![Narayana College Principal Brutally Beats Student in kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/10/student.jpg.webp?itok=ZRd5EPYH)
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాలేజ్‌లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్షల్లో ఫీజలు కట్టి కాలేజీకి పంపుతుంటే.. ఇలా హింసిస్తారా అని మండిపడ్డారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా.. రక్తం వచ్చేలా కొట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment