ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతవరకు కరక్ట్‌..! | People Waiting Curiously For Five Poll Bound States Election Exit Polls | Sakshi
Sakshi News home page

కాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌

Published Thu, Nov 30 2023 3:09 PM | Last Updated on Thu, Nov 30 2023 3:42 PM

People Waiting Curiously For Five States Election Exit Polls - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభకు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌ ముగిసిన వెంటనే సాయంత్రం 5.30 గంటల నుంచి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. లోక్‌సభ ఎ‍న్నికల్లో రానున్న ఫలితాలకు ఈ ఎన్నికల రిజల్ట్స్‌ ప్రివ్యూగా భావిస్తున్నారు.ఎన్డీఏ జైత్రయాత్రను సవాల్‌ చేస్తున్న ఇండియా కూటమి భవితవ్యం కూడా ఈ ఎన్నికలతో తేలిపోనుంది. 

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌,, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్‌ ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు మధ్య ‍‍ప్రధాన పోరు ఉండగా మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌కు మధ్య ఫైట్‌ నడిచింది. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్‌ పోల్స్‌లో 5 రాష్ట్రాల్లో జనాల మూడ్‌ ఎలా ఉందో తేలిపోనుంది. 

అయితే సాధారణంగా ఎగ్జిట​ పోల్స్‌ ఎన్నికల్లో ప్రజల మూడ్‌ ఎలా ఉందనేదాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఫైనల్‌ ఫలితాలు వచ్చాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌ను పూర్తిస్థాయిలో నమ్మడానికి లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. 

ఇదీచదవండి..రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్​పై సుప్రీంకోర్టు అసహనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement