కదలండి బాస్! | Half of India's adult population physically unfit, says Lancet study | Sakshi
Sakshi News home page

కదలండి బాస్!

Published Sat, Jun 29 2024 6:46 AM | Last Updated on Sat, Jun 29 2024 6:48 AM

Half of India's adult population physically unfit, says Lancet study

    దేశంలో శారీరక శ్రమ లేనివారు 49.4% మంది  

   పురుషులతో పోలిస్తే మహిళల్లో 57% ఎక్కువ  

   నగరంలో ఫిజికల్‌ యాక్టివిటీ లేనివాళ్లు 53.6%   

   15–49 ఏళ్ల మధ్య వయసు్కల్లోనే ఈ పరిస్థితి అధికం 

   ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ మెడికల్‌ జర్నల్‌లో వెల్లడి 

నగరంతో పాటు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించిన తాజా సమాచారం ప్రకారం.. గత 2022లో ప్రతీ ఇద్దరు వయోజనులలో ఒకరు ఆరోగ్యానికి అవసరమైన కనీసపు శారీరక శ్రమ స్థాయిని కూడా అందుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా, శారీరక శ్రమ లేని పెద్దల శాతం 31% కాగా మన దేశంలో మాత్రం ఇది 49.4% గా ఉంది. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో 57 శాతం మంది కనీసపు శారీరక శ్రమకు సైతం దూరంగా ఉన్నారని అధ్యయనం తేల్చింది. ప్రస్తుత ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే 2030 నాటికి 59.9%కి చేరుతుందని రోగాల నిలయంగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిజికల్‌ యాక్టివిటీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

నిశ్చల జీవనశైలి కారణంగా పలు రకాల వ్యాధులకు చిరునామాగా నగరం మారబోతోందని గతంలోనే  జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. నగరంలో 53.6 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని ఉస్మానియా ఆసుపత్రి, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం అప్పట్లో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ బేసిక్‌ అండ్‌ అప్‌లైడ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో ప్రచురితమైంది. అదే విధంగా అబ్డామినల్‌ ఒబెసిటీ (పొత్తికడుపు పైన కొవ్వు పేరుకుపోవడం) అనేది మన నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోందని గత ఏడాది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు, పురుషుల్లో ఈ పరిస్థితికి కారణం నిశ్చల జీవన శైలేనని స్పష్టం చేసింది.

శ్రమనోచని శరీరం.. వ్యాధుల కుటీరం
ఏదైనా సరే శారీరక కదలికను శారీరక శ్రమగా పరిగణిస్తారు. శరీరాన్ని కాకుండా మెదడుకు అధికంగా కలి్పంచే పని ఒత్తిడితో నగర జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీసుల్లో గంటల తరబడి పని, ఇంటికి ఆఫీసులకు మధ్య ప్రయాణం, వారాంతపు విరామంలో విశ్రాంతి.. ఇది శారీరక శ్రమ తగ్గిపోవడానికి పోషకాహార లోపాలకు దారితీసింది. శారీరక శ్రమ లోపం.. ప్రపంచ ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పు, ఇది దీర్ఘకాలిక వ్యాధుల భారానికి గణనీయంగా దోహదం చేస్తుంది. అని డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్‌ ప్రమోషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రూడిగర్‌ క్రెచ్‌ అన్నారు. గుండెపోటు స్ట్రోక్‌లతో సహా çహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాక మధుమేహం, చిత్తవైకల్యం, రొమ్ము పెద్దపేగు క్యాన్సర్లు ముప్పు వీటన్నింటికీ దారి తీస్తుందంటున్నారు.

అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ..
దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు రక్త పరీక్షలు పోషకాహార మార్గదర్శకాల కోసం ప్రతిరోజూ దాదాపు 5–10 మంది నగర ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ ధోరణి  పేలవమైన ఆహారపు అలవాట్లు అధిక ఒత్తిడి స్థాయిల కలయిక కారణమని, వీటన్నింటికీ మూలం నిశ్చల జీవనశైలి అని చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం ఆమ్లత్వంతో సహా రోగులలో జీర్ణాశయ సమస్యలు సర్వసాధారణంగా మారా యని చెప్పారు. అలాగే.. అధిక ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా అధిక బరువుతో కూడిన మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కేసులలోనూ పెరుగుదల కనిపిస్తోంది.  ఈ పరిస్థితులకు అనారోగ్య జీవనశైలి, ఒత్తిడి  క్రమరహిత నిద్ర విధానాలు కారణమని పేర్కొన్నారు. సరైన పోషకాహారం, వ్యాయామం  ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

వర్కవుట్‌.. వ్యాధులు అవుట్‌.. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ కథనం ప్రకారం.. వారానికి 150 నిమిషాల మితమైన–తీవ్రతతో కూడిన శారీరక శ్రమ లేదా 75 నిమిషాల తీవ్రమైన–తీవ్రతతో కూడిన శారీరక వ్యాయామంలో పెద్దలు పాల్గొనాలి. నడక, సైక్లింగ్, ఆటలు మాత్రమే కాదు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులు చేయడం కూడా శారీరకంగా చురుగ్గా ఉండటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సాధారణ శారీరక శ్రమ మధుమేహం ప్రమాదాన్ని 17%, గుండె జబ్బులు, పక్షవాతం 19%, డిప్రెషన్, చిత్తవైకల్యం 28–32% అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాలను 8–28% తగ్గిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల్లో చురుకుదనం అవసరమైనంత పెరిగితే , ఏటా 4–5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా.  

కదలికల లోపానికి కారణాలెన్నో.. 
కోవిడ్‌ తర్వాత ఒక విధానంగా మారిపోయిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్,  ఇంట్లో వండిన భోజనం కంటే ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి ఇష్టపడటానికి ఫుడ్‌ డెలివరీ సేవల సౌలభ్యం  దారితీసింది దాంతో విపరీతంగా పెరిగిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవల వినియోగం, పెరిగిన రెడీ–టు–ఈట్‌ మీల్స్‌కు ప్రాధాన్యం వంటివి నిశ్చల జీవనశైలి పెరగడానికి కారణమని నగర వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు సిటీజనుల ఆహారపు అలవాట్లను తద్వారా ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని నగరానికి చెందిన పోషకాహార నిపుణురాలు రుచికా చెప్పారు. ఇటీవల రకరకాల ఆరోగ్య సమస్యలు, శారీరక చురుకుదనం లోపించిన కారణంగా నిపుణులను సంప్రదించే వారిలో యువకుల సంఖ్య గణనీయంగా ఉండడం గమనార్హం అంటున్నారామె. 100 కిలోలకు దగ్గరగా ఉన్న 17–19 సంవత్సరాల నగర యువతకు ట్రీట్‌ చేశానని తెలిపారు.  ఈ భయంకరపరిస్థితికి తీవ్రమైన నిశ్చల జీవనశైలి కారణమని స్పష్టం చేశారు. వీరిలో కొందరు  ప్రీ–డయాబెటిస్‌ 
పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.

కనీస నడక లేకుంటే కష్టాలే.. 
ప్రస్తుతం నగరవాసుల్లో చాలా మందికి కనీసపు శారీరక శ్రమ ఉండడం లేదు. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. మేం ప్రిస్క్రిప్షన్‌లో మందులు మాత్రమే కాదు వాకింగ్, వ్యాయామాల గురించి కూడా చెబుతున్నాం. ఓ వ్యక్తి రోజుకు కనీసం 5వేల నుంచి 6వేల అడుగులు నడవాలి. యుక్త వయసు్కలు 2వేల అడుగులు కూడా నడవడం లేదు. మరి రోగాలు రాకుండా ఎలా ఆపగలం? ముఖ్యంగా హృద్రోగాలు, హార్ట్‌ ఎటాక్స్‌ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోవడానికి కదలిక లేని జీవనశైలే కారణం. ముందుగా 15 నుంచి 20 నిమిషాల నడకతో ప్రారంభించి ఏదైనా ఆసక్తి ఉన్న ఆటలు ఆడడం..  ఇలా శారీరక కదలికల్ని రోజువారీ జీవితంలో భాగం చేయాల్సిందే దీనికి ప్రత్యామ్నాయం లేదని అందరూ గుర్తించాలి.  
– డా.కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, ఓనస్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement