beats
-
నిమ్మకాయ, పచ్చిపసుపుతో సిద్ధు భార్య కేన్సర్ ఖతం: నిపుణుల హెచ్చరికలివే!
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల కీలక విషయాన్ని ప్రకటించిన సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 కేన్సర్‌ని విజయవంతంగా ఓడించిందని మీడియా సమావేశంలో ప్రకటించారు. కేవలం వైద్యులమీదే ఆధారపడకుండా కొన్ని ప్రత్యేక మైన చికిత్సా పద్దతులను అవలంబించామని క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి,ఆయుర్వేద పద్ధతులు, ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్-4 కేన్సర్‌నుంచి బయటపడినట్టు వెల్లడించారు. ముఖ్యంగా నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి వాటి ద్వారా కేన్సర్ మహమ్మారిని జయించినట్టు ప్రకటించడం చర్చకు దారి తీసింది. మరి కేవలం స్ట్రిక్ట్ డైట్ మాత్రమే క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?కొన్నాళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన నవజ్యోత్ కౌర్ చికిత్స తీసుకుంది. తగ్గిపోయిందని అనుకున్నారు. కానీ కుమారుడి పెళ్లి తర్వాత స్టేజ్-3 రూపంలో తీవ్రంగా మళ్లీ వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం లేదు సరికదా మరింత ముదిరింది. కేవలం 5 శాతం మాత్రమే చాన్స్ ఉందని, కోలుకోవడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. కానీ కఠినమైన ఆహార నియమాలు, జీవన శైలి మార్పులతో ఆమె క్యాన్సర్‌ను ఓడించిందని, అయితే ఇది దగ్గర డబ్బు ఉన్నందున కాదు, క్రమశిక్షణ, ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు సిద్దూ. ఆమె ఇపుడు వైద్యపరంగా కేన్సర్‌ను ఓడించిందని సిద్దూ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉపవాసం ప్రాముఖ్యత, చక్కెర , కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కేన్సర్‌ను దూరం చేస్తుందన్నారు. ఆమె తన రోజును నిమ్మరసంతో ప్రారంభించేదని, పచ్చి పసుపు తినేదని, ఆపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి లాంటి తీసుకునేదన్నారు. ఇంకా సిట్రస్ పండ్లు,గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేవన్నారు.My wife is clinically cancer free today ….. pic.twitter.com/x06lExML82— Navjot Singh Sidhu (@sherryontopp) November 21, 2024అందరికీ వర్తించదు: నిపుణుల హెచ్చరిక కేన్సర్ చికిత్సలో పోషకాహార పాత్ర కీలకమైనదే, కానీ అది మాత్రమే రికవరీకి ఆహారం మాత్రమే సరిపోదని హెచ్చరిస్తున్నారు. వ్యాధినుంచి కోలుకోవడానికి ఆహారం గణనీయంగా తోడ్పడుతుంది. కానీ కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స వంటి సాంప్రదాయ చికిత్సలకు ఎంతమాత్రం సరిపోదు. కేన్సర్ బహు ముఖమైంది. తీవ్రతను బట్టి, కేన్సర్ కణాలను నాశనం చేయడానికి పలు చికిత్సల కలయిక అవసరం అంటున్నారు వైద్య నిపుణులుఅలాగే ఉపవాసం కేన్సర్ రోగులకు ఉపవాసం అస్సలు పనికిరాదని, కేన్సర్ రోగులను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, లేదా ఉపవాసంలో ఉంచడం నేరమంటున్నారు మరికొందరు నిపుణులు. ఇది కోలుకోవడానికి అవసరమైన పోషకాహారాన్ని నిరోధిస్తుందన్నారు.తక్కువ-గ్లైసెమిక్ డైట్, న్యూట్రాస్యూటికల్స్ గ్లూకోజ్-ఆధారిత కేన్సర్లలో చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలవని డాక్టర్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే అందరికీ ఇది వర్తించదన్నారు. కేన్సర్ రకం, దశ ఆధారంగా, జీవక్రియ అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆహార ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా రోగులు ఆంకాలజిస్టులు, డైటీషియన్ల సలహాలను తీసుకోవాలని డాక్టర్ మల్హోత్రా జోడించారు.కేన్సర్‌నుంచి బయటపడాలంటే.. తొలి దశలోనే గుర్తించడం,కేన్సర్ రకం, లక్షణాలతో పాటు అత్యాధునిక చికిత్స, రోగి విల్ పవర్, ఆహార నియమాలు, రోగి శారీరక, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల సహకారం, మద్దతు ఇవన్నీ కీలకమైనవి. -
బాటిల్ కోసం వ్యక్తిని చెప్పుతో కొట్టిన పాపులర్ సింగర్.. వీడియో వైరల్
ఒక్కోసారి సెలెబ్రెటీలు వింతగా ప్రవర్తిస్తుంటారు. కోపం వస్తే తమ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. చిన్న చిన్న వాటికి సిబ్బందిపై చేయి చేసుకుంటారు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీఖాన్.. ఓ బాటిల్ కోసం తన శిష్యుణ్ని చెప్పుతో కొట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఎక్స్(ట్విటర్)లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన పాపులర్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ గురించి తెలిసిందే. పాకిస్తాన్లో కాకుండా ఆయనకు భారత్‌లో సైతం అభిమానులు ఉన్నారు. అనేక హిందీ సినిమాలకు ఆయన పాటలను ఆలపించాడు. తాజాగా ఆయన ఇంట్లో పవిత్ర జలానికి సంబంధించిన బాటిల్ కనిపించకుండా పోయిందట. (చదవండి: ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ‘గురూజీ’కి బన్నీ షాక్!) దానికి కారణంగా శిష్యుడే కావడంతో అతన్ని బూతులు తిడుతూ.. చెప్పుతో కొట్టాడు. అతని జట్టు పట్టుకొని లాగుతూ నేలపై కూర్చోబెట్టి ‘నా బాటిల్ ఎక్కడ’ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ దారుణంగా కొట్టాడు. తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. చివరకు ఇతర సిబ్బంధి వచ్చి అతన్ని నిలువరించారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ అయింది. సింగర్ చర్యపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బాటిల్ కోసం అతన్ని అంతలా చితక్కొట్టాలా? ఎంత పెద్ద సెలెబ్రెటీ అయినా..ఇలా చేయడం మంచిది కాదంటూ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ని ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పిన అలీఖాన్ చెప్పుతో కొడుతున్న వీడియో వైరల్ కావడంతో అలీఖాన్ ఈ ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఇది గురు, శిష్యుల మధ్య జరిగిన విషయమని, స్టూడెంట్ తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని చూడాలని విజ్ఞప్తి చేశాడు. బాధితుడు తన శిష్యుడే అయినప్పటికీ.. అలా కొట్టడం తప్పేనని క్షమాపణలు చెప్పాడు. ఇదే వీడియోలో బాధితుడు మాట్లాడుతూ.. పవిత్ర జలానికి సంబంధించిన బాటిల్ కనిపించకుండా పోవడానికి తానే కారణమని.. అందుకే అలీఖాన్ దండించారని తెలిపారు. అలీఖాన్ తనకు తండ్రిలాంటి వాడని, తనను ప్రేమగా చూసుకుంటాడని చెప్పారు. కోపంలో ఆయన తనను కొట్టాడని.. అంతకు మించి దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదన్నాడు. తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్ చేశారని బాధితుడు చెప్పడం గమనార్హం. Famous singer Rahat Fateh Ali khan beating his servent for bottle of Alcohol pic.twitter.com/9DZwYxgPmV — Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024 Update : Rahat Fateh Ali Khan ( @RFAKWorld )issued a clarification regarding his viral video, There was holy water in the bottle pic.twitter.com/oIStHwWXFp — Ghulam Abbas Shah (@ghulamabbasshah) January 27, 2024 -
భారత్‌దే ఆసియా కప్.. ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం
సలాలా (ఒమన్): ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన ఫైనల్లో 2–1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు అలీ బషారత్ (38వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్ నెగ్గడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2004, 2008, 2015లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్‌తో ఆసియా కప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. ఆసియా కప్ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. తాజా టోర్నీలో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి... కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారం ప్రకటించారు. -
మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార్చినా.. ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున్న మహాలక్ష్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే... -
అంచనాలను అందుకున్న సిప్లా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికానికి (202–23లో క్యూ2) బలమైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.797 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.709 కోట్లుగా ఉంది. దేశీయ, యూఎస్ మార్కెట్లలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయంతో పోలిస్తే రూ.5,520 కోట్ల నుంచి రూ.5,829 కోట్లకుపెరిగింది. భారత్‌లో ఉన్న అమెరికా వ్యాపారాన్ని బదలాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క్యూ2 ఫలితాలపై సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమంగ్ వోహ్రా మాట్లాడారు. యూఎస్ మార్కెట్లో వివిధ పోర్ట్‌ఫోలియోల పరంగా అమలు చేసిన విధానం, దేశీ మార్కెట్లో బలమైన పనితీరు ఫలితాల్లో కనిపించినట్టు చెప్పారు. దేశీ అమ్మకాల ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,563 కోట్లుగా ఉంటే, నార్త్ అమెరికా వ్యాపారం 35 శాతం పెరిగి రూ.1,432 కోట్లకు చేరింది. కలిసొచ్చిన లెనలిడోమైడ్ ముఖ్యంగా లెనలిడోమైడ్ డ్రగ్‌ను విడుదల చేయడం అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్టు ఉమంగ్ వోహ్రా తెలిపారు. వెలుపలి మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలను నమోదు చేసినట్టు వివరించారు. నిర్వహణ లాభం 22.3 శాతంగా ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలైన 21–22 శాతం పరిధిలోనే ఇది ఉన్నట్టు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడం, ధరలు పెంచడం తదితర చర్యలతో కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కంపెనీ అధిగమించింది. -
స్టడీ అవర్‌కు రాలేదని చితగ్గొట్టిన హెచ్ఎం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: స్టడీ అవర్‌కు రాలేదనే కోపం తో ఒక ప్రధానో పాధ్యా యుడు నలుగురు విద్యార్థులను కట్టెతో చితక బాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన ఆశ్రమ బాలుర హాస్టల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు స్టడీ అవర్ ఏర్పాటు చేశారు. కానీ తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, నవీన్, దీపక్, పవన్ నాయక్ రాలేదు. ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు వారిని పిలిపించారు. స్టడీ అవర్‌కు ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెత్తంతో విద్యార్థుల వీపులు, చేతులపై కొట్టడంతో వాతలు తేలాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారితో పాటు గిరిజన సంఘం నేత రమేష్ తదితరులు హాస్టల్‌కు చేరుకుని ప్రధానోపాధ్యాయుడితో గొడవకు దిగారు. దీనిపై హెచ్ఎం బుచ్చిరాములును వివరణ కోరగా విద్యార్థులు స్టడీ అవర్‌కు రాలేదని, క్రమశిక్షణతో ఉండాలనే కొట్టాను తప్ప మరో ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. -
అమానుషం! బాలికను కొట్టి, అగరబత్తులతో కాల్చి...
Exorcist was arrested in Jharkhand: ఇంకా చాలా చోట్ల మూఢనమ్మకాలను విశ్వాసించే వాళ్లు ఉన్నారు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ దర్మార్గులు చేసే అకృత్యాలకు అంతేలేదు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా మూఢనమ్మకాల పేరుతో సాగిస్తున్న హింసకు బలవుతున్నావారు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం....జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక బాలిక హోలీ ఆడిన తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ మేరకు మౌలానా ఎమ్‌డి వాహిద్ అనే భూతవైద్యుడు ఆ బాలిక భూతవైద్యం ద్వారా బాగుపడుతుందని ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఆ బాలికను అతని వద్దకు తీసుకువచ్చారు. అతను ఆ బాలికను భూత వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు ఆమెను కొట్టి, అగరబత్తీలతో కాల్చాడం వంటి అకృత్యాలను చేశాడు. దీంతో ఆ బాలిక మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత ఆ బాలికను కుటుంబ సభ్యులు చత్రలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కి తరలించారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వాహిద్ (35)ను అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్ తెలిపారు. (చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య) -
కొడుకును కొడుతున్న దృశ్యాలను .. కూతురుతో తీయించి..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు చెప్పడంతో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడికి భయం చెబుతున్నానని.. అందరికీ చూపించేందుకు సదరు వ్యక్తి తన కూతురుతోనే కొట్టే దృశ్యాలను వీడియో తీయించి, ఇరుగు పొరుగు వారికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లాల్‌దర్వాజాలోని నాగం కాంప్లెక్స్‌లో కర్ణాటక చెందిన అశోక్ ఘంటే భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి ఎనిమిదేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు పలుమార్లు చెప్పడంతో శనివారం మధ్యాహ్నం కొడుకును కర్రతో ఇష్టానుసారంగా చితకబాదాడు. వీడియోను చూసిన అతడి భార్య ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థులను కర్రలతో చితకబాదిన టీచర్లు..
సాక్షి, అనంతగిరి(విశాఖపట్నం): స్టడీ అవర్‌కు రాలేదని విద్యార్థులను చితకబాదిన ఘటన విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు సమీపంలో గ్రామం ఉండటంతో వారంతా రాత్రివేళ పడుకునే సమయంలో ఇంటికి వెళ్లి వస్తుంటారు. గురువారం వెళ్లి ఇంటికెళ్లిన విద్యార్థులు శుక్రవారం ఉదయం స్టడీ అవర్‌కు రాకపోవడంతో సోషల్ టీచర్ పీతాంబరం, పీఈటీ నాగభూషణం విద్యార్థులను కర్రలతో చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. అనంతరం విద్యార్థుల్ని పీహెచ్‌సీకి తీసుకునివెళ్లి చికిత్స చేయించారు.విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ప్రిన్సిపాల్ వేణుప్రసాద్ చెప్పారు. -
కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..
-
కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..
న్యూఢిల్లీ: కుక్కని కుక్కా అని పిలిచినందుకు చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారింది. పెద్ద గొడవకు దారితీసింది. హర్యానాలోని గురుగ్రామ్ చెందిన జ్యోతిపార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఆయితే ఆ కుక్క స్థానికుల్ని కరవడం, భయపెట్టడం చేస్తుండేది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే సుధీర్ అనే వ్యక్తి కుక్కని చైన్‌కి కట్టేయొచ్చు కదా, మా పిల్లల్ని కరుస్తోంది అని, కుక్క యజమానిని రిక్వెస్ట్ చేశాడు. అంతే మా టామీని కుక్క అని పిలుస్తావా? నీకెంత ధైర్యం అంటూ దాని యజమాని, యజమాని కుటుంబ సభ్యులు సుధీర్ కుటుంబంపై దాడికి దిగారు. రాడ్లు,కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సుధీర్ కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ఘర్షణ జరుగుతుండగా స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘర్షణ అనంతరం సుధీర్ సదరు కుక్క యజమాని మా కుటుంబసభ్యలపై దాడి చేశాడు. ఆ కుక్క మా పిల్లల్ని కరుస్తోందని యజమానికి చెప్పా. టామీని కుక్కా అని పిలుస్తావా అని కొట్టాడంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు. కాగా, గురుగ్రామ్‌లో కుక్కల వల్ల ఘర్షణ పడ్డ సంఘటనలు గతంలో చాలానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అందరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతుంటే వీళ్లు మాత్రం కుక్క గురించి తలలు పగిలేలా కొట్టుకోవడం ఏమిటోనని గురుగ్రామ్ పోలీసులు నిట్టూరుస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘర్షణపై తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అరె ఏంట్రా ఇది..కుక్కని కుక్కా అని పిలవకూడదా? అంత మాత్రనికే తలలు పగలగొట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్‌పే టాప్‌లో నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ మద్దతున్న ఫోన్‌పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్‌మార్ట్‌కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్‌తో ఉన్న ఫోన్‌పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్‌పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్‌పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్‌ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్‌పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్‌పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా సెలబ్రిటీలుగా ఉన్నవారికి భారీ క్రేజ్ ఉంటుంది. అందులోనూ వ్యాపార రంగంలో దూసుకుపోతూ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రాణిస్తోంటే.. యువత ఆసక్తి మామూలుగా ఉండదు. తాజాగా టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ బిల్ గేట్స్ దాటేయడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో ఆయనపై సోషల్‌మీడియా అంతా మంగళవారం మీమ్స్ సందడి నెలకొంది. తమాషా వ్యాఖ్యలు, క్లిప్‌లు, ఇమేజ్‌లతో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి ‘ఆడు మగాడ్రా బుజ్జా’ అన్నట్టు కమెంట్ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఇక్కడ అందిస్తున్నాం.. మీరూ సరదాగా నవ్వుకోండి. (మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్‌కు షాక్) #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Elon Musk:- pic.twitter.com/b2fhwx47ks — Raj Aditya (@chiku_9693) November 24, 2020 #ElonMusk ELON MUSK TO BILL GATES pic.twitter.com/GoDyFsgtLC — fᵣₑₑ wₐy (@T_O_freeway) November 24, 2020 #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Jeff bezos: pic.twitter.com/slamrRpdCu — Naveen Kumar (@Navikumar108) November 24, 2020 #ElonMusk becomes 2nd richest person after overtaking #BillGates Jeff Bezoz be like: pic.twitter.com/0EN0kAtdxn — Adarsh Adhar (@AdarshAdhar) November 24, 2020 #ElonMusk become 2nd richest person by surpassing #BillGates * Meanwhile Bill Gates to Elon pic.twitter.com/vuVvRk79FA — Chayan Jain (@ChayanJ20734351) November 24, 2020 -
మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్‌కు షాక్
ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ (49) అరుదైన ఘనతను సాధించారు. అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ను అధిమించి మరీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ధనవంతుడిగా దూసుకు వచ్చారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. అతని నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పుంజుకోగా, బిల్‌గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్‌కు చెందిన టెస్లా స్టాక్ సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 6.58 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 521.85 డాలర్లకు చేరింది. ఇదే అత్యధిక సింగిల్-డే లాభాలకు కారణమైంది. అతని మరో కంపెనీ స్పేస్ ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్లకు చేరడం విశేషం. ఈ ఏడాది జనవరి నుండి తన నికర విలువ 100 బిలియన్ల డాలర్లకు పైగా ఎగిసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 మంది ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండవస్థానం కంటే కిందికి పడిపోవడం బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ఎనిమిదేళ్ల చరిత్రలో ఇది రెండవసారి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్ 2017లో గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుగా నిలిచారు. అంతుకుముందు వరకు బిల్‌గేట్స్ రిచెస్ట్ పర్స్‌న్‌గా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం బెజోస్ 182 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అతని నికర విలువ 67 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. కాగా బిల్ గేట్స్ తన సంపాదనంలో ఏటా కొంత భాగాన్ని డొనేషన్లకు ఇస్తారు. 2006 నుంచి ప్రతి ఏటా 27 బిలియన్ డాలర్లను నేమ్‌సేక్ ఫాండేషన్‌కు గేట్స్ ఛారిటీగా ఇస్తున్నారు. -
కరోనా నుంచి కోలుకున్న 93 ఏళ్ల వ్యక్తి
న్యూఢిల్లీ : 93 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత కేవలం 8 రోజుల్లోనే కరోనాను జయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ కవి, సాహిత్య విభాగంలో పద్మశ్రీ అందుకున్న ఆనంద్ మోహన్ జుష్తీ గుల్జార్ దెహల్వి శ్వాసకోశ సమస్యతో జూన్ 1న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఐసీయాకి తరలించి డాక్టర్ అభిషేక్ దేశ్వాల్ నాయకత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అంతేకాకుండా జుష్తీ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహకారం అందించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జుష్తీ.. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక మీరంతా మా ఇంటికి విందుకు రావాలి అంటూ వైద్య సిబ్బందిని ఆహ్వానించారు. 93 ఏళ్ల వయసులోనూ చాలా త్వరగా కోలుకున్న జుష్తీకి అభినందనలు అంటూ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ అజిత్ కుమార్ ట్వీట్ చేశారు. జుష్తీ రికవరీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రచనలతోనే కాదు అతి తక్కువ రోజుల్లోనే కరోనాపై విజయం సాధించి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరింత కాలం జీవించాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. (కేజ్రీవాల్‌కు రేపు కరోనా పరీక్షలు? ) -
విద్యార్థిపై దంపతుల దాష్టీకం
-
టీచర్‌ను తాళ్లతో కట్టి.. రోడ్డుపై ఈడ్చి..
బలుర్ఘాట్: రోడ్డు వేసేందుకు స్థలం ఇవ్వడం లేదన్న కారణంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కాళ్లు, చేతులు కట్టేసి, రోడ్డుపై ఈడ్చిన దారుణ దుర్ఘటన పశ్చిమబెంగాల్లోని దీనజ్‌పూర్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టడంతో రాజకీయ సెగ అలుముకుంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాంపూర్ బ్లాక్‌కు చెందిన ప్రభుత్వ టీచర్, బీజేపీ మద్దతుదారు స్మృతికానా దాస్ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఉప ప్రధాన్ (డిప్యూటీ చీఫ్) అమల్ సర్కార్.. స్మృతికానా దాస్ కుటుంబాన్ని హింసించారు. టీచర్ కాళ్లను, చేతులను కట్టేయడంతో ఆమె కిందపడిపోవడం, ఆమెను కొందరు దుండగులు దాదాపు 30 అడుగులు ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లి బంధించడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో గూండాయిజం సాగుతున్నదనడానికి ఇది ఉదాహరణ అంటూ విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ చెప్పారు. -
బాన్సువాడలో పోకిరికి దేహశుద్ధి
-
470 కోట్ల కాన్పులకు ఒకటి!
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికే సాధ్యమవుతుందని అంచనా. హూస్టన్‌కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ శుక్రవారం ఉదయం 4.50–4.59 గంటల మధ్య నలుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారికి కొంతకాలం అడ్వాన్స్డ్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పారు. -
చిల్లర అడిగితే.. చితక్కొట్టాడు..!
సాక్షి, వనపర్తి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బస్ కండక్టర్ రౌడీలా ప్రవర్తించాడు. ఈ ఘటన వనపర్తి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఓ యువకుడు తనకు రావాల్సిన రూ.3 చిల్లరను కండక్టర్‌ను అడిగాడు. కోపంతో ఆ కండక్టర్ రెచ్చిపోయి ఆ యువకుడ్ని బస్టాండ్‌లోని కంట్రోల్ రూమ్‌లో వేసి చితకబాదాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే తమదైన శైలిలో పోక తప్పదని వారు హెచ్చరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సంబంధిత అధికారులు ఎవరూ కూడా అడ్డుచెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంచనాలను మించిన ఎం అండ్ ఎం
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది. -
విద్యార్థిని చితకబాదిన టీచర్
-
స్టూడెంట్ను చితకబాదిన నారాయణ ప్రిన్సిపల్
-
స్టూడెంట్స్‌ను చితకబాదిన ‘నారాయణ’ ప్రిన్సిపల్ !
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాలేజ్‌లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజలు కట్టి కాలేజీకి పంపుతుంటే.. ఇలా హింసిస్తారా అని మండిపడ్డారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా.. రక్తం వచ్చేలా కొట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛీఛీ.. వీడసలు మనిషేనా..?
సాక్షి, భువనేశ్వర్ : మనుషుల్లో మానత్వం చచ్చిపోతోందో.. లేక తాము మనుషులమన్న ఊహే ఉండటం లేదో తెలియదుకానీ.. కొందరు మాత్రం రాక్షసత్వానికి పరాకాష్టలా మారుతున్నారు. అత్యంత క్రూరంగా మూగజీవాలను హింసిస్తూ.. పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒక ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కని.. అత్యంత కిరాతకంగా, రాక్షసంగా.. బెల్టుతో హింసిస్తున్న ఘటన వెలుగు చూసింది. దాదాపు 21 సెకెన్లు ఉన్న వీడియోలో.. పెంపుడు కుక్కను బెల్టుతో.. విరామం లేకుండానే ఒక వ్యక్తి కొడుతూనే ఉన్నాడు. కుక్క పారిపోయే ప్రయత్నం చేసినా.. పట్టుకుని మరీ చితకబాదాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH Man caught on camera brutally thrashing a dog in Odisha's Bhubaneswar. pic.twitter.com/K3uDZsqHTi — ANI (@ANI) December 20, 2017