
కోరిక తీర్చలేదని భర్తపై దాడి
కోరిక తీర్చలేదనే అక్కసుతో భర్తపై ఓ మహిళ తీవ్రంగా దాడిచేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. దక్షిణ కరోలినా కు చెందిన ఎర్లీ కెల్లి(50) ఈ దారుణానికి పాల్పడింది.
న్యూయార్క్: కోరిక తీర్చలేదనే అక్కసుతో భర్తపై ఓ మహిళ తీవ్రంగా దాడిచేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. దక్షిణ కరోలినా కు చెందిన ఎర్లీ కెల్లి(50) ఈ దారుణానికి పాల్పడింది. కోరికను తిరస్కరించిన కారణంగా భర్తపై దాడికి దిగిన కెల్లి బీభత్సాన్ని సృష్టించిందని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.
శృంగారానికి నిరాకరించిన భర్తపై అసహనంతో రెచ్చిపోయిన కెల్లి దొరికిన వస్తువును దొరికినట్టు విసిరి పారేసింది. అందమైన సిరామిక్ బొమ్మలను ధ్వంసం చేసింది. చివరికి నాన్ చాక్ తో ఎటాక్ చేసి భర్తను తీవ్రంగా గాయపర్చింది. దీంతో పోలీసులు ఆమెపై గృహ హింస కేసు నమోదు చేశారు. అయితే ఎర్లీ కెల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడి నివారణ మందులు వాడుతున్నట్టు సమాచారం.