిప్రాయపడిన కమిటీ పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలుంటాయని వివరించింది. కొందరికి పుట్టుకతోనే గర్భాశయం లేకపోవడం, లేదా గర్భాశయం పనిచేయకపోవడం, క్యాన్సర్‌కారణంగా గర్భాశయాన్ని తొలగించాల్సి రావడం, కొందరు స్త్రీలకు ఎప్పటికీ పిల్లలను కనే అవకాశంలేని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి సరోగసీ ఒక ప్రత్యామ్నాయమని అభిప్రాయపడింది. ► బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ► అలాగే భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతిపొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలని కమిటీ సూచించింది. -
‘కమలా’ధీశుడు ఎవరో..?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఎవరు నియమితులవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉంటూనే అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవిలో ఉండాలనేది బీజేపీ సంప్రదాయం. కాబట్టి షా పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. బీజేపీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా స్థానాన్ని మరొకరు భర్తీ చేసి, ఆయనలా పనిచేయాలంటే చాలా కష్టమైన పనే. అయితే కొత్త చీఫ్‌గా కాస్త తక్కువ వయసు ఉన్న అలాగే పార్టీ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి నియమితులు కావొచ్చనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజస్తాన్ వ్యక్తి భూపేంద్ర యాదవ్, అలాగే కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జేపీ నడ్డాల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడైన నడ్డాను మోదీ ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. గత ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. అలాగే పార్టీ అగ్రనాయకులు, ఆరెస్సెస్ ఆశీస్సులు నడ్డాకు బాగా ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైనందున, తగినంత అనుభవం కూడా నడ్డాకు ఉంది. మరోవైపు పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో అమిత్ షాకు భూపేంద్ర యాదవ్ ఎంతో సాయం చేస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమిత్ షా కూడా భూపేంద్ర యాదవ్‌ను బాగా నమ్ముతారు. గతేడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్ గుజరాత్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్ పేరు కూడా కొత్త చీఫ్ రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుసగా మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. -
లోక్‌సభకి రాహుల్‌పై సభ హక్కుల ఉల్లంఘన నోటీస్
న్యూ ఢిల్లీ : సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజ్యసభలో నమోదైన సభ హక్కుల ఉల్లంఘన నోటీస్‌ని ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, శనివారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కి పంపారు. అరుణ్ జైట్లీ పేరులోని జైట్లీని ఒత్తి పలికి అమర్యాదపూర్వకంగా అర్థం వచ్చేలా వ్యవహరించారని వారం క్రితం రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్ రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై రాహుల్ అసభ్య పదజాలాన్ని వాడారని ఆరోపించారు. రాహుల్ లోక్‌సభ సభ్యుడు కావడంతో ఈ ప్రివిలేజ్ మోషన్ని లోక్‌సభకు పంపారు. వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై డిసెంబర్ 27న జైట్లీ రాజ్యసభలో వివరణ ఇస్తూ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని పేర్కొన్నారు.దీనిపై రాహుల్ ట్విట్టర్లో జైట్లీని.. జైట్-లై(అబద్ధాలకోరు) అని అభివర్ణించారు. మీకు ధన్యవాదాలు. మన ప్రధాని చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం అంటూ ట్వీట్ చేశారు. -
16న యూపీ–బీజేపీ శాసనసభాపక్షం భేటీ!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం మార్చి 16న జరిగే వీలుంది. రాష్ట్రానికి సీఎంని నియమించే పనిలో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. రాష్ట్రానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి వెంకయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లు నియమితులయ్యారు. 16న జరిగే సమావేశంలో వెంకయ్య, యాదవ్‌లు పాల్గొని, ఎమ్మెల్యేలను సంప్రదించి, సీఎం అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు నివేదిస్తారు. హోం మంత్రి రాజ్‌నాథ్ , రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తదితరుల పేర్లు సీఏం పదవికి పరిశీలనలో ఉన్నాయి. మళ్లీ సీఎంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వెనక్కు రావడానికి రాజ్‌నాథ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఒక పాత్రికేయుడు రాజ్‌నాథ్‌ను వివరణ కోరగా ఆయన ‘రామ్ రామ్’అంటూ వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన 403 మంది పేర్లతో కూడిన జాబితాను యూపీ ముఖ్య ఎన్నికల అధికారి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించారు. -
జవదేకర్ ను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: గుజరాత్లో జరిగిన తులసీరాం ప్రజాపతి భూటకపు ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రకాశ్ జవదేకర్, భూపేంద్ర యాదవ్‌లను సీబీఐ శుక్రవారం ప్రశ్నించింది. స్వతంత్ర జర్నలిస్ట చేసిన శూలశోధనలో లభించిన ఆధారాలపై వారిని విచారణ చేసింది. కేసును నిర్వీర్యం చేసే దిశగా బాధితుడి తల్లి నర్మదాబాయిని ఏవిధంగా ఒప్పించాలనే అంశాలపై వీరు చర్చిస్తుండగా లభించిన వీడియో టేపులపై వివరాలు రాబట్టింది. ఈ వీడియోలో దర్శనమిచ్చిన బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్‌పాల్‌కు కూడా సీబీఐ సమన్లు పంపింది. తన కుమారిడిది భూటకపు ఎన్కౌంటర్ అని, దీనిలో నరేంద్ర మోడీ అనుచరుడు అమిత్‌షా హస్తం ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, సోహ్రబుద్దీన్ హత్య కేసులో ప్రజాపతి ప్రధాన సాక్షి. అయితే స్టింగ్ ఆపరేషన్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, సీబీఐ పిలిచినందువల్ల వచ్చానని విచారణ అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద జవదేకర్ చెప్పారు.