సాహోలో మరో హాట్ బ్యూటీ
బాహుబలితో నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ సాధించిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాతో అక్కడ మరింతగా పాతుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ఎక్కువగా నార్త్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన సాహో యూనిట్, ప్రతి నాయకులుగా బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలను తీసుకున్నారు.
సాంకేతిక నిపుణులను కూడా బాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు సాహో టీం. సంగీత దర్శకులుగా శంకర్ ఇషాన్ లాయ్ లను ఎంపిక చేశారు. తాజాగా సాహో సెట్ లోకి మరో బాలీవుడ్ తార ఎంటర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో అలరించే బాలీవుడ్ భామ మందిర బేడీ సాహో లో కీలక పాత్రలో నటించనుందట. అది కూడా నెగిటివ్ రోల్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల కనిపిస్తున్న సాహో లో ఇంకెంత మంది ఉత్తరాది తారలు కనిపించనున్నారో.