
సాక్షి, వాషింగ్టన్: అమెరికా అడవులలో రాజుకున్న అగ్ని రోజురోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి 35 మందికి పైగా ప్రాణాలు కోల్పొయిన సంగతి తెలిసిందే. దీని గురించి విపక్షాలు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించాయి. తన ప్రచారంలో ఎక్కడా కాలిఫోర్నియా ఫైర్ గురించి మాట్లాడలేదని నిలదీశాయి. దీంతో ట్రంప్ స్పందించారు. మంటలు అనేది వాతావరణానికి సంబంధించిన విషయం కాదని, మేనేజ్‌మెంట్కు సంబంధించిన విషయం అని ట్రంప్ పేర్కన్నారు. త్వరలోనే మంటలు చల్లబడతాయని తెలిపారు.
మంటలపై విపక్షాలు ప్రశ్నించగా ఆయన ఫైర్ ఫైటర్స్‌ని కలిశారు. వాతావారణ మార్పే దీనికి కారణమా అని ఒక రిపోర్టర్ ట్రంప్‌ని ప్రశ్నించగా వేరే దేశాలకు ఈ సమస్య లేదని, ఆ దేశాలలో తొందరగా మంటలు అంటుకునే చెట్లు ఉన్నాయని, కానీ వారు అలాంటి సమస్యలు ఎదరుర్కోవడంలేదని ట్రంప్ తెలిపారు. అందుకే ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన మార్పు కాదు, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విషయం అని తెలిపారు. త్వరలోనే మంటలు చల్లబడతాయి మీరే చూడండి అని ట్రంప్ తెలిపారు. ఆ విషయం సైన్స్‌కు సంబంధించిన విషయం కాదని తాను అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment