joins BJP
-
బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్
కొచ్చి: కేరళ తొలి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్ శ్రీలేఖ జేపీలో చేరారు. ధవారం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్రీలేఖ.. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర కేడర్‌లో మొదటి మహిళా ఐపీఎస్. ఇక.. 2020లో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. తన నివాసంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ నుండి అధికారికంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన తర్వాత ఆమె అన్నారు.బీజేపీలో చేరిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘ 33 ఏళ్లు పార్టీలకతీతంగా ఐపీఎస్ అధికారిగా పనిచేశా. కానీ నా పదవీ విరమణ తర్వాత చాలా సమస్యలను దూరం నుంచి చూడటం ప్రారంభించా. ప్రజాసేవ చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గమని నాకు అర్థమైంది. బీజేపీ పార్టీ ఆదర్శాలపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నారామె. -
బీజేపీలో చేరిన స్టీల్ టైకూన్.. గంటల్లోనే టికెట్!
పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అలా చేరారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు బీజేపీ టికెట్ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. అంతకుముందు రోజు నవీన్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను పదేళ్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నాను’ అన్నారు. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. పార్టీతో జిందాల్ అనుబంధం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశంలోని ప్రముఖ జిందాల్ స్టీల్ & పవర్ (JSP) గ్రూప్‌నకు నవీన్ జిందాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి వ్యవస్థాపక ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. పోలో, స్కీట్ షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ గుర్తింపును సాధించారు. శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి షల్లు జిందాల్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవీన్ జిందాల్ 2004 నుంచి 2014 వరకు కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2014 జాతీయ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజ్ కుమార్ సైనీపై ఓటమిని ఎదుర్కొన్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. -
సాక్షి కార్టూన్ 08-04-2023
సాక్షి కార్టూన్ 08-04-2023 -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తండ్రి హర్ట్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తండ్రి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం గూటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్.. అనిల్ ఆంటల్‌ని పార్టీలోకి ఆహ్వానించారు. పుష్పగుచ్చం ఇచ్చి, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనిల్ ఆంటోని కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నిర్వహించేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన అనంతరం.. బీజేపీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేయడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఈ డాక్యుమెంటరీని అతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్‌ను వీడటం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు అనిల్ ఆంటోని. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కలిసి పనిచేసిన నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి రియాక్షన్.. మరోవైపు కుమారుడు బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. కొడుకులా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. లౌకికవాదమే భారతదేశ ఐక్యత అని, కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మండిపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ -
బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి
న్యూఢిల్లీ: జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో తనను అణచివేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం తనను ఓదార్చలేదన్నారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే.. -
బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. తప్పు చేసిన వారు భయపడతారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఎన్నిసార్లు అడిగిన ముఖ్యమంత్రి అపాయిమెంట్ ఇవ్వలేదు. ఉప ఎన్నిక అనగానే సీఎం మునుగోడుకు వచ్చారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చింది’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. -
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ బీజేపీలో చేరారు. ఆయన డెహ్రాడూన్‌లోని పార్టీ కార్యాలయంలో.. గోవా బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్, కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఆధ్వర్యంలో బీజేపీ కండువ కప్పుకున్నారు. కిషోర్ ఉపాధ్యాయను బీజేపీ నాయకులు సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా కిషోర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. కాగా, బుధవారం కిషోర్ ఉపాధ్యాయను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయన కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ ఎన్నోసార్లు మందలించింది. ఆయన ప్రవర్తనలో మార్పురాకపోవటం వలన బహిష్కరణ విధిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం ఆయనను.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ చార్జ్ దేవేందర్ యాదవ్ బహిష్కరిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే బీజేపీలో చేరడం ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో చర్చకు దారితీస్తోంది. చదవండి: గోవా రాజకీయాల్లో కీలక మార్పు.. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి -
బీజేపీలో చేరిన తృణమూల్ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్రా ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన తరువాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మార్పు తెస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం విష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌమిత్రా ఖాన్ పార్టీని వీడడాన్ని తృణమూల్ తక్కువచేసి చూపే ప్రయత్నం చేసింది. ఆయన్ని ఇది వరకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. సౌమిత్రా ఖాన్ చాన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కదన్న సంగతి ఆయనకు కూడా తెలుసని వెల్లడించింది. తాజా పరిణామంపై బీజేపీ స్పందిస్తూ.. బెంగాల్లో తృణమూల్ పతనం ప్రారంభమైందని పేర్కొంది. -
బీజేపీలో చేరిన అపరాజిత
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారిణి అపరాజిత సారంగి మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్ పాండా పాల్గొన్నారు. 1994 బ్యాచ్‌కు చెందిన అపరాజిత ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిణి. ఆమె 2013 నుంచి సెంట్రల్ డిప్యూటేషన్ మీద ఉన్నారు. అపరాజిత మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆమె చేపట్టిన ఈ పదవీకాలం 2018 ఆగస్టులో ముగిసింది. దీంతో సెప్టెంబర్‌లోనే ఆమె వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16వ తేదీన ఆమోదించారు. ఆమె ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తనదైన ముద్ర వేశారు. -
మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
-
మాయావతికి మరోషాక్
ఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్య అనుచరుడు మరొకరు పార్టీని వీడారు. బీఎస్పీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బ్రజేష్ పాఠక్ బీజేపీ గూటికి చేరారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి చెందిన మరో ముఖ్యనేత, సీనియర్ ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీఎస్పీ జనరల్ సెక్రెటరీగా, మంత్రిగా, విపక్షనేతగా పనిచేసిన మౌర్య బీజేపీలో చేరారు. కాగా ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల బీఎస్పీలో చేరారు.