పడిపోయిన ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్
ముంబై : ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద దిగ్గజం యాక్సిస్ బ్యాంకు లాభాల్లో పడిపోయింది. బుధవారం ప్రకటించిన 2017 క్యూ4 ఫలితాల్లో ఏడాది ఏడాదికి బ్యాంకు నికర లాభాలు 43 శాతం క్షీణించి, రూ.1,225.1 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. ఎక్కువ ప్రొవిజన్లు, తక్కువ ఆపరేటింగ్ ఇన్కమ్ తో బ్యాంకు లాభాల్లో పడిపోయినట్టు తెలిసింది. అయితే పన్నుల లాభాల్లో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు అధిగమించింది. ఈ క్వార్టర్లో పన్నుల అనంతరం బ్యాంకు లాభాలు కేవలం రూ.919 కోట్లగానే ఉంటాయని ఈటీనౌ పోల్ లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
క్వార్టర్ క్వార్టర్ బేసిస్ తోనే బ్యాంకు లాభాలు 111 శాతం పెరిగాయని వెల్లడైంది. డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకు లాభాలు రూ.579.57 కోట్లగానే ఉన్నాయి. గ్రాస్ ఎన్పీఏ లెవల్స్ ను బ్యాంకు స్వల్పంగా తగ్గించుకుంది. డిసెంబర్ క్వార్టర్ లో 5.22 శాతంగా ఉన్న ఎన్పీఏ లెవల్స్ ను, ఈ క్వార్టర్ లో 5.04 శాతంకు తగ్గించుకుని రూ.21,280కోట్లగా నమోదుచేసింది. మొత్తం రైటాఫ్ లు రూ.1,194కోట్లగా ఉన్నాయని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలను కూడా 2.18 శాతం నుంచి 2.11 శాతం తగ్గించుకుంది. మార్కెట్ అవర్స్ తర్వాత బ్యాంకు తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. నాలుగో క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు ధర 0.42 శాతం పెరిగి, 517.30 రూపాయలుగా ముగిసింది.