ఇలా పార్టీ ఫిరాయించి టికెట్‌ తెచ్చుకున్నారు! | Ashish Shukla Against BJPs Sanjay Sinh In Amethi | Sakshi
Sakshi News home page

ఇలా పార్టీ ఫిరాయించి టికెట్‌ తెచ్చుకున్నారు!

Published Tue, Feb 8 2022 11:30 AM | Last Updated on Tue, Feb 8 2022 11:49 AM

Ashish Shukla Against BJPs Sanjay Sinh In Amethi - Sakshi

అమేథీ: యూపీలో ఒకప్పటి తమ కంచుకోట అయిన అమేథీ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ ఫిరాయింపుదారు ఆశిష్‌ శుక్లాకు ఇచ్చింది కాంగ్రెస్‌! శుక్లా సోమవారం ఉదయం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ వెంటనే ఆయనకు టికెట్‌ ఖరారైంది. ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఆదివారం ప్రకటించింది! నిజానికి ఆయన భార్యలు అమితా సింగ్, గరిమా సింగ్‌ ఇద్దరూ బీజేపీ టికెట్‌ కోసం పోటీ పడ్డారు. ఇద్దరినీ కాదని భర్తకు చాన్స్‌ దక్కింది.

గరిమా సింగ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగా అమితా కాంగ్రెస్‌ తరఫున ఆమెపై పోటీ చేసి ఓడిపోయారు. సంజయ్‌ 2019లో రాజ్యసభ సీటు వదులుకుని కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరగా అమితా కూడా ఆయనను అనుసరించారు. ఇక సమాజ్‌వాదీ తరఫున గ్యాంగ్‌ రేప్‌ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, బీఎస్పీ నుంచి రాగిణీ తివారీ బరిలో ఉన్నారు. అమేథీలో ఫిబ్రవరిలో 27న పోలింగ్‌ జరగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement