Exorcist
-
బాలికకు దెయ్యం పట్టిందని చిత్రహింసలు పెట్టిన ఓ బాబా
-
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు
-
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి
పరిగి: ఇంటర్ చదువుతున్న బాలిక.. అనారోగ్యానికి గురైంది.. ఆమెకు దెయ్యం పట్టిందని ఓ బాబా భయపెట్టాడు.. భూతవైద్యం చేస్తానంటూ ఆమెను నిప్పులపై నడిపించాడు.. చిత్రహింసలు పెట్టాడు.. పాదాలు కాలిపోయి తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఐదు రోజుల కింద జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. భూత వైద్యం చేస్తానని.. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య కుమార్తె అశ్విని(17) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూత వైద్యుడు) ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మబలికాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. మండే నిప్పులపై బాలికను నడిపించాడంతోపాటు ఆమెపై కాళ్లుపెట్టి నిల్చున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన.. బాలికను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని.. పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. -
అమానుషం! బాలికను కొట్టి, అగరబత్తులతో కాల్చి...
Exorcist was arrested in Jharkhand: ఇంకా చాలా చోట్ల మూఢనమ్మకాలను విశ్వాసించే వాళ్లు ఉన్నారు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ దర్మార్గులు చేసే అకృత్యాలకు అంతేలేదు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా మూఢనమ్మకాల పేరుతో సాగిస్తున్న హింసకు బలవుతున్నావారు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం....జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక బాలిక హోలీ ఆడిన తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ మేరకు మౌలానా ఎమ్‌డి వాహిద్ అనే భూతవైద్యుడు ఆ బాలిక భూతవైద్యం ద్వారా బాగుపడుతుందని ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఆ బాలికను అతని వద్దకు తీసుకువచ్చారు. అతను ఆ బాలికను భూత వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు ఆమెను కొట్టి, అగరబత్తీలతో కాల్చాడం వంటి అకృత్యాలను చేశాడు. దీంతో ఆ బాలిక మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత ఆ బాలికను కుటుంబ సభ్యులు చత్రలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కి తరలించారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వాహిద్ (35)ను అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్ తెలిపారు. (చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య) -
భూతవైద్యుడి చికిత్స.. యువతి మృతి
సాక్షి, దేవరకొండ : అనారోగ్యానికి గురైన యువతి కొండమల్లేపల్లిలోని ఓ భూత వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ బుధవారం హఠాన్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పిట్టల నరసింహకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె హిమవర్షిణి అనారోగ్యానికి గురికావడంతో గతకొన్ని రోజులుగా మండల పరిధిలోని కొల్‌ముంతలపహాడ్ స్టేజీ సమీపంలోని భూతవైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. ఈక్రమంలో బుధవారం హిమవర్షిణి అకస్మాత్తుగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
కోడలుకు పట్టిన దెయ్యం వదలించేందుకు
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లిలో తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చిందని కోడలిపై మామ దాడి చేశాడు.ఈ నేపథ్యంలో ఇంట్లో భూతవైద్యుడితో మంత్రాలు చేస్తూ అడ్డంగా దొరికాడు. కోడలి ఫిర్యాదుతో అత్త, మామలతో పాటు భూత వైద్యుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లికి చెందిన యువకుడు చిరంజీవి, వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి రజిత ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. పదేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటకు ఓ పాప పుట్టాక మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. దయ్యం పట్టడంతోనే కోడలు కేసు వేసి కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తుందని అత్తింటివారు భావిస్తూ ఆమెను ఇంట్లోకి రానివ్వడంలేదు. గత కొంతకాలంగా పుట్టింటి వద్దనే ఉంటున్న ఆ మహిళ, కూతురుతో కలిసి అత్తవారింటికి చేరుకొని ఆందోళనకు దిగింది. ఇంట్లోకి రాకుండా అత్తమామలు శంకరమ్మ, అమృతయ్య అడ్డుకున్నారు. అప్పటికే కోడలుకు పట్టిన దెయ్యం పోవాలని భూతవైద్యుడితో ఇంటి లోపల ఓ తంతు నిర్వహిస్తున్నారు. కోడలు ఇంట్లోకి వస్తే అరిష్టం అని భావించిన మామ అమృతయ్య, కోడలు ఇంటిలోపల అడుగు పెట్టకుండా అడ్డుకుని ఆమెను నెట్టివేస్తు దాడికి దిగాడు. మామ నెట్టేస్తూ దాడికి పాల్పడ్డప్పటికీ ఆమె ప్రతిఘటిస్తూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటికి ఇంట్లో గుండిగోపాల్ రావుపేట్ కు చెందిన భూతవైద్యుడు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఎస్ఐ ప్రేమ్ కుమార్ అక్కడికి చేరుకొని భూత వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కోడలు ఫిర్యాదు తో అత్తమామలతో పాటు భూతవైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడలుకు పట్టిన దెయ్యం వదలించేందుకు..
-
నగ్నంగా ఉంటే నయమవుతుంది!
భోపాల్ : దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్నా.. మూఢ నమ్మకాల చీకట్లు తొలగడం లేదు. కంప్యూటర్ యుగంలో కూడా బాబాలు, మాంత్రికులనే ప్రజలు నమ్ముతున్నారు. మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న ఆరాచకాలు ఇంకా తగ్గలేదని రుజువు చేసే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. పాము కాటుకు గురైన ఓ మహిళ ఆస్పత్రితో చేరి భూత వైద్యుడి మంత్రాల వైద్యం చేయించుకున్నారు. డాక్టర్ల వైద్యం కాదని మాంత్రికుడి మాటలు నమ్మి ఆస్పత్రి ఆవరణంలోనే తాంత్రిక పూజలు నిర్వహించారు. ఆచారాల పేరుతో ఆ తాంత్రికుడు మహిళ దుస్తులు విప్పించి ఘోరంగా అవమానించారు. మధ్యప్రదేశ్‌లోని దామో ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలోని భతియాగర్ గ్రామ నివాసి అయిన ఇమ్రాత్ దేవి(25)గత ఆదివారం పాము కాటు గురైయ్యారు. చికిత్స కోసం అదే రోజు రాత్రి దామోలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మహిళల వార్డులో ఆమెను చేర్చి వైద్యం అందించారు. కాగా అదే రోజు రాత్రి దేవి బంధువులు ఓ మంత్రగాడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ల వైద్యంకి పాము కాటు నయం కాదని, మంత్రాలతోనే నయమవుతుందని ఆచారం పేరుతో ఆమె చేత పురుషుల వార్డు బయట బట్టలు విప్పించి కొన్ని మంత్రాలు చదివాడు ఆ మంత్రగాడు. ఇదంతా ఆస్పత్రి ఆవరణలో జరిగినా సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై ఆస్పత్రి అధికారులు మాట్లాడుతూ... డ్యూటీలో ఉన్న డాక్టర్లకు, సెక్యూరిటీ గార్డుకి ఘటన గురించి తెలియదు. ఓ నర్సు మాత్రం చూసింది. కానీ ఆపేందుకు ప్రయత్నించలేదు. డాక్టర్లకు,సెక్యూరిటీ గార్డుకి సమాచారమివ్వలేదు. ఈ విషయమై సంబంధిత నర్సుకి నోటీసులు పంపామని తెలిపారు. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇతర వార్డుల్లోని రోగులను పరీక్షిస్తున్నాడని, రోగులు,వారి కుటుంబ సభ్యులకి కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని సివిల్ సర్జన్ మమతా తిమోరి తెలిపారు. -
‘మగధీర’ సినిమా చూపించాడు
చాంద్రాయణగుట్ట: మానవతీత శక్తుల పేరుతో అమాయకులను బురిడి కొట్టించి కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ గోల్డెన్ కాలనీకి చెందిన మెహతాబ్ హుస్సేన్ అలియాస్ ఆదిల్, అతని మూడో భార్య సకీనా ఫాతీమా ఫర్నీచర్ వ్యాపారం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు భూత వైద్యుడి అవతారం ఎత్తిన అతడికి ఆజం అనే వ్యక్తి ద్వారా యాకుత్‌పురాకు చెందిన వ్యాపారి రుస్తుం పటేల్‌తో పరిచయం ఏర్పడింది. తనకు దివ్యదృష్టి ఉందని, ఆసిఫ్‌జాహి, టిప్పు సుల్తాన్, కుతుబ్‌షాహిల కాలంలో దాచిన గుప్త నిధుల వివరాలు చెబుతానంటూ నమ్మించాడు. కర్ణాటక, మైసూర్ ప్రాంతాలకు తీసుకెళ్లిన అతను వాస్తు దోషాల కారణంగా నిధి బయటికి రావడం లేదని నమ్మించాడు. ఇంతటితో ఆగకుండా మీరు 4000 ఏళ్ల క్రితం గొప్ప రాజు అని, అప్పట్లో మీ భార్యగా ఉన్న మహిళ కూడా మళ్లీ జన్మించిందని.....ఆమె ప్రస్తుతం వేల కోట్లకు అధిపతిగా ఉందని చెబుతూ ఓ మహిళ ఫొటో, హిందీలో రాసిన లవ్ లెటర్‌ను కూడా చూపించాడు. ఆమెతో పెళ్లి జరిపించి కోటీశ్వరుడిని చేస్తానని నమ్మించాడు. అంతేగాకుండా తన వద్ద ఉన్న రైస్ ఫుల్లింగ్ యంత్రం ద్వారా రూ.కోట్లు సంపాదించవచ్చని చెప్పి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశాడు. మరి కొందరినుంచి కూడా భారీగా వసూలు చేశాడు. ఈ డబ్బుతో చిన్న గోల్కొండ ప్రాంతంలో 2000 గజాల స్థలం, చింతల్మెట్లో ఓ భవనాన్ని నిర్మించడంతో పాటు పలుమార్లు విదేశీ పర్యటనలు చేశాడు. కొంతకాలానికి అతడిపై అనుమానం వచ్చిన రుస్తుం పటేల్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మెహతాబ్ అతడిని ఎయిర్ పిస్తోల్‌తో బెదిరించాడు. అయినా బాధితుడు ఒత్తిడి చేయడంతో రూ.8.5 లక్షలు హబీబ్‌నగర్ రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ అలియాస్ జంగ్లీ యూసుఫ్ ద్వారా ఇచ్చి పంపాడు. అయితే ఆ డబ్బులను యూసుఫ్ బాధితుడికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో గత నెల 24న బాధితుడు మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.13.5 లక్షల నగదు, ఎయిర్ పిస్తోల్, రెండు పాస్ పోర్టులు, ఐదు గ్రాముల బంగారం, రైస్ ఫుల్లింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. -
మేడారంలో భూతవైద్యుడి వీరంగం
బాగు చేస్తానని ఇద్దరిని చితకబాదిన పూజారి బాధితులు నల్లగొండ జిల్లా వాసులు మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి) : ఆరోగ్యం బాగు చేస్తానని ఇద్దరు వ్యక్తుల చేతులు కట్టేసి ఓ భవాని పూజారి చితకబాదిన సంఘటన వరంగల్ జిల్లా ఎస్ఎస్ తాడ్వారుు మండలం మేడారం గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్ల గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ ఆరోగ్యం బాగోలేకపోవడంతోపాటు అనుకున్న పని జరగడం లేద ని కొన్నాళ్లుగా మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో తన బంధువు ఒకరు ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన భవాని పూజారి దండు సారయ్య వద్దకు వెళ్తే బాగు చేస్తారని చెప్పడంతో అతడు సార య్యను ఆశ్రరుుంచాడు. సారయ్య గతంలో రెండుసార్లు అతడికి మేడారంలో పూజలు చేశాడు. ఇద్దరి మధ్య పెరిగిన పరిచయంతో లక్ష్మణ్ వద్ద సారయ్య రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. మూడు నెలల తర్వాత అప్పు చెల్లించాలని అడగడంతో మరోసారి మేడారంలో పూజ చేయాలని సారయ్య చెప్పాడు. దీంతో లక్ష్మణ్ తన సోదరుడు రామును వెంట తీసుకుని సోమవారం రాత్రి మేడారం చేరుకున్నాడు. మంగళవారం ఉదయం సారయ్య పూజ చేసేందుకు వారిని చిలకలగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పూజ చేయాలంటూ లక్ష్మణ్‌ను, అతడి సోదరుడు రామును కూర్చోబెట్టి చేతులు కట్టేసి కర్రలు, రాళ్లతో దాడి చేశాడు. దాడిలో అతడికి మరికొందరు సహకరించినట్లు బాధితులు తెలిపారు. దీంతో వారు ఎదురు దాడికి దిగుతూ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఇద్దరిని 108లో తాడ్వాయి పీహెచ్‌సీకి తరలించారు. దాడిలో లక్ష్మణ్ తలకు బలమైన దెబ్బలు తగిలి రక్తస్రావం జరగగా, ఆయన సోదరుడు రాము చేయికి దెబ్బ తగలడంతోపాటు తలకు గాయాలయ్యూరుు. వైద్యాధికారి క్రాంతికుమార్ ప్రథమ చికిత్స చేశారు. లక్ష్మణ్ తల పగిలి, చెవుల్లో నుంచి రక్తస్రావం జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని 108లో ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారన్నారు. బంగారం కోసం దాడి చేశారు : దండు సారయ్య కాగా, పరస్పర దాడిలో భవాని పూజారి సారయ్యకు కూడా తల పగిలి రక్తస్రావమైంది. బంగారం కోసం తనపై దాడి చేసి బంగారాన్ని లాక్కొని పారిపోయారని అతడు తెలిపాడు. సారయ్య వెంట ఉన్న బట్టు నాగారాజును ఈ సంఘటనపై అడగగా.. పూజ కోసం సారయ్య, వచ్చిన ఇద్దరు కలిసి చిలకలగుట్ట వైపు వెళ్లారని, తాను వంట చేస్తుండగా కాసేపటికి సారయ్య రక్తంతో తల పగి లి రక్తస్రావంతో కనిపించాడన్నారు. ఈ దాడిపై రాము, లక్ష్మణ్ పోలీసులకు సమాచారమివ్వడంతో అప్రమత్తమైన తాడ్వాయి ఎస్సై సాంబమూర్తి పూజారి సారయ్య కారును, డ్రైవర్ జనగాం నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై మేడారం పూజారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. భూతవైద్యం పేరుతో మేడారానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పూజారులు కోరారు.