మేడారంలో భూతవైద్యుడి వీరంగం
బాగు చేస్తానని ఇద్దరిని
చితకబాదిన పూజారి
బాధితులు నల్లగొండ జిల్లా వాసులు
మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి) : ఆరోగ్యం బాగు చేస్తానని ఇద్దరు వ్యక్తుల చేతులు కట్టేసి ఓ భవాని పూజారి చితకబాదిన సంఘటన వరంగల్ జిల్లా ఎస్‌ఎస్ తాడ్వారుు మండలం మేడారం గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్ల గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ ఆరోగ్యం బాగోలేకపోవడంతోపాటు అనుకున్న పని జరగడం లేద ని కొన్నాళ్లుగా మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో తన బంధువు ఒకరు ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన భవాని పూజారి దండు సారయ్య వద్దకు వెళ్తే బాగు చేస్తారని చెప్పడంతో అతడు సార య్యను ఆశ్రరుుంచాడు. సారయ్య గతంలో రెండుసార్లు అతడికి మేడారంలో పూజలు చేశాడు. ఇద్దరి మధ్య పెరిగిన పరిచయంతో లక్ష్మణ్ వద్ద సారయ్య రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. మూడు నెలల తర్వాత అప్పు చెల్లించాలని అడగడంతో మరోసారి మేడారంలో పూజ చేయాలని సారయ్య చెప్పాడు.
దీంతో లక్ష్మణ్ తన సోదరుడు రామును వెంట తీసుకుని సోమవారం రాత్రి మేడారం చేరుకున్నాడు. మంగళవారం ఉదయం సారయ్య పూజ చేసేందుకు వారిని చిలకలగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పూజ చేయాలంటూ లక్ష్మణ్‌ను, అతడి సోదరుడు రామును కూర్చోబెట్టి చేతులు కట్టేసి కర్రలు, రాళ్లతో దాడి చేశాడు. దాడిలో అతడికి మరికొందరు సహకరించినట్లు బాధితులు తెలిపారు. దీంతో వారు ఎదురు దాడికి దిగుతూ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఇద్దరిని 108లో తాడ్వాయి పీహెచ్‌సీకి తరలించారు. దాడిలో లక్ష్మణ్ తలకు బలమైన దెబ్బలు తగిలి రక్తస్రావం జరగగా, ఆయన సోదరుడు రాము చేయికి దెబ్బ తగలడంతోపాటు తలకు గాయాలయ్యూరుు. వైద్యాధికారి క్రాంతికుమార్ ప్రథమ చికిత్స చేశారు. లక్ష్మణ్ తల పగిలి, చెవుల్లో నుంచి రక్తస్రావం జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని 108లో ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారన్నారు.
బంగారం కోసం దాడి చేశారు : దండు సారయ్య
కాగా, పరస్పర దాడిలో భవాని పూజారి సారయ్యకు కూడా తల పగిలి రక్తస్రావమైంది. బంగారం కోసం తనపై దాడి చేసి బంగారాన్ని లాక్కొని పారిపోయారని అతడు తెలిపాడు. సారయ్య వెంట ఉన్న బట్టు నాగారాజును ఈ సంఘటనపై అడగగా.. పూజ కోసం సారయ్య, వచ్చిన ఇద్దరు కలిసి చిలకలగుట్ట వైపు వెళ్లారని, తాను వంట చేస్తుండగా కాసేపటికి సారయ్య రక్తంతో తల పగి లి రక్తస్రావంతో కనిపించాడన్నారు. ఈ దాడిపై రాము, లక్ష్మణ్ పోలీసులకు సమాచారమివ్వడంతో అప్రమత్తమైన తాడ్వాయి ఎస్సై సాంబమూర్తి పూజారి సారయ్య కారును, డ్రైవర్ జనగాం నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై మేడారం పూజారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. భూతవైద్యం పేరుతో మేడారానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పూజారులు కోరారు.