సాక్షి, అనంతగిరి(విశాఖపట్నం): స్టడీ అవర్‌కు రాలేదని విద్యార్థులను చితకబాదిన ఘటన విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట గురుకుల పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు సమీపంలో గ్రామం ఉండటంతో వారంతా రాత్రివేళ పడుకునే సమయంలో ఇంటికి వెళ్లి వస్తుంటారు.
గురువారం వెళ్లి ఇంటికెళ్లిన విద్యార్థులు శుక్రవారం ఉదయం స్టడీ అవర్‌కు రాకపోవడంతో సోషల్ టీచర్ పీతాంబరం, పీఈటీ నాగభూషణం విద్యార్థులను కర్రలతో చితకబాదారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశారు. అనంతరం విద్యార్థుల్ని పీహెచ్‌సీకి తీసుకునివెళ్లి చికిత్స చేయించారు.విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ప్రిన్సిపాల్ వేణుప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment