వాయుకాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు | Air pollution could increase blood clot risk by 39 percent to over 100 percent | Sakshi
Sakshi News home page

వాయుకాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు

Published Sat, Dec 14 2024 5:00 AM | Last Updated on Sat, Dec 14 2024 5:00 AM

Air pollution could increase blood clot risk by 39 percent to over 100 percent

న్యూఢిల్లీ: వాయు కాలుష్యం మానవుల ప్రాణాలకు అత్యంత హానికరమని మరోసారి రుజువైంది. దీర్ఘకాలంపాటు వాయుకాలుష్యం బారిన పడితే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఏకంగా 39 శాతం నుంచి 100 శాతందాకా పెరుగుతాయని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 17 సంవత్సరాలపాటు అమెరికాలో 6,650 మంది యుక్తవ యస్కు లపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 

‘‘వాయు కాలుష్యం కారణంగా కణజాలం, కండరాల కింద ఉండే ప్రధాన నరాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగొచ్చు. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే రక్తప్రవాహానికి తీవ్ర అవరోధాలు ఏర్పడి ప్రసరణ ఆగిపోవచ్చు. అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’’ అని పరిశోధకులు చెప్పారు. నరాల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితిని వేనస్‌ థ్రోంబోఎంబోలిజం’ అని పిలుస్తారు. 

ఈ సమస్య కారణంగా ఆస్పత్రిపాలైన రోగుల డేటాను మిన్నెసోటా విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పరిశీలించింది. ఆయా రోగుల ఇళ్లలో వాయుకాలుష్యం తాలూకు శాంపిళ్లనూ తీసు కున్నారు. న్యూయార్క్, షికాగో, లాస్‌ ఏంజెలిస్‌ సహా ఆరు మెట్రోపాలిటన్‌ నగరాల్లో, ఆ నగరాల సమీపాల్లో నివసించే యుక్తవయసు రోగులపై ఈ పరిశోధన చేశారు. 

సూక్ష్మధూళి కణాలు(పీఎం 2.5) , నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల బారిన పడి వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న వారిలో 3.7 శాతం(248 మంది) జనాభాలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు 39 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. సూక్ష్మధూళి కణాల గాఢత ఎంత ఎక్కువ ఉన్న గాలిని పీల్చితే అంత ఎక్కువగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరుగుతాయి. అత్యధిక స్థాయిలో నైట్రోజన్‌ ఆక్సైడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ల బారిన పడితే ఈ రిస్క్‌ ఏకంగా 120–174 శాతానికి పెరుగుతుంది. వాయు కాలుష్యం ఎక్కువైతే శరీరంలో ఆ మేరకు వాపు పెరిగి రక్తం గడ్డకడుతుంది. చివరకు ఆ వ్యక్తులు హృదయ, శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడతారు’’ అని పరిశోధకులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement