జన విజేత హిల్లరీయే..!
తాజాగా ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఇదే రీతిలో ఉన్నారుు. ఎన్నికల్లో అధికారికంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గెలిచారు. మొత్తం 538 ఎలొక్టరల్ కాలేజీ ఓట్లలో మేజిక్ ఫిగర్ 270 అరుుతే.. ట్రంప్‌కు 306 ఓట్లు లభించారుు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి కేవలం 232 ఎలొక్టరల్ కాలేజీ ఓట్లే దక్కారుు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం.. 6.34 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు హిల్లరీకి ఓటేస్తే.. ట్రంప్‌కు ఓటు వేసిన వారి సంఖ్య 6.12 కోట్ల వరకూ ఉండొచ్చు.
మొత్తంగా ట్రంప్ కన్నా హిల్లరీకి 1.5 శాతం ఓట్ల ఆధిక్యం ఉంది. హిల్లరీకి లభించినన్ని ఓట్లు అమెరికా చరిత్రలో బరాక్ ఒబామాకు (2008, 2012 ఎన్నికల్లో) తర్వాత మరే అధ్యక్ష అభ్యర్థికీ రాలేదని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన అమెరికన్ల సంఖ్య 2012 లో ఓటు హక్కు వినియోగించుకున్న 12.9 కోట్ల మందిని దాటి పోరుుందని తాజా అంచనా.