షిల్లాంగ్: మణిపూర్‌లో బీజేపీకి తాము బీ టీమ్ కాదని నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్, మేఘాలయ సీఎం కొనార్డ్ కె.సంగ్మా స్పష్టం చేశారు. ఈసారి మరిన్ని సీట్లు గెలిచి తీరతామని సోమవారం ధీమా వెలిబుచ్చారు. 2017లో బీజేపీ నేతృత్వంలోని ఈశాన్య డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఈడీఏ)తో జట్టుకట్టిన ఎన్‌పీపీ 9 సీట్లలో పోటీ చేసింది.
గెలిచింది 4 సీట్లే అయినా కింగ్‌మేకర్‌గా మారింది. ఎన్‌పీపీ మద్దుతుతోనే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఈసారి 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. తమ బీజేపీ విజయావకాశాలను బీజేపీ ఎంతమాత్రమూ దెబ్బ తీయలేదని కొనార్డ్ సంగ్మా ధీమా వెలిబుచ్చారు. పైగా తామే వారి విజయావకాశాలను దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదన్నారు. సంకీర్ణంలో ఉన్నంత మాత్రాన తమను బీజేపీకి బీ టీమ్ అనడం సరికాదన్నారు. ‘‘కొన్నిచోట్ల మాకు కాంగ్రెస్ ప్రత్యర్థి. మరికొన్నిచోట్ల బీజేపీతో పోటీ పడుతున్నాం. ఇంకొన్ని సీట్లలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌ను ఢీకొంటున్నాం. ఈసారి మేం చాలా స్థానాలు గెలుచుకోవడం ఖాయం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment