తెరపైకి కాలెగ్జిట్!
లాస్ ఏంజిలస్: అమెరికాలో చాలా కాలంగా ఉన్న కాలెగ్జిట్ (అమెరికా నుంచి కాలిఫోర్నియా ఎగ్జిట్) డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో కాలెగ్జిట్ జోరు కనిపించినా తర్వాత నెమ్మదించింది. అరుుతే.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవటంతో దీన్ని జీర్ణించుకోలేని కాలిఫోర్నియా ప్రజలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. అమెరికా నుంచి విడిపోవాలనే డిమాండ్‌తో రోడ్డెక్కారు. డెమొక్రాట్లకు బలమున్న ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం, గన్ కల్చర్, గే హక్కుల కోసం ఉద్యమాలూ ఎక్కువే. హిల్లరీఅధ్యక్ష ఎన్నికల్లో ఓడినా కాలిఫోర్నియాలో భారీ మెజారిటీతో గెలుపొందారు.
దీంతో ట్రంప్ విజయాన్ని ఒప్పుకోని కాలిఫోర్నియా వాసులు.. ఫలితాలు వచ్చినప్పటినుంచి కాలెగ్జిట్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొందరైతే ‘నాట్ మై ప్రెసిడెంట్’ అంటూ పోస్టులు చేస్తున్నారు. ‘మేం ఇకపై అమెరికన్‌స కాము, కాలిఫోర్నియన్‌సమే’ అంటూ రోడ్లపై నినాదాలు చేస్తున్నారు.ట్రంప్‌పై అసంతృప్తితోనే ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రాజకీయ నిపుణులంటున్నారు. ట్రంప్ స్పందిస్తూ.. మీడియా చిన్న విషయాన్ని ఎక్కువగా చూపిస్తుందని విమర్శించారు.