chopra
-
డబుల్ సెంచరీతో చెలరేగిన బాలీవుడ్ దర్శకుడి కొడుకు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మిజోరాం స్టార్ ప్లేయర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు అగ్ని చోప్రా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా నాడియాడ్ వేదికగా మణిపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అగ్ని చోప్రా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్ బౌలర్లను చోప్రా ఉతికారేశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 269 బంతులు ఎదుర్కొన్న అగ్ని చోప్రా.. 29 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 218 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా ఈ ప్రస్తుత రంజీ సీజన్లో చోప్రాకు ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్ కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌పై సెకెండ్ ఇన్నింగ్స్‌లో చోప్రా ద్విశతకం సాధించాడు. అదే మ్యాచ్‌లో చోప్రా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కూడా నమోదు చేయడం గమనార్హం.ఈ ఏడాది సీజన్లో చోప్రా కేవలం ఐదు ఇన్నింగ్స్‌లలో 646 పరుగులు లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. చోప్రా విధ్వంసకర డబుల్ సెంచరీ ఫలితంగా మిజోరాం తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: WI vs SL: మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్‌లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్‌కు చివరి రోజుగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్‌తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.
జోధ్‌పూర్: హైదరాబాద్‌లో ‘దిశ’ ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా స్పందించారు. ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్ యువతి అంటోంది. మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్‌లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలవనున్నట్లు ఆమె చెప్పారు. ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెనుకడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. ‘దిశ’ హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్ లక్ష్యమన్నారు. -
మోదీని అధిగమించిన ప్రియాంకా చోప్రా
న్యూయార్క్ః బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకా చోప్రా ఆన్ లైన్ పోల్ లో ప్రధాని మోదీని దాటేశారు. టైమ్ మ్యాగజిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఒక శాతం అధిక ఓట్లను సాధించి భారత్ ప్రధానినే మించిపోయారు. ప్రపంచంలోని వందమంది మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్స్ ను ప్రచురించే టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ప్రధాని మోదీకంటే ముందంజలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజిన్ ప్రతి సంవత్సరం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈసారి నిర్వహించిన పోల్ లో ప్రభావవంతమైన ప్రముఖులు వందమందిలో ప్రియాంకా చోప్రా భారత ప్రధాని మోదీని మించిపోయారు. దీంతోపాటు డెమొక్రెటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడ ఈసారి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ తో పాటు అధ్యక్షుడు బారాక్ ఒబామా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు పాకిస్తాన్ కార్యకర్త మలాలాను కూడ మూడు రెట్ల ఓట్లతో అధిగమించినట్లు టైమ్స్ తెలిపింది. అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాకోసం మ్యాగజిన్ ఏప్రిల్ 13 బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన జాబితా వెలువడనుంది. అయితే అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా' లో నటించి తన పాత్రతో మెప్పించిన ప్రియాంకా చోప్రా మోదీకి వచ్చిన 0.7 ఓట్ల కంటే ఒక శాతం అధికంగా 0.8 ఓట్లను పొంది ముందు వరుసలో నిలిచింది. అలాగే 1 శాతం ఓట్లను పొందిన క్లింటన్ కన్నా శాండర్స్ 3.3 శాతం అధిక ఓట్లను సాధించారు. ఇకపోతే శాండర్స్ తర్వాత సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలవగా అత్యధిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో ముందు కనిపిస్తున్న ట్రంప్ మాత్రం 0.6 శాతం ఓట్ల ను సాధించి ఆన్ లైన్ పోల్‌లో పూర్తిగా వెనుకబడ్డారు. -
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్‌ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్‌ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చించారు. నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్‌లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్‌లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు.