Physical activity
-
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
కుర్చీకి అతుక్కుపోతే అంతే సంగతులు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతిప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమంఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.30 నుంచి 60 నిమిషాల వ్యాయామం⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే.. భారత్‌లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్‌గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్ల మంది 2022లో ఇనాక్టివ్‌గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.వారానికి కనీసం 150 నిమిషాలు..ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. -
కదలండి బాస్!
నగరంతో పాటు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన తాజా సమాచారం ప్రకారం.. గత 2022లో ప్రతీ ఇద్దరు వయోజనులలో ఒకరు ఆరోగ్యానికి అవసరమైన కనీసపు శారీరక శ్రమ స్థాయిని కూడా అందుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా, శారీరక శ్రమ లేని పెద్దల శాతం 31% కాగా మన దేశంలో మాత్రం ఇది 49.4% గా ఉంది. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో 57 శాతం మంది కనీసపు శారీరక శ్రమకు సైతం దూరంగా ఉన్నారని అధ్యయనం తేల్చింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి 59.9%కి చేరుతుందని రోగాల నిలయంగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిజికల్ యాక్టివిటీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలి కారణంగా పలు రకాల వ్యాధులకు చిరునామాగా నగరం మారబోతోందని గతంలోనే జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. నగరంలో 53.6 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని ఉస్మానియా ఆసుపత్రి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం అప్పట్లో ఇండియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురితమైంది. అదే విధంగా అబ్డామినల్ ఒబెసిటీ (పొత్తికడుపు పైన కొవ్వు పేరుకుపోవడం) అనేది మన నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోందని గత ఏడాది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు, పురుషుల్లో ఈ పరిస్థితికి కారణం నిశ్చల జీవన శైలేనని స్పష్టం చేసింది.శ్రమనోచని శరీరం.. వ్యాధుల కుటీరంఏదైనా సరే శారీరక కదలికను శారీరక శ్రమగా పరిగణిస్తారు. శరీరాన్ని కాకుండా మెదడుకు అధికంగా కలి్పంచే పని ఒత్తిడితో నగర జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీసుల్లో గంటల తరబడి పని, ఇంటికి ఆఫీసులకు మధ్య ప్రయాణం, వారాంతపు విరామంలో విశ్రాంతి.. ఇది శారీరక శ్రమ తగ్గిపోవడానికి పోషకాహార లోపాలకు దారితీసింది. శారీరక శ్రమ లోపం.. ప్రపంచ ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పు, ఇది దీర్ఘకాలిక వ్యాధుల భారానికి గణనీయంగా దోహదం చేస్తుంది. అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రూడిగర్ క్రెచ్ అన్నారు. గుండెపోటు స్ట్రోక్‌లతో సహా çహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాక మధుమేహం, చిత్తవైకల్యం, రొమ్ము పెద్దపేగు క్యాన్సర్లు ముప్పు వీటన్నింటికీ దారి తీస్తుందంటున్నారు.అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ..దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు రక్త పరీక్షలు పోషకాహార మార్గదర్శకాల కోసం ప్రతిరోజూ దాదాపు 5–10 మంది నగర ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ ధోరణి పేలవమైన ఆహారపు అలవాట్లు అధిక ఒత్తిడి స్థాయిల కలయిక కారణమని, వీటన్నింటికీ మూలం నిశ్చల జీవనశైలి అని చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం ఆమ్లత్వంతో సహా రోగులలో జీర్ణాశయ సమస్యలు సర్వసాధారణంగా మారా యని చెప్పారు. అలాగే.. అధిక ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా అధిక బరువుతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ కేసులలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఈ పరిస్థితులకు అనారోగ్య జీవనశైలి, ఒత్తిడి క్రమరహిత నిద్ర విధానాలు కారణమని పేర్కొన్నారు. సరైన పోషకాహారం, వ్యాయామం ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.వర్కవుట్.. వ్యాధులు అవుట్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కథనం ప్రకారం.. వారానికి 150 నిమిషాల మితమైన–తీవ్రతతో కూడిన శారీరక శ్రమ లేదా 75 నిమిషాల తీవ్రమైన–తీవ్రతతో కూడిన శారీరక వ్యాయామంలో పెద్దలు పాల్గొనాలి. నడక, సైక్లింగ్, ఆటలు మాత్రమే కాదు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులు చేయడం కూడా శారీరకంగా చురుగ్గా ఉండటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సాధారణ శారీరక శ్రమ మధుమేహం ప్రమాదాన్ని 17%, గుండె జబ్బులు, పక్షవాతం 19%, డిప్రెషన్, చిత్తవైకల్యం 28–32% అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాలను 8–28% తగ్గిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల్లో చురుకుదనం అవసరమైనంత పెరిగితే , ఏటా 4–5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా. కదలికల లోపానికి కారణాలెన్నో.. కోవిడ్ తర్వాత ఒక విధానంగా మారిపోయిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో వండిన భోజనం కంటే ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఇష్టపడటానికి ఫుడ్ డెలివరీ సేవల సౌలభ్యం దారితీసింది దాంతో విపరీతంగా పెరిగిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల వినియోగం, పెరిగిన రెడీ–టు–ఈట్ మీల్స్‌కు ప్రాధాన్యం వంటివి నిశ్చల జీవనశైలి పెరగడానికి కారణమని నగర వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు సిటీజనుల ఆహారపు అలవాట్లను తద్వారా ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని నగరానికి చెందిన పోషకాహార నిపుణురాలు రుచికా చెప్పారు. ఇటీవల రకరకాల ఆరోగ్య సమస్యలు, శారీరక చురుకుదనం లోపించిన కారణంగా నిపుణులను సంప్రదించే వారిలో యువకుల సంఖ్య గణనీయంగా ఉండడం గమనార్హం అంటున్నారామె. 100 కిలోలకు దగ్గరగా ఉన్న 17–19 సంవత్సరాల నగర యువతకు ట్రీట్ చేశానని తెలిపారు. ఈ భయంకరపరిస్థితికి తీవ్రమైన నిశ్చల జీవనశైలి కారణమని స్పష్టం చేశారు. వీరిలో కొందరు ప్రీ–డయాబెటిస్ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.కనీస నడక లేకుంటే కష్టాలే.. ప్రస్తుతం నగరవాసుల్లో చాలా మందికి కనీసపు శారీరక శ్రమ ఉండడం లేదు. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. మేం ప్రిస్క్రిప్షన్‌లో మందులు మాత్రమే కాదు వాకింగ్, వ్యాయామాల గురించి కూడా చెబుతున్నాం. ఓ వ్యక్తి రోజుకు కనీసం 5వేల నుంచి 6వేల అడుగులు నడవాలి. యుక్త వయసు్కలు 2వేల అడుగులు కూడా నడవడం లేదు. మరి రోగాలు రాకుండా ఎలా ఆపగలం? ముఖ్యంగా హృద్రోగాలు, హార్ట్ ఎటాక్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోవడానికి కదలిక లేని జీవనశైలే కారణం. ముందుగా 15 నుంచి 20 నిమిషాల నడకతో ప్రారంభించి ఏదైనా ఆసక్తి ఉన్న ఆటలు ఆడడం.. ఇలా శారీరక కదలికల్ని రోజువారీ జీవితంలో భాగం చేయాల్సిందే దీనికి ప్రత్యామ్నాయం లేదని అందరూ గుర్తించాలి. – డా.కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇనిస్టిట్యూట్ -
ఈ స్మార్ట్ రింగ్ ఫింగర్లో ఉంటే ఫికర్ లేదు!
ఫిట్నెస్ ట్రాకర్‌గా పనిచేసే స్మార్ట్ రింగ్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ భారతదేశంలో విడుదల చేసింది. చేతి వేళ్లకు ధరించగలిగేలా తయారు చేసిన రింగ్ యూజర్ల బయోమెట్రిక్స్, రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ నీరు, చెమట నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యాయామ సెషన్లు లేదా నీళ్లలో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. స్టెప్ కౌంట్, నడిచిన దూరం, కేలరీలు ఎంత మేర కరిగాయి, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలతో సహా అనేక రకాల ఆరోగ్య కొలమానాలను ఈ స్మార్ట్ రింగ్ ట్రాక్ చేస్తుంది. ఇందులో బాడీ రికవరీ ట్రాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ వేరియబిలిటీ అనాలిసిస్‌తో పాటు ఓవరాల్ యాక్టివిటీ రికార్డులను ఉపయోగించి యూజర్ల మొత్తం ఆరోగ్య స్థితి గురించి తెలియజేస్తుంది. శారీరక శ్రమను ట్రాక్ చేయడంతో పాటు నిద్రను కూడా ఈ స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుంది. మొత్తం నిద్ర వ్యవధి, వివిధ నిద్ర దశలలో గడిపిన సమయం సంభావ్య నిద్ర భంగం వంటి అంశాలను కవర్ చేస్తూ సమగ్ర స్లీప్ డేటాను అందిస్తుంది. ఇక రుతుక్రమం ఉన్న మహిళల కోసం రుతు చక్రాలను ట్రాక్ చేసే, అంచనా వేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సమాచారాన్ని నేరుగా యూజర్ల ఫోన్‌కు నోటిఫికేషన్లు, రిమైండర్ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్య ప్రమాణాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే ఈ స్మార్ట్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని బోట్ సంస్థ పేర్కొంది. -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
లైట్ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: 2022 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 141.7 కోట్లు. అందులో 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సుగలవారు 34 శాతం మంది ఉన్నారు. ఆ వయస్సుగల పిల్లలు, టీనేజర్లు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల మధ్య వయస్సుగల వారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 11–17 ఏళ్ల మధ్య వయస్సువారు రోజుకు కనీసం 60 నిముషాలు కఠిన లేదా మధ్యస్థ వ్యాయామం చేయాలని సూచించింది. ఇక 18 ఏళ్ల పైబడినవారిలో పురుషుల్లో 25 శాతం, మహిళల్లో 40 శాతం శారీరక శ్రమ చేయడంలేదు. అంటే సరాసరి 32.5 శాతం అన్నమాట. వీళ్లు వారానికి 150 నిమిషాలు మధ్యస్థాయి వ్యాయామం లేదా 75 నిమిషాలు కఠిన వ్యాయామం చేయాలి. 70 ఏళ్లు పైబడినవారిలో పురుషులు 38 శాతం, మహిళలు 50 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. విచిత్రమేంటంటే... 11–17 ఏళ్ల వయస్సువారికంటే 70 ఏళ్లు పైబడిన వృద్ధులే నిర్ణీతంగా ఎక్కువగా వ్యాయామం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీర్ఘకాలిక జబ్బులు... ఏడాదికి రూ. 25,760 కోట్ల ఖర్చు శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దేశంలో దీర్ఘకాలిక జబ్బులు, మానసిక జబ్బులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గుండెపోటు, పక్షవాతం, షుగర్, బీపీ, ఏడు రకాల క్యాన్సర్లు.. రొమ్ము, పెద్ద పేగు, గర్భసంచి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వస్తాయి. అలాగే మతిమరుపు, కుంగుబాటు జబ్బులు వస్తాయని స్పష్టం చేసింది. దేశంలో జరిగే మరణాల్లో 66 శాతం దీర్ఘకాలిక జబ్బులే కారణమని పేర్కొంది. అందులో 25 శాతం గుండె, 10 శాతం క్యాన్సర్, 15 శాతం ఊపిరితిత్తులు, డయాబెటీస్ వల్ల 4 శాతం, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. శారీరక శ్రమ చేయకపోవడం వచ్చే ఈ జబ్బులను నయం చేసేందుకు ఏడాదికి ప్రజలు రూ. 25,760 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లలో వీటివల్ల ప్రజలపై పడే ప్రత్యక్ష భారం రూ. 2.83 లక్షల కోట్లు ఉంటుందని హెచ్చరించింది. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానమేదీ? దేశంలో పిల్లలు కేవలం చదువులకే అతుక్కుపోతున్నారు. స్కూలు, కాలేజీల సమయంలో కనీసం 4 అడుగులు వేసే పరిస్థితి కూడా లేదు. స్పోర్ట్స్ వ్యవస్థ కుంటుపడింది. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ చేయించే వ్యవస్థ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అసలు జాతీయస్థాయిలో చిన్న పిల్లల్లో శారీరక శ్రమను పర్యవేక్షించే వ్యవస్థ లేదని ఎత్తిచూపింది. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం లేదని తెలిపింది. శారీరక శ్రమను బహిరంగ ప్రదేశాల్లో చేసేలా ప్రోత్సహించాలని, వాకింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని పేర్కొంది. పనిచేసే చోట కూడా శారీరక శ్రమను ప్రోత్సహించాలని ఇండియాకు సిఫార్సు చేసింది. రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారి కంటే 1.5 రెట్లు ఎక్కువ. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. శారీరక శ్రమను ప్రోత్సహించాలి డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని అంశాలు ఆలోచించదగినవి.. శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను, పెద్దలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. మానసిక ఉల్లాసం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. –డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్‌ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్‌నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూసధోరణికి తెర
బెంగళూరు: దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలంటే భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను రెండింటినీ బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. మేడ్ ఇన్ ఇండియా, 5జీ టెక్నాలజీ 2014కు ముందు ఊహకందని విషయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాలు పాత ఆలోచనా ధోరణిని పట్టుకొని వేలాడాయని, దేశ ఆకాంక్షల్లో వేగాన్ని విలాసంగా, గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని రిస్క్‌గా భావించాయని విమర్శించారు. ఈ అభిప్రాయాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు. స్టార్టప్‌ల హబ్‌గా భారత్ పెట్టుబడులకు భారత్ ఒక నమ్మకమైన దేశంగా మారిందని మోదీ ఉద్ఘాటించారు. ‘‘కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మూడేళ్లలో కర్ణాటక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎఫ్‌డీఐ రాబట్టడంలో గతేడాది తొలి స్థానంలో నిలిచింది. ఐటీ, రక్షణ తయారీ, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో దూసుకెళ్తోందని కొనియాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటక బలం అని స్టార్టప్ అంటే కేవలం ఒక కంపెనీ కాదని, కొత్తగా ఆలోచించడానికి, సాధించడానికి భావోద్వేగ అంశమని వివరించారు. విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నగర వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహం బరువు 218 టన్నులు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్వాంజీ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. విమానాశ్రయంలో .5,000 కోట్ల వ్యయంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ హితంగా నిర్మించిన నూతన టెర్మినల్–2ను మోదీ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులోని క్రాంతివీరా సంగోలీ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి రాకపోకలు సాగిస్తుంది. వందేభారత్ రైలుతో మైసూరు–బెంగళూరు–చెన్నై అనుసంధానం మరింత మెరుగవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని మోదీ చెప్పారు. ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేవారి కోసం ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును సైతం ప్రధానమంత్రి ప్రారంభించారు. ‘భారత్ గౌరవ్’ పథకంలో భాగంగా రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తాయి. ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలుతో కర్ణాటక, కాశీ సన్నిహితమవుతాయని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నేటి సవాళ్లకు గాంధీజీ బోధనలే సమాధానం: మోదీ దిండిగల్: సంఘర్షణల నుంచి వాతావరణ సంక్షోభాల వరకూ.. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు జాతిపిత మహాత్మా గాంధీ బోధనలే సమాధానాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగడానికి మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. శుక్రవారం తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో పట్టభద్రులైన నలుగురు విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు అందజేశారు. -
WHO Report: ‘భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు’.. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో బద్ధకస్తులు ఎక్కువయ్యారు. చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా దీర్ఘకాలికవ్యాధులు పెరుగుతున్నాయి. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు భారీగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శారీరక శ్రమ లేకపోవడం వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, పడుతున్న భారం’పై ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారత్ గురించి అనేక అంశాలను ప్రస్తావించింది. మనదేశంలో 11–17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో బాలురు 72 శాతం, బాలికలు 76 శాతం ఉన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44 శాతం, పురుషులు 25 శాతం వ్యాయామం చేయడంలేదు. 70 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 60 శాతం, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె, క్యాన్సర్, మానసిక రుగ్మతలు తలెత్తుతు న్నాయి. వీటిని నయం చేసేందుకు అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ. 25,600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం కరువు దేశంలో చనిపోయేవారిలో 66% మంది దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులే. మొత్తం మరణాల్లో 30 శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తి వ్యాధులు, క్యాన్సర్, షుగర్, ఇతరాలతో చనిపోతున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ ఉండటంలేదు. జాతీయంగా శారీరక వ్యాయామం చేయించడానికి పెద్ద వాళ్ల విషయంలో ఒక సర్వేలెన్స్ వ్యవస్థ ఉంది. కానీ, చిన్నపిల్లలకు లేదు. ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో శారీరక శ్రమ ఎంత చేయాలన్న దానిపై మార్గదర్శకాలే లేవు. సాధారణ సిఫార్సులు... ► 2050 నాటికి శారీరక శ్రమ లేకపోవడం అనే స్థితిని 15 శాతానికి తగ్గించాలి. ► ప్రపంచంలో వచ్చే పదేళ్లలో సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కొత్తగా 50 కోట్లమంది దీర్ఘకాలికవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పదేళల్లో నమోదయ్యే బీపీ కేసుల్లో 47 శాతం వ్యాయామం లేకపోవడం వల్లే సంభవించవచ్చు. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43 శాతం మేర వ్యాయామం లేకపోవడం కారణమే. 50 కోట్ల కొత్త కేసుల్లో మూడో వంతు కేసులు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటాయి. అంటే మనలాంటి దేశాల్లోనే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ► నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాలి. ► వాహనాల వేగంపై నియంత్రణ ఉండాలి. ► డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ మాట్లాడుతూ నడపడంపై నియంత్రణ ఉండాలి. ► శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాలి. ► ప్రతి ఒక్కరికీ వారానికి 300 నిముషాల వ్యాయామం తప్పనిసరి ► 18 ఏళ్లు పైబడినవారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి. ► 11–17 మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి. ► 18 ఏళ్లు పైబడినవారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. ► 50 ఏళ్లు పైబడినవారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్లు చేయాలి. మానసిక రుగ్మతలపైనే ఖర్చు ఎక్కువ: డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యాయామం లేకపోవడం వల్ల ప్రధానంగా బీపీ, డిప్రెషన్, మతిమరుపు సమస్యలు వస్తాయి. ప్రపంచంలో 75 శాతం మరణాలకు దీర్ఘాకాలిక జబ్బులే కారణం. ఈ జబ్బులకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే వీటిని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య బడ్జెట్లో కేవలం రెండు శాతమే ఖర్చు చేస్తున్నారు. -
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి. మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం. మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే, ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు. అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు. కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం.. మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం. అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు. జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది. – భువనగిరి కిషన్ యోగి -
తరచూ మెడ, భుజం నొప్పి వస్తుందా ? ఇలా చేయండి..
Possible Causes of Neck and Shoulder Pain: సెల్‌ఫోన్ ఎక్కువగా చూడటం, ముఖ్యంగా సిస్టమ్ మీద ఎక్కువగా పని చేయడం వల్ల వస్తున్న సమస్యలలో మెడనొప్పి, భుజం నొప్పి ముఖ్యమైనవి. వీటితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగా ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మెడనొప్పితో బాధ పడుతూ ఉంటే మీరు చెయ్యవలసిన మొదటి పని తలను ముందుకు వంచకుండా ఉండడం. తల ఎత్తుకుని తిరగడం మొదలు పెట్టాలి. పడుకునేటపుడు తల దిండుకు బదులు గుండ్రంగా చుట్టిన పలుచటి దుప్పటి లేదా టవల్ మెడ కింద పెట్టుకోండి. స్మార్ట్ ఫోన్లో వాట్సప్ మెస్సేజ్‌లు చూసేటప్పుడు తలను ముందుకు వంచడం మానండి. చెయ్యవలసిన ఎక్సర్సైజ్లు ►రెండు చేతులనూ ముందుకు చాపి వేళ్ళను మాత్రమే ముడిచి తెరుస్తూ ఉండండి. ముడిచినపుడు వేళ్ళు కణుపుల వరకూ మాత్రమే ముయ్యాలి. తెరిచినపుడు వేళ్ళ మధ్య ఖాళీలు ఎక్కువ ఉండేటట్టు తెరవాలి. ఊపిరిని పీలుస్తూ తెరవండి. విడుస్తూ ముయ్యండి. ►తరువాత మీ చేతి బొటన వేళ్ళను లోపలి పెట్టి దానిపై మిగిలిన వేళ్ళతో వత్తిడి కలిగిస్తూ్త గుప్పిళ్ళను ముయ్యాలి. ఊపిరి పీలుస్తూ గుప్పిళ్ళను తెరవాలి. ►చేతులను భుజాల వరకు చాపి ఉంచి మోచేతి వద్ద మడుస్తూ అరచేతులు భుజాల వద్ద పెట్టాలి. మళ్ళీ చేతులను చాపాలి. ఇలా చెయ్యడం వలన మోచేతి జాయింట్ ఫ్లెక్సిబుల్ గా తయారవడమే కాదు. చేతులలోకి రక్త ప్రసరణ బాగా జరిగి స్పొండిలోసిస్ వలన కలిగే మొద్దుబారడం తగ్గుతుంది. చేతి వేళ్ళను దగ్గరగా చేర్చి, భుజాలపై పెట్టుకుని మోచేతులతో పెద్ద సున్నాలు చుట్టండి. వెనుకకు వెళ్ళేటపుడు బాగా దూరంగా ఉండేలా, ముందుకు వచ్చినపుడు చాతీ దగ్గర మోచేతులు కలిసిపోయేలా ఈ సున్నాలు చుట్టాలి. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. ►అర చేతులను మోకాళ్ళపై పెట్టుకుని, భుజాలను గుండ్రంగా ముందుకు సున్నాలు చుట్టండి. తరువాత వెనుకకు చుట్టండి. ఇది భుజాల నొప్పులను పోగొడుతుంది. ►రెండు చేతులనూ పైకి ఎత్తి, కుడి చేత్తో ఎడమ చేయి మణికట్టు వద్ద ఎడమ చే తితో కుడి మణికట్టు వద్ద పట్టుకుని, చేతులను తల వెనుక వైపుకు తీసుకు వెళ్లి, ఎడమ చేతిని దిగువకు లాగుతూ, కుడి మోచేయి తల పై భాగం లోకి వచ్చేలా చేసి తలతో చేతులను వెనుకకు నెట్టండి. ఇది ఫ్రోజెన్ షోల్డర్‌కి కూడా పనిచేస్తుంది. రివర్స్‌లో కూడా చెయ్యండి. ►అరచేతి వేళ్ళను ఇంటర్ లాక్ చేసి, తల వెనుకగా పెట్టి చేతులతో తలను ముందుకు నెడుతూ తలతో చేతులను వెనుకకు నెట్టండి. ఇపుడు చేతులను ముందు నుదురు మీద పెట్టి, వెనుకకు ప్రెషర్ ఇవ్వండి. అలాగే ఎడమ చేతిని ఎడం వైపు కణత మీద పెట్టి కుడి వైపుకు ప్రెషర్ ఇవ్వండి. అనంతరం కుడి చేతిని కుడి కణత మీద పెట్టి ఎడమ చేతి వేపు నెట్టండి. తలతో రెసిస్ట్ చెయ్యండి. ►ఊపిరి పీలుస్తూ తలను కుడి వైపుకు తిప్పి గడ్డం కుడి భుజాన్ని తాకేలా ఊపిరి విడుస్తూ ముందుకు తీసుకు రండి. ఎంత తిప్పగలిగితే అంత తిప్పండి. అలాగే ఎడమ వైపుకు కూడా చెయ్యండి. కానీ కిందకు మాత్రం చెయ్యకూడదు. ►కళ్ళను గుండ్రంగా తిప్పండి. పైకి, కుడికీ, దిగువకూ, ఎడమ వైపుకూ ..తిరిగి రివర్స్‌లో తిప్పండి. ఈ వ్యాయామాలు మెడనొప్పిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరమైనవి. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. -
అస్సలు శారీరక శ్రమ చేయడం లేదా? అయితే లాన్సెట్ స్టడీ తెలుసుకోండి!
ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్‌స్క్రీన్‌పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్‌లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వార్మింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు ♦ శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ♦ ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. ♦ రోజుకు సగటున 20-30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ♦ దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 10-24 సంవత్సరాల మధ్య వయసువాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. ♦ 2008 నుంచి గూగుల్‌లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్‌హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. -డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్‌తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కల్పించడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్‌స్క్రీన్‌పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్‌లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలె క్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వారి్మంగ్పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. రోజుకు సగటున 20–30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 10–24 సంవత్సరాల మధ్య వయసున్నవాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. 2008 నుంచి గూగుల్‌లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్‌హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. – డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్‌తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచి్చంది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కలి్పంచడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
అవును 365 రోజులు.. గర్వంగా ఉంది: నటి
ముంబై: నటి మందిరా బేడి తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన ఆమె ఇంట్లోనే యోగా, వ్యాయామం చేస్తున్న వీడియోలను తన అభిమానులకు షేర్ చేయడమే కాకుండా, వాళ్లు కూడా వ్యాయామం చేస్తూ ఫిట్ ఉండాలని సూచించారు కూడా. నాలుగు పదుల వయసులో కూడా మందిరా బేడి ఫిట్నెస్తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నారు. (చదవండి: రొమాంటిక్‌కి గెస్ట్) ప్రతిరోజు వ్యాయామం చేసినట్లు మందిరతన ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. ‘#365daysofexercise ఈ రోజు పూర్తయింది !! అవును.. రోజు వ్యాయామం / వ్యాయామం / నా కార్యాచరణ అంతే. తప్పిపోకుండా సంవత్సరం పాటు వ్యాయవం చేశాను. ఈ రోజుతో సంవత్సరం పూర్తైంది. గర్వంగా ఉంది. నాకు సపోర్టు చేసిన వారందరికి కృతజ్ఞతలు’ అంటూ ఆమె పోస్టు చేశారు. చివరిగా మందిరా రెబల్ స్టార్ ప్రభాస్-శ్రద్దా కపూర్ జంటగా నటించిన ‘సాహో’లో నటించారు. View this post on Instagram #365daysofexercise got DONE today!! YESSSSSSS 🤟🏽 One year of not missing a day of exercise/workout/activity. Today. I. Am. Proud. Of. Me. ❤️❣️ #gratitude Thank you @jitusavlani for the lovely pictures to commemorate this special day ❤️ A post shared by Mandira Bedi (@mandirabedi) on Aug 12, 2020 at 7:10am PDT -
పుషప్స్‌తో గుండె పదిలం
లండన్ : పుషప్స్‌తో గుండెకు మేలని, రోజుకు 40 పుషప్స్ చేసే పురుషులకు గుండె పోటు, స్ర్టోక్ ముప్పు 96 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ట్రెడ్మిల్ టెస్ట్‌లతో పోలిస్తే ఫిట్నెస్ స్ధాయిలను పరీక్షించేందుకు పుషప్స్ మెరుగైన మార్గమని పేర్కొంది. రోజుకు పది నుంచి 40 పుషప్స్ చేసే వారిలో దీర్ఘకాలంలో గుండె జబ్బులు, గుండె పోటు అవకాశాలు గణనీయంగా తగ్గాయని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్ వర్సిటీకి చెందిన డాక్టర్ జస్టిన్ యంగ్ పేర్కొన్నారు. గుండె జబ్బును గుర్తించడంలో రోగి స్వయంగా వెల్లడించే అంశాలతో పాటు, ఆరోగ్య, జీవనశైలి ఆధారంగానే వైద్యులు ఓ అంచనాకు వస్తున్నారని, కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ వంటి కీలక హెల్త్ రిస్క్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. పుషప్స్ సామర్ధ్యాన్ని సులభంగా, ఎలాంటి వ్యయం లేకుండా పరీక్షించవచ్చని, దీంతో రాబోయే రోజుల్లో వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని అథ్యయన రచయిత స్టెఫాన్స్ కేల్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 2000 నుంచి నవంబర్ 2007 మధ్య దాదాపు వేయి మంది ఫైర్ఫైటర్లపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలు గుర్తించామన్నారు. అథ్యయన వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమయ్యాయి. -
ఎక్కువ గంటలు కూర్చుంటే గుండెపోటు!
సాక్షి, న్యూఢిల్లీ : మీరు ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? అయితే మీరు వెంటనే లేచి నిలబడి ఈ వార్తను చదవాల్సిందే. మీరు ప్రతి రోజు శారీరక వ్యాయామం చేస్తున్నా సరే ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తే లేదా ఏ పనిచేయకుండా బడలికగా విశ్రాంతి తీసుకుంటే అది అకాల మరణానికి దారితీయడమే కాదు, చంపేస్తుందట. రోజుకు 60 నిమిషాల నుంచి 75 నిమిషాల వరకు వ్యాయామం చేస్తున్న వారు కూడా రోజుకు సరాసరి 12.30 గంటలపాటు పెద్దగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని పనిచేస్తే లేదా ఇందులో కొన్ని గంటలు పనిచేసి, మరికొన్ని గంటలు బడలికగా విశ్రాంతి తీసుకున్నా ప్రమాదమేనట. వీరంతా గుండె జబ్బులతో అకాలంగా మరణిస్తారట. ఈ ప్రమాదం లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషులకు, వయో భేదం లేకుండా పిల్లలు, యువకులు, వృద్ధులకు పొంచి ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు 45 ఏళ్లు దాటిన అన్ని వయస్కుల వారిని ఎనిమిదివేల మందిని ఎంపిక చేసి వారి జీవన శైలిని, శారీరక శ్రమను, వారి శరీరంలో వస్తున్న మార్పులను నాలుగేళ్లపాటు క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత వారు శారీరక శ్రమ అవసరం, ప్రాధాన్యత గురించి ఆస్ట్రేలియాలో 2000 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం మధ్యన వచ్చిన ముఖ్యమైన 36 వ్యాసాలలోని అంశాలతో తమ అధ్యయనం వివరాలను పోల్చి చూశారు. తద్వారా తమ అధ్యయనం వివరాలు వాస్తవమేనని తేల్చుకున్నారు. 45 ఏళ్లు దాటిన వారిలోనే సరైన శారీరక శ్రమలేక గుండెపోట్లు వస్తాయని భావించి ఆపై వయస్సు వారిపైనే వారు అధ్యయనం జరిపారు. శారీరక శ్రమ లేకపోతే పిల్లలకు కూడా ప్రమాదమేనని వారు ఆస్ట్రేలియా వ్యాసాల ద్వారా తెలుసుకున్నారు. రోజుకు 24 గంటల సమయం కనుక, అందులో సగకన్నా ఎక్కువ కాలం శారీరక శ్రమ ఉండాలని అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. అధ్యయనంలో పాల్గొన్న ఎనిమిది వేల మందిలో వారి శారీరక శ్రమను కొలవడానికి ‘యాక్సిలెరోమీటర్లు’ ఉపయోగించారు. ప్రస్తుతం బ్రిటన్ అమలు చేస్తున్న ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరు వారానికి 150 నిమిషాలు, అంటే రోజుకు 30 నిమిషాల చొప్పున ఐదు రోజులపాటు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నాయి. అయితే వారానికి 300 నిమిషాలు అంటే రోజుకు గంట చొప్పున 5 రోజులు శారీరక శ్రమ చేసినా సరిపోదని ఆస్ట్రేలియా వ్యాసాలు సూచిస్తున్నాయి. అందుకనే అమెరికా అధ్యయనకారులు రోజుకు 12.30 గంటలపాటు శారీరక శ్రమ ఉండాలంటున్నారు. శారీరక శ్రమంటే ఇక్కడ వ్యాయామమే కాదు. శారీరక కదలికలు. పనిచేసే చోట ఆఫీసయినా, ఇళ్లయినా అదే పనిగా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడడం, నడవడం, పచార్లు కొట్టడం లాంటివి చేయాలి. మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ వద్దకు తెప్పించుకోకుండా వాటి వద్దకు మనమే లేచి వెళ్లడం, ఆఫీసులో నలుగురితోనో, పది మందితోనే మీటింగ్ ఉంటే కూర్చొని మాట్లాడకుండా నిలబడే మాట్లాడుకోవడం మంచిది. సమీపంలో వున్న అనుబంధ ఆఫీసుకో, మిత్రుడికో మెయిల్ పంపించకుండా స్వయంగా వెళ్లి సమాచారం అందించడం లాంటివి చేయాలి. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకపోతే వీలైనంత దూరంలో ఉన్న హోటల్‌కో, మెస్కో వెళ్లాలి. భోజనం తెచ్చుకుంటే అనంతరం కాస్త దూరం నడవాలి. ఇంట్లో మంచాలపై, సోఫాలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపై కూర్చోవాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. -
వ్యాయామంతో వ్యాధులకు చెక్
లండన్ : క్యాన్సర్, మధుమేహం, డిమెన్షియా, కుంగుబాటు వంటి జబ్బుల బారిన పడిన వారిని వ్యాయామం చేసేలా వైద్యులు, హెల్త్‌కేర్ సిబ్బంది ప్రోత్సహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో మరింత చురుకుగా ఉండటం ద్వారా ఆయా వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. వైద్యులు తమ రోగుల శారీరక చురుకుదనం గురించి ఆరా తీయాలని, వ్యాయామం ద్వారా చేకూరే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించాలని సూచించారు. డాక్టర్ లేదా నర్సు చెబితే నలుగురు రోగుల్లో ఒక్క రోగైనా శారీరకంగా చురుకుగా ఉండేందుకు చొరవ చూపుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్యుల్లో మూడొంతుల మంది రోగుల శారీరక చురుకుదనం గురించి మాట్లాడటం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది. వ్యాయామం ద్వారా స్ధూలకాయం ముప్పును తగ్గించడం ద్వారా జీవనశైలి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. చురుకైన జీవనశైలిని పాటించడం ద్వారా టైప్ 2 మధుమేహ ముప్పును తగ్గించుకోవండం ద్వారా అధిక రక్తపోటు ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బుల ముప్పును 40 శాతం మేర తగ్గించవచ్చని, స్ర్టోక్, కుంగుబాటు ముప్పును కూడా 30 శాతం మేర తగ్గించవచ్చని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, స్పోర్ట్ ఇంగ్లండ్ స్పష్టం చేశాయి. -
ముందుగా వార్మప్... ముగిసాక కూల్‌డౌన్...
ఫిట్నెస్ ఏదైనా శారీరక శ్రమకు గురయ్యే పని చేసేప్పుడు దానికి తగ్గట్టుగా మనసు, శరీరం సిద్దం కావాలి. ఆటలకైనా, వ్యాయామాలకైనా ప్రారంభానికి ముందు వార్మప్ తప్పనిసరి అవసరం. అవయవాలని చైతన్యపరచి, అంతర్గత శక్తిసామర్ధ్యాలను మేల్కొలపడానికి వార్మప్ సహకరిస్తుంది. సిద్ధం చేస్తుంది... దేహంలో చక్కెర స్ధాయిల్ని అదుపులో ఉంచే అడ్రినాలిన్ హోర్మన్తో పాటు, శారీరక సామర్ధ్యాన్ని పెంచే హార్మోన్లను వార్మప్ వర్కవుట్ ఉత్పత్తి చేస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ సరఫరా మెరుగయ్యేందుకు అవయవాలు, కీళ్ళ కదలికలు సాఫీగా ఉండేందుకు సైనోవిల్ఫ్లూయిడ్ ఉత్పత్తి పెంచుతుంది. కీళ్ల కదలికల మధ్య ఇబ్బందుల్ని నివారించి, పూర్తి సామర్ధ్యంతో కదిలేలా చేస్తుంది. రక్తనాళాలు వ్యాకోచింపజేయడం, దేహంలో, కండరాల్లో, రక్తంలో అవసరమైనంత వేడి పుట్టించడం, కండరాల్లో సాగే తత్వాన్ని మెరుగుపరచడం, ఎంజైమ్‌ల కదలికలు పుంజుకునేలా... చేస్తుంది. హిమోగ్లోబిన్ మరింత ఆక్సిజన్‌ను స్వీకరించేలా చేసి మజిల్పై ఒత్తిడి నివారణకు ఉపకరిస్తుంది. వ్యాయామంపై ఏకాగ్రత, ఇష్టం పెరిగేందుకు, శక్తివంతంగా,పూర్తి సామర్ధ్యానికనుగుణంగా వ్యాయామం చేసేందుకు సహకరిస్తుంది. గుండెకు రక్తసరఫరా వేగాన్ని నియంత్రించి తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. మజిల్ మెటబాలిజం ప్రక్రియను పెంచుతుంది. రొటేట్... బెస్ట్ వార్మప్ లో భాగంగా రొటేట్ ఎక్సర్సైజ్లు, దేహాన్ని సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్‌సైజ్‌లను ఎంచుకోవాలి. కనీసం 10 రిపిటీషన్స్ చేయాలి. వర్కవుట్ ఏ బాడీపార్ట్కి చేస్తుంటే దానికి నప్పేలా ఈ వార్మప్ చేయాలి. ఉదాహరణకు కాళ్ళకి సంబంధించిన వ్యాయామం చేస్తుంటే కాళ్ళ కదలికల్ని దానికి అనువుగా మార్చే సిటప్స్ వంటి వార్మప్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఒక్కోరకం ఒక్కోసెట్ మాత్రమే చేయాలి. 30నిమిషాల వర్కవుట్ కు కనీసం 5నిమిషాలు, గంట చేసే వర్కవుట్కు 10నిమిషాల చొప్పున చేయాలి. ఈ సమయంలో ఉఛ్వాసనిశ్వాసాలు స్వేఛ్చగా తీసుకుని వదులుతుండాలి. హార్ట్‌రేట్ మీద దృష్టి పెట్టాలి. గుండె కొట్టుకునే వేగం మరీ పెరిగేంత వరకూ చేయనక్కర్లేదు. ముగింపు... ఇలా ఇంపు వర్కవుట్స్ పూర్తి కాగానే కూల్డవున్ అత్యవసరం. ఉత్పత్తయిన హార్మోన్లు తిరిగి దేహానికి అవసరమైన సాధారణస్ధాయికి చేరేలా కూల్డవున్ ఉపకరిస్తుంది..లాక్టిక్ యాసిడ్‌తో సహా వ్యాయామ çసమయంలో అదనంగా, వ్యర్ధంగా ఉత్పత్తయినవి తొలగించేందుకు సహకరిస్తుంది.అలసిన కండరాలు సేద తీరేందుకు దోహదపడుతుంది. రక్తంలో పెరిగిన ఎడ్రినాలిన్ హార్మోన్ స్ధాయిని యధాస్ధితికి చేరుస్తుంది. గుండె కొట్టుకునే స్ధితిని సాధారణస్ధాయికి చేరుస్తుంది. కొందరిలో వ్యాయామం చేసిన 48–72 గంటల తర్వాత డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్(డిఒఎమ్ఎస్) కారణంగా తీవ్రమైన ఒళ్లునొప్పులు వంటివి కలుగుతాయి.వీటిని కూల్డవున్ ఎక్సర్సైజ్లు నివారిస్తాయి. కూల్డవున్ కోసం చేసే వ్యాయామాలు పూర్తిగా రిలాక్సింగ్ మూడ్‌లో చేయాలి. శవాసనంతో పాటు,కూర్చుని, పడుకుని చేసే స్ట్రెచెస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏవైతే బాడీ పార్ట్స్‌కు మనం వ్యాయామమందించామో అవి రిలాక్స్ అయ్యేట్టుగా స్ట్రెచ్ చేయాలి.వేగంగా దించడం లేపడం చేయకుండా స్ట్రెచ్ చేసి అదే స్ధితిలో కాసేపు ఉంచి నిదానంగా యధాస్ధానానికి రావాలి. దాదాపు వార్మప్కోసం కేటాయించినంత సమయాన్నే కూల్డవున్కి కూడా వెచ్చించాలి. – సమన్వయం: సత్యబాబు -
శారీరక శ్రమతో మానసిక సంతృప్తి
జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి రంజన్‌కుమార్ జగిత్యాల జోన్: ప్రతిఒక్కరికి శారీరక శ్రమ ఉంటేనే మానసికంగా సంతృప్తి కలుగుతుందని జగిత్యాల రెండో అదనపు జిల్లా జడ్జి రంజన్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం న్యాయవాదులు, న్యాయమూర్తుల క్రికెట్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మానసిక ఒత్తిడి అనేక రుగ్మతలకు కారణమన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు శారీరక శ్రమ ఎంతో ఉపయోగపడుతున్నారు. అందరూ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కనీసం ప్రతిరోజు వాకింగ్ చేయాలని కోరారు. కోర్టులు, కక్షిదారులు అనే కాకుండా న్యాయవాదులు తమ ఆరోగ్యంకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీల్లో ఎవరో ఒక్కరే గెలుస్తారని.. కానీ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ గెలుపొందలేదన్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే న్యాయవాదులు క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మధు, మొదటి అదనపు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ రమేష్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి కటుకం చంద్రమోహన్, సీనియర్ న్యాయవాదులు హన్మంతరావు, జనార్ధన్ రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఇరవై నిమిషాలు.. ఇవీ వ్యాయామాలు
‘జిమ్’దగీ ‘ఆరోగ్యం వద్దనుకుంటే శారీరకశ్రమకు వారానికి కనీసం 150 నిమిషాలు కూడా కేటాయించకండి’’ ఇది తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేస్తున్న పరిశోధనాత్మక హెచ్చరిక. వారంలో ఆ మాత్రం సమయం కూడా చెమట పట్టేలా శారీరకశ్రమ చేయనివారు పెరుగుతున్నారని, అటువంటివారే ఎక్కువగా కేన్సర్, డయాబెటిస్, రక్తపోటు... తదితర వ్యాధులతో చనిపోతున్నారని ఆ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో వెల్లడైంది. వారానికి 150 నిమిషాలు అంటే జస్ట్ డైలీ 20 మినిట్స్. ఈ నేపధ్యంలో కొన్ని సులభమైన వ్యాయామాలు, అవి అందించే లాభాలపై ఫిట్నెస్ నిపుణులు అందిస్తున్న వివరాలివి... వాకింగ్ రోజుకి గంట చొప్పున వారానికి 5 రోజులు బ్రిస్క్ వాక్ చేస్తే పక్షవాతం వల్ల వచ్చే రిస్క్ సగానికి సగం తగ్గిపోతుందని హార్వర్డ్ స్టడీ తేల్చింది. గుండె, ఊపిరితిత్తులు శక్తివంతమవుతాయి. వ్యక్తి బరువుని బట్టి కూడా కేలరీలు ఖర్చు అయే తీరులో మార్పు ఉంటుంది. ఉదాహరణకు 60కిలోల బరువు ఉన్న వ్యక్తి గంటకు 5 కి.మీ వేగంతో నడిస్తే 180–200 కేలరీలు, అదే 80 కిలోలున్న వ్యక్తికైతే 220–240 కేలరీలు ఖర్చు అవుతాయి. తాము నిర్ధేశించుకున్న విధంగా కేలరీలు ఖర్చు అవుతున్నదీ లేనిదీ చూడాలంటే మార్కెట్లో లభించే పీడోమీటర్స్, స్టెప్ కౌంటర్స్ వంటివి వినియోగించవచ్చు. వారానికి 3500 కేలరీలు వాకింగ్ ద్వారా ఖర్చయ్యేట్టుగా నిర్ణయించుకోవడం చక్కని లక్ష్యం కనీసం 20 నిమిషాలు నుంచి 60 నిమిషాల దాకా కేటాయించగలగాలి. ఈ వ్యవధి నిదానంగా పెంచాలి. మొత్తం 60 నిమిషాలు ఒకే సారి వాకింగ్ చేయలేని పక్షంలో 15నిమిషాల చొప్పున దీనిని విభజించుకుని చేయవచ్చు. సైక్లింగ్ సైకిల్ తొక్కడం ద్వారా సాధించే ఫిట్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుంటే... సైకిల్ని మన డైలీ రొటీన్లో భాగం చేయడానికి ప్రయత్నిస్తాం. సాధారణ వేగంతో చేసే సైక్లింగ్ ద్వారా గంటకు దాదాపు 300 కేలరీలు, అంటే 20 నిమిషాలలో 100కిపైగా కేలరీలు హాంఫట్. ఇది గుండెకు మంచి వ్యాయామం. దీని ద్వారా తొడ పై భాగం కండరాలు, పిక్కలు, నడుం చుట్టు పక్కల ఉండే ఆబ్లిక్స్, మోచేతులు... వంటి దేహంలోని ప్రధాన భాగాలకు వ్యాయామం లభిస్తుంది. అవసరమైనపుడు వేగం పెంచడం, అలసట అనిపించినపుడు తగ్గించడం లాంటి సౌలభ్యం కారణంగా వ్యాయామం పై అదుపుని, నియంత్రణను అందిస్తుంది. కండరాలు వదులుగా ఉన్నాయని భావించేవారు, బరువు ఎక్కువ లేకున్నా బాడీషేప్ బాలేదని బాధపడేవారికి ఇది మంచి ఎంపిక. ఆఫీసుల్లో ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాలకు పరిమితమయ్యేవారు పొద్దున్నే సైకిల్‌పై రాకపోకలు సాగించడం వల్ల రెండుపూటలా వ్యాయామం చేసినట్టే. స్కిప్పింగ్ బాక్సర్లు సైతం ముందస్తు వార్మప్‌లో చేసే వ్యాయామాంగా స్కిప్పింగ్ ప్రాచుర్యం పొందింది.æ గుండె, ఊపిరితిత్తులకు చక్కని వ్యాయామం అందిస్తుంది. ఈ స్కిప్పింగ్ 10 నిమిషాలపాటు, నిమిషానికి 120రిపిటీషన్స్ చొప్పున చేస్తే అరగంట పాటు జాగింగ్ చేసినంత, టెన్నిస్ 2 సెట్స్ ఆడినట్టు, 12నిమిషాల స్విమ్మింగ్ చేసిన ఫలితాన్నిస్తుంది. వ్యక్తి బరువు, చేసే వేగాన్ని బట్టి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 70నుంచి 110 కేలరీలను ఖర్చు చేస్తుంది. డ్యాన్స్ డ్యాన్స్ ఓ మంచి వ్యాయామమని నిపుణులు చెప్తున్నారు. 10కిలోల బరువున్న వ్యక్తి ఒక్క నిమిషం నృత్యం చేస్తే దాదాపు 1.4 క్యాలరీలు ఖర్చు అవుతాయి. 70కిలోల బరువున్న వ్యక్తి 20 నిమిషాలు నృత్యం చేస్తే దాదాపు 196 క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనిలోనూ సావధానంగా చేయడం వల్ల 20నిమిషాలకు 140 నుంచి 150 క్యాలరీలు, మధ్యస్ధంగా చేయడం వల్ల 160 నుంచి 180 క్యాలరీలు, వేగంగా చేసే విధానం వల్ల 180 నుంచి 200 క్యాలరీలు ఖర్చుఅవుతాయి. ఈ డ్యాన్స్ వర్కవుట్స్‌ని వారంలో 2 నుంచి 4 సార్లు తమ వ్యాయామ రొటీన్లో భాగంగా మార్చుకోవచ్చు. క్రమబద్ధమైన ఆరోగ్యం కోసమైతే కేవలం 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం వీటికి కేటాయిస్తే సరిపోతుంది. అయితే బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం వార్మప్ చేసిన అనంతరం వ్యాయామం ప్రారంభించిన తొలి 8 నిమిషాలలోపు దేహంలో కార్బొహైడ్రేట్స్, ఆ తర్వాత 12 నిమిషాలలో ప్రొటీన్స్ ఖర్చవుతాయి. ఆ తర్వాతే, అంటే 20 నిమిషాల తర్వాతే అధికంగా ఉన్న ఫ్యాట్ ఖర్చు అవడం ప్రారంభిస్తుంది. కాబట్టి... వారు మరింత సమయం వెచ్చించక తప్పదు. -
కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశం!
వాషింగ్టన్: కూర్చొని పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు ఇదో మంచి అవకాశం. వారానికోసారి పనివేళ వాకింగ్ మీటింగ్‌ల (నడుస్తూ మాట్లాడుకోవడం) వల్ల వారిలో భౌతిక శ్రమ స్థాయులు 10 నిమిషాలు పెరుగుతాయని తాజా పరిశోధనలో తెలిసింది. ‘‘పనిచేసే చోట శారీరక శ్రమకు అవకాశం తక్కువ. ఈ ప్రయోగాత్మక అధ్యయనంలో... వాకింగ్ సమావేశాలు సాధ్యమేనని, సంప్రదాయ కూర్చొని జరిపే సమావేశాలను దీనిలోకి మార్చేందుకు ఉద్యోగులకు సమ్మతమేనని రుజువైంది’’ అని మియామి వర్సిటీ మెడిసిన్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.కాబన్ మార్టినెజ్ తెలిపారు. మూడు వారాల పాటు చేపట్టిన అధ్యయనంలో పాల్గొన్న వైట్ కాలర్ ఉద్యోగులు తమ భౌతిక శ్రమ స్థాయులు కొలిచేందుకు అక్సిలెరోమీటర్లు ధరించారు. వారి సగటు శారీరక శ్రమ స్థాయులు తొలివారంలోని 107 నిమిషాల నుంచి రెండో వారంలో 114 నిమిషాలకు పెరిగాయి. మూడో వారంలో 117 నిమిషాలకు చేరాయి. -
కామెర్లకు పసరు మందు వాడకండి!
కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఇటీవల అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించాం. ఎలాంటి సమస్యలూ లేవు అని డాక్టర్ చెప్పారు. వారం క్రితం నిద్రలో ఉన్నప్పుడు తనకు ఆయాసం వచ్చిందని నాన్న చెబుతున్నారు. ఇదేమైనా గుండెపోటుకు దారితీస్తుందా? - వజీర్ అహ్మద్, గుంటూరు సాధారణంగా స్థూలకాయుల్లోనూ, శారీరక శ్రమ లేనివారిలోనూ, ఆస్తమా ఉన్నా, రక్తహీనత ఉన్నా ఆయాసం వస్తుంది. మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ నాన్నగారికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆయాసం కనిపిస్తుంది తప్ప అది గుండెజబ్బుకు సూచన కాకపోవచ్చు. ఇక గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా కొందరికి ఆయాసం వస్తుంది. శ్వాస సమస్యలన్నింటినీ గుండెజబ్బుగా అనుమానించకూడదు. ఆయాసంతో పాటు గుండె బరువుగా ఉండటం, చెమటలు పట్టడం, ఛాతీలో మంట, నడవలేకపోవడం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, పనిచేయడం ఆపగానే నొప్పి తీవ్రత తగ్గడం, ఛాతీలో మొదలైన నొప్పి రెండు చేతులు, దవడలకు లేదా వెన్ను భాగానికి పాకడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలిదశలోనే గుర్తిస్తే కొద్దిపాటి మందులు, జాగ్రత్తలతోనే గుండెజబ్బును అరికట్టవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు కనిపించగానే సత్వరం చేయాల్సినవి... తొలిగంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఈజీటీ, టూ డి ఎకో వంటి పరీక్షలు చేయించాల్సి, తర్వాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్సలు చేయించాల్సిన అసవరం ఉంది. ఒకవేళ జబ్బు తీవ్రత తక్కువగా ఉంటే (అంటే గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో 50 శాతం కంటే తక్కువ బ్లాక్స్ ఉంటే) అవసరాన్ని బట్టి స్టాటిన్స్ వంటి మందుల ద్వారా సమస్య జటిలం కాకుండా నివారించవచ్చు. ఈ అడ్డంకులు (బ్లాక్స్) 50 నుంచి 70 శాతం మాత్రమే ఉంటే బార్డర్‌లైన్ ఉన్నాయని అర్థం. ఒకవేళ 90 శాతం కంటే ఎక్కువ బ్లాక్స్ ఉంటే తప్పనిసరిగా స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటూ వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ, పొగతాగడం వంటి దురలవాట్లు మానేస్తే మంచిది. దీంతో పాటు హైబీపీ, షుగర్ వ్యాధులు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి. డాక్టర్ ఎన్. కృష్ణారెడ్డి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజీ, కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్ కౌన్సెలింగ్ నేను తరచు జ్వరంతో బాధపడుతున్నాను. కడుపుపై భాగంలో కొద్దిపాటి నొప్పి కూడా ఉంటోంది. ఇటీవల కామెర్లు వస్తే పసరు మందు తీసుకున్నాను. అయినా తరచు కడుపునొప్పితో పాటు జ్వరం వస్తూనే ఉంది. మా డాక్టర్ గారిని అడిగితే తగ్గే వరకూ పసరు తీసుకొమ్మని అంటున్నారు. - యాదగిరి రెడ్డి, నల్లగొండ మీ లక్షణాలను బట్టి మీరు హెపటైటిస్-సి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పసరుమందు వాడకండి. మీ ఇన్ఫెక్షన్ పసరుతో తగ్గదు. హెపటైటిస్-సి వైరస్ కారణంగా ఈ కాలేయ వ్యాధి వస్తుంటుంది. వైరస్ సోకిన రక్తమార్పిడి లేదా ఇంజెక్షన్ సూదుల వల్ల, వ్యాధి సోకిన గర్భవతుల్లో తల్లి నుంచి బిడ్డకు, దంపతుల్లో ఒకరికి ఉంటే మరొకరికి ఇది సోకడం మామూలే. నిర్ధారణ: ఈ వ్యాధి నిర్ధారణ కోసం మొదట హెపటైటిస్-సి యాంటీబాడీ టెస్ట్ అనే రక్తపరీక్ష చేస్తారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రత (వైరల్ లోడ్) తెలుసుకునేందుకు హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ పరీక్ష చేస్తారు. వీటితో పాటు జీనోటైప్ పరీక్షల వల్ల రోగికి చికిత్స అందించాల్సిన వ్యవధి, దానికి రోగి ప్రతిస్పందించే తీరుతెన్నులు తెలుస్తాయి. ఇందులోనే కొన్ని ‘జీనోటైప్స్’కు చెందిన వ్యాధుల్లో కాలేయం నుంచి ముక్క తీసి పరీక్షించాల్సి ఉంటుంది. వ్యాధి మరింత ముదరకుండా ఉన్నవారికి చికిత్స బాగానే పనిచేస్తుంది. ఒకవేళ వ్యాధి బాగా ముదిరితే కనిపించే దుష్ర్పభావాలు... అంటే రక్తస్రావం, పొట్టలో నీరు చేరడం (అసైటిస్), వ్యాధి మెదడుకు చేరడం వంటివి కనిపిస్తే మాత్రం అది కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వ్యాధి సోకిన వారు ఎంత త్వరగా పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణం చికిత్స చేయించుకుంటే అంత మంచిది. డాక్టర్ పి.బాలచంద్ర మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28. నాకు రుతుక్రమం సరిగా రావట్లేదని డాక్టర్ని సంప్రదిస్తే, వారు స్కాన్ తీయించి, పీసీఓడీగా నిర్ధారించారు. వివాహమై ఐదేళ్లు గడిచినా ఈ సమస్య వల్ల సంతానం కలగడం లేదు. ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - డి. బాలమణి, రాజమండ్రి మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అందులో ఒకటైన పీసీఓడీ సమస్య ఒకటి. ఇది వివాహిత మహిళలలో సంతానలేమికి దారితీస్తుంది. ఇమెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటి బుడగల వలె ఉండటాన్ని పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యలో రెండు అండాశయాలలో ఒక అండాశయం నుంచి అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ ఈ పీసీఓడీ సమస్య ఉన్న మహిళలలో అండం విడుదల కాకుండా అపరిపక్వత చెంది అండాశయపు గోడలపై నీటిబుడగల వలె ఉండిపోతాయి. ఇలా రెండు ఆండాశయాలపై కనిపిస్తే దీనిని ైబె లేటరల్ పీసీఓడీ అంటారు. కారణాలు: ఎఫ్.ఎస్.హెచ్, ఈస్ట్రోజన్, టెసోస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారపు నియమాలు పాటించకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వంశపారంపర్యత వంటి అంశాలు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: నెలసరి రాకపోవడం, నెలసరి సరిగా వచ్చినా, అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువరోజుల పాటు కొనసాగడం, నెలసరి ఆగి ఆడి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం, కొంతమందిలో బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా గమనించవచ్చు. జుట్టు రాలడం, ముఖం, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖంపైన, ఛాతీపైన మగవారి మాదిరిగా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు. దుష్ఫలితాలు: ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో సంతానలేమికి అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక మరియు శారీరక తత్వాన్ని బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా సంతానలేమి, ఇతర కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. మీరు వెంటనే హోమియోవైద్యనిపుణులను సంప్రదించగలరు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
మావోగారి చాంచల్యం
పీచేముడ్ ఎర్రదండు నాయకుడిగా, కమ్యూనిస్టు చైనా పాలకుడిగా జగద్విఖ్యాతుడైన కామ్రేడ్ మావోగారు యవ్వనారంభ దశలో చంచల మనస్కుడై, దిశారహితమైన జీవితాన్ని గడిపాడు. మావో తండ్రి నిరుపేద రైతుగానే జీవితం ప్రారంభించినా, మావో పుట్టే నాటికి అతడు భూస్వామిగా ఎదిగాడు. ఆర్థిక ఇబ్బందుల్లేని వాతావరణంలో పెరిగిన మావో, యవ్వనారంభ దశలో ఎక్కువకాలం అభూత కల్పనలతో నిండిన కథలు చదువుతూ, పగటి కలలు కంటూ బద్ధకంగా కాలక్షేపం చేసేవాడు. అలాంటి రోజుల్లోనే తన తండ్రిని ఒప్పించి కాలేజీలో చేరాడు. కాలేజీలో తనలాంటి కులాసారాయుళ్లను పోగేసుకొని నానా కాలక్షేపం కార్యక్రమాలు సాగించేవాడు. పద్దెనిమిదేళ్ల వయసులో విప్లవ సైన్యంలో చేరాడు. అయితే, అందులో శారీరక శ్రమ తప్పనిసరి కావడంతో, కొద్దిరోజుల్లోనే సైన్యం నుంచి బయటకు వచ్చేశాడు. కాలేజీకి వెళ్లే వయసులో మావో ఏ సబ్జెక్టునూ స్థిరంగా చదువుకోలేదు. తరచు సబ్జెక్టులు మారేవాడు. కాలేజీలో ఉండగా, పోలీసు అకాడమీ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు. అందులో చేరక ముందే మనసు మార్చుకుని, సబ్బుల తయారీ కోర్సులో చేరాడు. అందులో పూర్తిగా కొనసాగకుండానే లా స్కూల్లో చేరాడు. చివరకు బిజినెస్ స్కూల్లో చేరాడు. అందులో బోధన ఇంగ్లిష్‌లో సాగేది. ఇంగ్లిష్ సరిగా రాకపోవడంతో నెల్లాళ్లకే ఆ కోర్సునూ మానేశాడు. కోర్సు నుంచి కోర్సు మారుతూనే మొత్తానికి చదువు పూర్తయిందనిపించుకొని, టీచర్‌గా మారాడు. చదువులో స్థిరం లేకుండా తిరుగుతున్న దశలోనే మావో వామపక్ష బృందాలకు చేరువయ్యాడు. చివరకు తానే ఎర్రదండుకు అధినేతగా ఎదిగాడు. -
ఆయుర్వేద కౌన్సెలింగ్
మెడనొప్పికి పంచకర్మ నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు తరచూ మెడనొప్పిగా ఉంటోంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చెయ్యి లాగడం మొదలవుతోంది. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మందులు మానగానే మళ్లీ వస్తోంది. దీనికి ఆయుర్వేదంలో సరైన వైద్యం ఉందా? - రవి వర్మ, విశాఖపట్నం మీరు కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసే వృత్తిలో ఉన్నవాళ్లలో ప్రతి 100 మందిలో 70 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దీనికి అనే కారణాలున్నాయి. ఈ వృత్తిలో వున్న చాలామందిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పు వచ్చింది. నిద్రా సమయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం మన శరీర, మానసిక వ్యవస్థలపై పనిచేసి, చాలా దుష్ర్పభావాలు చూపిస్తున్నాయి. అందులో ఒకటి ఈ మెడనొప్పి. ఈ మెడనొప్పిని ఆయుర్వేదంలో మన్యస్తంభము అనీ, అపబాహుకము అని, అల్లోపతి వైద్యశాస్త్రంలో సర్వికల్ స్పాండిలోసిస్ అని అంటారు. ఎక్కువగా మానసిక ఆందోళనకు గురికావడం, నిద్ర సరిగా లేకపోవడం, అన్నం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కొంతమందిలో మెడనొప్పి వస్తూ ఉంటుంది. కారణాలు: 1) మెడ భాగంలో ఉన్న ఎముకల మధ్య ఉన్న ఖాళీభాగం తగ్గడం వల్ల, ఎముకల మధ్యలో వాపు రావడం వల్ల, ఎముకలు అరిగిపోవడం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తుంటాయి. 2) కొంతమందిలో తల తిరగడం, పైకి లేస్తే కింద పడిపోతున్నట్లుగా ఉండడం వల్ల తలనొప్పి; మెడ నరాలు నొక్కుకుని పోయినట్లుగా, వాచినట్లుగా ఉండి, రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల కూడా మెడనొప్పి వస్తూ ఉంటుంది. 3) కొంతమందిలో మెడనొప్పి తక్కువగా ఉండి, మెడ దగ్గర నుండి అరచేయి వరకు లాగడం, నొప్పిగా ఉండడం, తిమ్మిరిగా, మొద్దుబారినట్టు ఉండడం వంటి లక్షణాలు ఉండచ్చు. మెడభాగంలోని ఎముకల మధ్య ఉన్న డిస్క్ భాగంలో వాపు రావడం వల్ల కానీ, అది పక్కకు జరగడం వల్ల కానీ ఇలా జరుగుతుంది. పై లక్షణాలు తెలుసుకోవడానికి ఎక్స్‌రే కానీ, ఎంఆర్ఐ కానీ తీయవచ్చు. ఆయుర్వేద వైద్యుడికి మాత్రం ఇవేవీ అవసరం లేదు. మీ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. చికిత్సా క్రమంలో... 1) వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పడుకోవడం మంచిది. తలభాగంలో తక్కువ పరిమాణంలో ఉన్న దిండును వాడడం మంచిది. 2) కొద్దిరోజుల వరకు బరువైన వస్తువులను మోయరాదు. 3) శతపాక క్షీరబలా తైలాన్ని ఉదయం, రాత్రి వ్యాధి తీవ్రతను బట్టి తీసుకోవలసి ఉంటుంది. 4) మానసిక ఆందోళన, రక్తపోటు, తలతిరగడం ఉన్నట్లయితే ‘మానసమిత్రవటకం’ను వాడడం మంచిది. 5) ఎముకలమధ్య వాపు ఉన్నట్లయితే వాపు తగ్గడానికి ‘త్రయోదశాంగ గుగ్గులు’ వాడడం మంచిది. తిమ్మిరి, చెయ్యి మొద్దుబారినట్లు ఉండటం వంటి వాటికి వాతగజాంకుశరస్, లశూనాదివటి ని కలిపి తీసుకోవడం మంచిది. పంచకర్మ పద్ధతిలో శిరోధార, నస్యకర్మ, గ్రీవవస్తి, మనల్కిడీ లాంటి పంచకర్మ చికిత్సలను తీసుకున్నట్లయితే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత, మెడనొప్పికి సంబంధించిన ఆసనాలు, మానసిక ప్రశాంతతకు ప్రాణాయామం, ధ్యానం మొదలైన వాటిని అలవాటు చేసుకోవడం మంచిది.