మోదీని అధిగమించిన ప్రియాంకా చోప్రా
న్యూయార్క్ః బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకా చోప్రా ఆన్ లైన్ పోల్ లో ప్రధాని మోదీని దాటేశారు. టైమ్ మ్యాగజిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఒక శాతం అధిక ఓట్లను సాధించి భారత్ ప్రధానినే మించిపోయారు. ప్రపంచంలోని వందమంది మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్స్ ను ప్రచురించే టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ప్రధాని మోదీకంటే ముందంజలో ఉన్నారు.
టైమ్స్ మ్యాగజిన్ ప్రతి సంవత్సరం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈసారి నిర్వహించిన పోల్ లో ప్రభావవంతమైన ప్రముఖులు వందమందిలో ప్రియాంకా చోప్రా భారత ప్రధాని మోదీని మించిపోయారు. దీంతోపాటు డెమొక్రెటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడ ఈసారి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ తో పాటు అధ్యక్షుడు బారాక్ ఒబామా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు పాకిస్తాన్ కార్యకర్త మలాలాను కూడ మూడు రెట్ల ఓట్లతో అధిగమించినట్లు టైమ్స్ తెలిపింది.
అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాకోసం మ్యాగజిన్ ఏప్రిల్ 13 బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన జాబితా వెలువడనుంది. అయితే అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా' లో నటించి తన పాత్రతో మెప్పించిన ప్రియాంకా చోప్రా మోదీకి వచ్చిన 0.7 ఓట్ల కంటే ఒక శాతం అధికంగా 0.8 ఓట్లను పొంది ముందు వరుసలో నిలిచింది. అలాగే 1 శాతం ఓట్లను పొందిన క్లింటన్ కన్నా శాండర్స్ 3.3 శాతం అధిక ఓట్లను సాధించారు. ఇకపోతే శాండర్స్ తర్వాత సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలవగా అత్యధిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో ముందు కనిపిస్తున్న ట్రంప్ మాత్రం 0.6 శాతం ఓట్ల ను సాధించి ఆన్ లైన్ పోల్లో పూర్తిగా వెనుకబడ్డారు.