Uttarakhand Assembly Election 2022
-
Sakshi Cartoon: నువ్ ఓడించావ్ ఓకే! సీఎంగా మేం గెలిపించాం! భరించాల్సిందే!!
నువ్ ఓడించావ్ ఓకే! సీఎంగా మేం గెలిపించాం! భరించాల్సిందే!! -
సీఎంకు ఓటర్ల షాక్.. మోదీ సూచనతో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మహిళ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అఖండ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో.. పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని నియమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీకే సీఎం పగ్గాలు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. బీజేపీ హైకమాండ్ నుంచి రీతు ఖండూరీకి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై అధినాకత్వం రీతూతో చర్చించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆమెనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రీతూ ఖండూరీ భర్త రాజేశ్ భూషణ్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ హెల్త్ సెక్రెటరీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, సీఎం రేసులో మరో ఆరుగురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిషన్ సింగ్ చుఫాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇదిలాఉండగా.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముగ్గురిని సీఎం పీఠంపై కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ఒకరిని, నిర్ణీత సమయంలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున మరొరిని సీఎం పదవుల నుంచి బీజేపీ అధిష్టానం తప్పించింది. చివరగా పుష్కర్ సింగ్ ధామికి అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సీఎంల మార్పు వ్యవహారం పార్టీని కొంతవరకు ఇబ్బంది పెట్టింది. దీంతో ఈసారి ఎలాంటి తప్పూ దొర్లకుండా ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
ఎన్నికల రిజల్ట్.. బీజేపీకి బిగ్ షాక్.. ఆందోళనలో కాషాయ నేతలు
డెహ్రాడూన్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ జూనియర్లు గెలుస్తూ సీనియర్లు ఓడిపోవడం పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కప్రీ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పుష్కర్ సింగ్ ధామీపై భువన్ చంద్ కప్రీ.. 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధామికి 40,675 ఓట్లు రాగా.. భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆధిక్యంగా ఉంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 48 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల విజయం సాధించింది. -
యూపీలో ఈసారి సీఎం ఆయనే!
-
Uttarakhand Exit Poll 2002: ఆ పార్టీకి మెజారిటీకి తగినన్ని సీట్లు పక్కానా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ (ఏడో దశ) ఎన్నికలు ముగియడంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మార్చి 10న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో సోమవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓటర్ల నాడీ ఎలా ఉంది? ఏ పార్టీకి ఓటరు దేవుళ్లు పట్టం కట్టనున్నారో పలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ సర్వే వివరాల్లో తెలిపాయి. కొన్ని సందర్భాల్లో మినహాయించి చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. ఈనేపథ్యంలో ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు.. హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే! -
సీఎం కోడ్ ఉల్లంఘన? ఆయన భార్య ఏమన్నారంటే..
పోలింగ్ సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలు తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇప్పుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన భార్య వెనకేసుకొచ్చిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి తన నియోజకవర్గం ఖతిమాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వేయడానికి వెళ్లిన టైంలో.. బీజేపీ కాషాయపు కండువాలు మెడలో ధరించి ఉన్నారు. అంతేకాదు దుస్తులపై కమలం గుర్తులు కూడా ఉన్నాయి. అనంతరం ఓటు వేశాక.. వాళ్లు గుర్తులను ప్రదర్శించడం ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం.. మాన్యువల్ పోస్టర్లు, జెండాలు, చిహ్నాలు, మరేదైనా ప్రచార సామగ్రిని పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రదర్శించకూడదు. కానీ, పుష్కర్, ఆయన భార్య పార్టీ కండువాలు, గుర్తులు ధరించడమే కాదూ.. కార్యకర్తలతో పోలింగ్ టైంలోనూ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలపై పుష్కర్ భార్య గీతను ఓ జాతీయ మీడియా ప్రశ్నించగా.. ‘ఇది ప్రచారం అని ఎవరన్నారు?. ప్రతీ ఎన్నికల్లోలాగే.. ఈసారి ఎంత ఓటింగ్ నమోదు అవుతుందో చూడడానికే వచ్చాం. ప్రతీ పార్టీకి చెందిన వాళ్లూ ఇలా పార్టీ సింబల్స్‌ను ధరించే ఉన్నారు. అయినా ప్రజలు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధమై వస్తారు. ఇలాంటివి వాళ్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? అని బదులిచ్చారు ఆమె. మరోవైపు ఆ సమయంలో బీజేపీ హడావిడి తప్ప అక్కడేం కనిపించలేదు. అయినా పోలింగ్ సిబ్బంది, ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసులు వాళ్లను అడ్డుకోలేదన్న పలువురు ఓట్లర్లు చెప్పడం గమనార్హం. खटीमा में ये क्या हो रहा है?@pushkardhami चुनाव प्रचार खत्म होने के बाद खुलेआम पैसे बाँट रहे हैं। खटीमा से आम आदमी पार्टी के प्रत्याशी @sskaleraap ने खुद धामी को रंगे हाथों पकड़ा तो धामी ने कैमेरा बंद कराने की कोशिश की।@ECISVEEP व @UttarakhandCEO जल्द इसका संज्ञान लें। pic.twitter.com/oLpuKV7UkX — Aam Aadmi Party Uttarakhand (@AAPUttarakhand) February 13, 2022 ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్నికల ప్రచారం పేరిట డబ్బులు పంచారంటూ ఆప్ ఏకంగా ఉత్తరాఖండ్ సీఎంపైనే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆప్ యూనిట్ ట్విటర్లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేయగా...ఈసీ చర్యలేవంటూ? పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. -
ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు చావో, రేవో
దేవతలు నడయాడే భూమిలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికార వ్యతిరేకతతో అల్లాడుతున్న బీజేపీ హిందుత్వ ఎజెండాను తలకెత్తుకుంటే, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ స్థానిక అంశాల బాట పట్టింది. కొత్త తరహా రాజకీయాలతో ఆప్ కూడా మూడో పార్టీగా ఉనికిని చాటజూస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ప్రజా సమస్యలే ప్రధానంగా తెరపైకి రావడం విశేషం. వలసలు ఉత్తరాఖండ్ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ రాష్ట్రం. చార్ధామ్ సందర్శన కోసం వచ్చే భక్తులతో కళకళలాడే ఈ రాష్ట్రం కరోనా లాక్డౌన్లతో రెండేళ్లుగా కల్లోల పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతో గ్రామాల నుంచి వలసలు ఎక్కువైపోయాయి. 2011 నాటికి రాష్ట్రంలో ఏకంగా 1,034 ఘోస్ట్ (వలసలతో ఖాళీ అయిన) విలేజెస్ నమోదయ్యాయి. రవాణా, ఆసుపత్రులు, ఇంటర్నెట్ సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలకు కుటుంబాలు వలస బాట పట్టాయి. ఇలాంటి గ్రామాలు మరో 734 ఉన్నట్టు బీజేపీ 2017లో ఏర్పాటు చేసిన కమిషన్ తేల్చింది. వలసల నివారణకు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ పెద్దగా ప్రయత్నించలేదు. హిందుత్వ కార్డు రెండు నెలల క్రితం హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో పాల్గొన్న సాధువులు ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. కానీ దీన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పెద్దగా వాడుకోలేదు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 14 శాతమే కావడం, హరిద్వార్, డెహ్రాడూన్, ఉద్ధమ్‌సింగ్ నగర్, నైనిటాల్కే పరిమితం కావడమే కారణమని భావిస్తున్నారు. బీజేపీ ఎప్పట్లా హిందుత్వ ఎజెండాతోనే దూసుకుపోతోంది. కేదార్నాథ్ అభివృద్ధిని ప్రతి చోటా ప్రస్తావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని ఎండగడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ ధామి మరో అడుగు ముందుకు వేసి తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు! చదవండి: (దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా?) బ్రాండ్ మోదీ ఉత్తరాఖండ్‌లో మోదీకి ప్రజాదరణ ఎక్కువ. ముఖ్యంగా ఆర్మీ కుటుంబాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానిగా ఎనిమిదేళ్లలో ఆయన ఉత్తరాఖండ్‌కు వెళ్లినంతగా మరే రాష్ట్రానికీ వెళ్లలేదు. ఇక్కడి ప్రజలతో తన అనుబంధాన్ని చాటడానికి గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తరాఖండ్ టోపీ కూడా ధరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని 5 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలిచింది. మొత్తం 34 శాతం ఓటు షేర్ సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 కొల్లగొట్టి విజయ దుందుభి మోగించింది. ఓట్ల శాతం 46.5కు పెరిగింది. 2019లోనూ ఐదు సీట్లూ గెలవడమే గాక ఓటు షేర్‌ను 61 శాతానికి పెంచుకుంది. కానీ కరోనా తర్వాత మోదీ ఇమేజ్ మసకబారింది. సమస్యలపై ప్రజల ఆందోళన బీజేపీని కలవర పెట్టేదే. కీలకంగా మారిన ఆప్ ఉత్తరాఖండ్‌లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నా ఇతర పార్టీలు ఎన్ని ఓట్లు సాధిస్తాయన్న దానిపై వాటి గెలుపు ఆధారపడిందని చెప్పొచ్చు. గత నాలుగు ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీ మూడో పార్టీగా ఓట్లను చీలుస్తూ వచ్చింది. కానీ 2017 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఓటు షేర్ 33 నుంచి 20 శాతానికి పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆప్ ఆ పాత్ర పోషించి అధికంగా ఓట్లు రాబడుతుందన్న విశ్లేషణలున్నాయి. ఆప్ మేనిఫెస్టో రూపకల్పన దగ్గర్నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ కొత్త పంథా అనుసరించారు. వినూత్నంగా ప్రజలనే సలహాలు కోరారాయన! ఏకంగా 70 వేల స్పందనలు వచ్చాయి. ఉపాధి, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం, విద్యా రంగాలే తమకు ప్రాధాన్యమని రాష్ట్ర ప్రజలు తేల్చి చెప్పారు. అంతేగాక సీఎం అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ అజయ్ కొథియాల్‌ను రంగంలోకి దింపి సైనికుల ఓట్లనూ కొల్లగొట్టేలా వ్యూహరచన చేశారు. ఆప్ ఏ పార్టీ ఓట్లను కొల్లగొడుతుందన్నది కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల గెలుపోటములను ప్రభావితం చేయనుంది. చదవండి: (Punjab Assembly Election 2022:సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు) రెండు పార్టీలకు సవాలే ప్రధాని మోదీ ఇమేజ్‌తో తన ఓటు షేర్ పెంచుకున్న బీజేపీ కొంతకాలంగా సమస్యలతో సతమతమవుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో లోపాలు, పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధానాలు, పెరిగిపోయిన వలసలు, ఉపాధి లేమి, ముగ్గురు సీఎంలు మారడం వంటివి కాషాయ దళానికి సమస్యగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మళ్లీ హిందుత్వ కార్డుతోనే నెగ్గాలని ఆ పార్టీ చూస్తుండగా కాంగ్రెస్ స్థానిక సమస్యలపైనే దృష్టి పెట్టింది. కానీ ఆ పార్టీ కూడా అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాటు అభ్యర్థులతో సతమతమవుతోంది. సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళుతోంది. సొంత పార్టీవారే సహకరించడం లేదంటూ ఆయన పలుమార్లు వాపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది! ఈ నేపథ్యంలో బీజేపీపై నెలకొన్న అధికార వ్యతిరేకతను కాంగ్రెస్ ఏ మేరకు అనుకూలంగా మార్చుకోగలదన్నది సందేహమేనని విశ్లేషకుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
-
దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రెండో దశ ఎన్నికల ప్రచారానికి శనివారం తెరపడింది. ఉత్తరాఖండ్‌లో 70, గోవాలో 40, యూపీలో 55 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రచారానికి చివరి రోజైన శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలి ప్రచారం చేశారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను తరిమికొట్టే అవకాశం ప్రజలకు వచ్చిందని అన్నారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు కాంగ్రెస్‌ను తిరస్కరించాయని, ఇక్కడ ప్రజలు కూడా అదే పని చేయాలని పిలుపునిచ్చారు. మైనారిటీలను బుజ్జగింపే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దేవతలు నడయాడే భూమిని ఇలాంటి పనులతో అవమానిస్తే మీరు సహిస్తారా? అని ప్రశ్నించారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల కాంగ్రెస్ అవగాహన లేదన్నారు. సైనికుల్ని కూడా అవమానించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని మోదీ ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌కే గర్వకారణంగా నిలిచిన దేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌ను వీధి రౌడీ అంటూ కాంగ్రెస్ మాట్లాడిందని ఈ ఎన్నికల్లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. -
Assembly election 2022: 51 మంది అభ్యర్థుల ఆస్తులు రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. గత ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలతో పోలిస్తే , ప్రస్తుత ఎన్నికల్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలు రెట్టింపయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 51 మంది అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. ఇందులో 40 మంది బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, మరో 10 కాంగ్రెస్ తరఫున, ఒకరు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఈ 51 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ 2017 ఎన్నికల్లో సగటున రూ.4.72 కోట్లుగా ఉండగా, అది 2022 నాటికి రూ.7.05 కోట్లకు పెరిగిందని ఏడీఆర్ వెల్లడించింది. సగటున ఆస్తుల విలువ రూ.2.33 కోట్లు అంటే... 49 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఇందులో బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో రూ.4.85 కోట్లుగా ఉంటే అవి ప్రస్తుతం సగటున రూ.7.23 కోట్లకు చేరాయని వెల్లడించింది. బీజేపీ తరఫున సోమేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేఖా ఆర్య ఆస్తులు గత ఎన్నికల్లో రూ.12.78 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 25.20 కోట్లుగా ఉందని తెలిపింది. ఇదే పార్టీ తరఫున రూర్కీ నుంచి బరిలో ఉన్న ప్రదీప్ బత్రా ఆస్తులు రూ.3.81కోట్ల నుంచి రూ.12.06 కోట్లకు చేరాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న 10మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో సగటున రూ.4.61 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అవి రూ.6.83 కోట్లకు చేరాయని వెల్లడించింది. -
హిజాబ్ వివాదం.. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు
డెహ్రాడూన్: హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హిజాబ్ అంశం చినికి చినికి చివరకు సుప్రీంకోర్టుకు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలుచేస్తామని తెలిపారు. దీని కోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్కర్ సింగ్ ధామీ శనివారం ఖతిమాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో తాము అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తరహా కోడ్‌ను అమలు చేయడం వల్ల ఉత్తరాఖండ్ లో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు కలుగుతాయని అన్నారు. ఇది సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే కాకుండా మహిళా సాధికారత బలోపేతానికి దోహదపడుతుందన్నారు. చదవండి: హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు ‘దేవభూమి’ సంస్కృతి, వారసత్వాన్ని చాటిచెప్పడమే తమ ప్రధాన కర్తవ్యమని, తాము దీని కోసం కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా శనివారంతో ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 14(సోమవారం)న పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ప్రచారాన్ని ముంచేస్తున్న మంచు.. చిక్కుకున్న 25 మంది నాయకులు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న మంచు అసెంబ్లీ ప్రచారాన్ని ముంచేస్తోంది. కొండల్లో ఉన్న ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,697 పోలింగ్ కేంద్రాలకు గానూ 766 బూత్‌లు మంచులో కూరుకుపోయి ఉన్నాయి. వీటిలో మెజార్టీ పోలింగ్ బూత్‌లు సముద్రమట్టానికి 5 నుంచి 7 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఉత్తరకాశి, నైనిటాల్, చమోలి ప్రాంతాల్లో అధికంగా మంచు కురుస్తోంది. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండటంతో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పోలింగ్ ఎలా జరుగుతుందోనన్న ఆందోళనైతే నెలకొంది. మంచులో చిక్కుకున్న 25 మంది బీజేపీ నేతలు ఉత్తరాఖండ్‌లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న గుజరాత్ ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ సహా 25 మంది నాయకులు రెండురోజులుగా మంచులో చిక్కుకుపోయారు. అల్మోరా నుంచి జగదేశ్వర్ ధామ్ వెళుతున్న మార్గంలో భారీగా మంచు కురుస్తూ ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతల్ని బీజేపీ అగ్రనేతలు గుజరాత్ నాయకులకు అప్పగించారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామంటూ దుష్యంత్ పటేల్ ఒక వీడియో షేర్ చేశారు. ట్రెక్కింగ్, నడకే మార్గం మంచులో కూరుకుపోయిన ప్రాంతాలకు వాహనాల్లో వెళ్లడమే సాధ్యం కాని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేయాలి. మరికొన్ని చోట్లకి నడుచుకుంటూ వెళ్లాలి. పోలింగ్ అధికారులకే అక్కడికి వెళ్లడం అత్యంత దుర్లభం. పిత్రోగఢ్‌లోని కనర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్‌లో 588 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. అక్కడికి వెళ్లాలంటే 80 కి.మీ. వాహనంలో వెళ్లాక మరో 18 కి.మీ. ట్రెక్కింగ్ చేయాలి. 200 మంది ఓటర్లున్న డ్యుమక్ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే 20 కి.మీ. నడవాలి. 260 మంది ఓటర్లున్న ఉత్తరకాశిలోని మోండా పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారులన్నీ 2019 వరదల్లో కొట్టుకుపోయాయి. ఆ మార్గంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. మరో 450 పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే కనీసం 5 కి.మీ. నడవాలి. మూడు రోజుల ముందే.. మంచు కురిసే ప్రాంతాలకు పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందే అంటే శుక్రవారమే ఎన్నికల అధికారులు బయలురుతారు. వందలాది మంది ఎన్నికల సిబ్బంది ఉన్న మొత్తం 35 మంది పోలింగ్ బృందాలు గాడిదలు, గుర్రాల సాయంతో ఈవీఎం మిషన్లు, ఇతర సామగ్రి తీసుకువెళ్లనున్నారు. అసాధారణ రీతిలో మంచు కురవడంతో 24 మైగ్రేటరీ బూత్‌ల్ని కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. -
మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు
మంగ్లౌర్: తాను ప్రధాని నరేంద్రమోదీకే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకూ తాను భయపడబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాట నేను విననని ప్రధాని చెప్పారు. నిజమే... తన మాట నేను వినను. ఎందుకంటే ఆయనకే కాదు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు నేను భయపడను కాబట్టి’ అని తెలిపారు. హరిద్వార్ జిల్లాలోనూ మంగ్లౌర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే మోదీతో పోరాటం చేయగలదని తెలిపారు. ఒక దొంగ స్థానంలోకి మరో దొంగను తీసుకొచ్చినట్టుగా రాష్ట్రంలో బీజేపీ ముఖ్య మంత్రులను మారుస్తోందని రాహుల్ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోదీ అధికారం నవ్వు తెప్పిస్తోందన్నారు. పేదలు, నిరుద్యోగుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. 70 ఏళ్లలో దేశంలో అభివృద్ధే జరగలేదని మోదీ మాట్లాడుతున్నారని, ఇప్పటివరకు దేశం నిద్రపోయిందా? ఏదైనా మ్యాజిక్ జరిగి బీజేపీ అధికారంలోకి రాగానే మేల్కొని హఠాత్తుగా అన్నీ ఏర్పడ్డాయా? అని ప్రశ్నించారు. -
ఉత్తరాఖండ్ అభివృద్ధే కాంగ్రెస్‌కు నచ్చదు: మోదీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఇన్నేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ప్రధాని నరంద్ర మోదీ ఆరోపించారు. వారి పాలనలో తరాల తరబడి రాష్ట్ర ప్రజలు ఉపాధి కోసం వలస పోతూ వచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. ఈసారి ఓటేసేటప్పుడు ఎలాంటి పొరపాటూ చేయొద్దని రాష్ట్ర ప్రజలకు హితవు పలికారు. మంగళవారం వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రానికి చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌తో తనకు ప్రత్యేక బంధముందని, ప్రజల సమస్యలు, ఆకాంక్షలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ పెడతామన్న కాంగ్రెస్ వాగ్దానాన్ని ప్రస్తావిస్తూ, ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాలను ఆ పార్టీ ఇంకా మానుకోలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పాటే కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మోదీ అన్నారు. -
ఈ పుష్పలో ఫ్లవరూ ఉంది.. ఫైరూ ఉంది
ప్యాన్ ఇండియా మూవీ ప్రచారంతో రిలీజ్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఊహించని రేంజ్లో సక్సెస్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ.. నెగెటివ్ టాక్ నుంచి క్రమక్రమంగా పుంజుకుని భారీ సక్సెస్‌ను అందుకోవడం విశేషం. సౌత్‌నే కాదు.. నార్త్‌లోనూ పుష్పమేనియా మామూలుగా కొనసాగడం లేదు. స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీల నుంచి ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాజకీయ నాయకుల దాకా పుష్పను అనుకరణ.. అనుసరణ చేసేస్తున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్ సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ 'పుష్ప' సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని... ఆ సినిమా పేరు 'పుష్ప' అని రాజ్ నాథ్ చెప్పారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు. ఈ పుష్ప చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని, కాంగ్రెస్ ఈయన్ని ఉత్త పుష్ప అనుకుంటోంది. కానీ, ఈయనలో ఫ్లవర్(పేరులో అని ఆయన ఉద్దేశం) ఉంది ఫైర్ కూడా ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని... ఈయన తగ్గేదేలే అని వ్యాఖ్యానిస్తూ జనాల్లో ఉత్సాహాన్ని నింపారు. తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగులు ప్రస్తుతం ఎన్నికల సీజన్లో జనాలకు ఎట్రాక్ట్ చేయడానికి తెగ వాడేస్తున్నారు మరి!. ఇంకోపక్క ‘పుష్ప ఇన్స్పిరేషన్తో..’ నేరాలు చోటు చేసుకుండడం గమనార్హం. -
ఎన్నికల ప్రచార ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షల్ని సడలించింది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా సభలను ఏర్పాటు చేసుకోవడానికి ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సభలను నిర్వహించుకునే అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత ఫిబ్రవరి 10న మొదలు అవుతుండగా ఫిబ్రవరి 8 సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసిపోతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని ఇప్పటికే ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ జనవరి 22న అత్యధికంగా 32 వేల కేసులు నమోదైతే ఫిబ్రవరి 5 నాటికి అయిదు రాష్ట్రాల్లో మొత్తం కేసుల సంఖ్య 7 వేలకు తగ్గిపోయింది. దీంతో ఎన్నికల సభలపై ఆంక్షల్ని సడలించిన ఈసీ రోడ్డు షోలు, పాదయాత్రలపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తోంది. ‘‘బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షల్ని సడలిస్తున్నాం. హాలుల్లో జరిగే సమావేశాల్లో 50% సామర్థ్యంతోనూ, బహిరంగ సమావేశాల్లో ఆ గ్రౌండ్స్‌లో 30% సామర్థ్యంతో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికారులు విధించే ఆంక్షలకు అనుగుణంగా ఇవి మారుతాయి. ఏ నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో హాజరవుతారో దానినే పాటించాలి’’ అని ఈసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లకి పకడ్బందీ భద్రత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా హపూర్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో స్టార్ ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల భద్రతపై ఈసీ దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాలంటే ఆయా పార్టీల ముఖ్య ప్రచారకర్తల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి నోటీసులు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ ఫొటోని ముస్లిం మత ప్రబోధకుడిగా మార్ఫింగ్ చేసి, ట్విట్టర్లో షేర్ చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర బీజేపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ స్పష్టం చేసింది. -
ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెబెల్స్ బెడద ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది నియోజకవర్లాల్లో తిరుగుబాటు అభ్యర్థులు సవాల్ విసురుతూ ఉంటే, బీజేపీ ఏకంగా పన్నెండు స్థానాల్లో రెబెల్స్‌ను ఎదుర్కొంటోంది. ఇక రెండు పార్టీల్లోనూ అసమ్మతి నేతలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో విజయావకాశాలు తారుమారు అవుతాయేమోనన్న ఆందోళనైతే నెలకొంది. రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని బుజ్జగించి నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని రెండు పార్టీలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ 20కిపైగా స్థానాల్లో పోటీ తప్పేటట్టుగా లేదు. బీజేపీ టికెట్లు ఇవ్వడానికి ముందు సర్వే నిర్వహించి పని తీరు బాగాలేని ఎమ్మెల్యేలని పక్కన బెట్టింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావహులెందరికో టికెట్ లభించలేదు. దీంతో యమునోత్రి, బాజ్పూర్, రుద్రప్రయాగ్, సితార్‌గంజ్, రామ్‌నగర్, బాగేశ్వర్, జ్ఞానశాలి, డెహ్రాడూన్ కాంట్, కిచా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబెల్స్ బరిలో ఉన్నారు. చివరికి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ప్రచార కమిటీ అధ్యక్షుడు హరీశ్ రావత్‌కి కూడా తిరుగుబాటు అభ్యర్థి తలపోటు తెప్పిస్తున్నారు. రావత్‌ను పోటీకి దింపాలనుకున్న రామ్‌పూర్‌లో టికెట్ ఆశించి భంగపడిన రెబెల్ అభ్యర్థి రంజిత్ రావత్ బరిలోకి దిగారు. దీంతో రావత్‌ను రామ్‌నగర్ నుంచి లాల్‌కౌన్ అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. అప్పటికే అక్కడ సీటు ఖరారు చేసిన సంధ్య దాలకోటికి కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ పరిణామాలతో రావత్‌కు రెబెల్ బాధ తప్పలేదు. ఇక యమునోత్రిలో రెబెల్ అభ్యర్థి సంజయ్ బోధల్ రిషికేశ్‌లో షర్బీర్ సింగ్, రుద్రప్రయాగలో మత్బర్ సింగ్ ఖండారీలు ఎక్కువ బలంగా ఉండడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. బీజేపీలో ఎగుస్తున్న అసమ్మతి జ్వాలలు ఇక బీజేపీకి రుద్రపూర్, భింతాల్, కిచా, కుమావూ, ధంతోలి, డెహ్రాడూన్ కాంట్, ధర్మపూర్, యమునోత్రి, కర్ణప్రయాగ, చక్రత, ఘనశాలి. కోట్వార్‌లలో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అంతర్గతంగా నెలకొన్న అసమ్మతి జ్వాలలు కూడా పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఈనెల 14న పోలింగ్ జరిగే ఉత్తరాఖండ్‌లో సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోతూ ఉండటంతో బీజేపీ ఇంకా రెబెల్స్‌ని బుజ్జగించే పనిలోనే ఉంది. బీజేపీ మొత్తం 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. ఇంచుమించుగా వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డారు. వాటికి తోడు పార్టీలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలో కమలనాథులున్నారు. -
రాజులా మోదీ
కిచ్చ: ‘‘అందరి మేలు కోసం పని చేయని ప్రధాని ఆ పదవిలో ఉండేందుకు అనర్హుడు. అలా చూస్తే మోదీ ప్రధానే కాదు’’ అని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. కరోనా కష్ట కాలంలో, వణికించే చలిలో రైతులను మోదీ ఏడాదికి పైగా నిర్దయగా నడిరోడ్డుపై వదిలేశారని దుయ్యబట్టారు. ‘‘మన దేశాన్నిప్పుడు ప్రధానికి బదులు ఒక రాజు పాలిస్తున్నాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా జనం నోరెత్తొద్దని భావిస్తున్నాడు’’ అంటూ విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో శనివారం కిసాన్ స్వాభిమాన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో రైతులకు 10 రోజుల్లో పంట రుణాలు మంజూరయ్యేవన్నారు. అది వారికిచ్చిన ఉచితవరం కాదని, రైతులు 24 గంటలూ దేశం కోసమే శ్రమిస్తారని అన్నారు. రాష్ట్రంలో రైతులు, యువత, పేదలతో కలిసి పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. ‘‘మన ముందు రెండు భారత్‌లున్నాయి. ఒకటి ధనిక పారిశ్రామికవేత్తలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, మెర్సిడెజ్ కార్లది. ఇంకోటి పేదలు, నిరుద్యోగులది. దేశం జనాభాలో 40 శాతం మంది దగ్గరున్నంత సంపద కేవలం 100 మంది చేతుల్లో పోగుపడింది. ఆదాయపరంగా ఇంతటి అసమానతలు మరెక్కడా లేవు. మనకు కావాల్సింది అందరికీ సమానావకాశాలుండే ఒకే ఇండియా. అసమానతలు పోయినప్పుడే అది సాధ్యం’’ అన్నారు. -
ఉత్తరాఖండ్ బరిలో 632 మంది పోటీ
డెహ్రాడూన్: ఈనెల 14న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని 81.43 లక్షలమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. నామినేషన్ వేసిన వారి నుంచి 95మంది ఉపసంహరించుకోగా 632 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 136 మంది స్వతంత్ర అభ్యర్థ్ధులున్నారు. డెహ్రాడూన్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 117 మంది, హరిద్వార్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 110మంది పోటీచేస్తున్నారు. చంపావత్, బాగేశ్వర్ జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి 14మంది పోటీపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. బరిలో ఎస్పీ, ఆప్, బీఎస్పీ, యూకేడీ కూడా ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. -
ఇరవై ఏళ్లుగా అక్కడ మహిళలనే గెలిపించారు!
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మహిళకే ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000లో ఏర్పడగా తొలి ఎన్నికలు 2002 ఫిబ్రవరి 14న జరిగాయి. తొలి ఎన్నికల నుంచి గడిచిన 2017 ఎన్నికల వరకూ నాలుగు సార్లు పౌఢి గఢ్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మహిళనే గెలిపించారు. నియోజకవర్గంలో సుమారు 90 వేల ఓట్లు ఉండగా వీరిలో సుమారు 40 వేల పైచిలుకు మహిళా ఓటర్లు. 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయ భరద్వాజ్ గెలుపొందారు. తొలిసారి గెలిచినపుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన విజయ భరద్వాజ్ 2007లో మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2017లో యమకేశ్వర్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూషణ్ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి రేణు బిస్త్‌పై 8,982 ఓట్ల తేడాతో రీతూ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరో ఆరుగురు పురుష అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. 2022లో బీజేపీ తమ అభ్యర్థిగా రేణు బిస్త్‌ను ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉండడంతో 60 శాతంలోపే ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత అసెంబ్లీలో రీతూ ఖండూరితోపాటు మరో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?
ఉత్తరాఖండ్‌కు అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఆరెస్సెస్‌తో 30 ఏళ్ల అనుబంధం, కరడుగట్టిన హిందుత్వ వాదం, ఇరుగు పొరుగు దేశాలను కూడా కలిపేసుకొని మళ్లీ అఖండ భారత్ ఏర్పాటు కావాలన్న లక్ష్యం, బీజేపీ సీనియర్ నాయకుల అండదండలు అన్నీ కలిపి ధామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. యువకుడు కావడంతో సీఎం అయ్యాక ఎన్నో సృజనాత్మక ఆలోచనలతో పరిపాలన సాగించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోయినా, గత సీఎంల వల్ల ఏర్పడిన వివాదాలను పరిష్కరించారు. రేయింబవళ్లు కష్టపడే తత్వం ఉన్న ధామి బీజేపీని వరుసగా రెండోసారి గెలిపించాలన్న సవాల్ స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 57 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారన్న అపప్రదను పోగొట్టుకోవాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో పాటు, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యువ ఆలోచనలు కూడా కలిసొస్తాయన్న విశ్లేషణలున్నాయి. ► ఉత్తరాఖండ్లోనిపితోరగఢ్లో 1975 సంవత్సరం సెప్టెంబర్ 16న జన్మించారు. ► లక్నో యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. ► యువకుడిగా ఉండగానే ఆరెస్సెస్ భావజాలంవైపు ఆకర్షితులయ్యారు. 1989–1999 వరకు పదేళ్ల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యునిగా ఉన్నారు. ఆరెస్సెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ► ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా చీఫ్‌గా 2002 నుంచి 2008 వరకు పని చేశారు. ► పుష్కర్ సింగ్ భార్య గీతా ధామి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ► ఉధామ్ నగర్‌లోని ఖతిమా నియోజకవర్గం నుంచి 2012లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి తన స్థానాన్ని కాపాడుకున్నారు. ► భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ► ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 2021 జూలైలో పదవీబాధ్యతలు తీసుకున్నారు. 45 ఏళ్ల వయసులో సీఎం పదవిని చేపట్టి రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డులకెక్కారు. ► ఉత్తరాఖండ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుల, ప్రాంతీయ సమతుల్యతల్ని కాపాడే విధంగా ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ధామిని బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది. (క్లిక్: గజ ఈతగాడు.. ఆయనను కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేదు..) ► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పుష్కర్ సింగ్ ధామి అత్యంత సన్నిహితులు. రాజ్‌నాథ్ సూచనల మేరకే ఆయనను సీఎంను చేసినట్టుగా ప్రచారంలో ఉంది. ► భగత్ సింగ్ కొషియారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికారిగా ప్రత్యేక బాధ్యతలు నిర్వహించారు. ► సీఎంగా ఎక్కువ కాలం పదవిలో కొనసాగకుండానే ఎన్నికలు రావడంతో ధామి ముందర ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ► కేవలం ఆరు నెలల కాలంలోనే ధామి ప్రభుత్వం 550 నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసింది ► సీఎం పదవి చేపట్టిన నాటికే సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ధామి చాలా ప్రయత్నాలు చేశారు. దేవస్థానంలో బోర్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న పూజార్లను వెనక్కి తీసుకునేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. ► అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిందన్న విమర్శల్ని పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. యువకుడు కావడంతో కొత్త ఆలోచనలతో అందరినీ ఆకర్షించారు. కష్టపడే మనస్తత్వంతో బీజేపీకి ధామి ప్లస్ పాయింట్ అవుతారనే అంచనాలైతే ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి అఖండ భారతం ధామి ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో 2015లో ఆయన చేసిన పాత ట్వీట్ వివాదాస్పదమై వెలుగులోకి వచ్చింది. ఆ ట్వీట్లో అఖండ భారత్ స్థాపనే తన లక్ష్యమంటూ మన ఇరుగు పొరుగు దేశాలను భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ కాషాయం రంగు పూసిన మ్యాప్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దేశభక్తి ఉన్న ప్రతీఒక్కరూ అఖండ భారత్ కోరుకుంటారంటూ ఆయన కామెంట్ చేయడంపై కలకలం రేగింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొంతమంది ఆ ట్వీట్‌ని పొగుడుతూ ఆయనని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, దేశానికి విదేశాంగ మంత్రిని చేయాలంటూ కొందరు బ్రహ్మరథం పడితే, మరికొందరు విమర్శించారు. (చదవండి: నాన్నా..‘ఎస్ వికెన్ డూ ఇట్’!) -
నాన్నా..‘ఎస్ వికెన్ డూ ఇట్’!
డెహ్రాడూన్: వాళ్లిద్దరూ విభిన్న భావజాలం కలిగిన పార్టీలకు చెందిన వారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒకే లక్ష్యంతో పోటీకి దిగారు. మాజీ సీఎంలైన తమ తండ్రులకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తండ్రులు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఎన్నికల బరిలో దిగారు. వారే కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె అనుపమా రావత్. బీజేపీ మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి. బీసీ ఖండూరి 2012 ఎన్నికల్లో కొత్‌ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న రీతూ ఖండూరి మాట్లాడుతూ ‘అప్పట్లో మా నాన్న గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో పోటీ చేసి నేను గెలిచి చూపిస్తా. మా పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది’’ అని అన్నారు. ఇక హరీశ్ రావత్ 2017 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి హరిద్వార్ (రూరల్) నుంచి ఓటమిపాలయ్యారు. రావత్ కుమార్తె అనుపమా గత ఏడేళ్లుగా హరిద్వార్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ‘‘హరిద్వార్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటివరకు నెగ్గలేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే మా నాన్నను ఓడించి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సారి గెలుపు నాదే’’ అని అనుపమ ధీమాగా చెప్పారు. మొత్తానికి ఈ ఇద్దరు కుమార్తెలు తండ్రుల ఓటమికి ప్రతీకారంగా అవే నియోజకవర్గాలను ఎంచుకొని పోటీకి దిగడం అందరినీ ఆకర్షిస్తోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ బీజేపీలో చేరారు. ఆయన డెహ్రాడూన్‌లోని పార్టీ కార్యాలయంలో.. గోవా బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్, కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఆధ్వర్యంలో బీజేపీ కండువ కప్పుకున్నారు. కిషోర్ ఉపాధ్యాయను బీజేపీ నాయకులు సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా కిషోర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. కాగా, బుధవారం కిషోర్ ఉపాధ్యాయను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయన కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ ఎన్నోసార్లు మందలించింది. ఆయన ప్రవర్తనలో మార్పురాకపోవటం వలన బహిష్కరణ విధిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం ఆయనను.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ చార్జ్ దేవేందర్ యాదవ్ బహిష్కరిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే బీజేపీలో చేరడం ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో చర్చకు దారితీస్తోంది. చదవండి: గోవా రాజకీయాల్లో కీలక మార్పు.. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి -
Harish Rawat: గజ ఈతగాడు.. ఆయనను కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేదు..
దేవుళ్లు నడయాడే భూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు సీనియర్ నేత హరీశ్ రావత్. ఆయనను కాదనుకొని ఆ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. ఎన్నికలనే మహాసముద్రంలో ఈత కొట్టనివ్వకుండా హైకమాండ్ ప్రతినిధులు తన కాళ్లూ చేతులు కట్టేశారని, ఇక విశ్రాంతి తీసుకుంటానని రావత్ ఎన్నికలకు ముందు అస్త్రసన్యాసం చేయడానికి సిద్ధపడినా, ముఠా తగాదాలు తారాస్థాయికి చేరుకొని వలసలు ఎక్కువైనా రావత్ అనుభవాన్నే మళ్లీ కాంగ్రెస్ నమ్ముకుంది. ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి మళ్లీ ఉత్తరాఖండ్ పీఠంపై పాగా వేసే బృహత్తరమైన బాధ్యత ఆయన భుజస్కంధాలపైనే మోపింది. హై కమాండ్ నుంచి రాహుల్ గాంధీ అండదండలు, ముఖ్యమంత్రిగా 43% ప్రజల మద్దతు రావత్‌కే ఉందని వివిధ సర్వేలు తేల్చేయడంతో ఎలాంటి బంధనాలు లేకుండా ఈత కొట్టడానికి ఉత్సాహపడుతున్నారు. ► ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని మొహనారి గ్రామంలో రాజ్‌పుత్ కుటుంబంలో 1948 సంవత్సరం ఏప్రిల్ 27న జన్మించారు. ► లక్నో యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ చదువుకున్నారు. ► యువకుడిగా ఉండగానే రాజకీయాల పట్ల ఆకర్షితులై యువజన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండే రేణుకను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► 1980లో తొలిసారిగా అల్మోరా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1980 – 1989 నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ► 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► 2002 నుంచి ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ► 2009లో హరిద్వార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–14 మధ్య మన్మోహన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ► 2013 నాటి వరద బీభత్స పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోలేకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో రావత్ 2014 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ సీఎం అయ్యారు. ► 2016లో ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. రావత్‌కి వ్యతిరేకంగా తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం మైనారి టీలో పడిపోయింది ► కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టింది. అయితే మూడు నెలల్లోనే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకొని తిరిగి సీఎం అయ్యారు. ► అదే సమయంలో సమాచార్ ప్లస్ అనే న్యూస్ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీశ్ రావత్ 12 మంది ఎమ్మెల్యేలకు రూ.25 లక్షల చొప్పున ముడుపులు చెల్లించినట్టుగా ఆరోపణలు రావడం ఆయనను ఇరకాటంలో పడేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్ నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ ఓటమిపాలైంది. హరిద్వార్ రూరల్, కిచ్చా స్థానాల్లోంచి పోటీ చేసిన రావత్ ఎక్కడా నెగ్గలేదు. ► పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య సఖ్యత కుదర్చడంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న రావత్ విఫలమైనందుకు ప్రచార కమిటీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. ► మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్చార్జ్ దేవేందర్ యాదవ్‌తో విభేదాలు రావత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీంతో ఇక చేసింది చాలంటూ ట్వీట్ చేసి రావత్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంరేపారు. చివరికి రాహుల్‌గాంధీ జోక్యంతో ఎన్నికల ప్రచార కమిటీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ► అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చి ఏటికి ఎదురీదుతున్న బీజేపీని ఢీ కొట్టడానికి ఇప్పుడు రావత్ అనే బలమైన నాయకుడు ఉండాలనే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దానికనుగుణంగానే రావత్ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కరోనానే పెద్ద పరీక్ష!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత పెద్ద పరీక్ష పెడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులకు తోడు మరోవైపు అనుకున్న స్థాయిలో ముందుకు సాగని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటు ఎన్నికల సంఘానికి అటు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా పరిణమిస్తోంది. గడిచిన పది రోజుల్లోనే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 70 శాతానికి పైగా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం లేకపోవడం కలవరపెట్టేలా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎంతమేర పుంజుకుంటుందన్నది ప్రశ్నగానే మారింది. మరిన్ని రోజులు నిషేధమే! దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఇంతకింతకీ పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ నెల 8న దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4.72 లక్షలు ఉండగా, అదే రోజున రోజువారీ కేసుల సంఖ్య 1.41 లక్షలుగా ఉంది. అయితే క్రమంగా పెరుగుతూ ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 20.18 లక్షల వరకు చేరగా, రోజువారీ కేసులు 3.47 లక్షలకు చేరాయి. ఇక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క యూపీలోనే పది రోజుల కిందటి కేసుల సంఖ్యతో పోలిస్తే కేసులు 11 వేల నుంచి 18వేలకు చేరాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృష్ట్యానే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఈ నెల 15వరకు ఉన్న నిషేధాన్ని ఎన్నికల సంఘం 22 వరకు పొడిగించింది. 22 తర్వాత సైతం దీనిపై షరతులతో కూడిన సభలకు అనుమతించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ పంజాబ్‌లో 79 శాతం, మణిపూర్‌లో 58 శాతం మాత్రమే పూర్తయింది. యూపీలో రెండో విడత వ్యాక్సినేషన్ 56.40 శాతమే పూర్తవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని ఈసీ సూచించింది. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా లేకపోవడం, మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం ఇస్తోంది. బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఓటర్లను చేరుకునేందుకు నానాయాతన పడుతున్న పార్టీలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ప్రచారాలు మొదలుపెట్టాయి. డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఏ ప్లాట్ఫారంలో లేని ఓటర్లను చేరుకోవడం అన్ని పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది. -
ఉత్తరాఖండ్‌లో కీలక పరిణామం; ‘10 సీట్లు గెలిపిస్తా’
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బహిష్కృ నేత, రాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్.. ఈ రోజు తన కోడలు అనుకృతి గుసేన్‌తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రచార సారథి, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. అందుకే వెళ్లగొట్టాం: బీజేపీ ఐదు రోజుల క్రితం హరక్ సింగ్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన బీజేపీ.. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. అసెంబ్లీ ఎన్నికలలో తన బంధువులకు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు ఆయనను పార్టీ నుంచి వెళ్లగొట్టినట్టు కమలం పార్టీ తెలిపింది. దీంతో ఆయన మళ్లీ సొంత గూటికి వచ్చారు. 2016లో హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయడంలో హరక్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మరో 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. బీజేపీ వాడుకుని వదిలేసింది: రావత్ అయితే బీజేపీ తనను వాడుకుని వదిలేసిందని తాజాగా హరక్ సింగ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి మెజారిటీతో గెలిపించి క్షమాపణలు కోరతానని తెలిపారు. తనపై బీజేపీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బేషరతుగా కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు. పది సీట్లు గెలిపిస్తా కాగా, రావత్ బుధవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తన పలుకుబడిని ఉపయోగించి కనీసం పది సీట్లు గెలిపిస్తానని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన హామీ ఇచ్చారని పీటీఐ నివేదించింది. అయితే, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లోని ఒక వర్గం ఆయన పునరాగమనాన్ని వ్యతిరేకించింది. కేదార్నాథ్ నుంచి హరక్ సింగ్‌ను, ఆయన కోడలిని లాన్స్‌డౌన్ నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే దశలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. (ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు) -
బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్‌ను ఢిల్లీలో కలిశారు. సాయంత్రం విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం తన తండ్రి బీజేపీలో చేరడంతో ఇప్పుడు తనకు కూడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
Uttarakhand: ఆనవాయితీ మారేనా!
ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొత్తగా రంగంలోకి దిగింది. చాలాసీట్లలో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్‌లకు మధ్యే ఉండే అవకాశం ఉన్నా... కొన్నిస్థానాల్లో ఆప్ దీన్ని ముక్కోణపు పోరుగా మారుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి 2000 నవంబర్ 9న ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడ్డ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. హిమాలయ సానువుల్లో... ప్రకృతి సౌందర్యాలతో అలరిల్లే ఈ దేవభూమిలో ప్రజాతీర్పును కోరుతున్న వేళ... ఏ పార్టీ పరిస్థితి ఏంటనేది చూద్దాం.. డబుల్ ఇంజిన్.. అభివృద్ధి మంత్రం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార వ్యతిరేకతను అధిగమించడమనే సవాల్‌ను ఎదుర్కొంటోంది. మరోవైపు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంతో సుస్థిర పాలనను అందించలేకపోయిందనే అభిప్రాయం నెలకొంది. గత ఏడాది మార్చి 10న త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ .. నాలుగు నెలలు తిరగకముందే జూలైæ 4న ఆయన్ను కూడా మార్చేసింది. పుష్కర్‌సింగ్ ధామీని సీఎంను చేసింది. పుష్కర్ దామీ 2017లో ఏకపక్షంగా గెలిపిస్తే (70 స్థానాల్లో బీజేపీ ఏకంగా 57 నెగ్గింది) ద్విగుణీకృత ఉత్సాహంతో అభివృద్ధిపై దృష్టి పెట్టి, సుస్థిర పాలన అందించాల్సింది పోయి... అవకాశాన్ని వృథా చేసుకుందనే అభియోగాలను బీజేపీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఈసారి 60 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని.. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది. విఖ్యాత కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణం, చార్ధామ్ క్షేత్రాలుగా పేరుగాంచిన... కేదార్నాథ్, బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ... సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండేలా (హిమాలయ సానువుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి శీతాకాలంలో విపరీతమైన హిమపాతంతో కొన్ని మార్గాల్లో ప్రయాణానికి వీలుండదు) సువిశాల రహదారి నిర్మాణం, రిషికేశ్– కర్ణప్రయాగ్ రైల్వేలైను నిర్మాణం... వీటిని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. నిర్మాణంలో ఉన్న మౌలికసదుపాయాల ప్రాజెక్టులు పూర్తయితే... పర్యాటకం బాగా పుంజుకుంటుందని, పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ ఇటీవలి ఉత్తరాఖండ్ పర్యటనల్లో నొక్కిచెప్పారు. ఇది ఉత్తరాఖండ్ దశాబ్దమని అభివర్ణించారు. డబుల్ ఇంజిన్ (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే)తోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని పదేపదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. పుష్కర్‌సింగ్ ధామీ (46 ఏళ్లు) యువ ఓటర్లను ఆకర్షించగలరని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. షరామామూలే కాంగ్రెస్‌ను మరొకరు ఓడించాల్సిన పనిలేదు. చాలాసార్లు ఆ పనిని సొంత పార్టీ వాళ్లే చేస్తారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతుంటారు. వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో భంగపడ్డా... కాంగ్రెస్ నేతలు ‘తగ్గేదేలే’అంటూ అంతర్గత కుమ్ములాటల్లో ఎప్పటిలాగే బిజీగా ఉన్నారు. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు... పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సిగపట్లు జగద్విదితం. ఎంతైనా కాంగ్రెస్ సంస్కృతి కదా! ఒకరికి చెక్ పెట్టడానికి మరొకరిని ఎగదోయడం కాంగ్రెస్ పెద్దలు అనాదిగా అలవాటు చేసుకున్నదే. హరీష్ రావత్ ఉత్తరాఖండ్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కు.. మాజీ సీఎం హరీష్ రావత్. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే పార్టీ కొట్లాడుతోంది. అయితే అధిష్టానం నియమించిన మనుషుల నుంచే తనకు సహాయనిరాకరణ ఎదురవుతోందని, అస్త్రసన్యాసం చేయడం (రాజకీయాల నుంచి తప్పుకోవడం) మినహా తనకు మరోమార్గం కనపడటం లేదని కొంతకాలం కిందట రావత్ బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తర్వాత అందరినీ ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం సర్దిచెప్పి పంపింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విపక్షనేత ప్రీతమ్‌సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దేవేంద్ర యాదవ్...హరీష్‌రావత్‌ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి వీల్లేదని పట్టుబట్టడంతో పార్టీ అధిష్టానం ఎవరి పేరునూ ప్రకటించలేదు. రావత్ నాయకత్వంలో∙ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ప్రియాంకా గాంధీ ప్రచారంపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరీష్ రావత్ చాలాకాలం నుంచే బీజేపీ సీఎంలను మార్చేసి అస్థిర పరిస్థితులకు కారణమవుతోందనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. నిరుద్యోగం, దరల పెరుగుదలనూ వీలైనంతగా ఎత్తిచూపారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే ఆనవాయితీ తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ వూహకర్తలు భావిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం లేదు సుపరిపాలన నినాదం, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్, ఢిల్లీ మోడల్ అభివృద్ధి (విద్య, వైద్య సదుపాయాల మెరుగుదల) హామీలు... ఆప్ ఆధారపడుతున్న అంశాలు. అయితే ప్రత్యర్థి పార్టీలతో పోల్చినపుడు తగిన సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఆప్‌కు ప్రధానలోటు. 20 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ల పాలన చూశారు కాబట్టి ఈసారి తమకొక అవకాశం ఇవ్వాలని ఆప్ కోరుతోంది. అధికారం లోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఉద్యోగాల భర్తీ, రూ.5,000 నిరుద్యోగ భృతి, మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి. ఉత్తరాఖండ్ నుంచి భారత సైన్యంలో పెద్ద ఎత్తున జవాన్లు, అధికారులు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆప్ రిటైర్డ్ కల్నల్ అజయ్ కోథియాల్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అజయ్ కోథియాల్ ఉనికి కోసం ఉద్యమ పార్టీ పోరాటం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (యూకేడీ) కోల్పోయిన ప్రాభావాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. కాశీ సింగ్ ఐరీ నేతృత్వంలోని యూకేడీ 2007లో మూడు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతునిచ్చింది. తర్వాత 2012, 2017 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన ఈ ఉద్యమపార్టీ ఇప్పుడు ఉనికిని చాటేందుకు పోరాడుతోంది. కాశీ సింగ్ ఐరీ – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తథ్యం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓటమి చవిచూస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ ఓటమి ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థల పరిరక్షణకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, బాలనర్సింహతో కలసి రాజా మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలో కొనసాగితే వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడి ఫాసిజానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి సంక్లిష్ట, సంక్షోభ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీలు, వివిధ విపక్ష, ప్రాంతీయపార్టీలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుంజుకుంటోందని, బీజేపీని ఓడించకపోతే ఫెడరల్ వ్యవస్థకే ముప్పు అని పేర్కొన్నారు. రైతులు తమ సుదీర్ఘ పోరాటంతో మూడు వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరింపచేసి మోదీ ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెట్టారన్నారు. బ్యాంక్ ఉద్యోగులు, కార్మికులు, పేదలు, వివిధ వర్గాల ఆందోళనలతో బీజేపీ ప్రభుత్వం, ఆరెస్సెస్ వ్యతిరేక పోరాట సంవత్సరంగా 2022 నిలవబోతోందన్నారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతావైఫల్యానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగభృతి, ఉద్యోగ కల్పన వంటి హామీల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని చాడ సూచించారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జనవరి 14న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ ►తొలి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి - 10 (యూపీలో మాత్రమే) రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 21న ►రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి -14 -(పంజాబ్, గోవా,ఉత్తరాఖండ్, యూపీ) -ఒకే దశలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికలు మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న ►మూడో విడత పోలింగ్ ఫిబ్రవరి -20 (యూపీ) నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న ►నాలుగో విడత పోలింగ్ ఫిబ్రవరి -23 (యూపీ) ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 01న ►ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి -27 (యూపీ, మణిపూర్) ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 04న ►మార్చి 3న ఆరో విడత ఎన్నికలు (యూపీ, మణిపూర్) ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న ►మార్చి 7న ఏడో విడత ఎన్నికలు (యూపీ) ►మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎన్నికల ఆఫీసర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తాం. ఐదురాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించాం. కరోనా పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపాం. ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం మాస్క్, థర్మల్ స్కానర్లు, శానిటేషన్ తదితర లాజిస్టిక్స్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతాం. కరోనా నేపథ్యంలో 2,15, 368 పోలింగ్ కేంద్రాలు పెంచాం. 16 శాతం పోలింగ్ కేంద్రాలు పెంచాం. యూపీలో ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటున 862 మంది ఓటర్లు ఓటు వేస్తారు. దీనివల్ల పోలింగ్ కేంద్రాలలో రద్దీ తగ్గుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాం. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలి. అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ వచ్చింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ..28లక్షలుగా ఉంది. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్ సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. రోడ్‌షోలు రద్దు ఐదు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ రేటును పరిశీలించాము. పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతున్నాం. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలి. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. మరోవైపు దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా?లేదా? అనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో.. ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల సమావేశం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఎన్నికలు జరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని భావించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ►యూపీలో అసెంబ్లీ స్థానాలు - 403 ►పంజాబ్‌లో అసెంబ్లీ స్థానాలు - 117 ►ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాలు - 70 ►గోవాలో అసెంబ్లీ స్థానాలు - 40 ►మణిపూర్‌లో అసెంబ్లీ స్థానాలు - 60