హిల్లరీకి భారత నేతల నుంచి డబ్బులు: ట్రంప్
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై మళ్లీ ఆరోపణలు గుప్పించారు. ఆమె భారత్-అమెరికా పౌర అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేసేందుకు భారత రాజకీయ నేతలు, సంస్థల నుంచి చందాలు తీసుకున్నారని ఆరోపించారు. అణు ఒప్పందానికి 2008కి పూర్వం భారత రాజకీయవేత్త అమర్ సింగ్ క్లింటన్ ఫౌండేషన్‌కు మిలియన్ నుంచి 5 మిలియన్ల డాలర్లు విరాళంగా ఇచ్చారని, సీఐఐ 1 మిలియన్ డాలర్లు ఇచ్చిందని ఆరోపించారు.
తెరపైకి ‘టెగ్జిట్’!
న్యూయార్క్: అమెరికా నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తున్న టెక్సాస్ రాష్ట్రం ‘బ్రెగ్జిట్’ నేపథ్యంలో ‘టెగ్జిట్’ను ఉధృతం చేసింది. ‘1836 నుంచి 1845 వరకు స్వతంత్రదేశంగా ఉన్న టెక్సాస్ ఆర్థిక పరిమాణం 1.6 లక్షల కోట్ల డాలర్లు. సంపన్న టెక్సాస్ అమెరికా నుంచి విడిపోవాల్సిందే’ అని రాష్ట్ర నేత మిల్లర్ తెలిపారు.