mandira bedi
-
నన్ను పట్టించుకోలేదు.. అవమానంతో కుంగిపోయా.. రోజూ ఏడ్చేదాన్ని!
కొంతమంది క్రికెట్ విశ్లేషకుల వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానంటోంది నటి, యాంకర్ మందిర బేడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2003 వరల్డ్ కప్ సమయంలో క్రికెట్ ఎక్స్‌పర్ట్‌తో కలిసి పని చేశాను. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే వారి ప్యానెల్లో అమ్మాయిలు ఉండేవారే కాదు. కొత్తగా ఒక అమ్మాయి వస్తుందంటే కూడా వాళ్లేమీ ఎగ్జయిట్ అవలేదు.నాకంత అవగాహన లేదునేను అడిగే ప్రశ్నలను కొన్నిసార్లు పట్టించుకునేవారే కాదు. క్రికెట్‌పై వారికున్నంత అవగాహన నాకు ఉండేది కాదు. నేను కాస్త పిచ్చి ప్రశ్నలడిగేదాన్ని. చాలామంది క్రికెట్ ప్రియులకు కూడా ఇలాంటి ప్రశ్నలే వారి బుర్రకు తట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవి అడగడంలో తప్పేముందని అనుకునేదాన్ని. నా మనసుకు ఏది అడగాలనిపిస్తే అది మొహమాటం లేకుండా అడిగేదాన్ని. కొన్నిసార్లు లైవ్‌లోనే వాళ్లు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు కాదు. పట్టించుకోనట్లు ఉండేవారు. అవమానంతో తల దించుకున్నా..షో అయిపోయాక అవమాన భారంతో తల దించుకుని ఏడ్చేదాన్ని. అసలు ఏం చేయాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనేది ఎవరూ చెప్పలేదు, ఒక్కరూ సపోర్ట్‌గా నిలబడలేదు. వారం రోజులు భయపడుతూనే హోస్టింగ్ చేశాను. మధ్యమధ్యలో తడబడేదాన్ని. నాతో పాటు ఉండే మేల్ హోస్ట్ చక్కగా వారితో కలిసిపోయేవాడు. ఒక వారం తర్వాత ఛానల్ నిర్వాహకుల నుంచి పిలుపొచ్చింది. నన్ను తీసేస్తారేమో అనుకున్నాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేవాళ్లేమో షో అంతా బోరింగ్‌గా ఉంది.. కాస్త జోష్ తీసుకురా అని చెప్పారు. అప్పుడు నేను నా విధానాన్ని మార్చుకున్నాను. భయాన్ని వదిలేశాను. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తీరాలని గట్టిగా అడిగేదాన్ని. వారం రోజుల నరకం తర్వాత నేను మామూలయ్యాను. అందరితోనూ సరదాగా కలిసిపోయాను. ఒకసారి టైగర్ పఠౌడీ స్టూడియోకు వచ్చినప్పుడు.. అందరూ మాట్లాడుకుంటున్న మందిరా బేడి మీరే కదా అని అడిగాడు' అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. సినిమాల్లోనూ..కాగా మందిరా బేడి ఛాంపియన్స్ ట్రోఫీ (2004 & 2006)తో పాటు ఐపీఎల్ రెండో సీజన్‌కు, 2007 వరల్డ్ కప్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మందిర బేడీ.. యాంకర్‌గా, నటిగా ఫేమస్. ఈమె మన్మథ మూవీలో సైకియాట్రిస్ట్‌గా, సాహోలో కల్కిగా నటించింది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె స్మోక్, రోమిల్ అండ్ జుగల్, ఖుబూల్ హై 2, సిక్స్ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ -
‘అంచనాలు’ అనే పదం అంతగా నచ్చదు: బాలీవుడ్ నటి
సాక్షి, హైదరాబాద్: ‘అంచనాలు’ అనే పదం తనకు అంతగా నచ్చదని.. మీరు కూడా దాని నుంచి బయటపడాలని బాలీవుడ్ నటి, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మహిళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. పని ఏదైనా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు. మంగళవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైర్డ్ ఫర్ చాలెంజెస్ అనే టాక్ సెషన్లో మహిళా పారిశ్రామికవేత్తలు నిపుణులతో నిండిన హాల్లో మందిరా బేడీ మాట్లాడుతూ.. ప్రతి మహిళా నిర్దుష్టమైన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. మందిరా బేడీ తన అనుభవాలను, జీవిత పాఠాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ శుభ్రా మహేశ్వరి, కార్యదర్శి గుంజన్ సింథీ, కోశాధికారి నిషితా మన్నె, జాయింట్ సెక్రటరీ శిల్పా రాజు పాల్గొన్నారు. -
పిల్లల కోసమే బతికి ఉన్నా: నటి మందిరా
బాలీవుడ్ నటి, మందిరా బేడీ క్రికెట్ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆమె భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ కౌశల్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో సడెన్‌గా మరణించాడు. ఆయన మృతి అనంతరం క్రమంగా కొలుకున్న ఈ నటి తన పనిలో పడిపోయింది. వర్క్‌లో ఎంత బిజీగా ఉన్న కుదిరినప్పుడల్లా భర్తపై ఉన్న ప్రేమని సోషల్ మీడియాలో వ్యక్త పరుస్తూనే ఉంటోంది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు. పిల్లల కోసం మాత్రమే తాను బతుకుతున్నట్లు ఓ ఇంటర్వూలో నటి తెలిపింది. ఓ ఇంటర్వూలో భర్త మరణం తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై మందిరా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా పిల్లలే నా ప్రపంచం. విషాదం నుంచి కోలుకోవడానికి మోటివేషన్ వాళ్లే. వాళ్ల కోసం ఏదైనా చేస్తాను. నిజానికి నేను బతికి ఉండడానికి కారణం వారే. వారికి మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నాను’ అని ఈ నటి చెప్పుకొచ్చింది. లైఫ్‌లో వచ్చే ఎత్తుపల్లాలతోనే గొప్ప పాఠాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ బ్యూటీ ప్రస్తుతం రెమిడీ నవ్ ఒరిజినల్ షో ‘ది లవ్ లాఫ్ లైవ్’ సీజన్ 3కి పనిచేస్తోంది. ఇంతకుముందు ‘దిల్వాలే దుల్హానియా లే జాయేంగే’,‘దస్ కహానియా’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అంతేకాకుండా 2003, 2007 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లకు, ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు ఐపీఎల్-2కు క్రికెట్ ప్రెజంటర్గా వ్యవహారించింది. చదవండి: మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. ఆయనే నా జీవితం: మందిర View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) -
మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. నా జీవితం: నటి భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త, సినీ దర్శకుడు రాజ్ కౌశల్‌ను గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా భర్తను స్మరించుకున్న మందిరా బేడీ వారిద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘ఆగస్టు 15 ఎల్లప్పుడూ వేడుకగా ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్ర్య దినోత్సవం, రాజ్ పుట్టిరోజు. హ్యాపీ బర్త్‌డే రాజీ.. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీవు మమ్మల్ని చూస్తున్నావని ఆశిస్తున్నా. నీవు లేని ఈ శూన్యత ఎన్నటికీ పూరించలేం. నీవు మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. మా జీవితం ’’ అని ఎమోషనల్ అయ్యారు. మందిరా బేడీ మళ్లీ తన పనిలో.. ఆగష్టు 14న మందిరా బేడీ తన కొత్త ఫోటోను షేర్ చేసింది. ఆమె మళ్లీ తన పనిలో నిమగ్నమైనట్లు అభిమానులకు తెలియజేసింది. ఈ ఫోటోలో ఆమె మెరూన్ జాకెట్, బూడిద, నలుపు రంగు చీరను ధరించి ఉంది. ఆమె స్మోకీ కళ్ళతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. " అందరికీ కృతజ్ఞతలు. నేను తిరిగి పని మొదలు పెట్టాను. మీరు నా పై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఆరోగ్యం ఉన్నాను.’’ అంటూ కామెంట్ చేశారు. కాగా మందిర- రాజ్ కౌశల్‌ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్‌గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్ నిఖిల్, ప్యార్ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కౌశల్.. సుమారు 800కు పైగా యాడ్స్‌ను ప్రొడ్యూస్ చేశారు. View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) -
నా రాజీ.. గుండె బద్ధలవుతోంది: మందిర భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త రాజ్ కౌశల్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక. నా హృదయం ముక్కలైంది’’ అని ఎమోషనల్ అయ్యారు. కాగా సినీ దర్శకుడు రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరానే స్వయంగా భర్త అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పు కుండ చేతబట్టి తానే అంతిమ సంస్కారాలు చేసి తనలోని సగ భాగానికి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఆమెపై విద్వేషపు విషం చిమ్మారు. కొడుకు ఉండగా, మందిర ఇలా ఎందుకు చేసిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు మాత్రం మందిరకు మద్దతుగా నిలబడి ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. ఇక మందిర- రాజ్ కౌశల్‌ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్‌గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్ నిఖిల్, ప్యార్ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కౌశల్.. సుమారు 800కు పైగా యాడ్స్‌ను ప్రొడ్యూస్ చేశారు. -
ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు
ఎంత ఏడ్చినా ఇంటి దగ్గరే ఏడ్వాలి. ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ దగ్గరే మొత్తుకోవాలి. చివరి యాత్ర మొదలుకాక ముందే స్త్రీల అనుబంధం ముగుస్తుంది మన సమాజంలో. అంతిమ సంస్కారాలలో పాల్గొనే హక్కు ఆమెకు లేదా? నటి మందిరా బేడీ తన భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. దానికి జవాబూ చెబుతున్నారు. అంతిమ వీడ్కోలు చెప్పే హక్కు స్త్రీలకు ఎందుకు లేదు అనేది ఇప్పుడు ప్రశ్న. 2018లో వారణాసిలో ఒక ఘటన జరిగింది. ఆ ఊళ్లో నివాసం ఉండే 95 ఏళ్ల సంతోరి దేవి కొన ఊపిరితో ఉండగా తాను మరణించాక అంతిమ సంస్కారాలు కుమార్తె పుష్పవతి పాటిల్ చేయాలని కోరింది. అంతే కాదు తన బంధువుల్లోని స్త్రీలే అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలని చెప్పింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్క కూతురు పుష్పవతి పాటిల్. ఇద్దరు కొడుకులు ఉన్నా కూతురే ఎందుకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలి అనంటే ‘మగవాళ్లకే ఆ హక్కు ఉండటం నాకు ఇష్టం లేదు’ అని ఆ పెద్దావిడ చెప్పింది. ఆమె పిల్లలను అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా పెంచింది. అందుకే మరణించాక కూతురే దహన కర్మలు నిర్వహించింది. సోదరులు అందుకు మద్దతుగా నిలిచారు. ఈ వార్త గొప్ప ప్రచారం పొందింది. దక్షణాదిలో కూడా రెండు మూడు సందర్భాలలో కూతుళ్లే చితి మంట పెట్టడం వంటి వార్తలు వచ్చాయి. ఇటీవల కరోనా సమయంలో తండ్రి పాడెను మోసిన కుమార్తెల చిత్రాలు వచ్చాయి. దుఃఖ సమయంలో ఎవరి దుఃఖ ప్రకటన వారిదిగా ఉంటుంది. కొందరు తమ వారిని చిట్టచివరి క్షణం వరకూ చూసుకోవాలని అనుకోవచ్చు. దగ్గరగా ఉండి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారి ఆత్మలు సంతృప్తి పడతాయి అనుకోవచ్చు. లేదా తమకు శాంతి అనుకోవచ్చు. అది వ్యక్తిగతం. కాని అది సామాజికం అని ఇతరుల స్పందన వల్ల తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మందిరా బేడి విషయంలో అదే అయ్యింది. భర్త అంతిమ సంస్కారాల సమయంలో .. నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది... నటి మందిరా బేడీ భర్త, దర్శకుడు అయిన రాజ్ కౌశల్ జూన్ 30న 49 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించాడు. ఇలాంటి సంఘటన ఎవరికైనా చాలా పెద్ద విషాదమే. మందిరా బేడికి ఇద్దరు సంతానం. ఆ దంపతులు ఆ సంతానంతో దిగే ఫొటోలు, పిల్లల గురించి మందిరా చెప్పే విశేషాలు సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూస్తూనే వచ్చారు. అలాంటిది సడన్‌గా భర్త చనిపోవడం చాలా పెద్ద షాక్‌కు గురి చేసి ఉంటుంది మందిరాకు. ఆమె భర్త అంతిమ సంస్కారాల్లో పాల్గొంది. పాడె ముందు నిప్పుకుండ పట్టుకుని నడిచింది. చితి మండే వరకూ దహనవాటికలోనే ఉంది. అయితే ఈ ఫొటోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చాయో విమర్శలు మొదలయ్యాయి నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది అని. ఆ బట్టలు ఏమిటి? ‘స్త్రీలు దుఃఖాన్ని నిభాయించుకోలేరు... అంతిమ సంస్కారాలు చూడలేరు... ఆ సమయంలో వారు పాల్గొంటే చనిపోయిన వారి ఆత్మకు సద్గతి లభించదు’... అని కామెంట్లు వచ్చాయి. సరే.. అవి సంప్రదాయవాదుల కామెంట్లు అనుకున్నా కొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఆ బట్టలేమిటి అని కూడా అన్నారు. ఆ సమయంలో మందిర జీన్స్ ప్యాంట్, వైట్ టాప్ వేసుకుని ఉండటమే ఇందుకు కారణం అట. స్త్రీలు వెళ్లడానికి అనుమతి లేని చోట వెళ్లకపోవడమే కరెక్ట్ అని విమర్శలు వచ్చాయి. ఆ మాట చెప్పడానికి మీరెవరు? అయితే మందిరా మీద ఇలాంటి అటాక్ మొదలైన వెంటనే మహిళా వాదులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. స్త్రీలు ఎలా దుఃఖపడాలో, ఏ మేరకు దుఃఖ పడాలో, ఆప్తుల మరణంలో ఏ చర్యలు చేయాలో చేయకూడదో మగవాళ్లు ఎంత కాలం డిసైడ్ చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. గాయని సోనా మహాపాత్ర, టీవీ యాంకర్ మిని మాథుర్ వీరిలో ఉన్నారు. ‘దుఃఖంలో ఉన్న స్త్రీని అనడానికి వీరెంత బుద్ధిలేనివారో అనిపిస్తోంది’ అని వారు అన్నారు. టెలివిజన్ నటి శ్వేతా తివారి అయితే ‘మందిరా... మేము నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని వ్యాఖ్యానించింది. డాన్సర్ ముక్తి మోహన్ ‘మానవాళిలో సగం మనం. కాని ఇప్పటి వరకూ ఈ సగానికి సరైన మర్యాద, గౌరవం దక్కలేదు. మనల్ని మనమే దెబ్బ తీసుకున్నాం. అందరూ ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. మనం ఎంత ఏడ్వాలో మనకు ఇంకా ఎంతకాలం చెబుతారు’ అని వ్యాఖ్యానించింది. కొరివి పెట్టే కొడుకు పుట్టాలనుకునే రోజులు పోయి ఒక్క అమ్మాయి పుడితే సంతోషపడి బాగా పెంచుకుందాం అనుకుని ఆపరేషన్ చేయించుకున్నవారు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక్క అమ్మాయి ఉన్న ఇంటికి ఉన్న అంగీకారం ఆ ఒక్క అమ్మాయో లేదా భార్యో ఇటువంటి సందర్భాల్లో ఇది తన కర్తవ్యం అనుకుంటే అంగీకరించాల్సిన వాతావరణం ఏర్పడాల్సి ఉంది. స్త్రీలు ఏర్పరిచేలానే ఉన్నారు. -
‘జీన్స్.. టీషర్టు.. ఆ అవతారమేంటి’; గుండె పగిలి ఆమె ఏడుస్తుంటే..
ముంబై: ‘‘అయ్యో.. అదేమిటి.. కొడుకు ఉండగా భార్య అంత్యక్రియలు చేయడమేంటి? పైగా జీన్స్.. టీ షర్టు, చెప్పులు, చేతికి వాచీ.. ఆ అవతారమేమిటి. ఇదెక్కడి చోద్యం. ఎందుకు ఈమె ఇలా చేసింది. సెలబ్రిటీ అయితే మాత్రం ఏం చేసినా చెల్లుతుందా. అసలు ఏమనుకుంటోంది’’.. మందిరా బేడీని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు చేస్తున్న తీవ్ర విమర్శలు ఇవి. భర్త అంతిమ సంస్కారాలను స్వయంగా నిర్వర్తించినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మందిరకు పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. భర్తపై ఆమె ప్రేమను చూడాలే తప్ప.. ఇలా విద్వేషపూరితంగా వ్యవహరించడం సరికాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, సింగర్ సోనా మొహాపాత్ర మాత్రం ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇంతకంటే పిచ్చితనం ఏమీ ఉండదంటూ మందిరను టార్గెట్ చేసిన వారికి చురకలు అంటించారు. ఈ మేరకు... ‘‘తన భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియల సమయంలో మందిరా బేడి ధరించిన దుస్తులపై కొంతమంది ఇంకా విపరీతపు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇవేమీ కొత్తకాదు. మనల్ని ఆశ్చర్యపరిచేవీ కావు. మన ప్రపంచంలో స్టుపిడిటీ కంటే ఇంకేదైనా పెద్ద విషయం ఉండదు కదా’’అంటూ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పలువురు ఫాలోవర్లు సోనా పోస్టును అభినందిస్తున్నారు. ‘‘ ఆపత్కాలంలో సానుభూతి ప్రదర్శించాలే తప్ప.. ఆమె ఎలాంటి దుస్తులు వేసుకుంది. ఎలా రెడీ అయింది అంటూ కామెంట్లు చేయడం సిగ్గుచేటు. గుండె పగిలి ఆమె ఏడుస్తుంటే.. వీరికి మాత్రం కట్టూబొట్టూ గురించి కావాల్సి వచ్చిందా. మీరు చెప్పింది కరెక్ట్ సోనా. పిచ్చి పీక్స్‌కు వెళ్లింది చాలా మందికి’’ అంటూ మందిరకు అండగా నిలుస్తున్నారు. కాగా ప్రముఖ నటి మందిరా బేడి భర్త, ఫిల్మ్ మేకర్ రాజ్ కౌశల్(49) గుండెపోటుతో బుధవారం(జూన్ 30) కన్నుమూసిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరా తానే భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి పదేళ్ల కుమారుడు వీర్, దత్తత కూతురు తార ఉన్నారు. ఓ సింగింగ్ షోలో సోనా మొహాపాత్ర That some people are still commenting on Mandira Bedi’s dress code or choice to carry out her husband Raj Kushal’s last rites shouldn’t surprise us. Stupidity is more abundant than any other element in our world after all .. — Sona Mohapatra (@sonamohapatra) July 2, 2021 -
‘4 గంటల సమయంలో గుండెపోటు.. అప్పటికే ఆలస్యమైంది’
ముంబై: ‘‘ఆరోజు సాయంత్రం నుంచే తను చాలా నీరసంగా ఉన్నాడు. టాబ్లెట్ కూడా వేసుకున్నాడు. మధ్యరాత్రి గుండె నొప్పి మొదలైంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రాజ్ పరిస్థితి విషమించింది. తనకు గుండెలో విపరీతంగా నొప్పి వస్తోందని మందిరకు చెప్పాడు. వెంటనే తను ఆశిష్ చౌదరికి ఫోన్ చేసింది. ఇద్దరూ కలిసి రాజ్‌ను కారులో కూర్చోబెట్టి లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే రాజ్ స్పృహ కోల్పోయాడు. సమయానికి హాస్పిటల్‌కు చేరుకుంటామని వారు భావించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. పది నిమిషాల్లోనే రాజ్ పల్స్ ఆగిపోయినట్లు వారు గుర్తించారు. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది’’ అంటూ బాలీవుడ్ సంగీత దర్శకుడు సులేమాన్ మర్చంట్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ప్యార్ మే కభీ కభీ’’ సినిమా సమయం కంటే ముందు నుంచే రాజ్ కౌశల్‌తో తనకు అనుంబంధం ఉందని స్నేహితుడిని గుర్తుచేసుకున్నాడు. బాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ నటి మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ జూన్ 30న కన్నుమూసిన విషయం విదితమే. గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో పలువురు బీ-టౌన్ సెలబ్రిటీలు ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. ఈ క్రమంలో... ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సులేమాన్ మర్చంట్... ‘‘రాజ్‌కు 30-32 ఏళ్ల వయస్సు ఉన్నపుడు అనుకుంటా ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి తను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ విధి రాత మరోలా ఉంది. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్ననాటి నుంచే నాకు పరిచయం. అంతేకాదు... తన మొదటి సినిమా ప్యార్ మే కభీ కభీకి నేనూ, సలీం కలిసి సంగీతం అందించాం. అప్పటి నుంచి తనతో నా అనుబంధం కొనసాగుతోంది. 25 ఏళ్ల స్నేహం మాది. తను ఎంతో మంచివాడు. తన ఇక లేడు అన్న వార్త ఇంకా జీర్ణించుకోలకపోతున్నాను. ఇంతకంటే షాకింగ్ మరొకటి ఉండదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా మందిరా బేడి- రాజ్ కౌశల్ 1999లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2011లో వీరికి కుమారుడు జన్మించగా, వీర్‌గా నామకరణం చేశారు. అంతేగాక గతేడాది జూలైలో తార అనే నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు. -
వైరల్: కన్నీరు పెట్టిస్తున్న రాజ్ కౌశల్ చివరి పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌశల్ ఇవాళ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, సినీ నటీనటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చివరి పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఆదివారం వీకెండ్ సందర్భంగా ఆయన స్నేహితులు, భార్య మందిర బేడీతో సందడి చేసినట్లు కౌశల్ తన చివరి పోస్టులో రాసుకొచ్చారు. ఇది చూసి ఆయన ఫాలోవర్స్, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆదివారం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆయన భార్య సాగరిక ఘాట్కే, నటి నేహా దూపియా, అంగద్ బేడి, భార్య మందిరా బేడిలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘సూపర్ సండే, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫన్’ అంటూ షేర్ చేశారు. అది చూసి ‘మూడు రోజుల క్రితమే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన కౌశల్ ఇలా మృత్యువాత పడటం తీవ్రం కలచివేస్తోంది’, ‘ఇదే ఆయన చివరి పోస్టు అని తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఫొటోను నేహా దూపియా షేర్ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. View this post on Instagram A post shared by Raj Kaushal (@rajkaushal) ‘రాజ్ ఈ ఫొటోను మనం ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం గుర్తుగా తీసుకున్నాము. కానీ నువ్వు మా మధ్య ఎప్పటికి ఉండవనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ మై స్ట్రాంగ్ లేడీ, ఈ సమయంలో నిన్ను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదంటూ మందిరా, ఆమె కుమారుడు వీర్, కూతురు తారాలను ఉద్దేశిస్తూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా రాజ్ కౌశల్ తన కుమారుడు వీర్, కూతురు తారాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన కౌశల్ పోస్టులు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) చదవండి: Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత -
గుండె బద్దలైంది.. సారీ మందిరా!
సాక్షి,ముంబై: ప్రముఖ నటి, మోడల్ మందిరా బేడీ భర్త రాజ్కౌశల్ ఆకస్మిక మరణం పలువుర్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో బాలీవుడ్ నటీ నటులతో పాటు, మందిరా దంపతుల స్నేహితులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందిరా బేడీకి, ఆమె కుటుంబ సభ్యలుకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ముఖ్యంగా ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, కబీర్‌బేడీ, మాధవన్, నటి నేహా ధూపియా, మనోజ్‌బాజ్‌పాయ్ తోపాటు, సింగర్ విశాల్ దాద్లానీ తమ సానుభూతి ప్రకటించారు. 49 సంవత్సరాల చిన్న వయసులో ఆయన మరణం తీరని విషాదమంటూ ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్ దర్శకత్వంలో వచ్చిన ఆంథోనీ కౌన్ హై మూవీలో నటించిన మినీషా లాంబా, ఆంథోనీ కౌన్ హై చిత్రంలో ఆయనతో పనిచేసిన అర్షద్ వార్సీ ట్విటర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కృతి కర్బందా, రణదీప్ హుడా, లారా దత్తా, రణ్వీర్ శ్రాయ్, గౌరవ్ చోప్రా, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, ఇతర ప్రముఖులు సోషల్ మీడియాద్వారా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా భర్త రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో మందిరాబేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు హ్యుమా ఖురేషి, అపూర్వ అగ్నిహోత్రి, సమీర్ సోని, రోహిత్ రాయ్, గుల్ పనాగ్, ఆశీష్ చౌదరీ తదితరులు మందిరా నివాసానికి చేరుకుని ఆమెను ఓదార్చారు. స్నేహితులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలను పూర్తి చేశారు. తీరని దుంఖంతో పిల్లలను ఓదార్చుతూ మందిరా తన భర్తకు అంతిమ సంస్మారాలను పూర్తి చేసిన వైనం కంటతడిపెట్టించింది. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా No news can be more shocking and tragic for us personally than loosing our dear friend and a fantastic human being Raj kaushal !! It will definitely take time to come to terms with this loss!! Rest in peace my friend 🙏 — manoj bajpayee (@BajpayeeManoj) June 30, 2021 Deeply saddened & shocked to know about the sudden demise of #RajKaushal! A friend, a film maker & a very positive man. Have some great memories of working with him & spending time with him few years back. Sorry dearest @mandybedi & family for your irreparable loss. 🙏#OmShanti pic.twitter.com/HrzULdJhYd — Anupam Kher (@AnupamPKher) June 30, 2021 Deepest condolences to Mandira Bedi on the tragic passing of her husband Raj Kaushal. Such a sudden and unexpected loss is deeply traumatic. My heart is with her in her great sorrow. @mandybedi #MandiraBedi — KABIR BEDI (@iKabirBedi) June 30, 2021 I just don’t know what to say. No words nor lines can express how devastating this news has been. One of the nicest guys with a heart of gold is now lighting up the heavens. Farewell my bro @rajkaushal1. Our world just got very very small. 🙏🙏🙏🙏 pic.twitter.com/KBZZz7ejVF — Ranganathan Madhavan (@ActorMadhavan) June 30, 2021 RIP #RajKaushal 🙏🏽 pic.twitter.com/X9J2oTL3Hc — Randeep Hooda (@RandeepHooda) June 30, 2021 Deepest condolences to Mandira Ma’am, her children and their family. This is so shocking. Rest in peace #RajKaushal sir. 💔 — kriti kharbanda (@kriti_official) June 30, 2021 -
ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత
ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త రాజ్ కౌశల్ బుధవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్ బాలీవుడ్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్యార్ మే కబీ కబీ, షాదీ కా లడ్డు వంటి చిత్రాలను తెరకెక్కించాడు. కొన్నేళ్ల క్రితం మందిరా బేడిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక్క కుమారుడు. అలాగే గతేడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఇక మందిరా విషయానికి వస్తే.. పలు హిందీ చిత్రాలతో పాటు, సిరియల్స్, వెబ్ సీరిస్‌ల్లో నటించింది. దక్షిణాదిన శింబు మన్మథుడు, ప్రభాస్ సాహో చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రాజ్ మృతి పట్ల బాలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: ‘హ్యాపీడేస్’ అప్పు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? -
స్పోర్ట్స్ బ్రా, షార్ట్స్‌లో అమ్మడి అదిరిపోయే వర్కవుట్స్
సాక్షి, ముంబై: యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోసారి తనదైన స్టయిల్లో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. హాట్ హాట్ వర్కవుట్స్, బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేసే మందిరా బేడీ వర్కవుట్స్‌పై తనకున్న మక్కువను మరోసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అమ్మడు అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మందిరా. ప్రతీ రోజూ కీలకమే..లవ్లీడేనే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అందరూ మంచి ఆరోగ్యం, శాంతితో ఆనందంగా ఉండాలని కోరుకుంది. ఈ అనిశ్చిత పరిస్థితులను ప్రతి ఒక్కరూ కరుణ, ప్రేమతో అధిగమించాలని సూచించిందీ భామ. కాగా ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే మందిరా బేడీకి వర్కవుట్స్ చేయడం చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే అనేక ఫోటోలు, ఫిట్నెస్ మంత్రాతో సోషల్ మీడియాలో చాలాసార్లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) -
బాత్ టబ్ వద్ద బికినీలో నటి వర్కవుట్లు
హిందీ పరిశ్రమలో మందిరా బేడి నటిగా గుర్తింపు పొందారు. దాంతోపాటు ఆమె ఫిట్నెస్ నిపుణురాలిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమె వర్కవుట్ చేస్తున్న వీడియో సెగలు రేపుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె వీడియో ట్రెండవుతోంది. బికినీ వేసుకుని.. బాత్ టబ్ వద్ద ఎక్సర్సైజ్లు చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మందిరా బేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాత్ టబ్ వద్ద బికినీలో వర్కవుట్‌లో చేస్తూ కనిపించింది. బాత్ టబ్ సహాయంతో కూడా కొన్ని వర్కవుట్ చేసింది. ఆమె బాలీవుడ్లో ఫిట్నెస్ గురుగా గుర్తింపు పొందారు. లంగ్ కిక్స్, గ్లబ్ బ్రిడ్జెస్, ట్రెసప్ డిప్స్ వంటి వర్కవుట్లు మందిరా బేడీ చేశారు. ఆమె గతేడాది తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. రోజు వ్యాయామం / వ్యాయామం.. నా కార్యాచరణ అంతే అని ఆమె పేర్కొంటుంటారు. దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రంలో ప్రీతి సింగ్ పాత్రలో మందిరా బేడీ నటించారు. 48 ఏళ్ల మందిరా బేడి వర్కవుట్లు చూస్తుంటే కుర్రకారు షాక్‌కు గురవుతున్నారు. View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
అవును 365 రోజులు.. గర్వంగా ఉంది: నటి
ముంబై: నటి మందిరా బేడి తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన ఆమె ఇంట్లోనే యోగా, వ్యాయామం చేస్తున్న వీడియోలను తన అభిమానులకు షేర్ చేయడమే కాకుండా, వాళ్లు కూడా వ్యాయామం చేస్తూ ఫిట్ ఉండాలని సూచించారు కూడా. నాలుగు పదుల వయసులో కూడా మందిరా బేడి ఫిట్నెస్తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నారు. (చదవండి: రొమాంటిక్‌కి గెస్ట్) ప్రతిరోజు వ్యాయామం చేసినట్లు మందిరతన ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. ‘#365daysofexercise ఈ రోజు పూర్తయింది !! అవును.. రోజు వ్యాయామం / వ్యాయామం / నా కార్యాచరణ అంతే. తప్పిపోకుండా సంవత్సరం పాటు వ్యాయవం చేశాను. ఈ రోజుతో సంవత్సరం పూర్తైంది. గర్వంగా ఉంది. నాకు సపోర్టు చేసిన వారందరికి కృతజ్ఞతలు’ అంటూ ఆమె పోస్టు చేశారు. చివరిగా మందిరా రెబల్ స్టార్ ప్రభాస్-శ్రద్దా కపూర్ జంటగా నటించిన ‘సాహో’లో నటించారు. View this post on Instagram #365daysofexercise got DONE today!! YESSSSSSS 🤟🏽 One year of not missing a day of exercise/workout/activity. Today. I. Am. Proud. Of. Me. ❤️❣️ #gratitude Thank you @jitusavlani for the lovely pictures to commemorate this special day ❤️ A post shared by Mandira Bedi (@mandirabedi) on Aug 12, 2020 at 7:10am PDT -
బ్యూటీ ‘మేకప్’
-
రొమాంటిక్‌కి గెస్ట్
రామ్ ఇప్పటివరకు అతిథి పాత్రల్లో కనిపించలేదు. వచ్చే ఏడాది ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. పూరి జగన్నాథ్ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ కథానాయిక. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ గెస్ట్‌గా నటించారనే వార్త బయటికొచ్చింది. సినిమాలో ఓ సర్ప్రైజ్గా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారట రామ్. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. -
సాహో పోస్టర్: కల్కిగా మందిరాబేడీ
‘సాహో’ పోస్టర్ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు ‘కల్కి’ పాత్ర పోషించిన మందిరా బేడి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో నటించిన వారి పాత్రలను పరిచయం చేస్తూ గత కొన్ని రోజులుగా చిత్ర దర్శకుడు సుజీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘గుడ్ ఇస్ బ్యాడ్’ (మంచి చెడుగా మారినప్పుడు) అనే ట్యాగ్‌తో వచ్చిన ఈ పోస్టర్లో మందిరా మెటాలిక్ బ్లాక్, గ్రే కలర్ శారీలో చిన్న జుట్టుతో సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. దీంతో పాటు జెన్నిఫర్‌గా నటించిన హాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దాదాపు 90 కోట్ల ఖర్చుతో అబుదాబిలో చిత్రీకరించారు. ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమాలో ఇదే హైలెట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరోవైపు సాహో ట్రైలర్‌ను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తామని నిర్మాతలు ట్విట్టర్లో ప్రకటించారు. -
ఎంత కష్టం వచ్చిందో
ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్ చేయాలి. దానికోసం రెండు భాషల్లో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కోసం రెండు సినిమాల కష్టం పడాల్సిందే అంటున్నారు శ్రద్ధా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సాహో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. పెద్ద సెట్స్, లొకేషన్స్ చేంజ్‌లు ఉన్నాయి. అలాగే ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం కావడంతో ప్రతీ సీన్ రెండు సార్లు యాక్ట్ చేయాలి. ఒకసారి తెలుగులో యాక్ట్ చేస్తాం. అది బాగా వస్తే మళ్లీ అదే సీన్‌ని హిందీలో చేయాలి. అలా కాకపోతే మరోలా. ఈ సినిమా కోసం నా లైన్స్ నేనే గుర్తు పెట్టుకుంటున్నా. కొత్త భాషలో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. చాలా టైమ్ కూడా పడుతుంది. పేరుకి ఒక్క సినిమా అయినా కష్టం రెండు సినిమాలది. అయినా ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవెలిన్ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
దొంగా.. దొంగా
‘బాహుబలి’ సినిమాలో ఊళ్ల మీద పడి దోచేసుకునే దొంగలను తన ఎత్తులతో పనిపడతాడు అమరేంద్ర బాహుబలి. ఆ పాత్రలో ప్రభాస్ కటౌట్ సూపర్. ఇప్పుడీ కటౌట్ దొంగగా కనిపిస్తే.. కచ్చితంగా మంచి దొంగే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దొంగ లోకల్ దొంగ కాదు ఇంటర్నేషనల్ దొంగ అట. ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని చిటికెలో దాటేస్తాడట. ఇంటర్ పోల్‌ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తాడట. అసలు విషయం ఏంటంటే.. ‘సాహో’ సినిమాలో ప్రభాస్ పురాతన వజ్రాలు దొంగిలించే క్రేజీ దొంగ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయిక. ప్రభాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్లో శ్రద్ధ కనిపించనున్నారు. మరి ఈ దొంగా పోలీస్ ఆట ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం:శంకర్ ఎహాసన్ లాయ్. -
అందగాడే నిండు చందురూడే!
ప్రభాస్‌ను మందిరా బేడీ ఓ... పొగిడేస్తోంది! అట్లా ఇట్లా కాదు. ఓ లెవల్లో మొత్తం బాలీవుడ్‌ని జల్లెడేసి పట్టినా ప్రభాసంతటోడు లేడనేసింది. మందిర అన్నదని కాదు కానీ, ప్రభాస్‌కి ‘బాహుబలి’ భలే కలిసొచ్చింది. అప్పటి దాకా మనోడి హైట్ సదరన్ పీక్ అయితే ఇప్పుడు నార్త్ రాష్ట్రాలు కూడా మెడలెత్తి చూస్తున్నాయి. ఇంతకీ మందిరకి ప్రభాస్ అంతగా ఎప్పుడు నచ్చాడంటే... ‘సాహో’ షూటింగ్లో. మూడు భాషల్లో తీస్తున్న ‘సాహో’లో మందిరా బేడీ కూడా నటిస్తోంది. రోజూ సాహో బాహుబలి అంటూ ప్రభాస్ ప్రస్తావన తెచ్చి మరీ సన్మాన సభ పెట్టేస్తోందట. ప్రభాస్ సౌత్‌లోనే కాదు... నార్త్ మందిరంలో కూడా ప్లేస్ కొట్టేశాడన్నమాట?! -
సాహోలో మందిర... మరి మోహన్‌లాల్?
ఏమాత్రం తగ్గడం లేదు... నటీనటుల ఎంపిక విషయంలో! ఎక్కడా వెనకడుగు వేయడం లేదు... ఖర్చులో! ‘సాహో’ చిత్రబృందం వేస్తోన్న ప్రతి అడుగూ సంచలనమవుతోంది. ప్రభాస్‌కు తోడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు తెలిసిన నటీనటులనే దర్శక–నిర్మాతలు సుజీత్, ‘యూవీ క్రియేషన్స్’ వంశీ–ప్రమోద్‌లు ఎంపిక చేస్తున్నారు. ఇందులో విలన్లుగా బీ–టౌన్ నుంచి నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, చంకీ పాండేలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ లిస్టులోకి బీ–టౌన్ నుంచి మరో లేడీని తీసుకున్నారు. మోడల్, టీవీ హోస్ట్, నటి అయిన మందిరా బేడీ ‘సాహో’లో నటిస్తున్నారు. కల్కి అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇటీవల మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌లపై హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారట. మందిరా బేడీని పక్కన పెడితే... ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘సాహో’లో నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ వార్తపై యూనిట్ సభ్యులు ఎక్కడా స్పందించడం లేదు. త్వరలో ఈ సిన్మా దుబాయ్ షెడ్యూల్ మొదలు కానుంది. ఆల్రెడీ దర్శకుడు సుజీత్ దుబాయ్ వెళ్లారు. ఆయన లొకేషన్ల వేటలో ఉన్నారు. -
సాహోలో మరో హాట్ బ్యూటీ
బాహుబలితో నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ సాధించిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాతో అక్కడ మరింతగా పాతుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ఎక్కువగా నార్త్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన సాహో యూనిట్, ప్రతి నాయకులుగా బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలను తీసుకున్నారు. సాంకేతిక నిపుణులను కూడా బాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు సాహో టీం. సంగీత దర్శకులుగా శంకర్ ఇషాన్ లాయ్ లను ఎంపిక చేశారు. తాజాగా సాహో సెట్ లోకి మరో బాలీవుడ్ తార ఎంటర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో అలరించే బాలీవుడ్ భామ మందిర బేడీ సాహో లో కీలక పాత్రలో నటించనుందట. అది కూడా నెగిటివ్ రోల్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల కనిపిస్తున్న సాహో లో ఇంకెంత మంది ఉత్తరాది తారలు కనిపించనున్నారో. -
అభిమానులకు షాకిచ్చిన నటి
సీనియర్ నటి, మోడల్ మందిరా బేడీ హాట్‌హాట్ ఫొటోలతో అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరల్‌గా మారిన ఆ ఒక్కో ఫొటోలు ఒక్కొక్కటీ 50 వేలు తగ్గకుండా లైక్స్‌తోపాటు వందలకొద్దీ షేర్స్ వచ్చాయి. కొన్నాళ్లుగా మీడియాకు దూరమైపోయిన ఈ 45ఏళ్ల నటి.. ఒక్కసారే ఇలా సోషల్ మీడియాలో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భర్త రాజ్ కౌశల్, ఐదేళ్ల కొడుకుతో సహా మందిరా బేడి శ్రీలంకలో పర్యటించారు. శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో తారాస్థాయికి చేరింది. ఇండియాలో స్పోర్ట్స్ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్నెస్ రంగంలోనూ రాణించారు. గతంలోనూ తన భర్త, కొడుకుతో కలిసి మందిర దిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
చాలా ఎంజాయ్ చేశాం..
బాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది ఆదివారం రక్షాబంధన్‌ను ఆనందంగా జరుపుకున్నారు. తమ సోదరులు ఇంటివద్ద అందుబాటులోనే ఉండటంతో రాఖీ పండుగను ఆనందంగా గడపగలిగామని బిపాసాబసు, రిచా చద్దా వంటి హీరోయిన్లు చెప్పారు. రాఖీ పండుగను ఇంకా కొంద రు హీరోయిన్లు ఎలా జరుపుకున్నారో.. వారి మాటల్లోనే.. తాప్సీ పన్నూ: నాకు సొంత అన్నదమ్ములు లేకపోవడంతో చిన్నప్పటినుంచీ మా పెదనాన్న కొడుకులు తాజిందర్, తన్వీర్,ఉదయ్వీర్లకే రాఖీ కడుతున్నా. ఒకప్పుడు రాఖీ పండుగనాడు వారికి దూరంగా ఉంటే రాఖీతోపాటు చాక్లెట్ పంపించేదాన్ని.. ఇప్పుడు మాత్రం బహుమతి వసూలు చేస్తున్నా.. మందిరాబేడీ: నా దురదృష్టం ఏంటంటే చిన్నప్పటినుంచీ నేను, నా సోదరుడు రాఖీ బంధన్‌నాడు ఎప్పుడూ ఒకే దేశంలో ఉండలేదు. అందుకే కొరియర్ చేస్తా.. దాంతోపాటు మా అన్నకు ఇష్టమైన స్వీట్లు చేసిపెట్టమని ఒదినకు లేఖ కూడా రాస్తా. కృతి సనూన్: నాకు సొంత అన్నదమ్ములు లేరు. అందుకే నా చెల్లికే ప్రతి యేటా రాఖీ కడతాను. ఈ ఏడాది మేము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాం. ఆమె నాకు రాఖీ పంపించింది.. నేను కూడా పంపించా.. ఫోన్లోనే శుభాకాంక్షలు చెప్పుకున్నాం. అహనా కుమ్రా: ఈ ఏడాది నా బ్రదర్ ఫిలడెల్ఫియాలో ఉన్నాడు. అందుకే నేను, నా చెల్లి వాడికి రాఖీ పంపించాం. నాకు ముంబైలో కజిన్ ఉన్నాడు. అతడికి రాఖీ కట్టా. అలాగే ‘యుద్ధ్’ సినిమాలో నాకు అన్నగా నటిస్తున్న పవైల్ గులాటికి ఒక సన్నివేశంలో రాఖీ కట్టా. అయితే ఇప్పుడు పండుగ నాడు నిజంగా రాఖీ కడదామనుకుంటే ఢిల్లీ వెళ్లిపోయాడు. అతడు రాగానే రాఖీ కట్టి బహుమతి తీసుకోవడం ఖాయం. స్వరభాస్కర్: ఎన్నో యేళ్లుగా విదేశాల్లో ఉన్న మా అన్నయ్య ఈ పండుగ రోజు ఇంటి దగ్గర ఉంటే నేను షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉండాల్సి వచ్చింది.. రాఖీ పంపించా.. అతడు కొత్తగా ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందాలని దేవుడికి ప్రార్థించా. రిచా చద్దా: ముంబైలోనే మా కజిన్‌కు రాఖీ కట్టి నేను సొంతంగా తయారుచేసిన డాల్ కిచిడీ పెట్టా. బిపాసాబసు: నేను నా ‘మూ-బోలా’ భాయ్ సోహమ్ షా కు రాఖీ కట్టా.. తర్వాత కలిసి స్వీట్ తిన్నాం..