ఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేయగా, జోరమ్ పీపుల్స్ మూమెంట్(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది.
40 అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తెలపగా, జన్ కీ బాత్ సర్వే మాత్రం ఎంఎన్‌ఎఫ్ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు.
మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్ సర్వే
- ఎంఎన్‌ఎఫ్ 16-20
- జేపీఎం-10-14
- ఐఎన్‌సీ 2-3
- బీజేపీ 6-10
- ఇతరులు-0
జన్ కీ బాత్ సర్వే
- ఎంఎన్‌ఎఫ్-10-14
- జేపీఎం-15-25
- కాంగ్రెస్-5-9
- బీజేపీ-0-2
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
- ఎంఎన్‌ఎఫ్ 14-18
- జేపీఎం 12-16
- కాంగ్రెస్ 8-10
- బీజేపీ 0-2
ABP-Cvoter
- MNF-15-21
- ZPM-12-18
- OTH-0-10
Times Now-ETG
- MNF-14-18
- ZPM-10-14
- OTH-9-15
Comments
Please login to add a commentAdd a comment