ఎన్నికల రోజే ట్రంప్ విజయోత్సవ వేడుక! | Trump Victory Celebration in the election day itself | Sakshi
Sakshi News home page

ఎన్నికల రోజే ట్రంప్ విజయోత్సవ వేడుక!

Published Fri, Nov 4 2016 1:55 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ఎన్నికల రోజే ట్రంప్ విజయోత్సవ వేడుక! - Sakshi

ఎన్నికల రోజే ట్రంప్ విజయోత్సవ వేడుక!

న్యూయార్క్: తాజా సర్వేలతోపాటు ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంపికవటం ఖాయంగా కనబడుతోందని.. ఈయన ప్రచార బాధ్యతలు చూస్తున్న వారంటున్నారు. అధ్యక్ష ఎన్నిక జరగనున్న నవంబర్ 8 రాత్రి ట్రంప్.. తన మిత్రులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారుల కోసం భారీ ‘విజయోత్సవ వేడుక’ నిర్వహించనున్నారని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. మన్‌హటన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఈ పార్టీ ఉంటుందన్నారు.

అటు హిల్లరీ కూడా ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నా.. ఇది విజయోత్సవ వేడుకగా కాకుండా తన మద్దతుదారులకు సందేశాన్నిచ్చేందుకు మాత్రమే ఉద్దేశించినట్లు తెలిసింది. కాగా, న్యూయార్క్ టైమ్స్/సీబీఎస్ సర్వేలో ట్రంప్‌కు 42 శాతం, హిల్లరీకి 45 శాతం ఓటర్ల మద్దతు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement