estimates
-
అంచనాలను అందుకున్న సిప్లా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికానికి (202–23లో క్యూ2) బలమైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.797 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.709 కోట్లుగా ఉంది. దేశీయ, యూఎస్ మార్కెట్లలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయంతో పోలిస్తే రూ.5,520 కోట్ల నుంచి రూ.5,829 కోట్లకుపెరిగింది. భారత్‌లో ఉన్న అమెరికా వ్యాపారాన్ని బదలాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క్యూ2 ఫలితాలపై సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమంగ్ వోహ్రా మాట్లాడారు. యూఎస్ మార్కెట్లో వివిధ పోర్ట్‌ఫోలియోల పరంగా అమలు చేసిన విధానం, దేశీ మార్కెట్లో బలమైన పనితీరు ఫలితాల్లో కనిపించినట్టు చెప్పారు. దేశీ అమ్మకాల ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,563 కోట్లుగా ఉంటే, నార్త్ అమెరికా వ్యాపారం 35 శాతం పెరిగి రూ.1,432 కోట్లకు చేరింది. కలిసొచ్చిన లెనలిడోమైడ్ ముఖ్యంగా లెనలిడోమైడ్ డ్రగ్‌ను విడుదల చేయడం అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్టు ఉమంగ్ వోహ్రా తెలిపారు. వెలుపలి మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలను నమోదు చేసినట్టు వివరించారు. నిర్వహణ లాభం 22.3 శాతంగా ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలైన 21–22 శాతం పరిధిలోనే ఇది ఉన్నట్టు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడం, ధరలు పెంచడం తదితర చర్యలతో కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కంపెనీ అధిగమించింది. -
అంచనాలు మించి అదరగొట్టిన హెచ్‌సీఎల్ టెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్‌టెక్) అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. క్యూ2లో లాభం 7 శాతం వృద్ధి చెంది రూ. 3,489 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 3,259 కోట్లు. ఇక ఆదాయం 19.5 శాతం పెరిగి రూ. 24,686 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 5 శాతం, లాభం 6 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే క్యూ2లో లాభం 2.7 శాతం, ఆదాయం 3.4 శాతం పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కొత్త ఆర్డర్ల బుకింగ్ పటిష్టంగా ఉందని, భవిష్యత్ వృద్ధికి గణనీయంగా ఊతమివ్వగలదని సంస్థ సీఈవో సి. విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేరుకు రూ. 10 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గైడెన్స్‌ను 13.5–14.5 శాతానికి పెంచింది. సమీక్షాకాలంలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,19,325కి చేరింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 23.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో హెచ్‌సీఎల్ షేరు 3 శాతం ఎగిసింది. -
ఫార్మా పరిశ్రమ గ్రోత్ అంతంత మాత్రమే: క్రిసిల్
న్యూఢిల్లీ: నియంత్రిత దేశాల్లో ఎగుమతులకు ఎదురవుతున్న సవాళ్లు, దేశీయంగా ఫార్ములేషన్స్ వ్యాపారంలో అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 7-9 శాతం స్థాయిలోనే వృద్ధి నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, ముడి సరుకులు.. రవాణా చార్జీల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూలంగా ఉండగలవని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నిర్వహణ లాభాలు 130 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) క్షీణించగా ఈసారి మరో 200-250 బీపీఎస్ మేర తగ్గొచ్చని క్రిసిల్ వివరించింది. ఆదాయంపరంగా ఫార్మా పరిశ్రమలో 55 శాతం వరకూ వాటా ఉండే 184 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం మేరకు క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. రిపోర్టు ప్రకారం దేశీయంగా ఫార్ములేషన్స్ మార్కెట్ ఆదాయ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా నమోదైంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్దిష్ట ఔషధాల రేట్లను సగటున 6–8 శాతం పెంచుకునేందుకు అనుమతించడం, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్-19పరమైన ఔషధాలు, విటమిన్లకు డిమాండ్ తగ్గుతున్నప్పటికీ, జీవనశైలి ఆధారిత తీవ్ర రుగ్మతలకు సంబంధించిన (డెర్మటాలజీ, ఆప్థాల్మాలజీ) ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే డిమాండ్‌కు చోదకంగా నిలవగలవని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ దానీ తెలిపారు. -
‘అంచనాలు’ అనే పదం అంతగా నచ్చదు: బాలీవుడ్ నటి
సాక్షి, హైదరాబాద్: ‘అంచనాలు’ అనే పదం తనకు అంతగా నచ్చదని.. మీరు కూడా దాని నుంచి బయటపడాలని బాలీవుడ్ నటి, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మహిళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. పని ఏదైనా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు. మంగళవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైర్డ్ ఫర్ చాలెంజెస్ అనే టాక్ సెషన్లో మహిళా పారిశ్రామికవేత్తలు నిపుణులతో నిండిన హాల్లో మందిరా బేడీ మాట్లాడుతూ.. ప్రతి మహిళా నిర్దుష్టమైన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. మందిరా బేడీ తన అనుభవాలను, జీవిత పాఠాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ శుభ్రా మహేశ్వరి, కార్యదర్శి గుంజన్ సింథీ, కోశాధికారి నిషితా మన్నె, జాయింట్ సెక్రటరీ శిల్పా రాజు పాల్గొన్నారు. -
భారత్‌పై వరల్డ్ బ్యాంక్ కీలక అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్ కీలక సంస్కరణలను కొనసాగించాలని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని, 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఇక దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మార్చితో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.6 శాతం క్షీణిస్తుందని పేర్కొంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ తిరిగి పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలగిపోతాయని అంచనా వేసింది. ఇక కోవిడ్-19 ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో భారత ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయని పేర్కొంది. చదవండి : కోవిడ్-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..? భారత్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా పరిస్థితి మరింత దిగజారిందని ప్రపంచ బ్యాంక్, దక్షిణాసియా ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమర్ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడే కోవిడ్-19 విరుచుకుపడిందని అయితే సత్వర సమగ్ర చర్యలతో భారత్ ఈ విపత్తును అధిగమించవచ్చన్నారు. భారత్ దూరదృష్టితో కూడిన సంస్కరణలను చేపట్టిన ఫలితంగా పేదరికంపై సాధించిన విజయాలను సంరక్షించుకోగలుగుతోందని ప్రపంచ బ్యాంక్‌లో భారత్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ పేర్కొన్నారు. భారత్‌లో సామాజిక భద్రతా చట్టాలకు తీసుకువచ్చిన సవరణలతో గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో సాయం పొందని వర్గాలు ఇప్పుడు ఆయా పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నాయని ఆయన వెల్లడించారు. -
బడ్జెట్‌పై సెలబ్రిటీల అంచనాలివే..
ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 5న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ తమదైన అంచనాలు నెలకొన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రవేశపెట్టబోయే తొలి పూర్తిస్ధాయి బడ్జెట్ కావడంతో ప్రజలు ఈ బడ్జెట్‌పై ఆశలు పెంచుకున్నారు. ఈ బడ్జెట్ నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం భారీ అంచనాలతోనే ఉన్నారు. బడ్జెట్లో పలు రంగాలను ఉత్తేజపరిచే చర్యలు అవసరమని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ప్రజల ముందుకు వస్తుందనే విశ్వాసం తనకుందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై తనకు భారీ అంచనాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇక నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ధరల భారం నుంచి బడ్జెట్లో ఉపశమనం కల్పించాలని నటి మహీ గిల్ కోరారు. విలాస వస్తువుల ధరలు పెరిగినా నష్టం లేదని, ఆహార ఉత్పత్తుల ధరులు పెరిగితే మాత్రం మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతుందని పేర్కొన్నారు. వినోద పరిశ్రమపై విధించిన 18 శాతం పన్నును భారీగా తగ్గించాలని జిమ్మీ షెర్గిల్ కోరారు. మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నిర్మాతలు భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో బాలీవుడ్ వద్ద పెద్దమొత్తంలో నిధులున్నాయనే అభిప్రాయం నెలకొందని, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఇక సామాన్యుడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించాలని టీవీ స్టార్ నందిష్ సంధూ కోరారు. మరోవైపు రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. -
లాభం 38 శాతం జంప్...
న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006 కోట్లకు చేరింది. కాగా, డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నికర లాభం రూ.2,544 కోట్లతో పోలిస్తే సీక్వెన్షి యల్ ప్రాతిపదికన క్యూ4లో లాభం 1.9 శాతం తగ్గింది. పూర్తి ఏడాదికి చూస్తే... 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విప్రో నికర లాభం రూ.9,018 కోట్లుగా నమోదైంది. 2017–18లో నికర లాభం రూ.8,003 కోట్లతో పోలిస్తే 12.6 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా 7.5 శాతం వృద్ధితో రూ.54,487 కోట్ల నుంచి రూ.58,585 కోట్లకు పెరిగింది. ఐటీ సేవలు ఇలా... విప్రో కీలక వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం డాలర్ల రూపంలో క్యూ4లో 2,075 మిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే 1.4 శాతం తగ్గింది. మార్కెట్ విశ్లేషకులు 2,082 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(2019–20, క్యూ1)లో ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం 2,046–2,087 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి మైనస్ 1 నుంచి 1 శాతంగా లెక్కతేలుతోంది. కాగా, మార్కెట్ విశ్లేషకుల వృద్ధి అంచనా 0–3 శాతంతో పోలిస్తే కంపెనీ అంచనా తక్కువగా ఉండటం గమనార్హం. ఉద్యోగుల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు విప్రో ప్రకటించడం, గైడెన్స్ బలహీనంగా ఉండటంతో మంగళవారం కంపెనీ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ.281 వద్ద ముగిసింది. ‘పటిష్టమైన ఆర్డర్ల ఆసరాతో పాటు డిజిటల్ సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ సేవలు, క్లౌడ్ వంటి కీలక విభాగాల్లో మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో నిలకడగా ఆదాయాలు, లాభాలు పుంజుకోవడమే దీనికి నిదర్శనం.’ – అబిదాలి నీముచ్వాలా, విప్రో సీఈఓ–ఎండీ -
అంచనాలు తగ్గించనున్న ఐఎండీ
న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు రుతుపవనాలపై తన అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సీజన్ మొత్తానికి అంచనాలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఇప్పటికే అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)ని 92 శాతంగా సవరించింది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. ఈ సీజన్లో 100 శాతం ఎల్పీఏతో వర్షాలు పడతాయని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
అంచనాలను మించిన ఎం అండ్ ఎం
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది. -
రిలయన్స్ సామర్ధ్యంపై అంచనాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పూర్తిస్థాయిలో సామర్థ్యం కనబరిచే సమయం ఇంకా రాలేదని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు ప్రకటించినా మున్ముందు ఆర్ఐఎల్ పూర్తిస్థాయిలో సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. జియో రాబడులు ఆశించిన మేర రాకున్నా కంపెనీ పెట్రోకెమికల్ సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని హెచ్ఎస్బీసీ పేర్కొంది. గోల్డ్‌మాన్ శాక్స్.. పెట్రోకెమికల్ డివిజన్ నుంచే ఆర్ఐఎల్ సత్తా చాటిందని ప్రతి క్వార్టర్లో 10 శాతం వృద్ధి కనబరుస్తూ రిఫైనింగ్ రాబడిని మించి అతిపెద్ద రాబడి ఆర్జించే విభాగంగా పెట్రోకెమికల్ ఎదిగిందని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. రిటైల్ బిజినెస్ నుంచి మెరుగైన వృద్ధితో రిఫైనింగ్ మార్జిన్లపై అంచనాలు తప్పాయని పేర్కొంది. ఇక ప్రతి యూజర్‌పై సగటు రాబడి (ఏఆర్పీయూ) తగ్గినా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో జియో రాబడి అంచనాలకు అనుగుణంగానే ఉందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఆర్ఐఎల్ షేర్లు పెరుగుతున్నా ఇంతకుమించి పెరగవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్ఐఎల్ మెరుగైన ప్రదర్శన ఇంకా మొదలు కాలేదని పేర్కొంది. మోర్గాన్‌స్టాన్లీ.. ఆర్ఐఎల్ ఇంధన రాబడులు అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే అత్యంత నిలకడగా ఉన్నాయి. వృద్ధి పరంపరను కొనసాగించే సంకేతాలు పంపుతున్నాయి. ఇక రిటైల్, టెలికాం విభాగాలు రాబడులను మెరుగుపరుస్తాయి. డేటా యూసేజ్ ఇతర యూజర్ల తరహాలోనే ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ఐఎల్ నాలుగో క్వార్టర్లో రిఫైనింగ్ రాబడులను (రూ 6400 కోట్లు) పెట్రోకెమికల్ బిజినెస్ రూ(7700 కోట్లు) అధిగమించింది. జియో కేవలం టెలికాం రంగానికే పరిమితం కాదని ఇది డిజిటల్ సేవల వ్యాపారంలో భాగమని ఆర్ఐఎల్ ప్రస్తావించడం గమనార్హం. రానున్న రోజుల్లో జియో దశల వారీగా ఫైబర్ టూ హోం సేవలను ప్రారంభించనుంది. కొటాక్ సెక్యూరిటీస్ జియో ఊపందుకునే వరకూ ఆర్ఐఎల్ వృద్ధి పరంపర మందగమనంలో ఉండే అవకాశం ఉంది. పెట్రోకెమికల్ ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఉపయోగంలోకి వచ్చిన అనంతరం మెరుగైన వృద్ధిని అంచనా వేయవచ్చు. డచ్ బ్యాంక్.. రాబోయే ఆరు నెలల్లో ఇంధన రంగంలో నూతన ప్రాజెక్టుల ఆరంభం, జియో నుంచి రాబడులతో ఆర్ఐఎల్ మెరుగైన సామర్థ్యం కనబరిచే అవకాశం ఉంది. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్ఐఎల్ రాబడులు 24 శాతం మేర వృద్ధి సాధించవచ్చు. -
ఫలితాలు.. క్రూడ్ వైపు చూపు
హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, మే డే సందర్భంగా మే 1న(మంగళవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. గణాంకాలు, ఫలితాలు ఈ వారంలో తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎమ్ఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు వస్తాయి. ఈ గణాంకాల ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ఉంటుంది. ఏప్రిల్ నెల తయారీ రంగ గణాంకాలు వచ్చే నెల 2న(బుధవారం) వస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.1గా ఉన్న నికాయ్ మాన్యుఫాక్చరింగ్ పీఎమ్ఐ గత నెలలో 51కు తగ్గింది. ఈ నెల సేవల రంగ పీఎమ్ఐ గణాంకాలు వచ్చే నెల 4న(శుక్రవారం) వెలువడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 47.8గా ఉన్న మార్కిట్ ఎకనామిక్స్ పీఎమ్ఐ గత నెలలో 50.3కు ఎగసింది. ఇక ఈ వారంలో దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడతాయి. నేడు(సోమవారం) హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫలితాలు వెలువడతాయి. వచ్చే నెల 2న(బుధవారం) హీరో మోటొకార్ప్, హెచ్‌సీఎల్ టెక్ల ఫలితాలు వస్తాయి. గురువారం(వచ్చే నెల 3న) వేదాంత, 4న అంబుజా సిమెంట్స్ ఫలితాలు వెలువడతాయి. టాటా పవర్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తదితర కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. వెలుగులో రిలయన్స్.. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలు ఆశావహంగానే ఉండటంతో ఈ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించిన వాహన విక్రయాలను కంపెనీలు వెల్లడించనున్నందున వాహన కంపెనీల షేర్లపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఎన్నికలు మార్కెట్‌పై ప్రభావం చూపించే కీలకాంశాలని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. దేశీయ ఆర్థిక అంశాలపై ప్రభావం చూపించే ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలను ఇన్వెస్టర్లు గమనించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫలితాల సీజన్ సానుకూలంగా ఆరంభమైందని, ఇప్పటివరకూ వెల్లడైన ప్రైవేట్ బ్యాంక్‌లు, ఐటీ కంపెనీల ఫలితాలను అంచనాలను మించాయని వివరించారు. వచ్చే నెల 1 (మంగళవారం) నుంచి ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం ఆరంభం కానున్నదని, ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ ఈ సమావేశ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. బాండ్ల (అమెరికా, భారత్)రాబడుల తీరు ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు సంజీవ జర్బాడే పేర్కొన్నారు. మే రెండు వారంలో జరిగే కర్నాటక ఎన్నికలు సమీప కాలంలో మార్కెట్‌కు ముఖ్యమైనదని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మార్కెట్ అటో, ఇటో తేలుతుందని, అప్పటివరకూ పరిమిత శ్రేణిలోనే స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని వివరించారు. రూ.15,558 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు... విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ రూ.15,588 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డాలర్‌తో రూపాయి మారకం బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దీనికి కీలక కారణాలని వారంటున్నారు. డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,552 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.10,036 కోట్లు చొప్పున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.8,460 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టగా, రూ.10,810 కోట్లు డెట్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. -
పడిపోయిన ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్
ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద దిగ్గజం యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. బుధవారం ప్రకటించిన 2017 క్యూ4 ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు నికర లాభాలు 43 శాతం క్షీణించి, రూ.1,225.1 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. ఎక్కువ ప్రొవిజన్లు, తక్కువ ఆపరేటింగ్ ఇన్కమ్ తో బ్యాంకు లాభాల్లో పడిపోయినట్టు తెలిసింది. అయితే పన్నుల లాభాల్లో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు అధిగమించింది. ఈ క్వార్టర్లో పన్నుల అనంతరం బ్యాంకు లాభాలు కేవలం రూ.919 కోట్లగానే ఉంటాయని ఈటీనౌ పోల్ లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తోనే బ్యాంకు లాభాలు 111 శాతం పెరిగాయని వెల్లడైంది. డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకు లాభాలు రూ.579.57 కోట్లగానే ఉన్నాయి. గ్రాస్ ఎన్పీఏ లెవల్స్ ను బ్యాంకు స్వల్పంగా తగ్గించుకుంది. డిసెంబర్ క్వార్టర్ లో 5.22 శాతంగా ఉన్న ఎన్పీఏ లెవల్స్ ను, ఈ క్వార్టర్ లో 5.04 శాతంకు తగ్గించుకుని రూ.21,280కోట్లగా నమోదుచేసింది. మొత్తం రైటాఫ్ లు రూ.1,194కోట్లగా ఉన్నాయని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలను కూడా 2.18 శాతం నుంచి 2.11 శాతం తగ్గించుకుంది. మార్కెట్ అవర్స్ తర్వాత బ్యాంకు తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. నాలుగో క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు ధర 0.42 శాతం పెరిగి, 517.30 రూపాయలుగా ముగిసింది. -
నిరాశపర్చిన సిప్లా...కొత్త సీఈవోగా ఉమాంగ్ వోరా
న్యూఢిల్లీ: వరుసగా ఫార్మా దిగ్గజాలు శుక్రవారం ఫలితాలను నమోదు చేశాయి. ఒకవైపు సన్ ఫార్మా మెరుగైన ఫలితాలను నమోదు చేయగా, మరో ఫార్మా జెయింట్ సిప్లా ఊహించిన దానికంటే తక్కువ త్రైమాసిక లాభాన్ని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో దేశీ అయిదవ అతి పెద్ద ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. రూ.376 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనా వేయగా....కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో నికర లాభం 44 శాతం క్షీణించి , రూ. 365 (54.59 మిలియన్ డాలర్లు) కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇది రూ. 649కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 6 శాతం తగ్గి రూ. 3594 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా)లో 42 శాతం కోత పడటంతో రూ. 611 కోట్లకు దిగింది. ఇబిటా మార్జిన్లు కూడా 27.5 శాతం నుంచి 17 శాతానికి బలహీనపడ్డాయి. అయితే పన్ను వ్యయాలు రూ. 242 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు తగ్గాయి. ఇక ఇతర ఆదాయం రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. ఎండీ, గ్లోబల్ సీఈవో సుభాను సక్సేనా పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ పేర్కొంది. సక్సేనా స్థానంలో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉమాంగ్ వోరా సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించినట్టు తెలిపింది. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కంది. కాగా, ట్రేడింగ్ ముగిసేసరికి సిప్లా షేరు బీఎస్ఈలో 1.3 శాతం నష్టంతో రూ. 517 వద్ద నిలిచింది. -
అంచనాలకు మించి రాణించిన ఎం అండ్ ఎం
ముంబై: దేశీయ ఆటో దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి మహీంద్రా అండ్ మహీంద్రా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. స్ట్రీట్ అంచనాల ఓడించి, జూన్ క్వార్టరు కు రూ 955 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని నమోదుచేసింది. దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ ఎం అండ్ ఎం నికర విక్రయాల్లో 14 శాతం వృద్ధితో రూ 11, 942 కోట్ల సాధించినట్టు బుధవారం వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వినియోగ వాహనాల తయారీ లో 9.7 శాతం వృద్ధి సాధించింది. జూన్ త్రైమాసికంలో సమయంలో 1,10,959 యూనిట్లు విక్రయించింది. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 13 శాతం ప జంప్ అయ్యాయి. ఈ త్రైమాసికంలో 55.909 యూనిట్లను విక్రయించి, 31.6 శాతం మార్కెట్ వాటాతో విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రాక్టర్ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. 71, 785 యూనిట్ల అమ్మకాలతో ఎం అండ్ ఎం జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ట్రాక్టర్ విభాగంలో 44 శాతం మార్కెట్ షేర్ సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎంఅండ్ఎం నికర లాభం రూ. 955 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా)11 శాతం పెరిగి రూ. 1489 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 10,525 కోట్లుగా నమోదైంది. 14.1 శాతం ఇబిటా మార్జిన్లు సాధించింది. క్యూ1లో దేశీ ట్రాక్టర్ మార్కెట్లో రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఆటో విభాగం మార్జిన్లు 5.9 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. దేశీయ మార్కెట్లో తమకు మంచి వృద్ధి ఉందని, మంచి భవిష్యత్తు ఉందని ఎంఅండ్ ఎం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, మార్కెట్లలో నెలకొన్న నష్టాల పరంపరలో ఎంఅండ్ఎం షేరు అనంతరం నష్టాల్లోకి జారుకుంది. -
సిద్ధమవుతున్న 2016- 17 తెలంగాణ బడ్జెట