Uttarakhand Assembly Election 2022: Ex-Congress President Kishore Upadhyay Joins In BJP - Sakshi
Sakshi News home page

బహిష్కరణకు గురైన మరుసటి రోజే పార్టీ మారిన కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు

Published Thu, Jan 27 2022 5:27 PM | Last Updated on Thu, Jan 27 2022 6:48 PM

Expelled Ex Uttarakhand Congress President Joins BJP - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా, ఉత్తరాఖండ్  కాంగ్రెస్​ పార్టీ​ మాజీ అధ్యక్షుడు కిషోర్​ ఉపాధ్యాయ బీజేపీలో చేరారు. ఆయన డెహ్రాడూన్​లోని పార్టీ కార్యాలయంలో.. గోవా బీజేపీ ఎన్నికల ఇన్​ చార్జ్, కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్​ కౌశిక్​ ఆధ్వర్యంలో బీజేపీ కండువ కప్పుకున్నారు.

కిషోర్​ ఉపాధ్యాయను బీజేపీ నాయకులు సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా కిషోర్​ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. కాగా, బుధవారం కిషోర్​ ఉపాధ్యాయను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయన కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్​ ఎన్నోసార్లు మందలించింది.

ఆయన ప్రవర్తనలో మార్పురాకపోవటం వలన బహిష్కరణ విధిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం ఆయనను.. ఆల్​ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్​ చార్జ్​ దేవేందర్​ యాదవ్​ బహిష్కరిస్తున్నట్లు ట్విటర్​ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్​ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే బీజేపీలో చేరడం ప్రస్తుతం ఉత్తరాఖండ్​లో చర్చకు దారితీస్తోంది.  

చదవండి: గోవా రాజకీయాల్లో కీలక మార్పు.. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్​ మాజీ ముఖ్యమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement