ఛీఛీ.. వీడసలు మనిషేనా..? | Odisha man ruthlessly beats up dog with belt | Sakshi
Sakshi News home page

ఛీఛీ.. వీడసలు మనిషేనా..?

Published Wed, Dec 20 2017 6:35 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

Odisha man ruthlessly beats up dog with belt - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ :  మనుషుల్లో మానత్వం చచ్చిపోతోందో.. లేక తాము మనుషులమన్న ఊహే ఉండటం లేదో తెలియదుకానీ.. కొందరు మాత్రం రాక్షసత్వానికి పరాకాష్టలా మారుతున్నారు. అత్యంత క్రూరంగా మూగజీవాలను హింసిస్తూ.. పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒక ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కని.. అత్యంత కిరాతకంగా, రాక్షసంగా.. బెల్టుతో హింసిస్తున్న ఘటన వెలుగు చూసింది.

దాదాపు 21 సెకెన్లు ఉన్న వీడియోలో.. పెంపుడు కుక్కను బెల్టుతో.. విరామం లేకుండానే ఒక వ్యక్తి కొడుతూనే ఉన్నాడు. కుక్క పారిపోయే ప్రయత్నం చేసినా.. పట్టుకుని మరీ చితకబాదాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement