ప్యాన్ ఇండియా మూవీ ప్రచారంతో రిలీజ్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఊహించని రేంజ్లో సక్సెస్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ.. నెగెటివ్ టాక్ నుంచి క్రమక్రమంగా పుంజుకుని భారీ సక్సెస్‌ను అందుకోవడం విశేషం. సౌత్‌నే కాదు.. నార్త్‌లోనూ పుష్పమేనియా మామూలుగా కొనసాగడం లేదు. స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీల నుంచి ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాజకీయ నాయకుల దాకా పుష్పను అనుకరణ.. అనుసరణ చేసేస్తున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్ సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ 'పుష్ప' సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని... ఆ సినిమా పేరు 'పుష్ప' అని రాజ్ నాథ్ చెప్పారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు.
ఈ పుష్ప చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని, కాంగ్రెస్ ఈయన్ని ఉత్త పుష్ప అనుకుంటోంది. కానీ, ఈయనలో ఫ్లవర్(పేరులో అని ఆయన ఉద్దేశం) ఉంది ఫైర్ కూడా ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని... ఈయన తగ్గేదేలే అని వ్యాఖ్యానిస్తూ జనాల్లో ఉత్సాహాన్ని నింపారు. తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగులు ప్రస్తుతం ఎన్నికల సీజన్లో జనాలకు ఎట్రాక్ట్ చేయడానికి తెగ వాడేస్తున్నారు మరి!. ఇంకోపక్క ‘పుష్ప ఇన్స్పిరేషన్తో..’ నేరాలు చోటు చేసుకుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment