
ప్రతికాత్మక చిత్రం
ఇప్పటికీ చాలా వెనకబడిన ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను ప్రభలంగా విశ్వసిస్తున్నారు. ఇలాంటి పిచ్చి నమ్మకాలతో తమ జీవితాలనే కాక తమ పిల్లల జీవితాలను కూడా బలిచేస్తున్నారు.
Exorcist was arrested in Jharkhand: ఇంకా చాలా చోట్ల మూఢనమ్మకాలను విశ్వాసించే వాళ్లు ఉన్నారు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ దర్మార్గులు చేసే అకృత్యాలకు అంతేలేదు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా మూఢనమ్మకాల పేరుతో సాగిస్తున్న హింసకు బలవుతున్నావారు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం....జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక బాలిక హోలీ ఆడిన తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ మేరకు మౌలానా ఎమ్‌డి వాహిద్ అనే భూతవైద్యుడు ఆ బాలిక భూతవైద్యం ద్వారా బాగుపడుతుందని ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఆ బాలికను అతని వద్దకు తీసుకువచ్చారు. అతను ఆ బాలికను భూత వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు ఆమెను కొట్టి, అగరబత్తీలతో కాల్చాడం వంటి అకృత్యాలను చేశాడు.
దీంతో ఆ బాలిక మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత ఆ బాలికను కుటుంబ సభ్యులు చత్రలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కి తరలించారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వాహిద్ (35)ను అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్ తెలిపారు.
(చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య)