సాహోలో మందిర... మరి మోహన్‌లాల్?
ఏమాత్రం తగ్గడం లేదు... నటీనటుల ఎంపిక విషయంలో! ఎక్కడా వెనకడుగు వేయడం లేదు... ఖర్చులో! ‘సాహో’ చిత్రబృందం వేస్తోన్న ప్రతి అడుగూ సంచలనమవుతోంది. ప్రభాస్‌కు తోడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు తెలిసిన నటీనటులనే దర్శక–నిర్మాతలు సుజీత్, ‘యూవీ క్రియేషన్స్’ వంశీ–ప్రమోద్‌లు ఎంపిక చేస్తున్నారు. ఇందులో విలన్లుగా బీ–టౌన్ నుంచి నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, చంకీ పాండేలను తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడీ లిస్టులోకి బీ–టౌన్ నుంచి మరో లేడీని తీసుకున్నారు. మోడల్, టీవీ హోస్ట్, నటి అయిన మందిరా బేడీ ‘సాహో’లో నటిస్తున్నారు. కల్కి అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇటీవల మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌లపై హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారట. మందిరా బేడీని పక్కన పెడితే... ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ‘సాహో’లో నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ వార్తపై యూనిట్ సభ్యులు ఎక్కడా స్పందించడం లేదు. త్వరలో ఈ సిన్మా దుబాయ్ షెడ్యూల్ మొదలు కానుంది. ఆల్రెడీ దర్శకుడు సుజీత్ దుబాయ్ వెళ్లారు. ఆయన లొకేషన్ల వేటలో ఉన్నారు.