కస్‌గంజ్: ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్‌గంజ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే. 2007లో కస్‌గంజ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు.
అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్‌పాల్ సింగ్ కస్‌గంజ్‌లో విజయం సాధించారు. ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్‌దీప్ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్‌పాల్ సింగ్ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్ వర్మకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment