
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మిజోరాం స్టార్ ప్లేయర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో భాగంగా నాడియాడ్ వేదికగా మణిపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అగ్ని చోప్రా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్ బౌలర్లను చోప్రా ఉతికారేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 269 బంతులు ఎదుర్కొన్న అగ్ని చోప్రా.. 29 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 218 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా ఈ ప్రస్తుత రంజీ సీజన్‌లో చోప్రాకు ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌పై సెకెండ్ ఇన్నింగ్స్‌లో చోప్రా ద్విశతకం సాధించాడు. అదే మ్యాచ్‌లో చోప్రా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కూడా నమోదు చేయడం గమనార్హం.
ఈ ఏడాది సీజన్‌లో చోప్రా కేవలం ఐదు ఇన్నింగ్స్‌లలో 646 పరుగులు లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. చోప్రా విధ్వంసకర డబుల్ సెంచరీ ఫలితంగా మిజోరాం తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
చదవండి: WI vs SL: మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment