అంచనాలను మించిన అమెరికా జాబ్ గ్రోత్
అంచనాలను మించిన అమెరికా జాబ్ గ్రోత్
Published Fri, Aug 5 2016 8:20 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
అమెరికా ఉద్యోగాలు పెరుగుదల అంచనాలకు మించి గణాంకాలను నమోదు చేసింది. జూలై జాబ్ గ్రోత్ లో బలమైన వృద్ధిని సాధించి 255,000 ఉద్యోగాలను జోడించింది. జూన్ మాసంలోని 292,000 ఉద్యోగాలతో పోలిస్తే వృద్ధిలో క్షీణించినప్పటికీ ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువ నమోదు చేసింది. ఇది 175,000- 180,000 మధ్య ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. దీంతో ఫెడ్ సంవత్సరాంతానికి వడ్డీరేట్లను పెంచనుందనే ఊహాగానాలను మరింత పెంచింది.
అయితే అన్ ఎంప్లాయ్ మెంట్ రేట్ (నిరుద్యోగుల )4.9% వద్ద స్థిరంగా ఉండిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ అద్భుతంగా లేదని విశ్లేషకుడు డెన్నిస్ డె జాంగ్ అభిప్రాయపడ్డారు. మొదటి ఆరు నెలల లెక్కలే సంవత్సరం మొత్తం ఫలితాలను ప్రతిబింబిస్తాయన్నారు. క్షీణించిన ఉపాధి అవకాశాలతో వడ్డీ రేట్లను పెంచాలనే సంకేతాలను ఫెడ్ అందించిందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండవ త్రైమాసికంలో అంచనాలకన్నా కంటే నెమ్మదిగా వృద్ధి చెందిందని ఆ తర్వాతి డేటా వెల్లడి చేసిందని పేర్కొన్నారు.
కాగా ఫెడ్ తదుపరి పాలసీ రివ్యూ సెప్టెంబర్ లో జరగనుంది. అయితే మందకొడిగా ఉన్న ఆర్థిక వృద్ధి, దిగజారుతున్న ఉత్పాదకత, అధ్యక్ష ఎన్నికలతో నెలకొన్న అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ వరకు ఆలస్యం కావచ్చని మరో ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు. ఉద్యోగ మార్కెట్ అభివృద్ధితో మళ్ళీ ఈ సంవత్సరం ఫెడ్ రేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. బ్యాంక ఆఫ్ ఇంగ్లాండ్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయం లాంటి ప్రపంచ పరిణామాలను ఫెడ్ నిశితంగా పరిశీలిస్తోందని వాషింగ్టన్ ఆర్థిక వేత్త తెలిపారు. బ్రెగ్జిట్ పరిణామాలు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై బలంగా ఉంటాయనీ, ఇది యూరోపియన్ బ్యాంకులపై కూడా ఉండనుందని పేర్కొన్నారు.
Advertisement