Hillary
-
హిల్లరీవైపే పుతిన్ మొగ్గుచూపారు
డోనాల్డ్ ట్రంప్ ప్రకటన వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తనకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలను డోనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారని ప్రకటించారు. ఆమెకు అధికారం వస్తే అమెరికా బలహీనమవుతుందని అంచనా వేశారని వెల్లడించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తను, పుతిన్ తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. జర్మనీ నగరం హాంబర్గ్‌లో గత వారం నిర్వహించిన జీ–20 సదస్సులో వీరిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ‘మా సైన్యం బలోపేతానికి నేను అధికశ్రద్ధ చూపాను. హిల్లరీ అధికారంలోకి వచ్చి ఉంటే సైన్యం బలహీనంగా మారేది. ఇంధనం ధర మరింత పెరిగేది. అందుకే ట్రంప్ నన్ను వ్యతిరేకించారు’ అని వివరించారు. గ్రీన్‌కార్డు నిబంధనలను సరళీకరించండి న్యూయార్క్: అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు/వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డ్ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన వార్తలపై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్లును కాన్సస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ నేత కెవిన్ యోడర్ ప్రవేశపెట్టారు. ఈ సమస్యకు కారణమైన ‘దేశ ఆధారిత’ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ఉండటం వల్ల భారత్, చైనా వంటి అధిక జనాభా దేశాల నుంచి వచ్చే వారికి అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో ఉన్న 230 మందిలో ఇప్పటికే 100 మందికి పైగా నేతలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ‘దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్ జారీ’ నిబంధనని తొలగిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం స్వతంత్ర దేశం నుంచి వచ్చిన ఉద్యోగుల కుటుంబాలకు కోటా ప్రకారం గ్రీన్‌కార్డులు మం జూరు చేయాలి. దీంతో భారత్, చైనాల నుంచి వచ్చిన వారితో సమానంగా చిన్న దేశం గ్రీన్లాండ్ నుంచి వచ్చిన ఉద్యోగులకూ గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. పెద్ద దేశాల నుంచి దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం వారి గ్రీన్‌కార్డ్ దరఖాస్తు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే ఈ బిల్లు అమలులోకి వస్తే తాత్కాలిక వీసా మీద అమెరికాలో పనిచేసే వారికి కూడా మరింత ప్రయోజనం చేకూరనుంది. ట్రంప్ అభిశంసనకు తీర్మానం అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి అనుమతించి న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించినందున ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ డెమోక్రాట్ ఎంపీ బ్రాడ్ షెర్మన్ తీర్మానం ప్రవేశపెట్టారు. మరో డెమోక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ దీనిపై సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పార్లమెంటులో రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్నందున ఈ తీర్మానాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. డెమోక్రాట్లకు ప్రతినిధుల సభలో తగిన మెజారిటీ లేకపోవడమే ఇందుకు కారణం. -
భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ షాక్
-
భారతీయులకు ట్రంప్ షాక్
- అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను అనుమతించబోమని ప్రకటన వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డాలర్ డ్రీమ్స్‌లో తేలియాడే భారతీయులకు షాక్ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్1బీ వీసాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు. గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రతి అమెరికన్ జీవితానికీ రక్షణ కల్పించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఎక్కువగా అమెరికా కార్మికులతో గడిపానని, శిక్షణ కోసం తప్పించి.. వారి స్థానంలో విదేశీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగనీయబోమని చెప్పారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి తీరుతామని చెప్పారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇది తప్పదన్నారు. ట్రంప్ గెలుపు వెనుక రష్యా హస్తం! అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నిర్ధారించినట్లు మీడియా వెల్లడించింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలుపుకోసం రష్యా ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనాన్ని ప్రచురించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం హిల్లరీ ప్రతిష్టను మసకబార్చి ట్రంప్ అవకాశాల్ని మెరుగుపరచేందుకు రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు పనిచేశారని, వీరు హిల్లరీ ప్రచారకమిటీ చైర్మన్‌తో సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది మెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వీకీలిక్స్కు అందజేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయంది. -
జన విజేత హిల్లరీయే..!
తాజాగా ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఇదే రీతిలో ఉన్నారుు. ఎన్నికల్లో అధికారికంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గెలిచారు. మొత్తం 538 ఎలొక్టరల్ కాలేజీ ఓట్లలో మేజిక్ ఫిగర్ 270 అరుుతే.. ట్రంప్‌కు 306 ఓట్లు లభించారుు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి కేవలం 232 ఎలొక్టరల్ కాలేజీ ఓట్లే దక్కారుు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం.. 6.34 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు హిల్లరీకి ఓటేస్తే.. ట్రంప్‌కు ఓటు వేసిన వారి సంఖ్య 6.12 కోట్ల వరకూ ఉండొచ్చు. మొత్తంగా ట్రంప్ కన్నా హిల్లరీకి 1.5 శాతం ఓట్ల ఆధిక్యం ఉంది. హిల్లరీకి లభించినన్ని ఓట్లు అమెరికా చరిత్రలో బరాక్ ఒబామాకు (2008, 2012 ఎన్నికల్లో) తర్వాత మరే అధ్యక్ష అభ్యర్థికీ రాలేదని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన అమెరికన్ల సంఖ్య 2012 లో ఓటు హక్కు వినియోగించుకున్న 12.9 కోట్ల మందిని దాటి పోరుుందని తాజా అంచనా. -
తెరపైకి కాలెగ్జిట్!
లాస్ ఏంజిలస్: అమెరికాలో చాలా కాలంగా ఉన్న కాలెగ్జిట్ (అమెరికా నుంచి కాలిఫోర్నియా ఎగ్జిట్) డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో కాలెగ్జిట్ జోరు కనిపించినా తర్వాత నెమ్మదించింది. అరుుతే.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవటంతో దీన్ని జీర్ణించుకోలేని కాలిఫోర్నియా ప్రజలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. అమెరికా నుంచి విడిపోవాలనే డిమాండ్‌తో రోడ్డెక్కారు. డెమొక్రాట్లకు బలమున్న ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం, గన్ కల్చర్, గే హక్కుల కోసం ఉద్యమాలూ ఎక్కువే. హిల్లరీఅధ్యక్ష ఎన్నికల్లో ఓడినా కాలిఫోర్నియాలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ట్రంప్ విజయాన్ని ఒప్పుకోని కాలిఫోర్నియా వాసులు.. ఫలితాలు వచ్చినప్పటినుంచి కాలెగ్జిట్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొందరైతే ‘నాట్ మై ప్రెసిడెంట్’ అంటూ పోస్టులు చేస్తున్నారు. ‘మేం ఇకపై అమెరికన్స కాము, కాలిఫోర్నియన్సమే’ అంటూ రోడ్లపై నినాదాలు చేస్తున్నారు.ట్రంప్‌పై అసంతృప్తితోనే ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రాజకీయ నిపుణులంటున్నారు. ట్రంప్ స్పందిస్తూ.. మీడియా చిన్న విషయాన్ని ఎక్కువగా చూపిస్తుందని విమర్శించారు. -
అగ్రరాజ్య ఫలితం నేడే
అమెరికాలో ముగిసిన అధ్యక్ష ఎన్నికలు ► కాలిఫోర్నియా, అలాస్కాల్లో ఉదయం 8 గంటల వరకూ ఓటింగ్ ► తొలి ఫలితం వెల్లడైన డిక్స్‌విల్లే నోచ్‌లో హిల్లరీకి ఆధిక్యం ► న్యూహ్యాంప్‌షైర్‌లో హోరాహోరీ ► స్వింగ్ రాష్ట్రాలైన వర్జీనియా,కొలొరాడో, నెవడాల్లో హిల్లరీకే మొగ్గు ► హిల్లరీ గెలుపు నల్లేరుపై నడకేనంటోన్న తాజా సర్వేలు ► నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఒహయోలపై ట్రంప్ ఆశలు వాషింగ్టన్/న్యూయార్క్: చివరి వరకూ ఉత్కంఠ రేపిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పసిఫిక్ తీర రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్‌లతో పాటు అలాస్కా, హవాయ్ దీవుల్లో మాత్రం బుధవారం ఉదయం 8 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టారు. ఉదయం 10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. మధ్యాహ్నంలోపు అధ్యక్షుడు ఎవరనేది దానిపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. ఇక న్యూహ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నోచ్ గ్రామం నుంచి వెలువడ్డ మొదటి ఫలితంలో హిల్లరీ ఆధిక్యం సాధించారు. మొత్తం 6 ఓట్లు పడగా నాలుగు హిల్లరీకి, రెండు ట్రంప్‌కు దక్కారుు.సమీపంలోని మిల్స్‌ఫీల్డ్‌లో మాత్రం ట్రంప్‌కు 16, హిల్లరీకి 4 ఓట్లు పడ్డాయి. హరస్ట్ లొకేషన్లో 17-14 ఓట్ల తేడాతో హిల్లరీకి ఆధిక్యం దక్కింది. 12 కోట్ల మంది ఓటుహక్కు వినియోగం.. 20 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా, 4.2 కోట్ల మంది ముందస్తు ఓటేవారు. వీరిలో నల్లజాతీయులు, లాటిన్ వలసదారులు ఎక్కువగా ఉండడంతో హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడొచ్చని భావిస్తున్నారు. 2012లో 3.23 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఎన్నికలో దాదాపు 12 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. న్యూయార్క్‌లో హిల్లరీ, ట్రంప్ ఓటు.. భర్త బిల్‌క్లింటన్‌తో కలసి న్యూయార్క్ రాష్ట్రం చాప్పాక్వాలోని ప్రాథమిక పాఠశాలలో హిల్లరీ ఓటేశారు. ‘ఆనందంగా ఉన్నా’ అంటూ పోలింగ్ బూత్ బయటకు వస్తూ అన్నారు. పార్టీ మద్దతుదారులకు చేతులూపుతూ ఉత్సాహంగా కన్పించారు. మద్దతుదారులు ‘మేడమ్ ప్రెసిడెంట్’ అంటూ నినాదాలు చేశారు. ఇక భార్య మెలేనియాతో కలసి ట్రంప్ న్యూయార్క్ నగరంలో ఓటు వేశారు. ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. హిల్లరీదే గెలుపు ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, న్యూయార్క్, న్యూహ్యాంప్‌షైర్, మసాచుసెట్స్, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా తదితర రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభమవడంతో ఫలితంపైఉత్కంఠ నెలకొంది. హిల్లరీ గెలుపు ఖాయమని సర్వేలు చెప్పడంతో ఫలితాన్ని తారుమారు చేసే రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపు తప్పనిసరి. అరిజోనా(11), ఫ్లోరిడా(29), నెవెడా(6), నెబ్రాస్కా రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), న్యూహ్యాంప్‌షైర్(4), నార్త్ కరోలినా(15)లో ట్రంప్ గెలిస్తే విజయం దక్కినట్లే. కాగా హిల్ల్లరీ అధ్యక్షురాలిగా ఎన్నికవడం ఖాయమని సీఎన్ఎన్ పేర్కొంది. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని, స్వింగ్ రాష్ట్రాలైన వర్జీనియా, కొలరాడో, నెవడాల్లో మైనార్టీలు, ఉన్నత విద్యావంతుల ఓటర్లను ఆకర్షించడంలో విజయం సాధించారని తెలిపింది.నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఒహయోల్లో ట్రంప్ తప్పక గెలవాలి. న్యూహ్యాంప్‌షైర్, అయోవాల్లో కూడా గెలిస్తే అధ్యక్షుడయ్యే అవకాశాలుంటారుు. చివరి నిమిషం వరకూ హోరాహోరీ ప్రచారం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు చివరి నిమిషం వరకూ ప్రచారం నిర్వహించారు. చివరిగా నార్త్ కరోలినా రాష్ట్రం రాలైగ్లో భారీ ర్యాలీలో హిల్లరీ ప్రసంగించారు. ట్రంప్ మిచిగన్ రాష్ట్రంలో చివరి ప్రసంగం చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల కు ఇద్దరి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగిసింది. పోటీ వల్ల నేను మారా: ట్రంప్ ‘ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే భారీగా డబ్బు, శక్తి, సమయం వృథా అయినట్లే’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘నేను గెలవకపోతే అదేమీ గొప్ప విషయం కాదు. ఎన్నిక ప్రచారం అద్భుతంగా సాగింది. దేశమంతా పర్యటించి వివిధ స్థాయిల వ్యక్తుల్ని కలిశా. అందరూ అద్భుతం’ అంటూ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ఏం సాధించావని ప్రజలు అడిగితే అదే నేర్చుకున్నానని చెబుతానన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తనను పూర్తిగా మార్చేసిందని చెప్పారు. అధ్యక్ష ఎన్నికలతో పాటే... అధ్యక్ష ఎన్నికలతో పాటు 12 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, సెనెట్(100)లోని మూడో వంతు సీట్లకు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స సభ్యుల కోసం మంగళవారమే ఎన్నికలు నిర్వహించారు. హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స రేసులో 12 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. మాజీ అటార్నీ కమలా హరిస్ కాలిఫోర్నియా నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అమి బెరా, రో ఖన్నా(కాలిఫోర్నియా), ప్రమీల జయపాల్(వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి(ఇలినాయిస్), పీటర్ జాకబ్(న్యూజెర్సీ), అలోక్ కుమార్(మిచిగన్)లు పోటీలో ఉన్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే వర్జీనియాలోని లౌడన్, ఫైర్ఫేక్స్ల్లో ఓటర్లు క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ శాతం డెమోక్రటిక్ పార్టీకే మద్దతిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ వివాదాస్పద, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలు, హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ వివాదంతో పాటు కింది అంశాలు ఓటర్లపై ప్రభావం చూపాయి. గన్స్ పై నిషేధం: గన్ కల్చర్‌పై నియంత్రణ విధించాలనేది డెమోక్రాట్ల ప్రధాన ప్రచారం. గన్ వినియోగంలో మార్పుల్ని అమెరికన్ కాంగ్రెస్ తిరస్కరించగా... అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం పూర్తిగా సమర్థిస్తూ పలు ఆదేశాలిచ్చారు. ► కనీస వేతనాలు ► కొన్ని చికిత్సల కోసం మారిజోనా వాడకం చట్టబద్దం ► మరణదండన ... మరణదండనకు ఉపయోగించే లెథల్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో మరణదండన అమవలవడం లేదు. ► ఆరోగ్య రంగం, వివాదాస్పదమైన ఒబామా కేర్ పాలసీ ► సిగరెట్ల ధర పెరగడం 70 శాతం చాన్స్ ఆమెకే! రిపబ్లికన్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కే శ్వేతసౌధానికి చేరుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అమెరికా ప్రముఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2008, 2012 ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన ‘ఫైవ్ థర్టీఐట్’ అనే వెబ్ సైట్ ప్రకారం.. ‘చివరి రోజుల్లో క్లింటన్ ప్రచారం సానుకూల ప్రభావాలు చూపిస్తోంది. ఇందువల్ల ఆమె విజయం సాధించటం 70 శాతం ఖాయంగా కనబడుతోంది’. ఇతర సర్వేలు కూడా 2.9 నుంచి 3.8శాతం ఓట్ల మెజారిటీ పొందొచ్చని తెలిపాయి. తప్పక గెలిచే రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ అలబామా(9), అలాస్కా(3), ఐడహ(4), ఇండియానా(11), క్యాసస్(6), కెంటకీ(8), లూసియానా(8), మిస్సిసిపి(6), మిస్సోరీ(10), మాంటెనా(3), నెబ్రాస్కా(4), నార్త్ డకోటా(3), ఒక్లహోమా(7), సౌత్ కరోలినా(9), సౌత్ డకోటా(3), టెన్నెసే(11), టెక్సాస్(38), వెస్ట్ వర్జీనియా(5), వయోమింగ్(3) .... మొత్తం ఎలక్టోరల్స్ 157. మొగ్గు రాష్ట్రాలు: జార్జియా(16), అయోవా(6), మైనే రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), ఒహయో(18), యూటా(6).... మొత్తం 47 డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా(55), కనెక్టికట్(7), డేలావేర్(3), వాషింగ్టన్ డీసీ(3), హవాయ్(4), ఇలినారుుస్(20), మైనే(3), మేరీల్యాండ్(10), మసాచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), ఓరెగాన్(7), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్(3), వాషింగ్టన్(12), మిన్నెసొటా(10), న్యూ మెక్సికో(5) మొత్తం 200. మొగ్గు రాష్ట్రాలు: కొలొరడో(9), మిషిగన్(16), పెన్సిల్వేనియా(20), వర్జీనియా(13), విస్కాన్సిన్(10)... మొత్తం 68 హోరాహోరీ రాష్ట్రాలు అరిజోనా(11), ఫ్లోరిడా(29), నెవెడా(6), నెబ్రాస్కా రెండో కాంగ్రెస్‌నల్ డిస్ట్రిక్(1), న్యూహ్యాంప్‌షైర్(4), నార్త్ కరోలినా(15)... మొత్తం 66 ఫలితాలు ఇలా ఉండొచ్చు! సీఎన్ఎన్ తాజా అంచనాల ప్రకారం... ఒహయో, యూటా రాష్ట్రాలతో పాటు మైనే రాష్ట్రంలోని ఒక డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ పార్టీకి గెలుపు అవకాశాలున్నారుు. ఇక అరిజోనా, ఫ్లోరిడా, నెవెడా, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో పోరు హోరాహోరీ.. పూర్తి పట్టున్న, స్వల్ప ఆధిక్యం ఉన్న రాష్ట్రాల నుంచి హిల్లరీకి 268 ఎలక్టోరల్స్ ఓట్లు ఖాయం. ఇక ట్రంప్‌కు 204 ఎలక్టోరల్స్ రావచ్చు. అధ్యక్ష పీఠం దక్కాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు తప్పనిసరి... 66 సీట్ల కోసం హోరాహోరీ సాగొచ్చు. అంతరిక్షం నుంచి ఓటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి షేన్ కింబ్రో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్టోబర్ 19న రష్యా అంతరిక్ష నౌక సూయజ్ ద్వారా ఇద్దరు వ్యోమగాములతో కలిసి కింబ్రో ఐఎస్ఎస్కు వెళ్లారు. 1997 నుంచి అంతరిక్షం నుంచి కూడా అమెరికన్ వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలిసారి అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగామి డేవిడ్ వోల్ఫ్. తగ్గని క్రేజ్ సాధారణంగా రెండుసార్లు అధికారంలో ఉన్న అధ్యక్షుడిపై అసంతృప్తి సహజం. అదీ అమెరికాలో ఇంతవరకు పదవినుంచి దిగిపోతున్న ఏ వ్యక్తికీ కనీస రేటింగ్ లేదు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాకు మాత్రం ఎన్నికల రోజు వరకూ 56 % మంది మంచి రేటింగ్ ఇచ్చారు. 2012లో రెండోసారి ఎన్నికయ్యేందుకు ముందు కూడా ఒబామాకు ఇంత రేటింగ్ రాలేదు. దీంతో.. ఒబామా పాపులారిటీ ఆధారంగానే క్లింటన్ విజయం గురించి కొన్ని సర్వేలు సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాయి. కాగా, తాజా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. ‘ఉద్యోగాల విషయంలో ట్రంప్ వద్ద నిర్దిష్టమైన ప్రణాళికేమీ లేదనీ.. ప్రస్తుత వ్యవస్థను తిట్టడం మినహా ఏమీ చేయలేరు’ అని అన్నారు. -
మనకు వేరే మార్గం లేదు: ట్రంప్
వాషింగ్టన్: ఒబామా, హిల్లరీలు అమెరికన్లకు సంబంధం లేని యుద్ధాలు, వివాదాల్లో తలదూర్చి దేశాన్ని సురక్షితం కానిదిగా మార్చారని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్.. ఒబామా, హిల్లరీల విదేశాంగ విధానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర ప్రజల సరిహద్దుల కోసం పోరాడుతూ అమెరికన్లు ప్రాణాలు, డబ్బు కోల్పోతున్నారని.. అయితే తన మొదటి ప్రాధాన్యత అమెరికాకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాక్, సిరియా, లిబియాలలో మారణహోమానికి హిల్లరీనే కారణమని ట్రంప్ మరోసారి విమర్శించారు. సిరియా నుంచి అమెరికాకు ప్రవేశించే శరణార్థుల సంఖ్య 550 శాతం పెరగాలని హిల్లరీ కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఒబామా అనుమతించిన వారి కంటే వేల సంఖ్యలో ఎక్కువమంది వలసదారులను హిల్లరీ అమెరికాలోకి అనుమతించాలని చూస్తున్నారన్నారు. సిరియన్ శరణార్ధుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దూరంగా ఉంచాలని.. మనకు అంతకన్నా వేరే మార్గం లేదని ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ట్రంప్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. -
హిల్లరీ గత తరం నాయకురాలు
-
ఎన్నికల రోజే ట్రంప్ విజయోత్సవ వేడుక!
న్యూయార్క్: తాజా సర్వేలతోపాటు ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికవటం ఖాయంగా కనబడుతోందని.. ఈయన ప్రచార బాధ్యతలు చూస్తున్న వారంటున్నారు. అధ్యక్ష ఎన్నిక జరగనున్న నవంబర్ 8 రాత్రి ట్రంప్.. తన మిత్రులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారుల కోసం భారీ ‘విజయోత్సవ వేడుక’ నిర్వహించనున్నారని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. మన్‌హటన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో ఈ పార్టీ ఉంటుందన్నారు. అటు హిల్లరీ కూడా ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నా.. ఇది విజయోత్సవ వేడుకగా కాకుండా తన మద్దతుదారులకు సందేశాన్నిచ్చేందుకు మాత్రమే ఉద్దేశించినట్లు తెలిసింది. కాగా, న్యూయార్క్ టైమ్స్/సీబీఎస్ సర్వేలో ట్రంప్‌కు 42 శాతం, హిల్లరీకి 45 శాతం ఓటర్ల మద్దతు లభించింది. -
అమెరిక ఎన్నికలల్లో నల్ల జాతీయుల ప్రభావం
-
మంచినీళ్లలా ప్రచార ఖర్చు
వాషింగ్టన్/డెలవేర్: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు వెదజల్లుతున్నారు.ప్రచారం, ఉద్యోగుల కోసం మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెడుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెల వ్యవధిలో ప్రచార ఖర్చును రెండింతలు చేశారు. ప్రచార ఖర్చు, నిధుల సేకరణలో మాత్రం హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. సెప్టెంబర్‌లో ట్రంప్ రూ. 477 కోట్లు ఖర్చుపెట్టారు. సెప్టెంబర్ నెల ముగిసేసరికి తన వద్ద రూ. 236 కోట్లు ఉన్నాయంటూ ట్రంప్ ఎన్నికల సంఘానికి తెలిపారు. ఆగస్టులో ట్రంప్ రూ. 284 కోట్ల నిధుల్ని సేకరించారు. ట్రంప్ ప్రచారం శిబిరంలో 350 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ సెప్టెంబర్ నెలలో ఏకంగా రూ. 561 కోట్లు ఖర్చుచేశారు. సెప్టెంబర్ ముగిసేనాటికి తన వద్ద రూ. 406 కోట్లు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో హిల్లరీ రూ. 501 కోట్ల నిధులు సేకరించారు. ఆమె 800 మందికి జీతాలు చెల్లిస్తున్నారు. ఆగస్టులో ఆమె 337 కోట్లు ఖర్చుపెట్టగా రూ. 404 కోట్ల నిధులు సేకరించారు. ఫలితాన్ని సవాల్ చేసే హక్కుంది: ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తాను గెలిస్తేనే ఫలితాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తానని ట్రంప్ చెప్పారు. ‘ఎన్నికల ఫలితం ప్రశ్నార్థకమైనప్పుడు దానిని సవాల్ చేసే హక్కు తనకు ఉంటుందన్నారు. అక్రమ వలసదారులు డ్రైవింగ్ లెసైన్స్ కలిగివుంటే ఎన్నికల్లో ఓటు వే యొచ్చని హిల్లరీ శిబిరం పేర్కొన్నట్లు వికీలీక్స్ చెప్తోందన్నారు. ట్రంప్‌పై ఆగని ఆరోపణలు 18 ఏళ్ల క్రితం ట్రంప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ యోగా శిక్ష కురాలు కరెనా వర్జినియా ఆరోపించారు. 1998లో యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ స్టేడియం వెలుపల తనను గట్టిగా లాగి ఛాతిపై చేయి వేశాడన్నారు. -
ట్రంప్ నోట మళ్లీ ‘హెచ్1బీ’
ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎక్కుపెట్టిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వాషింగ్టన్: హెచ్1బీ వీసాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలో మళ్లీ ప్రచారాస్త్రంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వీటిని తెరపైకి తెస్తున్నారు. వర్క్ వీసాల పేరుతో కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను దిగుమతి చేసుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా తల్లుల్లో చాలా మంది తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోనని ఆందోళనపడుతున్నారని, కాలేజీ విద్యార్థులకు అతిపెద్ద ముప్పు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలేనని పేర్కొన్నారు. హెచ్1బీ వీసాలతో చాలా కంపెనీలు తక్కువ వేతనానికే విదేశీయులను దిగుమతి చేసుకుని కాలేజీల్లో చదువుతున్న అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. హెచ్1బీ వీసాలను ఎక్కువగా ఐటీ రంగం వారే దక్కించుకుంటున్నారని, వారిలో ఎక్కువ మంది భారతీయులేనన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందిస్తూ.. వాస్తవానికి తానే బాధితుణ్నని, తనపై డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ కుట్రపన్నారని ఆరోపించారు. మహిళలపై ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను క్షమించలేమని దేశాధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషల్ పేర్కొన్నారు. హిల్లరీకే 72 శాతం ముస్లింల మద్దతు! ప్రతి పదిమంది అమెరికన్ ముస్లింలలో ఏడుగురు హిల్లరీకే ఓటేస్తామని చెప్పినట్లు ఓ సర్వేలో తేలింది. -
అమెరికా, రష్యా కలిసి పోరాడితే మేలు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీల మధ్య జరిగిన రెండో డిబేట్లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా, అమెరికాలు కలిసి ఐసీస్‌పై పోరాటం చేస్తే బాగుంటుందని ట్రంప్ అన్నారు. ఓవైపు అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుందని హిల్లరీ ఆరోపించగా.. రష్యాతో కలిసి పోరాటం చేయాలని ట్రంప్ పేర్కొనడం విశేషం. ప్రస్తుతం అమెరికా విదేశాంగ విధానం ఏమాత్రం బాగాలేదని, అమెరికాను హిల్లరీ బలహీనపరిచారని ట్రంప్ ఆరోపించారు ట్రంప్ రష్యా అనుకూల విధానాలను అవలంభిస్తున్నారని విమర్శిస్తూ వస్తున్న హిల్లరీ.. డిబేట్లో పుతిన్ ట్రంప్‌ను ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ రష్యాతోగాని, పుతిన్తోగాని తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రతిదానికి రష్యాను నిందించడం సరికాదని తెలిపిన ట్రంప్.. ఐసీస్‌పై పోరాటంలో ఆదేశంతో కలిసి పనిచేస్తే బాగుంటుందన్నారు. హిల్లరీ మాత్రం ఐసీస్‌ను తుదముట్టించడం రష్యాకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. -
రెండో డిబేట్లో మాటల యుద్ధం
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ రెండో డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మహిళలపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిల్లరీ ఎండగట్టారు. ట్రంప్ వ్యక్తిత్వమేంటో ఆడియోటేపుల్లో బయటపడిందని.. అధ్యక్ష పదవికి ట్రంప్ తగినవ్యక్తి కాదని హిల్లరీ అన్నారు. అయితే.. మహిళలను తానెప్పుడూ కించపరచలేదని.. వారిపట్ల తనకెంతో గౌరవం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆడియో టేపుల్లో బయటపడిన వ్యవహారాన్ని ప్రైవేటు సంభాషణగా చూడాలన్న ట్రంప్.. తాను చేసిన వ్యాఖ్యల పట్ల అమెరికా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు మహిళలను కించపరిచింది హిల్లరీ భర్త బిల్ క్లింటన్ అంటూ ట్రంప్ ఎదురుదాడికి దిగారు. అధికార వ్యవహారాలకు వ్యక్తిగత మెయిల్‌ను వాడిన విషయంలో హిల్లరీ క్షమాపణలు చెప్పాలని.. 33 వేల ఈమెయిల్స్‌ను ఆమె ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రంప్ అన్నారు. ఈమెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ జైల్లో ఉండాలని.. తాను గెలిస్తే ఈ విషయంలో విచారణ జరిపిస్తానని ట్రంప్ అన్నారు. అయితే ఈమెయిల్స్ వ్యవహారంలో ఎప్పుడో తన తప్పును అంగీకరించానని హిల్లరీ అన్నారు. ముస్లింలను అవమానించడం సరికాదని.. అమెరికా అందరికి స్వాగతం పలుకుతుందని హిల్లరీ అన్నారు. అమెరికన్లు ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుందని.. పుతిన్ ట్రంప్‌ను ఎందుకు సమర్ధిస్తున్నారని హిల్లరీ ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. హిల్లరీకి ప్రతిదానికి రష్యాను నిందించడం అలవాటైపోయిందన్నారు. తనకు రష్యాతో గానీ.. పుతిన్‌తో గానీ ఎలాంటి సంబంధాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వస్తే పన్నులను కనిష్ట స్థాయికి తీసుకోస్తానని ట్రంప్ అన్నారు. -
ట్రంప్ గెలిస్తే దేశం విడిచిపోతా: ఫ్రీడ్‌లాండర్
పారిస్: పులిట్జర్ అవార్డు గ్రహీత, చరిత్రకారుడు, రచయిత సాల్ ఫ్రీడ్‌లాండర్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే తాను అమెరికా వదలివెళ్లిపోతానన్నారు. ట్రంప్ ఓ ప్రమాదకర పిచ్చోడన్నారు. ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అందుకు కారణం హిల్లరీ వైఖరే కారణమన్నారు. హిల్లరీ కొన్ని విషయాల్లో వాస్తవాలు దాస్తున్నారన్నారు. ట్రంప్ విషయానికొస్తే..అతని ఆదాయ పన్ను వివరాల్ని వెల్లడించకపోయినప్పటికీ నిజాయితీ పరుడిగా ప్రజలకు కన్పిస్తున్నాడన్నారు. -
ఆ వ్యాఖ్యలతో తీవ్రవాదులకు లాభం: హిల్లరీ
లాస్ ఏంజల్స్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ నామినీ హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిమ్మీ కిమ్మెల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. అసలు అధ్యక్ష పదవి రేసులో తన ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ కాకుండా.. అర్హత కలిగిన వేరే వ్యక్తి పోటీలో ఉంటే బాగుండేదని భావిస్తున్నట్లు హిల్లరీ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రవాదులకు ఉపయోగపడేలా ఉన్నాయని ఆమె విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రవాదులకు ఒక సందర్భాన్ని ఇచ్చినట్లు అవుతోందని.. ఇవి పరోక్షంగా వారికి ఉపయోగపడుతాయని హిల్లరీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తగినన్ని ఆధారాలు సైతం ఉన్నాయని ఆమె తెలిపారు. హిల్లరీ క్లింటన్, బరాక్ ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను తయారుచేశారన్న ట్రంప్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ట్రంప్ నోటి నుంచి ఈ మాటలు చాలాసార్లు విన్నామని, అయితే అవి పిచ్చిమాటలని కొట్టిపారేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు సైతం ప్రమాదకరమైనవని హిల్లరీ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజలు కూడా తనను సపోర్ట్ చేస్తున్నారని, లేఖలు రాస్తున్నారని హిల్లరీ వెల్లడించారు. -
ఇక మంచివాడిని కాను: ట్రంప్
హిల్లరీ తనకు అభినందనలు చెప్పలేదంటూ ధ్వజం వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విషయంలో తాను ఇక ఏమాత్రం ‘మంచి మనిషి’గా వ్యవహరించబోనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కొలరాడోలో శుక్రవారం జరిగిన పార్టీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఈ పోరులో ఇక నిర్దయగా వ్యవహరిస్తానన్నారు. హిల్లరీ గురువారం పార్టీ జాతీయ సదస్సులో చేసిన ప్రసంగంలో.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందినందుకు తనకు అభినందనలు చెప్పకపోవటాన్ని తప్పుపడుతూ ఆమె గొంతును అనుకరించి ఎద్దేవా చేశారు. ట్రంప్ మరో సభలో మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేసిన డెమోక్రటిక్ నేతలకు దిమ్మతిరిగిపోయేలా బుద్ధి చెప్తానన్నారు. హిల్లరీకి నిర్ణయం తీసుకోవటం రాదంటూ.. జాతీయ భద్రతపై అధికారిక సమాచారం చెప్పొద్దని ఆ తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. పార్టీ జాతీయ సదస్సులో హిల్లరీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కునుకుతీస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ.. ఆమె ‘అబద్ధాలతో బిల్ కూడా విసిగిపోయార’ని విమర్శించారు. కాగా పార్టీ నామినేషన్లను స్వీకరిస్తూ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని 3.22 కోట్ల మంది, హిల్లరీ చేసిన ప్రసంగాన్ని 2.98 కోట్ల మంది టీవీల్లో చూశారని ఓ సర్వేలో తేలింది. -
హిల్లరీకి భారత నేతల నుంచి డబ్బులు: ట్రంప్
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై మళ్లీ ఆరోపణలు గుప్పించారు. ఆమె భారత్-అమెరికా పౌర అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేసేందుకు భారత రాజకీయ నేతలు, సంస్థల నుంచి చందాలు తీసుకున్నారని ఆరోపించారు. అణు ఒప్పందానికి 2008కి పూర్వం భారత రాజకీయవేత్త అమర్ సింగ్ క్లింటన్ ఫౌండేషన్‌కు మిలియన్ నుంచి 5 మిలియన్ల డాలర్లు విరాళంగా ఇచ్చారని, సీఐఐ 1 మిలియన్ డాలర్లు ఇచ్చిందని ఆరోపించారు. తెరపైకి ‘టెగ్జిట్’! న్యూయార్క్: అమెరికా నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తున్న టెక్సాస్ రాష్ట్రం ‘బ్రెగ్జిట్’ నేపథ్యంలో ‘టెగ్జిట్’ను ఉధృతం చేసింది. ‘1836 నుంచి 1845 వరకు స్వతంత్రదేశంగా ఉన్న టెక్సాస్ ఆర్థిక పరిమాణం 1.6 లక్షల కోట్ల డాలర్లు. సంపన్న టెక్సాస్ అమెరికా నుంచి విడిపోవాల్సిందే’ అని రాష్ట్ర నేత మిల్లర్ తెలిపారు. -
'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు'
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు మంచి నిర్ణయం అని కితాబిచ్చిన ట్రంప్‌పై హిల్లరీ బృందం తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాదన్న విషయాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయని హిల్లరీ సినియర్ పాలసీ ఆడ్వైజర్ జాక్ సుల్లివాన్ మండిపడ్డారు. పౌండ్ విలువ పతనం కావడం అనేది ట్రంప్ గోల్ఫ్ బిజినెస్‌కు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టే ట్రంప్ 'బ్రెగ్జిట్' నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చారని ఆయన విమర్శించారు. 'ట్రంప్ ఎల్లప్పుడూ ప్రపంచదేశాల మిత్రుత్వం, భాగస్వామ్యాల పట్ల అలక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ బలహీన, సురక్షితం కాని, ఆత్మవిశ్వాసం లోపించిన అమెరికా గురించి ఆయన మాట్లాడుతారు. ట్రంప్ స్వభావం అమెరికా అధ్యక్ష పదవికి పనికిరాదు' అని జాక్ విమర్శించారు. -
హిల్లరీ బోరింగ్ స్పీకర్..!
కాలిఫోర్నియా: ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో మరోసారి ట్రంప్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వేలమంది గుమిగూడిన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ దేశంలో భారీ కరువు పరిస్థితులు నెలకొననుందనే వార్తలను ట్రంప్ కొట్టి పారేశారు. తాను దేశాధ్యక్షడు అయ్యాక నీటి కరువు తీరిపోతుందంటూ హామీ ఇచ్చారు. అనంతరం ట్రంప్ హిల్లరీ క్లింటనపై తన దాడిని కొనసాగించారు. ఆమె చాలా బోరింగ్ స్పీకర్ అని, అస్పలు వినలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలకోరు .. క్రూకెడ్ హిల్లరీ అని అంటూనే ఇంతకు మించి వ్యక్తిగతంగా , ఏమీ వ్యాఖ్యానించలేనన్నారు. ఇది రాజకీయంగా సరైన కాదని పేర్కొన్నారు. ఆమె అన్నీ తప్పుడు విషయాలు, అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. హిల్లరీ ఆరోపించినట్టు తనకు నియంతల మీద ప్రేమ లేదన్నారు. ఈ సందర్భంగా నాటో దేశాలపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. తాను అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తరువాత వ్యాపారంలో, సైన్యంలో విజయాల పరంపర మొదలు కాబోతోందన్నారు. ఇప్పటివరకూ ఓడించలేకపోయిన ఐఎస్ఎస్ ను ఓడించబోతున్నామన్నారు. దేశం ఏదైనా విజయం మనదే, మన దేశాన్ని మళ్లీ పునర్నిర్మిచుబోతున్నాం అంటూ చేసిన ప్రసంగానికి చప్పట్లు మారు మోగాయి. జూన్ 7న ప్రైమరీ ఎన్నికలు జరగనుండటంతో ప్రచారం నిమిత్తం శాండియాగోకు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అక్కడ ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీ మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకులకు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఇటీవల అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు బోర్డర్ గోడ కట్టనున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు అక్కడివారిలో ఆగ్రహాన్ని రగిలించాయి. మెక్సికో బోర్డర్ సమీపంలో ఆ ప్రాంతం ఉన్న కారణంగా ఆందోళనకారులు ట్రంప్ ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. వాటర్ బాటిళ్లు, కోడిగుడ్లు విసురుకున్నారు. ట్రంప్ గో హోమ్ అనే నినాదాలు మిన్నంటాయి. దీంతో పెప్పర్ స్ప్రే ప్రయోగించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు. ఫ్రెస్నో నగరంలో ర్యాలీ చాలా జరిగిందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అటు శాన్ డియాగో పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్విట్లు చేశారు. ర్యాలీ ని చెడగొట్టడానికి చూసిన సందర్భంలో సమస్యను చాలా ప్రశాంతంగా చక్కదిద్దారని కొనియాడారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. -
ట్రంపే రిపబ్లికన్ అభ్యర్థి!
♦ ఇండియానాలో గెల్చిన ట్రంప్, ఓడిన హిల్లరీ ♦ రిపబ్లికన్ రేసు నుంచి తప్పుకొన్న క్రుజ్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. ప్రైమరీ రేసులో మాత్రం అనూహ్యంగా ముందుకెళ్తున్నారు. మంగళవారం ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. ఇండియానాలో ఓటమి పాలైన టెడ్ క్రుజ్ రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. బలమైన ప్రత్యర్థి అయిన క్రుజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి ట్రంప్‌కు మార్గం సులువైంది. రేసులో ఇంకా ఓహియో గవర్నర్ కాసిచ్ ఉన్నప్పటికీ ఆయన ట్రంప్‌కు పోటీగా నిలిచే పరిస్థితి లేదు. అయితే జూన్ నెల వరకు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పుడే అధికారిక ప్రకటన వెలువడుతుంది. తాజా విజయంతో 1,047 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. మేజిక్ నంబర్‌కు చేరుకోవాలంటే మరో 190 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఒకప్పటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు, ఇండియన్ అమెరికన్ బాబీ జిందాల్ ట్రంప్‌కే తన ఓటు అని ప్రకటించారు. హిల్లరీ నామినేషన్ ఆశలు పదిలం మరోవైపు డెమోక్రాటిక్ అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న హిల్లరీ.. ఇండియానాలో ఆమె ప్రత్యర్థి బెర్న్ శాండర్స్ చేతిలో ఓటమి పాలయ్యారు. రేసులో బాగా వెనుకంజలో ఉన్న శాండర్స్ ఈ విజయం సాధించినా హిల్లరీ డెమోక్రాటిక్ నామినేషన్‌కు ఢోకా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మోదీని అధిగమించిన ప్రియాంకా చోప్రా
న్యూయార్క్ః బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన ప్రియాంకా చోప్రా ఆన్ లైన్ పోల్ లో ప్రధాని మోదీని దాటేశారు. టైమ్ మ్యాగజిన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఒక శాతం అధిక ఓట్లను సాధించి భారత్ ప్రధానినే మించిపోయారు. ప్రపంచంలోని వందమంది మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్స్ ను ప్రచురించే టైమ్స్ పత్రిక నిర్వహించిన పోల్ లో ప్రధాని మోదీకంటే ముందంజలో ఉన్నారు. టైమ్స్ మ్యాగజిన్ ప్రతి సంవత్సరం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈసారి నిర్వహించిన పోల్ లో ప్రభావవంతమైన ప్రముఖులు వందమందిలో ప్రియాంకా చోప్రా భారత ప్రధాని మోదీని మించిపోయారు. దీంతోపాటు డెమొక్రెటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడ ఈసారి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ తో పాటు అధ్యక్షుడు బారాక్ ఒబామా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు పాకిస్తాన్ కార్యకర్త మలాలాను కూడ మూడు రెట్ల ఓట్లతో అధిగమించినట్లు టైమ్స్ తెలిపింది. అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాకోసం మ్యాగజిన్ ఏప్రిల్ 13 బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన జాబితా వెలువడనుంది. అయితే అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా' లో నటించి తన పాత్రతో మెప్పించిన ప్రియాంకా చోప్రా మోదీకి వచ్చిన 0.7 ఓట్ల కంటే ఒక శాతం అధికంగా 0.8 ఓట్లను పొంది ముందు వరుసలో నిలిచింది. అలాగే 1 శాతం ఓట్లను పొందిన క్లింటన్ కన్నా శాండర్స్ 3.3 శాతం అధిక ఓట్లను సాధించారు. ఇకపోతే శాండర్స్ తర్వాత సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలవగా అత్యధిక వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రజల దృష్టిలో ముందు కనిపిస్తున్న ట్రంప్ మాత్రం 0.6 శాతం ఓట్ల ను సాధించి ఆన్ లైన్ పోల్‌లో పూర్తిగా వెనుకబడ్డారు. -
ట్రంప్ దూకుడు.. హిల్లరీకి షాక్
డెట్రాయిట్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. మిస్సిసిపిలో జరిగిన ప్రైమరీల్లో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని కూడా తట్టుకుని ట్రంప్ 50% మంది రిపబ్లికన్ల మద్దతు సాధించారు. డెమొక్రాట్ల విషయానికొస్తే.. మిచిగాన్‌లో హిల్లరీ క్లింటన్ (48శాతం ఓట్లు) ఓడిపోగా.. 50శాతం ఓట్లతో శాండర్స్ విజయం సాధించారు. -
ట్రంప్, హిల్లరీలకు టఫ్ ఫైట్
* గట్టి సవాల్ విసురుతున్న క్రూజ్, శాండర్స్ * ఉత్కంఠగా సాగిన సూపర్ సాటర్డే పోల్స్ బాటన్ రోగ్(లూసియానా): అమెరికా అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. డెమొక్రాటిక్ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న హిల్లరీ, రిపబ్లికన్ పార్టీ తరఫున ముందంజలో ఉన్న ట్రంప్‌లకు గట్టి సవాల్ ఎదురవుతోంది. లూసియానా రాష్ట్రంలో జరిగిన ‘సూపర్ సాటర్డే’ పోల్స్‌లో ట్రంప్, హిల్లరీలకు క్రూజ్, శాండర్స్ షాక్ ఇచ్చారు. వీరు కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించడం ద్వారా రేసులోకి వచ్చారు. అయితే క్రూజ్, శాండర్స్ విజయం సాధించినా.. ట్రంప్, హిల్లరీలు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సూపర్ సాటర్ డే పోల్స్‌లో కాన్సస్, నెబ్రాస్కల్లో శాండర్స్ గెలిచారు. లూసియానాలో హిల్లరీ గెలిచారు. ఇక రిపబ్లికన్ల విషయానికి వస్తే కాన్సస్, మైన్ రాష్ట్రాల్లో క్రూజ్ గెలిచారు. లూసియానా, కెంటకీ రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. తాను క్రూజ్‌తో నేరుగా తలపడాలనుకుంటున్నానని, అందువల్ల రుబియో రేసు నుంచి తప్పుకోవాలని, తాను క్రూజ్‌పై విజయం సాధిస్తానని ట్రంప్ చెప్పారు. క్రూజ్ మాట్లాడుతూ.. ట్రంప్‌ను అడ్డుకోగలిగిన సత్తా తనకు మాత్రమే ఉందని, మిగతా అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే తనకు గెలుపు సులభమవుతుందని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ 385 డెలిగేట్ల ఓట్లు సాధించగా.. క్రూజ్ 298 ఓట్లు, రుబియో 126 ఓట్లు సాధించారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కాలంటే కనీసం 1,237 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక డెమొక్రాట్ల విషయానికి వస్తే ఇప్పటికే హిల్లరీ క్లింటన్ 1,131 డెలిగేట్ల ఓట్లు సాధించగా శాండర్స్‌కు 479 ఓట్లు మాత్రమే వచ్చాయి. నామినేషన్ దక్కాలంటే కనీసం 2,383 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.