![I Do Not Like The Word of Estimates, Mandira Bedi Says - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/6/mandira-bedi.gif.webp?itok=xM_R7tmW)
సాక్షి, హైదరాబాద్: ‘అంచనాలు’ అనే పదం తనకు అంతగా నచ్చదని.. మీరు కూడా దాని నుంచి బయటపడాలని బాలీవుడ్ నటి, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మహిళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. పని ఏదైనా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు. మంగళవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో జరిగిన ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చాప్టర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
వైర్డ్ ఫర్ చాలెంజెస్ అనే టాక్ సెషన్‌లో మహిళా పారిశ్రామికవేత్తలు నిపుణులతో నిండిన హాల్‌లో మందిరా బేడీ మాట్లాడుతూ.. ప్రతి మహిళా నిర్దుష్టమైన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. మందిరా బేడీ తన అనుభవాలను, జీవిత పాఠాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ శుభ్రా మహేశ్వరి, కార్యదర్శి గుంజన్ సింథీ, కోశాధికారి నిషితా మన్నె, జాయింట్ సెక్రటరీ శిల్పా రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment