అంచనాలకు మించి రాణించిన ఎం అండ్ ఎం
ముంబై: దేశీయ ఆటో దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి మహీంద్రా అండ్ మహీంద్రా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. స్ట్రీట్ అంచనాల ఓడించి, జూన్ క్వార్టరు కు రూ 955 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని నమోదుచేసింది. దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ ఎం అండ్ ఎం నికర విక్రయాల్లో 14 శాతం వృద్ధితో రూ 11, 942 కోట్ల సాధించినట్టు బుధవారం వెల్లడించింది.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వినియోగ వాహనాల తయారీ లో 9.7 శాతం వృద్ధి సాధించింది. జూన్ త్రైమాసికంలో సమయంలో 1,10,959 యూనిట్లు విక్రయించింది. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 13 శాతం ప జంప్ అయ్యాయి. ఈ త్రైమాసికంలో 55.909 యూనిట్లను విక్రయించి, 31.6 శాతం మార్కెట్ వాటాతో విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రాక్టర్ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. 71, 785 యూనిట్ల అమ్మకాలతో ఎం అండ్ ఎం జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ట్రాక్టర్ విభాగంలో 44 శాతం మార్కెట్ షేర్ సాధించింది.
క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎంఅండ్‌ఎం నికర లాభం రూ. 955 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా)11 శాతం పెరిగి రూ. 1489 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 10,525 కోట్లుగా నమోదైంది. 14.1 శాతం ఇబిటా మార్జిన్లు సాధించింది. క్యూ1లో దేశీ ట్రాక్టర్ మార్కెట్లో రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఆటో విభాగం మార్జిన్లు 5.9 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. దేశీయ మార్కెట్లో తమకు మంచి వృద్ధి ఉందని, మంచి భవిష్యత్తు ఉందని ఎంఅండ్ ఎం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, మార్కెట్లలో నెలకొన్న నష్టాల పరంపరలో ఎంఅండ్‌ఎం షేరు అనంతరం నష్టాల్లోకి జారుకుంది.