
ఇష్టంలేదని చెప్పిందని కూతుర్నే చంపేశాడు
రియాద్: రక్తం పంచుకుపుట్టిన కన్న కూతురినే కొట్టి చంపాడో తండ్రి. ఈ సంఘటన సౌదీ అరేబియాలోని రియాద్లో చోటు చేసుకుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడమే ఆ చిన్నారి తండ్రితో చెప్పటమే ఆమె పాలిట మృత్యువైంది. ఏడేళ్ల యర... నువ్వంటే ఇష్టం లేదని తండ్రితో చెప్పడంతో కోపోద్రిక్తుడైన అతను కర్రతో పాటు ఎయిర్ కండీషనర్ గొట్టంతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆ చిన్నారిని బెడ్ రూంలో వేసి తాళం వేశాడు. చాలాసేపటి తర్వాత ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని తండ్రి తలుపు తెరిచి చూశాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతుర్ని చివరికి ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అయితే మార్గ మధ్యలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాగా యర తల్లిదండ్రులు మనస్పర్థలు కారణంగా విడిగా ఉంటున్నారు. వీరి విడాకులు మంజూరు కోసం పిటిషన్ కోర్టులో నడుస్తుండగా ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి ఇటీవలే వెళ్లిందని యర తల్లి తెలిపింది. తండ్రి అంటే చిన్నారికి అస్సలు ఇష్టం లేదని, అతని దగ్గరికి వెళ్లడానికి కూడా నిరాకరించిందని కన్న తల్లి కన్నీరుమున్నీరైంది.