ఏటీఎంలో కుక్కల బస
రాయగడ(ఒడిశా): ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బ్యాంక్‌లు ఆధునిక పద్ధతిలో విభిన్న ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో కుక్కలు సేదదీరుతున్నాయి. ఆయా ప్రాంతపు ప్రజల కోసం ఏటీఎంలు ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రం దగ్గర సెక్యూరిటీని నియమించి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సి ఉండగా అవేమీ కానరావడం లేదు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా గతంలో ఏటీఎంలో పశువులు బస చేయగా ప్రస్తుతం ఏటీఎంలో 24గంటలు ఏసీ ఉండడం వల్ల వీధికుక్కలు సేద తీరుతున్నాయి.
కుక్కల సంఖ్య ఏటీఎంలో అధికంగా ఉండడం వల్ల ఖాతాదారులు ఏటీఎంలను వినియోగించుకోవడంలో అనేక ఇబ్బందులకు గుర వుతున్నారు. రెండురోజులుగా ఏటీఎంలో కుక్కలు ఉన్న వాట్సాప్ క్లిప్పింగ్ రాయగడ జిల్లాలో హల్‌చల్ చేస్తున్నప్పటికీ బ్యాంక్ అధికారుల స్పందన కనిపించలేదు.