రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్‌లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్ స్పాట్‌గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్ కణితికి సంబంధించిన డీఎన్‌ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్ ప్రొఫైలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది.
రక్తంలో డీఎన్‌ఏ మిథైలేషన్‌ని గుర్తించడానికి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్ కట్టుబడి ఉంది. భారత్‌లో కేన్సర్ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది.
ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ.
అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్‌తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్‌ని జయించేలా ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్‌స్పాట్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.
(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ మాయం..!)
Comments
Please login to add a commentAdd a comment