సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment