అవును 365 రోజులు.. గర్వంగా ఉంది: నటి | Mandira Bedi Completes The 365 Days Exercise Challenge | Sakshi
Sakshi News home page

అవును 365 రోజులు.. గర్వంగా ఫీల్‌ అవుతున్న: నటి

Published Thu, Aug 13 2020 2:54 PM | Last Updated on Thu, Aug 13 2020 4:10 PM

Mandira Bedi Completes The 365 Days Exercise Challenge - Sakshi

ముంబై: నటి మందిరా బేడి  తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను పూర్తి చేసినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన ఆమె ఇంట్లోనే యోగా, వ్యాయామం చేస్తున్న వీడియోలను తన అభిమానులకు షేర్‌ చేయడమే కాకుండా, వాళ్లు కూడా వ్యాయామం చేస్తూ ఫిట్‌ ఉండాలని సూచించారు కూడా. నాలుగు పదుల వయసులో కూడా మందిరా బేడి ఫిట్‌నెస్‌తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నారు. (చదవండి:  రొమాంటిక్‌కి గెస్ట్‌)

ప్రతిరోజు వ్యాయామం చేసినట్లు మందిరతన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తెలిపారు. ‘#365daysofexercise ఈ రోజు పూర్తయింది !! అవును.. రోజు వ్యాయామం / వ్యాయామం / నా కార్యాచరణ అంతే. తప్పిపోకుండా సంవత్సరం పాటు వ్యాయవం చేశాను. ఈ రోజుతో సంవత్సరం పూర్తై‍ంది. గర్వంగా ఉంది. నాకు సపోర్టు చేసిన వారందరికి కృతజ్ఞతలు’ అంటూ ఆమె పోస్టు చేశారు. చివరిగా మందిరా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌-శ్రద్దా కపూర్‌ జంటగా నటించిన ‘సాహో’లో నటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement