five state assembly election
-
మార్పులే మంత్రం!
రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు కానీ, కొన్ని ఘటనలు అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. ఆకర్షిస్తాయి. అవి సంభవించడానికి ప్రేరణ ఏమిటన్న ఆలోచనకు పురిగొల్పుతాయి. ఇటీ వలి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక అక్షరాలా అలాంటిదే. మూడు చోట్లా సీనియర్లను కాదని కొత్త ముఖాలను కాషాయ పార్టీ ఎంచుకున్న తీరు ఆశ్చర్యాన్నీ, ఆలోచననూ కలిగిస్తోంది. కొత్త నేతల పేర్లు పెద్దగా తెలియ కున్నా... రకరకాల స్థానిక సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకొన్నాకనే మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సహాయ్, రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మలను అధిష్ఠానం ఎంపిక చేసినట్టుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ కమలనాథులు అనుసరిస్తున్న ఈ కొత్త సీఎం ముఖాల వ్యూహం లోతుపాతుల పట్ల అంచనాలు, విశ్లేషణలను పెంచుతోంది. ప్రజాస్వామ్యంలో సభలో సంఖ్యా బలంతో అధికార పీఠంపై కూర్చొనే రాజకీయ పార్టీకీ, ఎన్నికైన ఆ పార్టీ చట్టసభ సభ్యులకూ తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటాయి. అది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అయితే, శ్రమించి పార్టీని అధికారంలోకి తెచ్చిన, నిలబెట్టిన సీనియర్ నేతలకు సీఎం పీఠం దక్కకపోవడం, రాజస్థాన్ లాంటి చోట్ల తొలిసారి ఎమ్మెల్యేనే సరాసరి సీఎంను చేయడం, మంత్రులుగా ఎన్నడూ పనిచేయనివారిని డిప్యూటీ సీఎంలను చేయడం విచిత్రమే. కానీ నిత్యం ఎన్నికల పోరులో ఉన్నట్టే ఏడాది పొడుగూతా శ్రమించే బీజేపీకి తనవైన లెక్కలున్నాయి. విస్తృత రాజకీయ, సైద్ధాంతిక వ్యూహమూ ఈ ఎంపికలో కనిపి స్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతూకం పాటిస్తూ, సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసుకొంటూ ఈ కొత్త సీఎంల ఎంపికకు వ్యూహరచన చేశారని అర్థమవుతోంది. కొత్త సీఎంలు ముగ్గురూ హిందూత్వ వాదులే. ఆరెస్సెస్‌కు సన్నిహితులే. అధినేతలకు విధేయులే. మాజీ కేంద్ర మంత్రి, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడైన విష్ణుదేవ్‌ను అక్కడి సీఎం పీఠంపై కూర్చోబెట్టడం వెనుక దేశంలోని 9 శాతం ఆదివాసీలను అక్కున చేర్చుకొనే వ్యూహం ఉంది. ఇప్పటికే ద్రౌపదీ ముర్ముతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని అందించిన బీజేపీ ఆ వర్గంతో ఓట్ల బంధాన్ని బలోపేతం చేసుకోవాలనేది ఎత్తుగడ. ఇక, మధ్యప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యామంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్ రాష్ట్రంలో బలమైన ఓబీసీ వర్గానికి చెందినవారు కావడం కలిసొచ్చిన అంశం. ఆయన డిప్యూటీలుగా బ్రాహ్మణ, ఎస్సీ వర్గీయుల్ని నియమించడంలో, ఇతర ప్రధాన ఓటుబ్యాంకుల్ని తృప్తిపరిచే యత్నం కనిపిస్తోంది. రాజస్థాన్‌లోనైతే అధికారిక ప్రకటన ముందు దాకా సమావేశ ఏర్పాట్లలో ఉన్న ఎమ్మెల్యే భజన్‌లాల్ పేరును ఆకస్మికంగా ప్రకటించారు. ఆయనే ఊహించని ఆ ఎంపిక మరోసారి పదవిపై ఆశపడ్డ వసుంధరకు అధిష్ఠానం వేసిన గుగ్లీ. రాజవంశీయురాలైన వసుంధరా రాజె రెండు దశాబ్దాలలో తొలిసారిగా రాజస్థాన్‌లో ఇటు సీఎం కాకుండా, కనీసం సీఎం అభ్యర్థిగానైనా కాకుండా మిగిలారు. ఇక, మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలిక సీఎంగా పేరు తెచ్చుకొని, తాజా ఎన్నికల్లో ఏటికి ఎదురీది పార్టీని విజయతీరానికి చేర్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మళ్ళీ పగ్గాలు దక్కలేదు. ఛత్తీస్‌గఢ్‌కు ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన రమణ్ సింగ్ పరిస్థితీ అదే. ఇప్పుడిక ఒక విషయం స్పష్టం. వసుంధరా రాజె, చౌహాన్లను పక్కనబెట్టడంతో కమలం పార్టీ ఇప్పుడిక ఒకప్పటి వాజ్‌పేయి, అద్వానీల శకం నుంచి పూర్తిగా బయటపడి, మోదీ, షాల కొత్త జమానాలోకి సంపూర్ణంగా చేరుకున్నట్టే. పాత కాపులుగా చక్రం తిప్పుతున్న అనేకులకు అనధికారికంగా... అధికార పీఠం నుంచి బలవంతపు పదవీ విరమణ ఇచ్చేసినట్టే. అయితే, సీఎం పదవి ఇవ్వనంత మాత్రాన బీజేపీలో ఈ సీనియర్ల కథ ముగిసిపోయిందని అనుకోలేం. రానున్న రోజుల్లో కాషాయపార్టీ వీరి సేవలను ఎలా వినియోగించుకుంటుందో వేచిచూడాలి. ఏమైనా, ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది రోజుల తర్వాత బీజేపీ ఆచితూచి సీఎంల ఎంపిక తతంగాన్ని పూర్తిచేసింది. రాజకీయాల్లో తరాల మార్పే కాక అధికార మార్పిడి సైతం సాఫీగా సాగేలా చూసుకుంది. దేశంలో 60 ఏళ్ళు ఆ పైబడ్డ ఓటర్లు 15 నుంచి 20 శాతమే అని లెక్కలు వినిపిస్తున్న వేళ పెరుగుతున్న యువ ఓటర్లను ఆకర్షించే నవతరం నేతలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దే పథకరచనకు విజయవంతంగా శ్రీకారం చుట్టింది. వ్యక్తుల కన్నా వ్యవస్థ (పార్టీ) పెద్దదనే నిష్ఠురసత్యాన్ని నసాళానికి అంటేలా సీనియర్లకు సంకేతించింది. ఇక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త సీఎంలు బుధవారం కొలువుతీరారు. కొన్ని ధార్మికస్థలాలే లక్ష్యమనిపించేలా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లపై నిషేధమంటూ మధ్యప్రదేశ్‌లో మోహన్‌యాదవ్ పని మొదలెట్టేశారు. పాతవారిని మరిపించేలా పాలన అందించడమే కాక, తక్షణమే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు సాధించే సవాలు ఈ ముగ్గురు కొత్త సీఎంల ముందుంది. బీజేపీ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమన్న దిలాసా కనబరుస్తోంది. తరగని మోదీ మాయ, పార్టీ సైద్ధాంతిక పునాది, ప్రారంభం కానున్న అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు సహా ఈ కులసమీకరణాలూ తమకు లాభిస్తాయనే భరోసాతో ఉంది. మార్పే మంత్రమని నమ్మిన బీజేపీ ఇప్పటికైతే అధికారంలో ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా ఓటర్లపై పట్టు నిలుపు కోవడానికీ, పెంచుకోవడానికీ పై స్థాయిలో మార్పులు కీలకమని ఆచరణలో పెట్టింది. కొత్త యంత్రాన్ని పాత సాఫ్ట్‌వేర్‌తో కాక, కొత్త సాఫ్ట్‌వేర్‌తో నడపాలని నమ్మిన బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలి స్తుందో చూడాలి. అది ఫలిస్తేప్రతిపక్షాలెంత ఆశపడ్డా ఢిల్లీ గద్దెపై మార్పును 2024లోనూ చూడలేవు. -
బీజేపీ సీఎంలు ఎవరో..?
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ రాష్ట్రాల్లో మూడింటిటో బీజేపీ అధికారంలోకి రాగా తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జెడ్‌పీఎమ్ పవర్లోకి వచ్చాయి. తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే సీఎం ఎవరో తేలిపోగా బీజేపీ పవర్లోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో ఇప్పటికీ ముఖ్యమంత్రులెవరో ఇంకా తేలలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డినే సీఎంగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మిజోరంలో ఎక్కువ సీట్లు గెలిచిన జెడ్‌పీఎమ్ చీఫ్ లాల్డూహోమా సీఎం పదవి చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో సీఎం పదవికి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో పవర్లోకి వచ్చిన బీజేపీ నుంచి సీఎం పోస్టు కోసం మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గట్టిపోటీదారుగా ఉన్నారు. రాజస్థాన్‌లో సీఎం పదవి రేసులో మాజీ సీఎం వసుంధరరాజేతో పాటు బాబా బాలక్‌నాథ్, దియాకుమారీలు పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరే మళ్లీ వినిపిస్తోంది. అయితే త్వరలోనే బీజేపీ ఈ రాష్ట్రాల్లో సీఎంలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య..గెహ్లాట్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు! -
బీజేపీకి జై..సూచీలు రయ్
ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ‘జై’ కొట్టడంతో సోమవారం స్టాక్ సూచీలు ఏకంగా రెండు శాతం ర్యాలీ చేశాయి. ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదు ఉత్సాహాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు దిగువకు చేరుకుంది. ఫలితంగా సూచీలు 18 నెలల్లో (మే 20, 2022 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,384 పాయింట్లు పెరిగి 68,865 ముగిసింది. నిఫ్టీ 419 పాయింట్లు బలపడి 20,687 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ట ముగింపు. ట్రేడింగ్‌లోనూ జీవితకాల గరిష్టాల నమోదు జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 945 పాయింట్లు పెరిగి 68,435 వద్ద, నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 20,602 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మీడియా తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరమైన లాభాలతో ట్రేడయ్యా యి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడం ఓ దశలో సెన్సెక్స్ 1,437 పాయి ంట్లు దూసుకెళ్లి 53 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 68,918 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 435 పాయింట్లు ఎగసి 20,703 వద్ద రెండో రోజూ రికార్డు ర్యాలీ చేసింది. ► సూచీల రికార్డు ర్యాలీని అందిపుచ్చుకున్న అదానీ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 9%, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 7%, అదానీ పోర్ట్స్, ఏసీసీ 6%, అదానీ పవర్, అదానీ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 4%, ఎన్డీటీవీ 3%, అదానీ విల్మార్ 2% చొప్పున లాభపడ్డాయి. మొత్తం పది కంపెనీల షేర్లూ రాణించడంతో ఇంట్రాడేలో గ్రూప్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 31 తర్వాత తొలిసారి రూ.12 లక్షల కోట్లను తాకింది. చివరికి రూ.11.95 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ►ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఐసీఐసీఐ బ్యాంక్ 5%, ఎస్బీఐ 4%, కోటక్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 3% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఏ యూ బ్యాంక్‌లు 2%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు ఒకశాతం పెరిగాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ 91 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 46,484 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ రెండుశాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.81 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ. 343.48 లక్షల కోట్లకు చేరింది. కాగా అయిదు రోజుల ర్యాలీతో బీఎస్ఈలో రూ.14.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు మెప్పించడంతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగొచ్చు. రికార్డు ర్యాలీ నేపథ్యంలో స్థిరీకరణ జరిగితే నిఫ్టీకి 20,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ -
మిజోరాం ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుపు ఎవరిదంటే..!
ఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. 40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్ఎఫ్ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ సర్వే ఎంఎన్ఎఫ్ 16-20 జేపీఎం-10-14 ఐఎన్‌సీ 2-3 బీజేపీ 6-10 ఇతరులు-0 జన్ కీ బాత్ సర్వే ఎంఎన్ఎఫ్-10-14 జేపీఎం-15-25 కాంగ్రెస్-5-9 బీజేపీ-0-2 ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఎంఎన్ఎఫ్ 14-18 జేపీఎం 12-16 కాంగ్రెస్ 8-10 బీజేపీ 0-2 ABP-Cvoter MNF-15-21 ZPM-12-18 OTH-0-10 Times Now-ETG MNF-14-18 ZPM-10-14 OTH-9-15 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరక్ట్..!
న్యూఢిల్లీ: లోక్‌సభకు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 5.30 గంటల నుంచి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రానున్న ఫలితాలకు ఈ ఎన్నికల రిజల్ట్స్ ప్రివ్యూగా భావిస్తున్నారు.ఎన్డీఏ జైత్రయాత్రను సవాల్ చేస్తున్న ఇండియా కూటమి భవితవ్యం కూడా ఈ ఎన్నికలతో తేలిపోనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్,, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ప్రధాన పోరు ఉండగా మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్‌కు మధ్య ఫైట్ నడిచింది. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌లో 5 రాష్ట్రాల్లో జనాల మూడ్ ఎలా ఉందో తేలిపోనుంది. అయితే సాధారణంగా ఎగ్జిట పోల్స్ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉందనేదాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఫైనల్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌ను పూర్తిస్థాయిలో నమ్మడానికి లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇదీచదవండి..రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Five State Election Battle: ఉత్తరాది రాష్ట్రాల్లో హోరాహోరీనే..!
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉందంటున్నారు విశ్లేషకులు. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సర్వేలు కూడా చెబుతున్నాయి. రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని ప్రస్తుతం బీజేపీకి కొద్ది పాటి మొగ్గు ఉందని అంటున్నారు. అయితే రాజస్థాన్‌లో కూడా తామే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఛత్తీస్ ఘడ్ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. అయితే ఓటరు నిర్ణయం ఏంటనేది తెలిసేది మాత్రం డిసెంబరు మూడునే. అప్పటి వరకు ఫలానావారే గెలుస్తారని చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు. సెమీఫైనల్స్ గా అందరూ అభివర్ణిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ మెజారిటీ రాష్ట్రాల్లో ఎవరు సత్తా చాటితే వారికి వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉండచ్చని ఒక వాదన. అయితే అందులో శాస్త్రీయత ఉందని చెప్పలేం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మధ్య ప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బొటా బొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన జ్యోతిరాదిత్య సింధియా కొంత కాలం తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. దాంతో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది . సింధియా మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అయితే ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోందని అంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి రావడం..ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒకరకమైన సానుభూతి కూడా ఉందంటున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రీపోల్ సర్వేలు అంటున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితూ ఎంపీలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్య ప్రదేశ్ తరహాలోనే ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సచిన్ పైలట్‌ను కాదని సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ కు కిరీటం పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. దాంతో పైలట్ అలిగారు. ఎంపీలో సింధియా తరహాలోనే రాజస్థాన్ లో పైలట్ కూడా బీజేపీతో టై అప్లోకి వెళ్లారు . ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయని ఉప్పందడంతోనే రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ పైలట్‌ను బుజ్జగించి పార్టీ మారకుండా ఆపుకోగలిగారు. అయితే ఆతర్వాత గెహ్లాట్ అదే పనిగా సచిన్ పైలట్ ను వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైలట్ వర్గీయులకు కీలక పదవులు ఇవ్వకుండా అవమానించారు. దీనిపై అలిగిన పైలట్ ప్రభుత్వంపైనే బాహాటంగా విమర్శలు చేయడంతో ఈ మధ్యనే రాహుల్ గాంధీ పైలట్ తో భేటీ అయ్యి ఆయన్ను దారికి తెచ్చుకున్నారు. పార్టీలో కీలక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇవ్వడంతో పైలట్ తగ్గారు. ఈ ఇద్దరి మధ్య గొడవలతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దెబ్బతింటుందేమోనని కాంగ్రెస్ నాయకత్వం కంగారు పడింది. అయితే గెహ్లాట్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని..వాటి పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వేల్లో తేలింది. ప్రీపోల్ సర్వేల్లో బీజేపీకి స్వల్ప మొగ్గు ఉందని తేలింది. అయితే గెహ్లాట్ పాలనపై మాత్రం మరీ అంత ఎక్కువ వ్యతిరేకత ఏమీ లేదని కూడా అంటున్నారు. కాంగ్రెస్-బీజేపీలు రెండింటిలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరులు ఉన్నాయి.వాటి ప్రభావం ఆయా పార్టీలపై ఏ విధంగా ఉంటుదో ఇప్పుడే చెప్పలేం అంటున్నారు పరిశీలకులు. రాజస్థాన్ లో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉందంటున్నారు. గిరిజనులు బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ వైపే నిలిచారని అంటున్నారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో బీజేపీకి కాంగ్రెస్ చాలా గట్టి పోటీనే ఇస్తోంది. కర్నాటక , హిమాచల ప్రదేశ్ ఎన్నికల విజయాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను రీ డిజైన్ చేసుకుంది. కర్నాటక వ్యూహాన్నే ఈ అయిదు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తోంది. ఎన్నికల హామీల విషయంలోనూ ఒకేరకమైన గ్యారంటీలు ఇస్తోంది. సక్సెస్ ఫుల్ ఫార్ములానే అన్ని చోట్లా అమలు చేయడం మంచిదన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో అవినీతి ఆరోపణలతో పాటు మహిళలపై నేరాలు, అకృత్యాలు దారుణంగా పెరిగిపోతోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుంటోంది. బీజేపీ తరపున మోదీ, అమిత్ షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంటే కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కాలికి చక్రాలు కట్టుకుని తిరిగేస్తున్నారు. -
అధికారంలోకి రాగానే కుల గణన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పేద వర్గాల, దళిత, బీసీల సాధికారత కోసం కుల గణన చేపట్టాలని పేర్కొంది. కుల గణన కోసం అధికార బీజేపీపై ఒత్తిడి పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కుల గణన నిర్వహిస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానం చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కలి్పస్తామని వెల్లడించింది. కుల గణనకు మద్దతు ఇస్తూ సీడబ్ల్యూసీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ అన్నా రు. కుల గణన అనేది ఇండియాకు ఎక్స్–రే అని అభివరి్ణంచారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను సీడబ్ల్యూసీ స్వాగతించింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. ప్రభావవంతమైన వ్యూహం కావాలి: ఖర్గే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే ప్రభావవంతమైన వ్యూహం అవసరమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా, క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు సీడబ్ల్యూసీ భేటీలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబి్ధదారులకు అందాలంటే కేంద్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించాలని అన్నారు. కుల గణనకు తాను వంద శాతం మద్దతు ఇస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సోనియా గాంధీ చెప్పారు. దానికోసం పోరాడుదామని సూచించారు. కులాల వారీగా జనాభా లెక్కలకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
పాత కాపులకే పట్టం
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన పది రోజులకు ఎట్టకేలకు అన్నిచోట్లా ముఖ్య మంత్రుల ఎంపిక ప్రహసనం ముగిసింది. పంజాబ్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)ని మినహాయిస్తే, మిగతా 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొత్తవే కానీ సారథులు పాతవాళ్ళే. ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారం నిలుపుకొన్న బీజేపీ చిత్రంగా పాత కాపులపైనే మళ్ళీ భరోసా పెట్టింది. పార్టీలోనూ, బయటా తిరుగులేని యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని యూపీ సంగతి వేరు. ఆ ఒక్కటీ అటుంచితే, అసమ్మతుల మొదలు అధికారం కోసం పోటీ దాకా అనేకం ఉన్న రాష్ట్రాల్లోనూ పాత సారథులకే బీజేపీ జై కొట్టడం గమనార్హం. మణిపూర్‌లో బీరేన్ సింగ్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయగా, మరో 3 రాష్ట్రాల్లో ఈ వారంలోనే ప్రమాణ స్వీకారోత్సవాల హంగామా. పదిరోజుల ఊహాగానాల తర్వాత ఉత్తరాఖండ్‌లో... సొంత సీటులో ఓటమి పాలైన పుష్కర్ సింగ్ ధామీనే మళ్ళీ సీఎంగా పార్టీ ఎంపిక చేయడంతో ఇప్పుడు చర్చంతా ఈ పాత కాపుల విజయసూత్రాల చుట్టూ నడుస్తోంది. 70 స్థానాల ఉత్తరాఖండ్‌లో 47 సీట్లు గెలిచి, బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీ అనే ఘనత దక్కించుకుంది. అయితే, పోటీ చేసిన ఖటీమా నియోజకవర్గం నుంచి సీఎం ధామీ ఓడిపోవడం పార్టీకి పెద్ద షాక్. ధామీ ఓడారు గనక ఆ పదవి తమకు దక్కుతుందని ఇతర సీనియర్లు ఆశపడ్డారు. రకరకాల పేర్లు వినవచ్చాయి. పరిశీలకులుగా అధిష్ఠానం పంపిన మంత్రుల సమక్షంలో మంగళవారం ఆ ఊహాగానాలకు తెర పడింది. «45 ఏళ్ళ దామీకే మళ్ళీ సీఎం పీఠం లభించింది. ఈ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు వివిధ రాష్ట్రాల్లో సీఎంలను పేక ముక్కలలా మార్చారన్న అపకీర్తి బీజేపీ మూటగట్టుకుంది. ఆ అప్రతిష్ఠకు భిన్నంగా ఇప్పుడు ఫలితాలు వచ్చాక పాత సారథు లనే ఆ పార్టీ కొనసాగించింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో గత మార్చిలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌ను మార్చారు. వచ్చిన తీరథ్ సింగ్ రావత్ సైతం వివాదాస్పద మయ్యారు. స్త్రీల వస్త్రధారణపై వ్యాఖ్యలు, హరిద్వార్ కుంభమేళాలో కోవిడ్ నిబంధనల వైఫల్యం, టీకాల డేటాలో ప్రభుత్వ మతలబుల లాంటి కారణాలతో పదవి పోగొట్టుకున్నారు. ఆయన స్థానంలో గత జూలైలో పగ్గాలు చేతబట్టి, ఉత్తరాఖండ్‌కు సీఎం అయ్యారు ధామీ. ఓటమి అంచున ఉందనుకున్న పార్టీ అదృష్టాన్ని తిరగరాశారు. తీరా ఓడిపోతుందనుకున్న బీజేపీని గెలిపించారు. సొంత సీటులో ఓడినా, పదవి రేసులో మాత్రం అధిష్ఠానం ఆశీస్సులతో గెలిచారు. మణిపూర్ సంగతికొస్తే, 79.85 శాతంతో దేశ సగటు కన్నా ఎక్కువ అక్షరాస్యత రేటున్న ఈ కీలక సరిహద్దు రాష్ట్రంలో తీవ్రవాదం, జాతుల ఘర్షణ కూడా ఎక్కువే. 60 స్థానాల ఈశాన్య రాష్ట్రంలో 2017లో బీజేపీ గెలిచింది 21 సీట్లే. అప్పట్లో 28 సీట్లతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా, కమలనాథులే ప్రభుత్వం ఏర్పాటుచేయడం మరో పెద్ద కథ. ఆటుపోట్లెన్నో తట్టుకుంటూ అయిదేళ్ళుగా విజయవంతంగా మైనారిటీ ప్రభుత్వం నడిపారు బీరేన్ సింగ్. తాజా ఎన్నికల్లో పార్టీ బలాన్ని 32కు పెంచి, మెజారిటీ సాధించి పెట్టారు. సీఎం సీటుకు ఇతరులు పోటీ పడ్డా, బీరేన్‌కు అది అనుకూలించింది. బీరేన్ నియంతృత్వ ధోరణిని నిరసించే అసమ్మతి వర్గం చివరకు ఏమీ చేయలేకపోయింది. అధిష్ఠానం సహజంగా విజయసారథి వైపే మొగ్గింది. ఎన్నికల అనంతరం ఆరుగురు ఎమ్మెల్యేల జనతాదళ్ (యు), అయిదుగురు ఎమ్మెల్యేల నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ మద్దతుతో ఈసారి బీరేన్ది సుస్థిర సర్కార్. నాగాలాండ్ సరిహద్దు గ్రామాలతో ఘర్షణలు, నిరుద్యోగం, వివాదాస్పద సాయుధ బలగాల చట్టం లాంటి వాటిని బీరేన్ ఎలా పరిష్కరిస్తారో? ఎమ్మెల్యేల బేరసారాలకూ, పార్టీ ఫిరాయింపులకూ పేరుపడ్డ 40 స్థానాల గోవాలో గతంలో అతి పెద్ద పార్టీ కాంగ్రెసైనా, బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ చీలిక వర్గం వచ్చి కలవడం కలిసొచ్చింది. తాజా ఎన్నికల్లో మాత్రం మెజారిటీకి ఒక్క సీటు తక్కువగా 20 సీట్లతో బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, అంతర్గత కలహాలు, సీఎం ఆశావహులతో చిక్కొచ్చింది. పార్టీని గెలిపించిన ప్రమోద్ సావంత్ సొంత పార్టీలోని ప్రత్యర్థి విశ్వజిత్ రాణే లాంటి వారిని దాటుకొని రావాల్సిన పరిస్థితి. ఫలితాలొచ్చి పది రోజులు దాటినా, అనేక కారణాలతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. అమిత్ షా స్వయంగా ప్రమోద్, విశ్వజిత్‌లతో భేటీ జరిపినట్టు వార్తలొచ్చాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టిన ప్రమోద్‌నే సారథిగా అధిష్ఠానం మరోసారి ఎంచుకుంది. ఎన్నికలలో అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకతకు ఎదురొడ్డి, ముందుండి మరీ పార్టీని గెలిపించడం ఈ రెండోసారి సీఎంలకున్న సానుకూలత. బీరేన్, ధామీ, ప్రమోద్ సావంత్‌లకు మళ్ళీ సీఎం పీఠం దక్కింది అందుకే. బీజేపీ నేతలూ ఆ మాటే చెబుతున్నారు. అయితే, శాసనసభా పక్ష సమావేశాల్లో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నిక లాంటి లాంఛనపూర్వక మాటలకు చాలా ముందే రాజ్‌నాథ్ సింగ్ లాంటి పరిశీలకుల నోట కాబోయే ముఖ్యమంత్రులెవరో సూచనలు వచ్చేశాయి. ‘‘మ్యాచ్‌ను అద్భుతంగా ముగించే క్రికెటర్ ధోనీ లాంటి వారు ధామీ’’ లాంటి వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. మొత్తానికి, ఒకప్పటి కాంగ్రెస్ అధిష్ఠానం లాగే, నేటి బీజేపీ కూడా సీల్డ్ కవర్ సీఎంల సంస్కృతికి అతీతమేమీ కాదని తాజా సీఎం ఎంపికలతో తేలిపోయింది. పార్టీ జెండాను మరింత పైకెత్తడంలో ఈ సరికొత్త పాత సీఎంలు సఫలమైతే అధిష్ఠానానికి అంతకు మించి ఇంకేం కావాలి! -
2024 సాధారణ ఎన్నికలకు సూచికే
- సాక్షికి ప్రత్యేకం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సానుకూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో యూపీ ప్రభుత్వం విజయవంతం కావడం ఆ రాష్ట్రంలో బీజేపీ విజయ కారణాల్లో ఒకటి. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఎస్పీ విఫలమైంది. ఇక పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. ఈ విజయం ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే! ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగిం టిని గెలుచుకుని భారతీయ జనతా పార్టీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సాను కూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగ్గానే అంచనా వేశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఎన్నికల్లో ఎవరు ఎందుకు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూపీలో మోడీ–యోగీ హవా! ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయానికి మోడీ–యోగీ ద్వయం కారణ మన్నది నిర్వివాదాంశం. మొత్తం 403 స్థానాల్లో 255 బీజేపీకి దక్కడం, అది కూడా 41 శాతం ఓటుషేరుతో కావడం భారీ విజయం గానే చెప్పుకోవాలి. 2017 ఎన్నికలతో పోలిస్తే 57 సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేసిన అప్నాదళ్ (సోనేలాల్) పన్నెండు స్థానాలు గెలుచుకోగా, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్ ఇంకో ఆరు సీట్లు గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల కంటే 73 స్థానాలు ఎక్కువగా, మొత్తం 111 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. సైకిల్ గుర్తుకు పడ్డ ఓట్లూ 32 శాతానికి చేరాయి. ఎన్నిక లకు ముందు ఎస్పీతో జట్టు కట్టిన ఆర్ఎల్డీ 8, ఎస్బీఎస్పీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ 13 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏతావాతా యూపీ రాజకీయాల్లో తమకు తిరుగులేదని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ ఎన్నికలు శాంతి భద్రతలకూ, సమాజ్‌వాదీ గూండా రాజ్యానికీ మధ్య జరుగుతున్నాయన్న బీజేపీ ప్రచారం బాగానే పనిచేసిందని ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణానికి యోగీ అవసరమని భావించిన ఓటర్లు తమ తీర్పును విస్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూలేని విధంగా ఒక పార్టీకి వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశం దక్కింది. అలాగే ‘ఎన్సీఆర్’ ప్రాంతంలోని నోయిడాను సందర్శించిన వారు యూపీ గద్దెనెక్కలేరన్న గుడ్డి నమ్మకాన్ని కూడా యోగీ ఆదిత్యనాథ్ వమ్ము చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో రాణించడానికి పలు కారణా లున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ల చరిష్మాతో పాటు కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ అధి కారంలో ఉండటమూ కలిసొచ్చింది. మోడీ హవా సామాజిక వర్గా లను దాటుకుని అన్ని వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడేలా చేసింది. అగ్రవర్ణాలు, ఎస్సీలు, చిన్న చిన్న ఓబీసీ వర్గాలతో కలిసి 2014లో సృష్టించుకున్న కూటమి బీజేపీకి దన్నుగా (కొన్ని ప్రాంతాలు మినహా) నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో ప్రభుత్వం విజయవంతం కావడం బీజేపీ విజయ కారణాల్లో ఇంకోటి. ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు బీజేపీకి మూకుమ్మడిగా ఓట్లేశారు. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగు తున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకుందామనుకున్న ఎస్పీ ఈ విషయంలో తీవ్ర భంగపాటుకు గురైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, బీజేపీ సీనియర్ నేతలు జాట్ నేతలను కలవడం పరిస్థితిని బీజేపీకి కొంత అనుకూలంగా మార్చింది. ఆర్ఎల్డీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఎక్కువ సీట్లు సాధించ వచ్చునన్న ఎస్పీ అంచనా తప్పింది. వేర్వేరు పార్టీల మధ్య ఓట్ల మార్పిడి కూడా సరిగ్గా జరగలేదు. అయితే, ఎస్పీ కూటమికి దక్కిన అదనపు సీట్లు బీజేపీ వ్యతిరేక పార్టీలతో జాతీయ స్థాయి కూటమి కట్టాలన్న ప్రయత్నంలో జరిగిన మార్పు అనుకోవాలి. పంజాబ్‌ను ఊడ్చిన ఆమ్ ఆద్మీ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ప్రతిపక్షాలన్నింటినీ ఊడ్చేసిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ స్థానాలు 117లో ఏకంగా 92 గెలుచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓట్లు 22 శాతమే అయి నప్పటికీ సాధించిన అదనపు సీట్లు మాత్రం 72. కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓట్లతో 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కూటమి నాలుగు స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఆప్‌కు పంజాబ్‌లో దక్కిన అపూర్వ విజయం... ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే. అదే సమయంలో ఈ ఓటు భూస్వామ్యవాద పోకడలతో, అవినీతిలో మునిగిపోయిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పడ్డది గానూ చూడవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ము లాటలు, వర్గపోరుల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్ అమరీందర్‌సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య భగ్గుమన్న విభేదాలు పార్టీ మద్దతుదారులు అనేకులు దూరమమ్యేందుకు కారణమైంది. సిద్ధూను పార్టీ అధ్యక్షుడిగా, దళితుడైన చరణ్‌జీత్‌సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. చన్నీ, సిద్ధూ ద్వారా రాష్ట్రంలోని 32 శాతం దళిత, 20 శాతం జాట్ ఓటర్లను కూడగట్టాలని అనుకున్న కాంగ్రెస్ పథకం పూర్తిగా బెడిసికొట్టింది. ఆధిపత్య పోకడలకు పోయే జాట్ సిక్కులతో కలిసి ప్రయాణించలేమనుకున్న దళితులు మూకుమ్మడిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రచార లోపాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించిన క్షణం నుంచి ఆ పార్టీకి అనుకూల పవనాలు వీచాయంటే అతిశయోక్తి కాదు. నిరుద్యోగ భృతి, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, విద్యా వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, మహిళలకు పింఛన్ల వంటి పథకాలు ప్రజలను ఆప్‌కు ఓటేసేలా చేశాయి. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... మోడీ హవాతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి విజయం దక్కింది. ఉన్న డెబ్భై స్థానాల్లో 47 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మును పటి కంటే ఎనిమిది సీట్లు ఎక్కువ దక్కించుకున్నా అధికారం మాత్రం అందని మానిపండుగానే మిగిలింది. ముఖ్యమంత్రులను మార్చడం, పార్టీలో అంతర్గత విభేదాల కార ణంగా బీజేపీ మూడు శాతం ఓట్లు, పది సీట్లు కోల్పోయింది. కొత్త ఉద్యోగాల కల్పన, ఏడాది పొడవునా చార్ధామ్ యాత్రకు ఉయోగపడేలా రహదారుల నిర్మాణం, కర్ణ ప్రయాగ్, రిషికేశ్‌ల మధ్య రైల్వే లైను వంటి బీజేపీ ఎన్నికల హామీలు పని చేశాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో తన స్థితిని కొంచెం మెరుగుపరచుకోగలిగింది కానీ, హైకమాండ్ నుంచి తగిన మద్దతు లభించకపోవడం; పార్టీలో వర్గాలు, ప్రచారకర్తల లేమి వంటి కారణాలతో ఓటమి పాలైంది. మణిపూర్‌లో బీరేన్ సింగ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నలభై సీట్లలో విజయం లక్ష్యంగా అరవై స్థానాలున్న అసెంబ్లీకి పోటీ పడింది. దక్కింది 32 స్థానాలు మాత్రమే అయినప్పటికీ... సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, జేడీ(ఎస్), ఫార్వర్డ్ బ్లాక్‌లతో కూడిన కాంగ్రెస్ కూటమికి ఐదు స్థానాలు మాత్రమే లభించాయి. కేంద్రంలో బీజేపీ భాగస్వామి అయిన ఎన్పీపీ ఒంటరిగానే పోటీకి దిగి ఏడు స్థానాలు, జేడీ(యూ) ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్పీఎఫ్ ఇంకో ఐదు స్థానాలు గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సుస్థిర, శాంతియుతమైన ప్రభుత్వం అందిం చినందుకుగానూ మణిపూర్ ప్రజలు మరోసారి బీజేíపీకి పట్టం కట్టినట్లుగా చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక వర్గాల మధ్య నమ్మకాన్ని పెంపొందించుకోవడమూ కాషాయ పార్టీకి కలిసివచ్చింది. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బహుముఖ పోటీ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహా రాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోయి ఉండటం కలిసి వచ్చింది. మోజారిటీకి ఒక స్థానం తక్కువగా 20 స్థానాలు గెలుచు కుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 12, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలు దక్కించుకోగా తృణమూల్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. బీజేపీయేతర పార్టీల్లో అనైక్యత ఫలితాలు ఎలా ఉంటాయో గోవా ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించడం వెనుక ఓటర్లు మత ప్రాతిపదికన చీలిపోవడం కారణమన్న వాదనలో అంత పస లేదనే చెప్పాలి. మంచి పాలన, వి«ధానాల ఆధారంగానే ఓటర్లు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తుకు సూచికగా చూడవచ్చు. పంజాబ్, గోవాల్లో అధికారాన్ని దక్కించు కోవడంలో విఫలమైన కాంగ్రెస్ తన పతనావస్థలో చరమదశకు చేరుకుందని చెప్పాలి. 2024 సాధారణ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సూచిక అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రవీణ్ రాయ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
కొత్త రూపుతో తిరిగొస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది. ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా వచ్చాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతిని ధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అంతమాత్రాన ధైర్యం కోల్పోలేదని, పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. ఫలితాల అనంతరం గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలతో నిరాశ చెందినా కుంగిపోలేదని చెప్పారు. ‘‘ఓటమి కారణాలపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఒక పార్టీగా కాంగ్రెస్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. సరికొత్త వ్యూహాలతో తిరిగొస్తుంది. గెలిచేదాకా పోరాడుతూనే ఉంటుంది. ఆ క్రమంలో నిత్యం జనం పక్షానే నిలుస్తుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై అంతే బాధ్యతతో గొంతెత్తుతుం ది’’ అని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కుల, మతవాదాలకు తావివ్వకుండా చూసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేసినా బీజేపీ చేసిన విపరీతమైన భావోద్వేగ ప్రచారం ముందు విద్య, వైద్యం, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలు పక్కకు పోయాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో మెరుగైన ఫలితాలు ఆశించినట్టు సుర్జేవాలా చెప్పారు. కానీ పంజాబ్‌లో ప్రభు త్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయామన్నారు. ‘‘యూపీలో పార్టీకి నూతన జవసత్వాలు కల్పించగలిగినా ప్రజల్లో తమ పట్ల ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోలేకపోయాం. ఉత్తరాఖండ్, గోవాల్లో బాగా పోరాడినా విజయం సాధించలేకపోయాం’’ అని చెప్పారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం సాగిస్తాం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రజల తరపున నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. యూపీలో విజయం కోసం తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం ఉద్యమించారని తెలిపారు. అయినప్పటికీ తమ శ్రమను ఓట్లుగా మరల్చుకోలేకపోయామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పు శిరోధార్యం అని ఉద్ఘాటించారు. యూపీ అభివృద్ధి కోసం తమ వంతు పోరాటం సాగిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. -
కాంగ్రెస్‌ను ముంచేసి..ఇప్పుడు రాజీనామానా?
చంఢీగఢ్: పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఈసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టే వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయినా ఇది కాంగ్రెస్‌కు సత్ఫలితాలను ఇవ్వలేదు. కాంగ్రెస్ గ్రూపు రాజకీయంతో విసుగుపోయిన ప్రజలు ఆప్కే పట్టం కట్టారు. ఆది నుంచి కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టిన ఆప్ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్ బై? పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్ సింగ్ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఆశించే పంజాబ్ కాంగ్రెస్‌లో మంట రాజేసిన సిద్ధూ.. ఆపై సీఎం కావొచ్చనే భావించాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చన్నీని ముఖ్యమంత్రి చేసింది. ఇది కూడా సిద్ధూకి జీర్ణించలేదు. పార్టీ మారదామనే ప్లాన్ చేశాడు. మొత్తం కాంగ్రెస్‌నే విచ్ఛిన్నం చేద్దామనే అనుకున్నాడు. తనకు దక్కనిది వేరే వాళ్ల దక్కడంతో వివాదాలకు ఆజ్యం పోశాడు. కానీ చివరకు రాహుల్ గాంధీ జోక్యంతో సిద్ధూ వెనక్కి తగ్గి కాంగ్రెస్‌తో నడిచాడు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని అధిష్టానం ప్రకటించినా సిద్ధూ మిన్నుకుండిపోయాడు. సీఎం క్యాండిడేట్ తనకు ప్రాబ్లమ్ లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ దారుణ పరాజయం దిశగా సాగుతుండటంతో సిద్ధూకు రాజీనామ ఒక్కటే మార్గంలా కనబడుతోంది. ఇవాళ సాయంత్రం ఆ రాష్ట్ర సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించినా అందుకు పలువురు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండాలని అనుకున్నారట. అందులో సిద్ధూ కూడా ఉన్నాడని, తాను రాజీనామా చేయబోతున్నట్లు సీఎల్పీకి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చేసిన నష్టమంతా చేసి ఇప్పుడు రాజీనామా డ్రామాకు తెరలేపడం మళ్లీ హాట్‌టాపిక్ అయ్యింది. చదవండి: పంజాబ్‌లో అఖండ ‘ఆప్ కీ సర్కార్’.. ఫలించిన ‘ఎక్ మౌకా’ నినాదం -
యూపీలో ఈసారి సీఎం ఆయనే!
-
యోగి రికార్డు! యూపీలో 70 ఏళ్ల తర్వాత..
ఎగ్జిట్ పోల్ అంచనాలే దాదాపుగా నిజం అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ 202ను దాటేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రాంతీయ పార్టీలతో జత కలిసి కూటమిగా వెళ్లినా.. అఖిలేష్ యాదవ్‌కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎంలకు భంగపాటు తప్పలేదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కంటిన్యూ అవుతోంది. మోదీ-షా ప్రచార మాయజాలంతో యోగి సర్కార్కే రెండోసారి పట్టం కట్టేందుకు జనాలు మొగ్గు చూపించారు. ఫలితాల సరళిని గమనిస్తే.. మెజారిటీ స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ.. యోగి నేతృత్వంలో సుస్థిర బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అయ్యింది. ముఖ్యంగా యూపీలో బీజేపీకి సోషల్ ఇంజినీరింగ్ బాగా కలిసొచ్చింది. ముజఫర్‌నగర్ పంచాయితీ ఎన్నికల్లో ఫలితం చూపించడంతో.. అసెంబ్లీ ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది బీజేపీ. Social Engineering కాస్త సూపర్‌సక్సెస్ అయ్యింది. ఓబీసీలు యోగి సర్కార్ వెంటే నడిచారు. అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ కూటమి.. రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే చాలాగ్యాప్ తర్వాత ఎస్పీ వంద సీట్లు దాటడం కాస్త ఊరట ఇచ్చే విషయం. ఎంఐఎం ఓటింగ్ శాతం.. ఎస్పీపై ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. గతంలో ప్రతిపక్షం ఎప్పుడూ 50 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగుసార్లు యూపీని పాలించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. కనీస ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ స్థానంలో గెలుపుదిశగా పయనిస్తున్నారు. యూపీలో 70 ఏళ్ల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా కనిపిస్తోంది. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. అంతేకాదు దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక పెద్ద రాష్ట్రంలో.. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కూడా జరగనుంది. -
కేజ్రీవాల్ కాబోయే ప్రధాన మంత్రి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కీలక చర్చ నడుస్తోంది. కాగా, యూపీ, పంజాబ్ ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ నేత, పంజాబ్ ఎన్నికల సహ ఇన్ఛార్జ్ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. దేశ ప్రజల ఆశాకిరణమని, దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే అంటూ కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. అయితే, గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాఘవ్ చద్దా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీని అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి స్థాయిలో హోదాలో కనిపిస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని అన్నారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి.. పదేళ్లు కూడా కాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల వేళ ఆయన ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్ పోల్స్
అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరికొత్త సర్వే ఒకటి ట్రెండింగ్‌లో నిలిచింది. పీపుల్స్ పల్స్, ఏబీపీ-సీ ఓటర్, ఇండియా టుడే, టైమ్స్ నౌ.. వంటి ప్రముఖ సర్వే సంస్థల అంచనాలకు తలకిందులు చేస్తూ సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్(ఢిల్లీ యూనివర్సిటీ) భిన్నంగా ఎగ్జిట్ పోల్స్‌ను చేపట్టింది. తమ సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గురువారం ఐదు రాష్ట్రాల(ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఐదు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఎంతో పట్టుదలతో ప్రచారంలో దూసుకెళ్లగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం బీజేపీకి చెక్ పెట్టేందుకు ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగాయి. కాగా.. దేశంలోనే అత్యధిక సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం మరోసారి వికసించనున్నట్లు ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో వెల్లడైంది. అన్నిఎగ్జిట్పోల్కు భిన్నంగా సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్(ఢిల్లీ యూనివర్సిటీ) చేపట్టిన సర్వే యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపుతుందని తమ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు గాను 55.3 శాతం ఓటింగ్‌తో బీజేపీ 334 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని తెలిపింది. అలాగే.. సమాజ్‌వాదీ పార్టీ కూటమి 53 స్థానాల్లో, బీఎస్పీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధింస్తుందని అంచనా వేసింది. కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎవరూ చేయని విధంగా దాదాపు 3 లక్షల మందిని తాము సంప్రదించినట్టు ఈ సర్వే నివేదికలో వారు పేర్కొన్నారు. అయితే, చాలా సర్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వందకు పైగా స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఈ సర్వేలో మాత్రం ఎస్పీకి కేవలం 53 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం విశేషం. -
కీలకమైన గెలుపు హవా!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీతోపాటు పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్ని కల తంతు ముగిసింది. జయాప జయాల వివరాలు ఇంకో రెండు రోజుల్లో స్పష్టమవుతాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఒక విషయమైతే అంచనా వేయవచ్చు. దేశ ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతికంగా మోడీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికలు మోడీని జాతీయ స్థాయి నేతగా నిలబెడితే, 2019 నాటి ఎన్నికలు మోడీ ఆధిపత్యాన్ని పరాకాష్టకు చేర్చాయి. మోడీ నాయ కత్వంపై విదేశీ మీడియా మాత్రమే కాదు.. వామపక్షవాదులు, విమర్శకులు, విదేశీ మీడియా తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓటమిపాలైనా మోడీ హవా అయిపోయిందనీ వీరు ప్రకటించేస్తూంటారు. వ్యవసాయ చట్టాల రద్దు తరువాత మోడీ రైతులకు క్షమాపణలు చెప్పడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. అయితే, మోడీ హవాను అర్థం చేసుకోవడం అంత సులువైన పనేమీ కాదు. మోడీ హవాకు నాందీ పడింది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అధికారం నిర్వహించినప్పుడన్నది నిర్వివాదాంశం. మోడీ మార్కు గుజరాత్ నమూనా ఆర్థిక వృద్ధికి సూచికగా మారిన విషయం తెలిసిందే. 2002–12 మధ్యకాలంలో గుజ రాత్ ఆర్థిక వృద్ధిని సవాలు చేసే వాళ్లెవరూ లేకపోగా ఈ పరి ణామం కాస్తా ఆయన్ని మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిని చేయ గలిగింది. నిజాయతీపరుడు, కష్టజీవి, హిందుత్వవాది అన్న ముద్ర మోడీకి దక్కింది. ఆర్థికంగా ఎదగాలన్న మధ్యతరగతి వర్గం రాష్ట్ర అభివృద్ధి విషయంలో మోడీ దార్శనికతను తమదిగా చేసుకున్నారు. హిందూ ఓట్లు మోడీకి నమ్మకంగా పడటం మాత్రమే కాకుండా.. హిందుత్వ రాజకీయాలకు మోడీ ఓ మార్గదర్శకుడయ్యాడు. బీజేపీ తరఫున ప్రధానిగా మోడీ పోటీ చేయనున్నారన్న వార్తతో మెజారిటేరియన్ రాజకీయాల్లో మోడీ ప్రభ గుజరాత్‌ను దాటి దేశవ్యాప్తమైంది. మోడీ చరిష్మాతో దేశ ఎన్నికల యవనికపై కాషాయం అలుముకుంది. మట్టి మనిషి, అభివృద్ధి రాజకీయాలపై దార్శనికత ఉన్న వాడిగా ముద్ర సంపాదించుకున్న మోడీ వాటి సాయంతోనే తన చరిష్మాను కొనసాగించారు. ఆర్థికంగా సాధించిన అభివృద్ధి గుజరాత్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కూడా ఇక్కడ ఉపయోగపడింది. చాయ్‌వాలా నేపథ్యం, ఆర్ఎస్ఎస్ సిద్ధాం తాల మద్దతులు ఒకవైపున... అవినీతి, వారసత్వ రాజకీయాలు ఇంకోవైపున ఉన్న సందర్భంలో ప్రజలు మోడీకి ఆకర్షితుల య్యారని చెప్పాలి. రాజకీయ, వాక్ చాతుర్యాలూ కలిసి వచ్చాయి. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ... మైనారిటీ లను ప్రసన్నం చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను తరచూ ప్రస్తావిస్తూ హిందూ వర్గాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు అందించడం, ప్రజల నాడిని గ్రహిస్తూ వాటిల్లో తప్పులను సరిదిద్దుకోవడం మోడీకి లాభిం చింది. మోడీ వినా మరో ప్రత్యామ్నాయం లేదన్న మానసిక స్థితిని సృష్టించడంలోనూ విజయం సాధించారు. 2014 తరువాత జరిగిన ఎన్నికల్లో అత్యధికం హవాల ఆధారంగా నడిచినవే. బీజేపీ విజయాలు.. లేదా ఓట్లశాతంలో పెరుగుదల ప్రధానంగా మోడీ అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత సెంటిమెంట్ల ఆధారంగానే జరిగాయి. ప్రభుత్వ పాలన సరిగా లేని మధ్యప్రదేశ్, హరియాణాల్లో మోడీ ప్రభ బీజేపీ పతనాన్ని అడ్డుకుంది. ఓటమి తాలూకూ తీవ్రతను గణనీ యంగా తగ్గించింది. పశ్చిమబెంగాల్లో పార్టీ రెండో స్థానానికి ఎదిగేందుకు సాయపడింది. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అన్న నినాదంతో 2022 నాటికి సరి కొత్త భారత దేశాన్ని నిర్మిస్తా మన్న మోడీ నినాదం దేశంలో ఓ కొత్త ఊపు తెచ్చింది. జాతీయ మౌలిక సదుపాయా లను ఆధునికీకరించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తవాటిని ఏర్పాటు చేయడం అన్న ద్విముఖ వ్యూహంతో మోడీ కొత్తగా నేషన్ బిల్డింగ్ మొదలుపెట్టారు. ఆర్థిక సంస్క రణలు వేగవంతం చేయడం, ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలు రాజకీయంగా మోడీకి ఉన్న ఆదరణను మరింత పెంచాయి. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం వంటి చిరకాల ఆర్ఎస్ఎస్ అజెండాను వేగంగా ఆచరణలోకి తీసుకురావడం మోడీ హవాకు మరింత జోరు నిచ్చాయి. ఏతావాతా.. మోడీ హవా మరింత కాలం కొన సాగేందుకు ఇవన్నీ దోహదపడుతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు, నిపుణులు కొందరు మోడీ హవా, బీజేపీ తాలూకూ వ్యవస్థ చాలా బలహీన పడ్డాయని చెబుతూ, అందుకు ఐదు కారణాలు చూపుతున్నారు. వీటిల్లో మొదటిది, 2014 తరువాతి ఎన్నికల్లో మోడీ విజ్ఞప్తుల తరువాత కూడా బీజేపీకి పడ్డ ఓట్ల శాతంలో స్వల్పమైన తగ్గుదల నమోదు కావడం. ఈ కారణంగా 2024 ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజా రిటీతో గెలవడం అంత సులువు కాబోదని వీరు అంటున్నారు. మోడీ తరువాత బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థి తులు ఉండవన్నది రెండో కారణంగా చూపుతున్నారు. మోడీ వారసుడు ఎవరన్న అంశంపై పార్టీ చీలిపోవడమో, కుప్పకూలి పోవడమో జరుగుతుందని వీరి అంచనా. మోడీ, బీజేపీ హవా తగ్గుతోందనేందుకు విశ్లేషకులు చూపుతున్న మూడో కారణం పార్టీలోనే అంతర్గతంగా పోటీ మొదలయ్యే అవకా శాలు ఉండటం. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పార్టీలో కొత్తగా చోటిచ్చిన నేపథ్యంలో వారు తమ ప్రాతినిధ్యంపై డిమాండ్ చేస్తారని వీరు చెబుతున్నారు. ఇప్పటివరకూ బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వంలో అగ్రవర్ణాలదే ఆధిపత్యం. బీజేపీ సంస్థాగత నిర్మాణం దోవతప్పిపోయే అవకాశం ఉందన్నది నాలుగో కారణం. ఇందిరా కాంగ్రెస్ తరువాత కాంగ్రెస్ పార్టీలో జరిగి నట్టే ఇప్పుడూ జరగవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణలు బెడిసికొట్టి ఓటర్లకు కొన్ని ఇతర అంశాలు గోచరిస్తే రాజకీయంగా మరోసారి కొత్త ముఖాల కోసం ప్రయత్నాలు మొదలు కావచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ కారణాల్లో కొన్ని పరస్పర వైరుద్ధ్యమున్నవి. ఇందిరా కాంగ్రెస్ తరువాతి పరిస్థితులపై అంచనా కూడా అస్పష్టం. ఎందుకంటే ఇరు పార్టీల నేపథ్యం, రాజకీయం పూర్తిగా భిన్నం. మొత్తమ్మీద చూస్తే... మోడీ హవా ఇప్పటికీ కొన సాగుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దేశ రాజ కీయాలకు అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల్లోనూ గెలుపు ఓటములకు మోడీ హవా కీలకం కానుంది. ప్రవీణ్ రాయ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు.. బీజేపీకి బిగ్ షాక్
బలియా: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశలో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో కుటుంబపాలన సాగుతోందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. గురువారం ఆయన ఎన్డీ టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారన్నారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్‌పూర్ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? ప్రస్తుతం కర్ణాటక సీఎం ఎవరు?’ అని వ్యాఖ్యానించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్ అన్న విషయం తెలిసిందే. -
ఫలితాలు రానేలేదు .. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు
పనాజీ: రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్, గోవా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ కిరణ్ కండోల్కర్ మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కండోల్కర్.. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్‌కు ఎన్నికల సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ బృందం వ్యవహరించింది. ఇదిలా ఉండగా కిరణ్ కండోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సలహాదారు I-PAC(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) తమ పార్టీ అభ్యర్థులను విడిచిపెట్టిందని విమర్శించారు. కాగా, ప్రశాంత్ కిషోర్, అతని బృందం తీరుతో కలత చెందానని అన్నారు. ఈ క్రమంలోనే తాను తృణమూల్ కాంగ్రెస్ గోవా యూనిట్ చీఫ్ పదవిని వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి I-PAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సాయం అందించిన విషయం తెలిసిందే. మరోవైపు, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కండోల్కర్.. ఆల్డోనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా, అతని భార్య కవిత తృణమూల్ టిక్కెట్‌పై థివిమ్ నుండి పోటీ చేశారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
డిగ్రీ అయితే రూ.4,000 నిరుద్యోగ భృతి!
BJP Manifesto 2022 Punjab: పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పలు తాయిలాలు ప్రకటించింది. తమను గెలిపిస్తే ప్రభుత్వోద్యోగాల్లో 75 శాతం, ప్రైవేట్ ఉద్యోగాల్లో 50 శాతం రాష్ట్ర యువతకే దక్కేలా రిజర్వేషన్లు కేటాయిస్తామని శనివారం విడుదల చేసిన మూడో మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 35 శాతం కేటాయిస్తామని చెప్పింది. డిగ్రీ పూర్తయ్యాక రెండేళ్ల దాకా నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. -
ప్రచార సమయం పెంపు.. పాదయాత్రలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 సంబంధిత ఆంక్షలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మరింతగా సడలించింది. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రచార సమయాన్ని రోజుకు నాలుగు గంటలు పెంచింది. ఇప్పటిదాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ఈ ప్రచార వేళలను ఈసీ ఉదయం 6 నుంచి రాత్రి పది గంటలకు వరకు పొడిగించింది. ఫలితంగా అభ్యర్థులు, పార్టీలకు రోజుకు నాలుగు గంటలపాటు అదనంగా ప్రచార సమయం లభించనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు జనవరి 8న షెడ్యూల్‌ను ప్రకటిస్తూ కోవిడ్–19 కారణంగా ఈసీ పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధం విధించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ఈసీ క్రమేపీ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. యాభై శాతం సామర్థ్యానికి పరిమితమై బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈసీ శనివారం తెలిపింది. మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆంక్షలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, బహిరంగ వేదికల్లో సమావేశస్థలి సామర్థ్యంలో ఎంత శాతం మందిని అనుమతించాలనే విషయంలో ఈసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు పెట్టిన పరిమితుల్లో ఏది తక్కువగా ఉంటే.. అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
ప్రజలతో కలిసిపోయి..వారి కష్టసుఖాలు విని
చంకూర్ సాహిబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు చంకూర్సాహిబ్, బహదూర్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామాన్యుల్లో ఒకరిగా కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. లూథియానాలో ప్రచారం చేస్తూ ఒక ధాబాలో లారీ డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు. మరోసారి ఒక ఎన్నికల సభలో వేదిక మీద నుంచి కిందకి దిగి వచ్చి ప్రజలతో కలిసిపోయి వారి కష్టసుఖాలు విన్నారు. వరుసగా నాలుగోసారి చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలు రేగేలా ప్రసంగాలు చేస్తున్నారు. 50 వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే దానిని గెలుపుగా భావించలేని చెప్పుకొచ్చారు. 111 రోజుల పాటు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలను కూడా చన్నీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ‘‘నేను మీ కుమారుడిని, సోదరుడిని. మీతో కలిసి 15 ఏళ్లుగా ఉన్నాను. ఒక్క రోజు కూడా మిమ్మల్ని విడిచి పెట్టలేదు. మీరు లేకుండా నేను లేను’’ అని చన్నీ చెప్పారు. ఇక బహదూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న చన్నీ ప్రచారంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. మొత్తంగా తాను ప్రజల మనిషిననే ముద్ర రావాలని చన్నీ ఆరాటపడుతున్నారు. -
Assembly election 2022: 51 మంది అభ్యర్థుల ఆస్తులు రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. గత ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలతో పోలిస్తే , ప్రస్తుత ఎన్నికల్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలు రెట్టింపయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 51 మంది అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. ఇందులో 40 మంది బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, మరో 10 కాంగ్రెస్ తరఫున, ఒకరు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఈ 51 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ 2017 ఎన్నికల్లో సగటున రూ.4.72 కోట్లుగా ఉండగా, అది 2022 నాటికి రూ.7.05 కోట్లకు పెరిగిందని ఏడీఆర్ వెల్లడించింది. సగటున ఆస్తుల విలువ రూ.2.33 కోట్లు అంటే... 49 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఇందులో బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో రూ.4.85 కోట్లుగా ఉంటే అవి ప్రస్తుతం సగటున రూ.7.23 కోట్లకు చేరాయని వెల్లడించింది. బీజేపీ తరఫున సోమేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేఖా ఆర్య ఆస్తులు గత ఎన్నికల్లో రూ.12.78 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 25.20 కోట్లుగా ఉందని తెలిపింది. ఇదే పార్టీ తరఫున రూర్కీ నుంచి బరిలో ఉన్న ప్రదీప్ బత్రా ఆస్తులు రూ.3.81కోట్ల నుంచి రూ.12.06 కోట్లకు చేరాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న 10మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో సగటున రూ.4.61 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అవి రూ.6.83 కోట్లకు చేరాయని వెల్లడించింది. -
స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది!
Goa Assembly Election 2022: గోవా అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠని రేపుతున్నాయి. లెక్కకు మించిన పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నాయి. చిన్న చిన్న నియోజకవర్గాలతో ఓటింగ్ మార్జిన్, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో నిలిచిపోయిన మైనింగ్ కార్యకలాపాలే ఈసారి కీలకంగా మారాయి. బీజేపీ అధికార వ్యతిరేకత, అంతర్గత సమస్యలతో అల్లాడిపోతూ ఉంటే, కాంగ్రెస్ ఫిరాయింపులతో సతమతమవుతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఆమ్ ఆద్మీ నేనున్నానంటూ ఈసారి గట్టి ప్రయత్నమే చేసింది. గోవాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. బీజేపీ హిందుత్వ ఎజెండా స్థానంలో అభివృద్ధి ఎజెండాను తీసుకువచ్చిన మనోహర్ పారికర్ వంటి దిగ్గజ నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది. పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు పనాజీ నుంచి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, కాంగ్రెస్ వలస నేతలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంతో ఏర్పడిన అంతర్గత సమస్యలు కమలనాథులకి తలనొప్పిగా మారాయి. ఇక కాంగ్రెస్ కూడా ఫిరాయింపుల సమస్యని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి గత అయిదేళ్లలో ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, మాజీ ముఖ్యమంత్రి లూజినో ఫలేరియో తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర స్థాయిలో సరైన నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ ఏకంగా 31 మంది కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. వారిలో 18 మంది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఆప్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వార్డ్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2017 ఎన్నికల్లో 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానాన్ని గెలవలేకపోయినా 6.27 శాతం ఓట్లు సాధించడంతో పాటుగా అత్యధిక స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా మైనింగ్ పునరుద్ధరణ, క్యాథలిక్ బెల్ట్‌పై అధికంగా దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్ విసురుతోంది. మమతా బెనర్జీ తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో తొలుత హల్చల్ చేశారు. కాంగ్రెస్ నుంచి నాయకుల్ని తమ పార్టీలోకి లాగినప్పటికీ ప్రచారంలో బాగా వెనుకబడిపోయారు. ఇక ఎన్సీపీ, శివసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా వారి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే వివిధ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్వల్ప ఓట్ల తేడాతోనే తలరాత మారుతుంది! 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అతి చిన్న రాష్ట్రం కావడంతో ఓటింగ్ మార్జిన్ ఎప్పుడూ కీలకాంశంగా ఉంటుంది. కేవలం 500 ఓట్ల తేడాతోనే అభ్యర్థులు విజయం సాధించడం ఇక్కడే చూస్తుంటాం. ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 26–28 వేల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. దీంతో స్వల్ప ఓట్ల తేడాతో విజయావకాశాలు తారుమారు అవుతాయి. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో... ప్రజా నాడి తెలుసుకోవడం కష్టంగా మారింది. 2017 ఎన్నికల్లో ఏడు స్థానాల్లో వెయ్యి కంటే తక్కువ ఓట్లతోనే విజయం లభించింది. కాంగ్రెస్ పార్టీ కంకోలిమ్లో కేవలం 33 ఓట్లతో నెగ్గితే, మార్మగోవాలో బీజేపీ 140 ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. మైనింగ్ నిలిచిపోయి.. 1.5 లక్షల మంది ఉపాధిపై దెబ్బ మైనింగ్ అంశం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. దేశంలో ఉక్కు ముడి ఖనిజం, మాంగనీస్ ఉత్పత్తిలో గోవా మూడో స్థానంలో ఉంది. సుప్రీంకోర్టు మైనింగ్ కార్యకలాపాల్ని 2018లో నిలిపివేయడంతో 1.5 లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. 1961లో గోవా ఆవిర్భావం సమయంలో మైనింగ్ తవ్వకాల్ని 2007 వరకు లీజుకి ఇచ్చారు. లీజు గడువు ముగిసిపోయినా అక్రమ తవ్వకాలు నిరాటంకంగా సాగడంతో కొందరు కోర్టుకెక్కారు. దీంతో సుప్రీంకోర్టు మైనింగ్‌ను నిలిపివేసింది. ఆ తర్వాత జరిగే ఎన్నికలు ఇవే కావడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌లు మైనింగ్‌పై ఆధారపడే కుటుంబాలను ఈ ఎన్నికల్లో తరచూ కలుసుకున్నారు. కేజ్రివాల్ ఓ అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే మైనింగ్ కార్యక్రమాలు పునరుద్ధరించేంత వరకు నిరుద్యోగ భృతి కింద వారికి నెలకి రూ.5,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికార బీజేపీ అక్రమంగా మైనింగ్ చేసిన వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేసే పనిలో ఉంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్రమ మైనింగ్ దారులపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ప్రచారాస్త్రాలు ఇవే.. గోవా ఎన్నికల ప్రచారంలో అవినీతి ప్రతిపక్షాలకు అతి పెద్ద అస్త్రంగా మారింది. మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ స్వయంగా గోవాలో ప్రతీ చోటా అవినీతి ఉందని వ్యాఖ్యానించడంతో ఇదే ప్రధానాంశం అయింది. మేఘాలయా గవర్నర్‌గా బదిలీ కాకముందు మాలిక్ 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు గోవా గవర్నర్‌గా ఉన్నారు. కాసినో (జూదం) సంస్కృతి కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినిపించింది. 2012లో బీజేపీ అధికారంలోకి రాకముందు కాసినోలపై నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాసినో ఇండస్ట్రీకి అధికార పార్టీ కొమ్ము కాస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ జూదశాలలపై నిషేధం విధిస్తామని హామీ ఇస్తూ విస్తృతంగా ప్రచారం చేసింది. గోవా ప్రాంత సంస్కృతి పరిరక్షణ కూడా ప్రముఖంగా మారింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏ భాషలో బోధన కొనసాగించాలన్న అంశం వివాదాస్పదమైంది. కొంకణి, మరాఠి, ఇంగ్లిషు భాషల్లో ఎందులో బోధించాలనే చర్చ కూడా జరుగుతోంది. గోవాకు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈసారి కొన్ని పార్టీలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వల్ల ప్రత్యేక హోదా రాదని మెజార్టీ గోవా ప్రజల అభిప్రాయంగా ఉంది. దీంతో ఆప్ ఈ అంశాన్ని తమకి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర జనాభాలో 26 శాతం ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇక్కడ గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమట..!
కస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్గంజ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే. 2007లో కస్గంజ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్‌పాల్ సింగ్ కస్గంజ్లో విజయం సాధించారు. ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్దీప్ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్‌పాల్ సింగ్ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్ వర్మకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్ జరగనుంది. -
వాళ్లకు బెయిలు.. మాకు జైలు
ఓటమి భయంతో సాకులు.. ఉత్తరప్రదేశ్‌లో కాషాయ జెండా ఎగురుతుందని గురువారం నాటి తొలి దశ పోలింగ్ తర్వాత అందరికీ అర్థమైంది. అందుకే కుటుంబ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది. తమ పని అయిపోయిందన్న భయంతోనే ఎన్నికల కమిషన్‌ను, ఓటింగ్ మిషన్లను తప్పు పడుతున్నారు. – ప్రధాని నరేంద్ర మోదీ (కస్గంజ్, ఉత్తరప్రదేశ్) మోదీకి చరిత్ర తెలియదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చరిత్రపై అవగాహన లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలీదు. అందుకే పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తికి 15 ఏళ్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్‌ను ఆడిపోసుకున్నారు.స్వాతంత్య్ర సమరయోధులు, విద్యావేత్తల కంటే ప్రధానికి ఎక్కువ తెలుసా? పర్యావరణం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి గోవా ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. – కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (మార్గోవా, గోవా ) మేం గన్నా అంటే.. వారు జిన్నా అంటారు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ తమ కుటుంబాల కోసమే జీవిస్తున్నాయి. మేము జాతీయవాదం మాట్లాడితే వాళ్లు కులాల ప్రస్తావన తెస్తారు. మేము అభివృద్ధి అంటే మతం ఊసెత్తుతారు. నేను గన్నా (చెరుకు)పై మాట్లాడితే జిన్నా గురించి మాట్లాడతారు. – యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(షాజహన్‌పూర్, ఉత్తరప్రదేశ్) వాళ్లకు బెయిలు.. మాకు జైలు ఈ రాష్ట్రంలో రైతుల మీదకి కారు పోనిచ్చి నిండు ప్రాణాలు తీసిన వారికి బెయిల్ వస్తుంది. కానీ మా పార్టీలో చిన్న చిన్న నేరాలు చేసిన వారు కూడా జైల్లోనే ఉంటారు. మా పార్టీ ఎంపీ ఆజమ్ ఖాన్‌ను గేదెలు, మేకలు, పుస్తకాల చోరి ఆరోపణలపై జైల్లో పెట్టి ఇంకా బెయిలివ్వలేదు. – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (రామ్‌పూర్, ఉత్తరప్రదేశ్) -
బీజేపీతో ఉంటేనే పంజాబ్‌కు మంచిది
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఎవరికీ పెద్దగా అందుబాటులో ఉండరనే అభియోగాలు కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఉండేవి. అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటున్న ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడు... హసం పార్టీని వీడి.. ఇప్పుడు పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీ పెట్టారు. బీజేపీతో జట్టుకట్టి పంజాబ్ అసెంబ్లీ బరిలోకి దిగిన అమరీందర్ ఇప్పుడు రోజంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. అర్ధరాత్రి దాకా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. బీజేపీతో ఉంటేనే పంజాబ్‌కు భవిష్యత్తు బాగుంటుందని.. జాతీయ పార్టీ అండ లేకుండా రాష్ట్రంలో సజావుగా పాలన సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు అమరీందర్. కొత్త మిత్ర పార్టీ బీజేపీ నుంచి సంపూర్ణ సహకారం ఉందంటున్న ఆయన శుక్రవారం ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... బీజేపీ– పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమికి అవకాశాలెలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అమరీందర్: ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. పంజాబ్‌లో బీజేపీవైపు బయటికి కనిపించని మొగ్గు ఉంది. దానికి.. ఉజ్వల పథకం, ఉచిత రేషన్ సరఫరా, ఇతర సబ్సిడీలు కారణం. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నా కూతురితో మోదీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారు. నా హయాంలోనూ పేదల కోసం ఎంతో చేశాను. ఐదు లక్షల రూపాయల ఆరోగ్యబీమా పథకాన్ని ప్రవేశపెట్టాను. దీని మూలంగా పేదవాళ్లకు పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే అవకాశం లభించింది. పొత్తు కోసం బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీతో కలిసి సాగడం పంజాబ్‌కు మంచిది. జాతీయ పార్టీ అండ లేనిదే పాలన సాధ్యం కాదు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు ఉండదు. బీజేపీ నాతో బాగానే ఉంటోంది. నాకైతే వారితో సమస్యలు లేవు. 1980లో నేను కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైనపుడు... మా అమ్మగారు బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆప్ రాజకీయ పార్టీయా? ఉద్యమ సంస్థా? అనేది నాకిప్పటికీ స్పష్టత రావడం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి దూరం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే అన్నారు. రాజకీయ విశ్లేషకులైతే 2017లో ఆప్ 100 పైగా సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. కానీ 20 దగ్గరే ఆప్ ఆగిపోయింది. ఇప్పుడు రైతు సంఘాల రాజకీయ వేదిక.. సంయుక్త సమాజ్ మోర్చా కూడా బరిలో ఉండటం ఆప్ అవకాశాలను మరింతగా దెబ్బతీస్తుంది. ఆర్థిక అధికారాలన్నీ కేంద్ర సర్కారుకే దఖలు పడ్డాయని మీరు అన్నారు. అదెవరి తప్పు? రాజ్యాంగం మనకు సమాఖ్య వ్యవస్థను నిర్దేశించింది. కానీ ప్రతిదీ కేంద్రీకృతమైపోయింది. రాష్ట్రాల అధికారాలన్నింటినీ ఒక్కొక్కొటిగా కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కేంద్రంలో బీజేపీ వచ్చింది ఇటీవలి కాలంలోనే కదా. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏకరూప పన్ను విధానం తేవాలనేది కూడా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బుర్రలో పుట్టిన ఆలోచనే. జీఎస్టీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. పాక్‌తో సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్ రాష్ట్ర భద్రతపై మీరు తరచూ తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చుతుంటారు? సరిహద్దుల అవతల నుంచి నిరంతరం డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబడుతున్నాయి. చైనా– పాక్‌తో జట్టు కట్టింది. తాజాగా ఆఫ్గానిస్తాన్ నుంచీ ముప్పు పొంచి ఉంది. ఇది పంజాబ్‌కు అభిలషణీయమైన భద్రతా స్థితి కాదు. ఆధునిక ఆయుధ సంపత్తిలో శత్రుదేశాలు మనకంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. 2004 నుంచి 2014 దాకా పదేళ్లకాలంలో ఆయుధ సమీకరణ, నవీకరణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. కనీసం బీజేపీ ఇప్పుడు ఆయుధ వ్యవస్థలనైనా కొంటోంది. పంజాబ్‌లో కులం, మతం ఆధారంగా ఓట్ల పునరేకీకరణ జరుగుతుందని భావిస్తున్నారా? ఇది పూర్తి అర్థంపర్థం లేని వ్యవహారం. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటిపోయాక కూడా ఇంకా కులం, మతం అంటూ మాట్లాడుతున్నాం. ప్రస్తుత పంజాబ్ సీఎం చన్నీ కుల ప్రస్తావన ఎందుకు? దేనికైనా ప్రతిభే కొలమానం కావాలి. -
సామీ... నీకు సరిలేరెవ్వరు!
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతలు విన్యాసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. నేతల ఫిరాయింపులు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు బీజేపీలో చేరారు. ఇదంతా కేవలం టికెట్ కోసమే. గురుదాస్‌పూర్ జిల్లాలోని శ్రీహరగోబింద్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్వీందర్‌సింగ్ లడ్డీ ప్రతిపక్ష బీజేపీలో మరోసారి చేరారు. శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆయనను కాషాయ దళంలోకి ఆహ్వానించారు. లడ్డీ గత ఏడాది డిసెంబర్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఆరు రోజుల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. శ్రీహరగోబింద్పూర్ స్థానం నుంచి ఆయనకు టిక్కెట్ ఇవ్వబోమని కాంగ్రెస్ తేల్చిచెప్పడంతో తాజాగా మళ్లీ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి ఆయనకు టికెట్ ఇస్తారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. -
ప్రచారాన్ని ముంచేస్తున్న మంచు.. చిక్కుకున్న 25 మంది నాయకులు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న మంచు అసెంబ్లీ ప్రచారాన్ని ముంచేస్తోంది. కొండల్లో ఉన్న ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,697 పోలింగ్ కేంద్రాలకు గానూ 766 బూత్‌లు మంచులో కూరుకుపోయి ఉన్నాయి. వీటిలో మెజార్టీ పోలింగ్ బూత్‌లు సముద్రమట్టానికి 5 నుంచి 7 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఉత్తరకాశి, నైనిటాల్, చమోలి ప్రాంతాల్లో అధికంగా మంచు కురుస్తోంది. ఫిబ్రవరి 14న రాష్ట్రంలో అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండటంతో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పోలింగ్ ఎలా జరుగుతుందోనన్న ఆందోళనైతే నెలకొంది. మంచులో చిక్కుకున్న 25 మంది బీజేపీ నేతలు ఉత్తరాఖండ్‌లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న గుజరాత్ ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ సహా 25 మంది నాయకులు రెండురోజులుగా మంచులో చిక్కుకుపోయారు. అల్మోరా నుంచి జగదేశ్వర్ ధామ్ వెళుతున్న మార్గంలో భారీగా మంచు కురుస్తూ ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతల్ని బీజేపీ అగ్రనేతలు గుజరాత్ నాయకులకు అప్పగించారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామంటూ దుష్యంత్ పటేల్ ఒక వీడియో షేర్ చేశారు. ట్రెక్కింగ్, నడకే మార్గం మంచులో కూరుకుపోయిన ప్రాంతాలకు వాహనాల్లో వెళ్లడమే సాధ్యం కాని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేయాలి. మరికొన్ని చోట్లకి నడుచుకుంటూ వెళ్లాలి. పోలింగ్ అధికారులకే అక్కడికి వెళ్లడం అత్యంత దుర్లభం. పిత్రోగఢ్‌లోని కనర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్‌లో 588 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. అక్కడికి వెళ్లాలంటే 80 కి.మీ. వాహనంలో వెళ్లాక మరో 18 కి.మీ. ట్రెక్కింగ్ చేయాలి. 200 మంది ఓటర్లున్న డ్యుమక్ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే 20 కి.మీ. నడవాలి. 260 మంది ఓటర్లున్న ఉత్తరకాశిలోని మోండా పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారులన్నీ 2019 వరదల్లో కొట్టుకుపోయాయి. ఆ మార్గంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. మరో 450 పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే కనీసం 5 కి.మీ. నడవాలి. మూడు రోజుల ముందే.. మంచు కురిసే ప్రాంతాలకు పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందే అంటే శుక్రవారమే ఎన్నికల అధికారులు బయలురుతారు. వందలాది మంది ఎన్నికల సిబ్బంది ఉన్న మొత్తం 35 మంది పోలింగ్ బృందాలు గాడిదలు, గుర్రాల సాయంతో ఈవీఎం మిషన్లు, ఇతర సామగ్రి తీసుకువెళ్లనున్నారు. అసాధారణ రీతిలో మంచు కురవడంతో 24 మైగ్రేటరీ బూత్‌ల్ని కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. -
మణిపూర్ పోలింగ్ తేదీల్లో మార్పు
న్యూఢిల్లీ: రెండు విడతల్లో జరగనున్న మణిపూ ర్ అసెంబ్లీ (మొత్తం 60 స్థానాలు) పోలింగ్‌లో ఎన్నికల సంఘం (ఈసీ) స్వల్ప మార్పులు చేసింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీల్లో పోలింగ్ జరగాలి. అయితే ఫిబ్రవరి 27న ఆదివారం వస్తోందని, ప్రార్థనల కోసం చర్చికి వెళ్లడానికి వీలుగా ఆ రోజు పోలింగ్‌ను వాయిదా వేయాలని కొన్ని క్రైస్తవ సంస్థలు కోరడంతో ఎన్నికల తేదీలను మార్చాల్సి వచ్చిందని ఈసీలోని విశ్వసనీయవర్గాల సమాచారం. ఫిబ్రవరి 28, మార్చి 5వ తేదీల్లో మణిపూర్ పోలింగ్ ఉంటుందని ఈసీ గురువారం ప్రకటించింది. ‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండటం, కొన్ని విజ్ఞప్తులు అందడం, గత దృష్ట్యాంతాలు.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలింగ్ తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
మేజిస్ట్రేట్ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఈవీఎం!
లక్నో : యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం మొదటి దశలో 58 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, ఓటింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం నంబర్ ప్లేట్ లేని ఓ కారులో ఈవీఎం యంత్రం కనిపించడం వివాదాస్పదంగా మారింది. యూపీలోని కైరానా వద్ద షామ్లీ-పానిపట్ హైవేపై నంబర్ ప్లేట్ లేని కారులో ఈవీఎం యంత్రాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలు గుర్తించారు. సదరు కారు కైరానా జోనల్ మేజిస్ట్రేట్ స్టిక్కర్‌తో ఉండటంతో ఎస్పీ నేతలు ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ కారులోని ఈవీఎంను తెరిచి పరిశీలించారు. ఈ క్రమంలో ఎన్నికల భద్రతా నియమావళిని ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ అంగీకరించారు. దీంతో ఎస్పీ నేతలు ఈ పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై షామిలీ జిల్లా మేజిస్ట్రేట్ జస్మీత్ కౌర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. జోనల్ మేజిస్ట్రేట్ కారులో ఈవీఎం యంత్రం ఉండటం నిజమేనన్నారు. అయితే కారు డ్రైవర్ భోజనం చేయడానికి వెళ్లిన సమయంలోనే ఈవీఎంను కారులో పెడుతున్న విషయాన్ని తాము గమనించామని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. UP के कैराना में सपा-रालोद प्रत्याशी नाहिद हसन की बहन इकरा ने आधी रात को बिना नम्बर की गाड़ी में जा रहीं कुछ EVM पकड़ीं, प्रशासन ने कहा- ये रिजर्व EVM थीं. पहले चरण में कैराना में सबसे ज्यादा 75% वोट पड़े हैं. Video: @sachingupta787pic.twitter.com/ElEFUFsOJ9 — Swati Mishra (@swati_mishr) February 11, 2022 -
ఈ పుష్పలో ఫ్లవరూ ఉంది.. ఫైరూ ఉంది
ప్యాన్ ఇండియా మూవీ ప్రచారంతో రిలీజ్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఊహించని రేంజ్లో సక్సెస్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ.. నెగెటివ్ టాక్ నుంచి క్రమక్రమంగా పుంజుకుని భారీ సక్సెస్‌ను అందుకోవడం విశేషం. సౌత్‌నే కాదు.. నార్త్‌లోనూ పుష్పమేనియా మామూలుగా కొనసాగడం లేదు. స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీల నుంచి ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాజకీయ నాయకుల దాకా పుష్పను అనుకరణ.. అనుసరణ చేసేస్తున్నారు. తాజాగా బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్ సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ 'పుష్ప' సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని... ఆ సినిమా పేరు 'పుష్ప' అని రాజ్ నాథ్ చెప్పారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు. ఈ పుష్ప చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని, కాంగ్రెస్ ఈయన్ని ఉత్త పుష్ప అనుకుంటోంది. కానీ, ఈయనలో ఫ్లవర్(పేరులో అని ఆయన ఉద్దేశం) ఉంది ఫైర్ కూడా ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని... ఈయన తగ్గేదేలే అని వ్యాఖ్యానిస్తూ జనాల్లో ఉత్సాహాన్ని నింపారు. తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగులు ప్రస్తుతం ఎన్నికల సీజన్లో జనాలకు ఎట్రాక్ట్ చేయడానికి తెగ వాడేస్తున్నారు మరి!. ఇంకోపక్క ‘పుష్ప ఇన్స్పిరేషన్తో..’ నేరాలు చోటు చేసుకుండడం గమనార్హం. -
వాళ్లు వృద్ధి నిరోధకులు
బిజ్నూర్: అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డంకులుగా నిలిచారని ప్రత్యర్ధులపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అలాంటివారంతా రైతు నేత చౌదరీ చరణ్‌సింగ్‌కు వారసులమని తప్పుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆన్లైన్ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉండగా తమ గ్రామాలకు ఎంత మేర విద్యుత్‌ను అందించారో సమాజ్‌వాదీ నేతలను ప్రశ్నించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. వీరంతా నకిలీ సమాజ్వాదీలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. యూపీ ఎన్నికల్లో ఆర్ఎల్డీ, ఎస్పీ కూటమి చరణ్ సింగ్ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ, రైతుల ప్రధాని చరణ్‌సింగ్‌కు తామే వారసులమని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకే తమ ప్రభుత్వాలు కట్టుబడిఉన్నాయని మోదీ చెప్పారు. ఐదేళ్లలో పంచదార రైతులకు సుమారు 1.5 లక్షలకోట్ల బకాయిలు చెల్లించామని, గత రెండు ప్రభుత్వాలు ఈ పని చేయలేదని గుర్తు చేశారు. ప్రతిపక్షాల హయంలో యూరియా బ్లాక్మార్కెట్లో దొరికేదని, తాము అధికారంలోకి వచ్చాక గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వాల కన్నా రెట్టింపు మోతాదులో యోగి ప్రభుత్వం గోధుమలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో రైతుల జనాభా, అందునా చెరుకు రైతుల హవా అధికం. అందుకే వారిని ఆకట్టుకునేందుకు ప్రధాని తమ ప్రభుత్వాలు చేసిన రైతు ఉపయోగ పనులను గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు సమస్యలను సృష్టించి సానుభూతి రాజకీయాలు చేసేవని, వారి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మోదీ విమర్శించారు. ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. -
ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!
అమేథీ: యూపీలో ఒకప్పటి తమ కంచుకోట అయిన అమేథీ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ ఫిరాయింపుదారు ఆశిష్ శుక్లాకు ఇచ్చింది కాంగ్రెస్! శుక్లా సోమవారం ఉదయం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ వెంటనే ఆయనకు టికెట్ ఖరారైంది. ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఆదివారం ప్రకటించింది! నిజానికి ఆయన భార్యలు అమితా సింగ్, గరిమా సింగ్ ఇద్దరూ బీజేపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇద్దరినీ కాదని భర్తకు చాన్స్ దక్కింది. గరిమా సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా అమితా కాంగ్రెస్ తరఫున ఆమెపై పోటీ చేసి ఓడిపోయారు. సంజయ్ 2019లో రాజ్యసభ సీటు వదులుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరగా అమితా కూడా ఆయనను అనుసరించారు. ఇక సమాజ్‌వాదీ తరఫున గ్యాంగ్ రేప్ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, బీఎస్పీ నుంచి రాగిణీ తివారీ బరిలో ఉన్నారు. అమేథీలో ఫిబ్రవరిలో 27న పోలింగ్ జరగనుంది. -
సర్కారీ కొలువుల్లో మహిళలకు 30 శాతం
పణజి: గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం నువెం అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో కుంభకోణాలకు చెక్ పెట్టడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయ్ పథకం కింద బలహీన వర్గాల వారికి నెలకు రూ.6,000 అందిస్తామని చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంపు, మార్గోవా, పణజిల్లో వర్కింగ్ విమెన్‌కు హాస్టళ్లు, పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.80 మించకుండా చూడటం వంటి పలు హామీలను ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ప్రకటించింది. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
బీజేపీకి మేము బీ టీం కాదు
షిల్లాంగ్: మణిపూర్‌లో బీజేపీకి తాము బీ టీమ్ కాదని నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్, మేఘాలయ సీఎం కొనార్డ్ కె.సంగ్మా స్పష్టం చేశారు. ఈసారి మరిన్ని సీట్లు గెలిచి తీరతామని సోమవారం ధీమా వెలిబుచ్చారు. 2017లో బీజేపీ నేతృత్వంలోని ఈశాన్య డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్ఈడీఏ)తో జట్టుకట్టిన ఎన్పీపీ 9 సీట్లలో పోటీ చేసింది. గెలిచింది 4 సీట్లే అయినా కింగ్‌మేకర్‌గా మారింది. ఎన్పీపీ మద్దుతుతోనే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఈసారి 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. తమ బీజేపీ విజయావకాశాలను బీజేపీ ఎంతమాత్రమూ దెబ్బ తీయలేదని కొనార్డ్ సంగ్మా ధీమా వెలిబుచ్చారు. పైగా తామే వారి విజయావకాశాలను దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదన్నారు. సంకీర్ణంలో ఉన్నంత మాత్రాన తమను బీజేపీకి బీ టీమ్ అనడం సరికాదన్నారు. ‘‘కొన్నిచోట్ల మాకు కాంగ్రెస్ ప్రత్యర్థి. మరికొన్నిచోట్ల బీజేపీతో పోటీ పడుతున్నాం. ఇంకొన్ని సీట్లలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌ను ఢీకొంటున్నాం. ఈసారి మేం చాలా స్థానాలు గెలుచుకోవడం ఖాయం’’ అన్నారు. -
పంజాబ్‌లో ఆప్ టెన్ పాయింట్ అజెండా
ఢిల్లీ అసెంబ్లీలో అధికార పీఠాన్ని వరుసగా రెండుసార్లు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఈసారి సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లోనూ పాగా వేయాలని తహతహలాడుతోంది. ఫిబ్రవరి 20న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించి, జయకేతనం ఎగుర వేసేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆప్ నేతలు ఇంటింటి ప్రచారంలో తలమునకలయ్యారు. రైతు సంఘాలతో కూడిన ‘సంయుక్త సమాజ్ మోర్చా’తో పొత్తు పెట్టుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడమే ఇందుకు కారణం. సంయుక్త సమాజ్ మోర్చా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఈ మోర్చా తమ ఓట్లను చీల్చే అవకాశం ఉందని కేజ్రీవాల్ సైతం అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ విజయం తమదేనని ధీమాగా చెబుతున్నారు. పంజాబ్ ప్రజల మనసులను గెలుచుకొనేందుకు ఆమ్ ఆద్మీ ప్రధానంగా టెన్ పాయింట్ అజెండాను తెరపైకి తీసుకొచ్చింది. పంజాబ్‌లో సామాన్య ప్రజల భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పంజాబ్ ఆప్ అధ్యక్షుడు భగవంత్ మాన్, ఇతర నాయకులు ప్రజల అభిప్రాయాలను సేకరించారు. వారు ఎలాంటి పాలన కోరుకుంటున్నారో గుర్తించారు. తమ నేతలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఆప్ నాయకత్వం ‘పంజాబ్ మోడల్’ను సిద్ధం చేసింది. ఇందులో 10 పాయింట్లు ఉన్నాయని, ఇవన్నీ పంజాబ్ అభివృద్ధి కోసమేనని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. పంజాబ్ మోడల్ ఇదే.. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు రౌండ్ ద క్లాక్(రోజంతా) ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. పెద్ద బెడదగా మారిపోయి, రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న మాదక ద్రవ్యాల భరతం పడతామని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. యువత కోసం పెద్ద ఎత్తున ఉద్యోగావశాలు కల్పిస్తామని, విదేశాలకు వలస వెళ్లిన వారు సైతం వెనక్కి తిరిగి వచ్చేలా చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని నెలకొల్పుతామని అన్నారు. బాధిత, అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చడం తమ అజెండాలోని కీలక అంశమని చెప్పారు. సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిని విడిచిపెట్టబోమని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన అవినీతిని అంతం చేస్తామని ప్రతిన బూనారు. పనుల కోసం ప్రజలు లంచాలివ్వాల్సిన అవసరం ఇక ఉండదని భరోసా కల్పించారు. పంజాబ్ మోడల్ కింద విద్యా, వైద్య రంగాలను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ తరహాలో 16,000 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మోడల్ స్కూళ్లతోపాటు విద్యాసంస్థల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని తెలిపారు. రైతన్నల సమస్యలను పరిష్కరిస్తామని, ‘రైడ్రాజ్’ను నామరూపాల్లేకుండా చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాపారం, వాణిజ్యం పెరగడానికి, పరిశ్రమల స్థాపన కోసం పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తామని కేజ్రీవాల్ వివరించారు. షెడ్యూల్డ్ కులాలపై గురి రాష్ట్ర జనాభాలో 32 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల ఓట్లపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. ఆయా కులాలను మచ్చిక చేసుకుంటోంది. ఎస్సీ కులాల చిన్నారులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. పై చదువులకు వెళ్లేవారికి కోచింగ్ కోసం అవసరమైన ఫీజులను తామే భరిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు శిక్షణ పొందితే ఆ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తే అందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఎస్సీల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఉచితంగా చికిత్స చేయిస్తామని చెప్పారు. -
పంజాబ్‌లో ఫన్నీ ఛాలెంజ్‌లు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య సవాళ్లు ఎక్కువయ్యాయి. అయితే వీటిలో అన్నీ సీరియస్ ఛాలెంజులు కాదు. ‘దమ్ముంటే ఒక్క సీటులో పోటీ చెయ్యి, సత్తా ఉంటే 30 నిమిషాలు ఆగకుండా బ్యాడ్మెంటెన్ ఆడు..’ లాంటి కాలక్షేపం సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం చిన్నా చితకా అభ్యర్ధులే సవాళ్లు విసురుకుంటున్నారనుకుంటే పొరపాటే! సీఎం చన్నీ, పీఎల్సీ నేత అమరీందర్, పీసీసీ చీఫ్ సిద్ధూ లాంటి వాళ్లు కూడా జోరుగా ఛాలెంజులు చేస్తున్నారు. చన్నీ రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, సిద్ధూను ఎదుర్కొనేందుకు ఎస్ఏడీ నేత మజితియా సిద్ధపడడంతో ఈ ఛాలెంజుల వేడి పెరిగింది. చన్నీ రెండు సీట్లలో పోటీ చేయడంపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, చన్నీ తప్పకుండా చమకూర్ సాహెబ్ సీటు ఓడిపోతారన్నారు. దీనిపై వెంటనే చన్నీ స్పందించి తనకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు. అదే కోవలో పాటియాల సీటు వదిలి తనపై అమృతసర్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని అమరీందర్ సింగ్‌ను నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా అమరీందర్ ఆపకుండా 30 నిమిషాలు బ్యాడ్మెంటెన్ ఆడితే తాను రాజకీయాలు వదిలేస్తానని ఎద్దేవా చేశారు. అలాగే తనపై పోటీకి దిగిన ఎస్ఏడీ నేత మజితియా కేవలం తనపై మాత్రమే పోటీ చేయాలని, మజితా నియోజకవర్గం వదిలిపెట్టాల ని సిద్ధూ సవాల్ చేశారు. దీన్ని మజితియా అంగీకరించి అమృత్సర్ సీటుకే పరిమితమయ్యారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. అయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి. ‘కెప్టెన్’ ఆరోపణలను ఖండించిన అల్కా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మంత్రి పదవి కోసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీయింగ్ చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఖండించారు. ‘కెప్టెన్’ తన మిత్రపక్షమైన బీజేపీ మాటలు వల్లెవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 27న పంజాబ్‌కు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. 117 మంది పార్టీ అభ్యర్థులతో కలిసి స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని చెప్పారు. తర్వాత వర్చువల్ ర్యాలీని నిర్వహిస్తారని చెప్పారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనను పార్టీ కండువాతో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ స్వాగతించారు. 32 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టారని ఈ సందర్భంగా ఆర్పీఎన్ సింగ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభమైందని, ప్రధాని మోది ఆశయ సాధనకు కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ హామీ ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోని వస్తే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.500 కంటే తక్కువకు పరిమితం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తాము పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. 2న ఆగ్రాలో మాయావతి సభ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2న ఆగ్రాలో జరిగే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు. అప్నా దళ్ స్టార్ కాంపెయినర్లు వీరే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి, రెండవ దశ ఎన్నికల స్టార్ ప్రచారకుల జాబితాను అప్నా దళ్ (సోనీలాల్) పార్టీ విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. ఆమె భర్త, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిష్ పటేల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేడీ(యూ) తొలి జాబితా ఇదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థుల పేర్లతో జనతాదల్ యునైటెడ్ పార్టీ మొదటి జాబితాను మంగళవారం విడుదల చేసింది. ‘ఆప్’ నాలుగో జాబితా విడుదల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసింది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్; నాయకులు ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. ఎన్నికల షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నట్టు పలువురు రాజకీయ నేతలు పేర్కొన్నారు. (ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆన్లైన్లో నామినేషన్ వేసే అవకాశం) అధికారాన్ని నిలబెట్టుకుంటాం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అఖండ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ తేదీలతో యూపీలో భారీ మార్పు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. తాజాగా ప్రకటించిన ఎన్నికల తేదీలు యూపీలో భారీ మార్పును తీసుకురానున్నాయని పేర్కొన్నారు. ఈసీ విధించిన నిబంధనలను తమ పార్టీ పాటిస్తుందని స్పష్టం చేశారు. అధికార బీజేపీ ఈ మార్గదర్శకాలను అనుసరించేలా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ప్రవర్తనా నియమావళికి కట్టుబడతాం ఉత్తరాఖండ్ ఎన్నికల తేదీల ప్రకటనను గతిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు, ప్రవర్తనా నియమావళికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. మీడియా ద్వారా ప్రచారం చేస్తాం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని పంజాబ్ మంత్రి రాజ్ కె వెర్కా పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠినమైన నిబంధనలను విధించాలని తాము కోరుకున్నామని ఆయన వెల్లడించారు. పంజాబ్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ శాతం నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సోషల్ మీడియా, టీవీ, ఇతర మీడియా ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. మా కోసం పంజాబ్ ప్రజల ఎదురుచూపు పంజాబ్ ప్రజలు ఈసారి తమకు అధికారం కట్టబెడతారని శిరోమణి అకాలీదళ్‌అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ దీమా వ్యక్తం చేశారు. శాంతి, మత సామరస్యానికి కట్టుబడే బలమైన ప్రభుత్వం కోసం పంజాబీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రస్తుత పాలకులు పాలనను సర్కస్‌గా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడొద్దు వర్చువల్, ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీజేపీ ఓటు వేసినట్టేనని ఆయన అన్నారు. గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇది నిరూపితమయిందని.. ఇప్పుడు చండీగఢ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడొద్దని పంజాబ్ ఓటర్లకు సిసోడియా విజ్ఞప్తి చేశారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జనవరి 14న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ ►తొలి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి - 10 (యూపీలో మాత్రమే) రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 21న ►రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి -14 -(పంజాబ్, గోవా,ఉత్తరాఖండ్, యూపీ) -ఒకే దశలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికలు మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న ►మూడో విడత పోలింగ్ ఫిబ్రవరి -20 (యూపీ) నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న ►నాలుగో విడత పోలింగ్ ఫిబ్రవరి -23 (యూపీ) ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 01న ►ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి -27 (యూపీ, మణిపూర్) ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 04న ►మార్చి 3న ఆరో విడత ఎన్నికలు (యూపీ, మణిపూర్) ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న ►మార్చి 7న ఏడో విడత ఎన్నికలు (యూపీ) ►మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎన్నికల ఆఫీసర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తాం. ఐదురాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించాం. కరోనా పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపాం. ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం మాస్క్, థర్మల్ స్కానర్లు, శానిటేషన్ తదితర లాజిస్టిక్స్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతాం. కరోనా నేపథ్యంలో 2,15, 368 పోలింగ్ కేంద్రాలు పెంచాం. 16 శాతం పోలింగ్ కేంద్రాలు పెంచాం. యూపీలో ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటున 862 మంది ఓటర్లు ఓటు వేస్తారు. దీనివల్ల పోలింగ్ కేంద్రాలలో రద్దీ తగ్గుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాం. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలి. అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ వచ్చింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ..28లక్షలుగా ఉంది. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్ సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. రోడ్‌షోలు రద్దు ఐదు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ రేటును పరిశీలించాము. పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతున్నాం. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలి. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. మరోవైపు దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా?లేదా? అనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో.. ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల సమావేశం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఎన్నికలు జరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని భావించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ►యూపీలో అసెంబ్లీ స్థానాలు - 403 ►పంజాబ్‌లో అసెంబ్లీ స్థానాలు - 117 ►ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాలు - 70 ►గోవాలో అసెంబ్లీ స్థానాలు - 40 ►మణిపూర్‌లో అసెంబ్లీ స్థానాలు - 60 -
అభివృద్ధి ఎజెండాకు విపక్షాల అడ్డంకులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమీక్షా సమావేశం, పార్టీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీలో పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశం కోసం పనిచేశారని నడ్డా అభినందించారు. బీజేపీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీ వివరాలను చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. ఈ సమావేశంలో కోవిడ్–19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి ఎజెండా, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను నడ్డా ప్రస్తావించారు. వీటిని పార్టీకి చెందిన వివిధ మోర్చాల ద్వారా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాలి్సన ప్రణాళికలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్‌్జలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్‌్జలు ఇచ్చిన నివేదికలపై చర్చ సాగింది. వ్యాక్సినేషన్లో ఉచితంగా ఇస్తున్న టీకా డోసులు వంద కోట్లకు చేరువవుతున్నాయని, ఈ ఘట్టాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
మమతకు చెమటలు పట్టిస్తున్న సువేందు
-
నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ
లేటెస్ట్ అపడేట్ : నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ కోలకత: పశ్చిమబెంగాల్లో నందీగ్రామ్ ఎన్నికల ఫలితం కీలకంగా మారింది. క్షణ క్షణానికిమారుతున్న ఆధిత్యంతో నరాలు తెగే ఉత్కంఠను రాజేస్తోంది. సమీప ప్రత్యర్ధి,బీజేపీ అభ్యర్థి సువేందుపై ప్రారంభంలో వెనుకబడిన మమతా, ఆ తరువాత లీడింగ్‌లోకి వచ్చారు. 16వ రౌండ్ ముగిసే సమయానికి సువేందుకు కంటే కేవలం 6 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీదీ-సువేందు మధ్య నెలకొన్ని హోరాహోరీ పోరు టీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. చివరిదైనా 17వ రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటి లీడింగ్‌లో దూసుకుపోతుండగా ముఖ్యమంత్రి మమత మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన స్థానంలో దూసుకుపోతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు, అప్పటి మంత్రి సువేందు అధికారిని తనవైపు తిప్పుకున్న బీజేపీ నందీగ్రామ్‌నుంచి గట్టిపోటీ ఇస్తోంది. తొలి రౌండ్‌నుంచీ వెనుకంజలో ఉన్న దీదీ నాలుగు రౌండ్ల తరవాత కూడా సువేందుకంటే 8 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు. నందిగ్రామ్‌లోమమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేసిన అధికారి ఆ దిశగా సాగి పోతున్నారు. అయితే క్షణక్షణానికి మారుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫలితం వచ్చేవరకు నందీగ్రామ్ ఫలితంపై ఉత్కంఠకు తెరపడదు. కాగా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన, మాజీమంత్రి సువేందు అధికారి సవాల్‌కు ప్రతిసవాల్‌గా నందీగ్రామ్‌నే మమత ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, -
ఎగ్జిట్ పోల్స్: నువ్వా.. నేనా!
న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం టీఎంసీ, బీజేపీ మధ్య దోబూచులాడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య గట్టిపోటీ నెలకొందని, నువ్వా–నేనా అన్నట్లుగా పరి స్థితి ఉందని గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే– యాక్సిస్ సర్వే బీజేపీకి 134–160 సీట్లు, టీఎంసీకి 130–156 సీట్ల దాకా వస్తాయని తెలిపింది. అయితే మిగతా పలు చానల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అతికష్టం మీద సాధారణ మెజారిటీ (147) కంటే కొద్దిసీట్లు ఎక్కువ సాధిస్తారని పేర్కొన్నాయి. ఇక తమిళనాడులో ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ల కజగం (డీఎంకే) ఘన విజయం సాధించబోతోందని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి చూస్తే... అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనపడుతోంది. కేరళలోనూ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి సంప్రదాయాన్ని తోసిరాజని వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న ట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. పుదుచ్చేరిలోనూ అధికారం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్లో ఉనికి కోసం పాట్లు పడుతోంది. అందరి దృష్టి బెంగాల్ పైనే... బెంగాల్లో లెఫ్ట్ కంచుకోటలను బద్దలుకొట్టి 2011, 2016లలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన దీదీ గట్టిపట్టు సాధించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 42 సీట్లలో బీజేపీ దాదాపు 40 శాతానికి పైగా ఓట్లతో 18 లోక్‌సభ సీట్లను సాధించింది. దాంతో గత రెండేళ్లుగా కమలనాథులు బెంగాల్‌పై గురిపెట్టి... ఇంకా బలపడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీంట్లో భాగంగా తృణమూల్ ముఖ్యనేతలను పలువురిని బీజేపీలోకి ఆకర్షించారు. మమత కుడిభుజమైన సువేందు అధికారి కొద్దినెలల కిందట బీజేపీ గూటికి చేరడంతో బెం గాల్ రాజకీయం వేడెక్కింది. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగ్గా... ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పలుమార్లు బెంగాల్‌ను చుట్టివచ్చారు. మమత లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టి... ముప్పేటదాడి చేశారు. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను నెగ్గిన బీజేపీ ఇప్పుడు అధికారపీఠానికి దగ్గరగా వచ్చేంతగా ఎదిగింది. ఇండియా టుడే– యాక్సిస్ సర్వే బీజేపీకి 134–160, టీఎంసీకి 130–156 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్– సీఎన్ఎక్స్ కూడా కొంచెం అటుఇటుగా బీజేపీకే అధికస్థానాలు వస్తాయని తేల్చింది. అయితే టైమ్స్ నౌ– సీ ఓటర్, ఏబీపీ– సీ ఓటర్ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం తృణమూల్ సాధారణ మెజారిటీ సాధిస్తుందని, 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాయి. ముప్పేటదాడి జరుగుతున్నా... ఏమాత్రం వెరవకుండా ఒంటరిపోరాటం చేసిన దీదీకి స్వల్పమొగ్గు ఉంటుందని ఈ రెండు సంస్థలు తేల్చాయి. ఎగ్జిట్‌పోల్స్ ఓటరు నాడిని ఏమేరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. సువేందు అధికారితో మమత నేరుగా తలపడ్డ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో గట్టిపోటీ ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమని పలు సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు వామపక్షాలు– కాంగ్రెస్ కూటమి దారుణంగా దెబ్బతిననుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ తేల్చిచెప్పాయి. ఈ రెండు పార్టీలకు కలిపి గరిష్టంగా 25 సీట్లు... కనిష్టంగా 2 సీట్లు వస్తాయని లెక్కగట్టాయి. ఒకవేళ తృణమూల్, బీజేపీలలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే అప్పుడీ కూటమి కీలకమయ్యే అవకాశాలుంటాయి. తమిళనాడులో డీఎంకే హవా మొదటిసారిగా అమ్మ జయలలిత లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్న అన్నాడీఎంకే (బీజేపీతో జతకట్టి) దారుణంగా దెబ్బతిని అధికారం కోల్పోనుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ ముక్తకంఠంతో చెప్పాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (మిత్రపక్షం కాంగ్రెస్) ఏకపక్ష విజయంతో అధికారం చేపట్టనుందని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. డీఎంకే కూటమికి 175–195 స్థానాలు వస్తాయని, అన్నాడీఎంకే కూటమి 38 నుంచి 54 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ డీఎంకే భారీ విజయం ఖాయమని చెప్పాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా... అన్ని ఎగ్జిట్‌పోల్స్ కూడా డీఎంకే కూటమికి కనిష్టంగా 160, అంతకుపైనే స్థానాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం. అస్సాంలో వరుసగా రెండోసారి... ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. బీజేపీ కూటమికి 75–85 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 40 నుంచి 50 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ఉద్దేశంలో అస్సాంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఇది సత్ఫలితాలను ఇచ్చినట్లే కనపడుతోంది. శర్వానంద సోనోవాల్ (ప్రస్తుత సీఎం), హిమంత బిశ్వ శర్మలు ఇక్కడ బీజేపీ గెలిస్తే సీఎం కుర్చీకి గట్టిపోటీదారులు కానున్నారు. టైమ్స్ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ బీజేపీకే మొగ్గు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి భారీ ఆధిక్యంతో అధికారంలోకి తేనున్నారని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. ఎల్డీఎఫ్కు ఏకంగా 104– 120 స్థానాలు వస్తాయంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్కు సాధారణ మెజారిటీ (71) కంటే ఎక్కవే సీట్లు వస్తాయని ప్రతి సంస్థా చెప్పడం గమనార్హం. ప్రతి ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే అలవాటున్న కేరళ ఓటర్లు ఈసారి అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చారనేది ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కేవలం 20–36 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టుడే– యాక్సిస్ పేర్కొనగా... మిగతా సంస్థలు ఈ కూటమికి 50 పైచిలుకు స్థానాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ– అన్నాడీఎంకే కూటమి అధికారం చేపట్టే అవకాశాలున్నాయి. -
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది
-
కొనసాగుతున్న 5 రాష్ట్రాల పోలింగ్
-
ముగిసిన పోలింగ్: అసోంలో భారీగా.. తమిళనాడులో స్వల్పంగా
లైవ్ అప్డేట్స్: ► నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో భారీగా పోలింగ్ నమోదైంది. పలు కేంద్రాల్లో వరుసలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అధికారులు కల్పించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. పశ్చిమ బెంగాల్: 76.84 తమిళనాడు : 65.11 కేరళ : 67.96 అసోం : 81.85 పుదుచ్చేరి : 78.03 ► నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో భారీగా పోలింగ్ నమోదైంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. 5 గంటల వరకు నమోదైన పోలింగ్ పశ్చిమ బెంగాల్: 76.84 తమిళనాడు : 61.34 కేరళ : 69.24 అసోం : 78.32 పుదుచ్చేరి : 76.46 4 గంటల వరకు పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 67.27 తమిళనాడు : 53.35 కేరళ : 59.91 అసోం : 68.31 పుదుచ్చేరి : 66.36 3 గంటల వరకు పశ్చిమ బెంగాల్: 54.43 తమిళనాడు : 43.40 కేరళ : 51.4 అసోం : 54.73 పుదుచ్చేరి : 54.27 ► రెండు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 54.43 తమిళనాడు : 40.94 కేరళ : 51.4 అసోం : 53.23 పుదుచ్చేరి : 54.21 ► ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 53.89 తమిళనాడు : 39.61 కేరళ : 43.3 అసోం : 53.23 పుదుచ్చేరి : 53.35 ► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శంకర్. ► డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ ఉదయనిధి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా హీరో సిద్ధార్థ్ ఓటు వేశారు. ► ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు తమిళనాడులో 22.92 శాతం, అసోంలో 33.18 శాతం, కేరళలో 31. 62 శాతం, పుదుచ్చేరి 35. 71 శాతం, పశ్చిమ బెంగాల్ 34.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులుపేర్కొన్నారు. ► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.29 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కేరళలో 23.33 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా సినీ నటి కుష్బూ, నటుడు విక్రమ్ ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తమిళనాడులోని విరుగంబక్కంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ► నటుడు విజయ్ చెన్నై నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్ మీద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల వరకూ 16.06 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారలు పేర్కొన్నారు. ► చెన్నైలోని తేనాంపేట్‌లో డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి ఓటు హక్కు వినయోగించుకున్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ► కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివస్తున్నారు. ► పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. యానాం అసెంబ్లీ స్థానంలో పోలింగ్ కొనసాగుతోంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం తరలివస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీ ఓటు వేశారు. ► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్, ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా తిరువాన్మయూర్‌లో నటుడు అజిత్ ఓటు వేశారు. ► పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేరళలోని పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్ధి శ్రీధరన్ఓటు వేశారు. అదేవిధంగా చెన్నైలో సినీ నటుడు రజనీకాంత్ ఓటు వేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళనాడు 234, కేరళ 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అసోంలో తుది విడత పోలింగ్‌లో భాగంగా 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మే 2న బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించన్నారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా?
-
కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన కమిషన్ బుధవారం నగారా మోగించింది. అయితే ఈ కీలక ఎన్నికలకు ముందు ఈ మాసాంతంలో నిర్వహించనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశంపై తమకు ప్రతిపక్షాలనుంచి అభ్యంతరాలు అందాయని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ నసీం జైదీ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీకి తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఎన్నికల తేదీలు తదితర కీలక ఘట్టాలకు సంబంధించిన వివరాలను నసీం ప్రకటించారు. మార్చి 11 న అయిదు రాష్ట్రాల కౌంటింగ్ ను నిర్వహించనున్నారు. అలాగే తాజా సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని ఈసీ స్పష్టం చేసింది. మత, కులం పేరులో ఓట్లు అడగడం అవినీతి కిందికి వస్తుందన్న హిందుత్వ కేసులో సుప్రీం తీర్పును కచ్చితంగా పాటిస్తామని ఈసీ ఛైర్మన్ స్పష్టం చేశారు. అలాగే ప్రతీ అభ్యర్తి సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని కూడా ఈసీ కోరింది. ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసింది. మరోవైపు నిబంధనలను మరింత కఠినతరం చేసిన ఈసీ అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చునూ నమోదు చేయాలని, దాన్ని నిత్యమూ అధికారులకు అందించాలని సూచించింది. ఒక్క రూపాయి నగదు ఖర్చును అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థీ విధిగా ఎన్నికల ఖాతాను ప్రారంభించాలని, దాని ద్వారానే కేటాయింపులు జరపాలని ఆదేశించింది. సదరు ఖాతాలోని వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఈసీకి అందించాలని, ఒకవేళ బ్యాంకుల ద్వారా కాకుండా చెల్లింపులు జరపాల్సి వస్తే, చెక్కులు జారీ చేయాలని సూచించింది. రూ. 20 వేల కన్నా అధిక మొత్తంలో డొనేషన్లు వస్తే, అది చెక్కులు లేదా డీడీల రూపంలో మాత్రమే ఉండాలని పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ ఖర్చులపై పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ప్రకటించాలని ఆదేశించింది.