న్యూఢిల్లీ: జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో తనను అణచివేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం తనను ఓదార్చలేదన్నారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్‌ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే..
Comments
Please login to add a commentAdd a comment