Life-threatening diseases
-
రేపటి తరం కోసం
బొడ్డుతాడు మూలకణాలను భద్రపరిచేందుకు తల్లిదండ్రుల ఆసక్తి నగరంలో స్టెమ్‌సెల్స్ బ్యాంకులకు పెరుగుతున్న ఆదరణ వాటితో అనేక వ్యాధులకు చికిత్స సాధ్యమంటున్న నిపుణులు బెంగళూరు: గుండె, కాలెయం, మూత్రపిండాల జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా మనం భయపడకుండా ఉండగలమా..? అది ఇప్పుడు సాధ్యమే. మన బంగారు బిడ్డల భవిష్యత్ కోసం మనం వారి బొడ్డు తాడు తీసి భద్రపరిస్తే చాలు అంటున్నారు నిపుణులు. శిశువు పుట్టగానే బొడ్డుతాడు నుంచి సేకరించిన మూల కణాలను భద్రపరడచం వల్ల భవిష్యత్తులో పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని వైదులు పేర్కొంటున్నారు. ఇలా సేకరించే భద్రపరిచే వాటినే స్టెమ్‌సెల్స్ బ్యాంకులకు నగరంలో ఆదరణ పెరుగుతోంది. 70 రకాల బబ్బుల నుంచి కాపాడే మూల పదార్థం ఇందులో ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం సంపన్న వర్గాలు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ముందుగానే ‘మందు’.... చిన్నారులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఈ మూలకణాలు తిరిగి శరీరంలోని అవయవాలను పునరుజ్జీవింపజేయడానికి పనికొస్తాయి. ప్రసవ సమయంలో బిడ్డతో పాటు ఉండే బొడ్డుతాడు నుంచి ఈ స్టెమ్‌సెల్స్ సేకరణ జరుగుతుంది. ప్రతి బొడ్డుతాడులో 200 మిల్లీ లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం నుంచి సేకరించిన కణాల్నే వైద్యపరిభాషలో హెమటో పాయిటిక్ స్టెమ్సెల్స్గా వ్యవహరిస్తారు. ప్రసవ సమయంలో వీటిని భద్రపరిస్తే బ్లడ్‌క్యాన్సర్, గుండె, కాలేయం, మూత్రపిండాల్లో తలెత్తే సమస్యలు తదితర 70 వ్యాధులను వీటి సాయంతో నయం చేసేందుకు అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన రెండు నిమిషాల్లో... బిడ్డ పుట్టిన సమయంలో బొడ్డుతాడును అంటిపెట్టుకొని ఉండే రక్తంలో ఈ స్టెమ్‌సెల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డ పుట్టిన రెండు నిమిషాల్లో బొడ్డుతాడు నుంచి ఈ స్టెమ్‌సెల్స్‌ను సేకరించి భద్రపరచాల్సి ఉంటుంది. అనంతరం ఈ కణజాలాలను ఆస్పత్రిలో ల్యాబొరేటరీకి తీసుకెళ్లి హెచ్ఐవీ ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించుకున్న తరువాత స్టెమ్‌సెల్స్‌ను ప్రత్యేక బాటిల్లో నింపి, ఆ బాటిల్‌పై సంబంధిత చిన్నారి వివరాలు (తల్లిదండ్రుల పేర్లు, చిరునామా తదితరాలు) నమోదు చేసి ఆ బాటిల్‌కి ఒక ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. ఈ బాటిల్‌ని మైనస్ 196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచిన మూలకణాలు సుమారు వందేళ్లపాటు నిల్వ ఉంటాయి. అయితే సాధారణంగా ప్రస్తుతం నగరంలో చిన్నారికి 21 ఏళ్ల వరకూ స్టెమ్‌సెల్స్ భద్రపరుస్తున్నారు. కొంతమంది మాత్రమే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని 50 ఆ పై ఏళ్ల వరకూ తమ చిన్నారుల స్టెమ్‌సెల్స్‌ను భద్రపరుస్తున్నారు. ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తాం: చాలా స్టెమ్‌సెల్స్ బ్యాంకులు కణాలను భద్రపరిచి కావాలన్నప్పు అందించడం మాత్రమే చేస్తున్నాయి. మేము స్టెమ్‌సెల్స్‌ను భద్రపరచమే కాకుండా వాటితో వివిధ రోగాలకు చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ)ను కూడా అందిస్తాం. మా బ్యాంకులో 21 ఏళ్లపాటు స్టెమ్‌సెల్స్‌ను నిల్వ ఉంచడానికి రూ.80 వేలు వసూలు చేస్తాం. ఇందుకు ఈఎంఐ (నెలవారిగా కొంతమొత్తాన్ని చెల్లించడం) సదుపాయం కూడా కల్పిస్తున్నాం. - శ్రీనివాస్, లైఫ్సెల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధి -
వ్యవశా స్త్రవేత్తలు
ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. కళ్ల ముందరే పసిమొగ్గలు నేలరాలడం వారిని కలచివేసింది. ప్రకృతిలో ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నది వారి విశ్వాసం. వ్యవసాయ పనులు చేస్తూనే ఖాళీ సమయాల్లో అడవుల్లో చెట్లూపుట్టల వెంట తిరిగారు. దోమల సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుకొన్నారు. ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’ నేతృత్వంలో ఇచ్చే రాష్ట్రపతి అవార్డును 2013లో వారికి దక్కించుకొని ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారు. ప్రాణాంతక వ్యాధులను తక్కువ ఖర్చుతో నయం చేసే మందులను కొనుక్కోవడం కోసం అన్వేషణ సాగిస్తున్నారు చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామీణ శాస్త్రవేత్తలు. వీరికి ప్రయోగశాల కూడా అందుబాటులో లేదు. ఆ మాటకొస్తే ఈ బృందంలో ఇద్దరు మినహా మిగతావాళ్లవి వానకారు చదువులే. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ ఎం.ఏ(ఫిలాసఫీ) మధ్యలోనే ఆపేశాడు. ్ఞఇంటర్మీడియెట్లో బైపీసీ విద్యార్థి అయిన చంద్రశేఖర్‌కు సైన్సులో కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి వైద్యం అందించిన మనదేశం ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం విదేశాల వైపు చూస్తోండటం చంద్రశేఖర్‌ను ఆలోచింపజేసింది. సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడే ఉంటుందని పెద్దలు చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తే సంచలనం సృష్టించవచ్చన్న భావనతో డిగ్రీ చదివిన చిరంజీవులు, నాలుగైదు తరగతులు చదివిన భాస్కర్, బత్తెయ్యనాయుడు, శివ, వెంకటేశ్వర్లు, మురళీ, శ్రీధర్‌లతో కలిసి ‘జగదీష్ చంద్రబోస్’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి 20 ఏళ్ల క్రితమే పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి చేసిన తొలి ప్రయోగం విఫలమైన సందర్భంలోనే కారాకొల్లును సెరెబ్రల్ మలేరియా చుట్టుముట్టింది. అడవిబాటలో... దోమ కాటుకు ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా సోకి పసిమొగ్గలు కళ్ల ముందే నేలరాలుతోండటంతో ఆ బృందం మళ్లీ అడవిమార్గం పట్టింది. దోమలు, క్రిములు వాలని మొక్క, చెట్టు దొరికితే సమస్యకు పరిష్కారం లభించినట్లేనన్నది వారి భావన. అదే లక్ష్యంతో చెట్లెంటా పుట్లెంటా తిరిగారు. చివరకు తెల్లజుమికి మొక్కపై దోమలు, క్రిములు వాలకపోవడాన్ని గుర్తించారు. వాలిన దోమలు, క్రిములు కూడా చనిపోవడాన్ని పసిగట్టారు. తెల్లజుమికి మొక్క ఆకులపై, కాయలపై జిగురులాంటి పదార్థం ఉండటం వల్ల దోములు, క్రిములు వాలడం లేదని భావించారు. తెల్లజుమికి ఆకులు, కాయల రసాన్ని దోమల లార్వాలపై ప్రయోగించారు. దెబ్బకు దోమల లార్వాలు చనిపోయాయి. ఆ రసాన్ని ఊర్లో మురుగుకాలువలు, నీళ్లు నిలిచే ప్రాంతాలపై చల్లారు. దెబ్బకు దోమలన్నీ చనిపోయాయి. ఊళ్లో వాళ్లందరికీ ఆ రసాన్ని ఇచ్చారు. పడుకునే ముందు చేతులకు కాళ్లకు పూసుకుంటే దోమలు కుట్టవని చెప్పారు. ఆ ఊరి ప్రజలు అలానే చేశారు. దోమకాటుకు పరిష్కారం దొరకడంతో సెరెబ్రల్ మలేరియా నుంచి కారాకొల్లుకు విముక్తి కలిగింది. ఇదే సమయంలో తాము కనుగొన్న మందుకు శాస్త్రీయత ఉందని నిరూపించాలని బృందం భావించింది. ఎస్వీ యూనివర్శిటీలో ఎంటమాలజీ ప్రొఫెసర్ హరినాథబాబును సంప్రదించారు. బృందం అందించిన శాంపుల్స్‌పై పరిశోధనలు చేసిన హరినాథబాబు, తెల్లజుమికి రసంలో క్రిమిసంహారక లక్షణాలున్నట్లు తేల్చారు. న్యుమటోడ్స్ (చెట్ల ఆకులపై రసం పీల్చే పురుగులు) నిర్మూలించడానికి ప్యురాడాన్ ఉపయోగిస్తున్నారు. ప్యూరాడాన్ కన్నా తెల్లజుమికితో తయారుచేసిన మందే న్యుమటోడ్స్పై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు ప్రొఫెసర్ హరినాథబాబు తేల్చారు. అడవే ప్రయోగశాల... తెలుగుగంగ ఆయకట్టు ప్రాంతమైన కారాకొల్లులో చిత్తడి నేలలు అధికం. చిత్తడి నేలల్లో నడవడం వల్ల ఆ గ్రామ ప్రజలను బురదపుండ్లు పట్టి పీడిస్తుండడంతో గాయాన్ని మాన్పే మందు కోసం అన్వేషణ సాగించారు. వెంట్రుకలను నల్లగా మార్చడానికి చేసిన ప్రయోగంలో గతంలో ఉపయోగించిన బురుగుడు ఆకు రసాన్ని ఓ ఎద్దు గాయంపై ప్రయోగించారు. త్వరగా మానిపోయింది. ఆ తర్వాత కోడికి తగిలిన గాయంపై ప్రయోగించారు. అదీ మానిపోయింది. మనుషుల గాయాలకూ, చర్మవ్యాధులకు ఇదే మందును పూశారు. 15 నిముషాల్లో ప్రభావం చూపాయి. బురుగుడు ఆకు రసం తయారుచేసిన మందుపై పరిశోధనలు చేసిన కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ రఘునాథరాజు ఆ మందు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని తేల్చారు. తక్కువ ధరకు మందును అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ‘ఎంజెల్-హెచ్’ అనే పేరుతో మార్కెట్ చేసేందుకు పూనుకున్నారు. ‘‘మేం తయారు చేసిన మందులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. క్యాన్సర్ వ్యాధికి మందును కనుగొనడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’’ అంటున్నారు బృందంలో సభ్యుడైన చంద్రశేఖర్. ‘జగదీశ్ చంద్రబోస్’ సంఘం సభ్యులు చేస్తున్న కృషిని గమనించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఏఫ్) రాష్ట్ర కో-ఆర్డినేటర్ గణేశం వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. బృందం ఆవిష్కరణలను ఎన్ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి ఆవిష్కరణలకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ప్రజలకు మేలు చేసే మరిన్ని మందులను ఈ గ్రామీణ శాస్త్రవేత్తల బృందం కనుగొనాలని ఆశిద్దాం. ఎన్ఐఎఫ్ను సంప్రదించండి... దేశంలో ప్రతిభకు కొదువ లేదు. పల్లెల్లో అద్భుతాలు సృష్టించే యువకులు ఎందరో ఉన్నారు. ఎవరు ఏ ఆవిష్కరణలు చేసినా నన్ను(ఫోన్ నెంబరు 09866001678) సంప్రదించండి. రాష్ట్రంలో ఇప్పటికే 112 ఆవిష్కరణలను ఎన్ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లాం. 22 మందులకు పేటెంట్లు తెప్పించాం. 12 మందికి రాష్ట్రపతి అవార్డులు వచ్చేలా చేశాం. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ బృందం అద్భుతాలు సాధిస్తోంది. - గణేశం, రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎన్ఐఎఫ్. -
‘పెంటావలెంట్’తో ప్రాణాంతక వ్యాధులు దూరం
తాండూరు: పెంటావలెంట్ టీకాతో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి శిశువులను రక్షించవచ్చని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.నిర్మల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి(పీపీయూనిట్)లో నిర్వహించిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఏఎన్ఎంల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెంటావలెంట్ టీకా శిశువులకు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెంటావలెంట్ టీకాతో శిశువుకు ఇచ్చే ఇంజెక్షన్లు 9 నుంచి 3కు తగ్గుతాయన్నారు. ఈ టీకాతో ప్రాణాంతకమైన కంఠస్పర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హైపటైటీస్-బీ, హెమోఫిలస్ ఇన్ల్ఫూయెంజా అనే ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడవచ్చన్నారు. అంతేకాకుండా పెంటావలెంట్తో హెమోయెంజా టైప్‌బీ(హిబ్) బాక్టీరియా వల్ల కలిగే న్యుమోనియా, మెనింజైటీస్, చెవిటితనం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయన్నారు. ఏఎన్ఎంలు వచ్చే నెల డిసెంబర్లో పెంటావలెంట్ టీకాలను శిశువులకు ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో అధికారులు డా.సూర్యప్రకాష్, డా.శ్రీనివాస్, రవి, బాలరాజ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రిన్స్‌తో కాసేపు..
సిటీకి ఎందరో కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు.. ఈ రోజు మాత్రం ఓ లోకల్ చంటిగాడు సిటీ క మిషనర్‌గా రాబోతున్నాడు. ఈ కుర్రాడి పేరు సాదిక్. వయసు పదేళ్లు. పోలీస్ కమిషనర్‌గా పదేళ్ల కుర్రాడేంటని అనుకుంటున్నారా..! కమిషనర్ ఆఫ్ పోలీస్ కావాలన్నది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి కోరిక. అందుకే మేక్ ఎ విష్ అనే స్వచ్ఛంద సంస్థ సాదిక్ కోరికను తీరుస్తోంది. ఈ రోజు ఉదయాన్నే సాదిక్ ఇంటికి బుగ్గకారు వస్తుంది. ఈ బుల్లి కమిషనర్‌కు రెడ్‌కార్పెట్ పరిచి మరీ ఆఫీస్‌కు తీసుకెళ్తుంది. అక్కడున్న ఖాకీలంతా గౌరవ వందనంతో ఈ బుల్లి కమిషనర్‌కు స్వాగతం పలుకుతారు. సీపీ సీట్లో కూర్చుని మరీ మనోడు ఏక్ దిన్ కా సీపీగా పనులు చక్కబెడతాడు. ప్రిన్స్‌తో కాసేపు.. అభిషేక్. వయస్సు పద్నాలుగేళ్లు. జూబ్లీహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న ఈ కుర్రాడు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. ఈ బాలుడికి సినీ హీరో మహేశ్‌బాబును కలవాలన్న కోరిక మేక్ ఎ విష్ చొరవతో తీరిపోయింది. ఆగడు సినిమా షూటింగ్ సమయంలోనే గంటపాటు ఈ కుర్రాడికి ప్రిన్స్ సమయం కేటాయించారు. ఒక్క సాదిక్ విషయంలోనే కాదు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఎందరి కోరికలనో తీరుస్తోంది ‘మేక్ ఎ విష్’ స్వచ్ఛంద సంస్థ. ‘అమితాబ్‌తో ఆడుకోవాలి.. సచిన్‌తో మాట్లాడాలి.. ప్రిన్స్ మహేశ్‌బాబును చూడాలి.. బార్బీ బొమ్మ కావాలి.. ఇలా చిన్నారుల మనసులోని చిన్న, పెద్ద ఆశలను చిటికె’లో తీర్చేసి వారి ముఖాల్లో సంతోషం నింపుతోంది. ఇలా తెలుసుకుంటారు... నగరంలోని గ్లోబల్, కేర్, గాంధీ, అపోలో, ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ పరిశోధన కేంద్రం, ఇండో-అమెరికన్ హాస్పిటల్...ఇలా ప్రముఖ ఆస్పత్రులకు ‘మేక్ ఎ విష్’ వాలంటీర్లు వెళ్తారు. ప్రాణాంతక వ్యాధులతో చికిత్స పొందుతున్న పిల్లల వివరాలు తెలుసుకుంటారు. డాక్టర్ అనుమతితో ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. చిన్నారుల కోరిక లు తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. కొడుకు కోరిక తీర్చలేక.. ఈ సంస్థకు ఆద్యులు ఉదయ్, గీతాజోషీ దంపతులు. వారి ముద్దుల కుమారుడు గాంధార్ లుకేమియాతో పోరాడుతూ 1996లో మరణించాడు. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాంధార్‌కు డిస్నీల్యాండ్ చూడాలన్న కోరిక. ఆ విషయం తెలుసుకొని కోరికను నిజం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ చివరి కోరిక తీరకుండానే ఆ బాలుడు కన్నుమూశాడు. ఆ బాధలోనే ఇండియాకు వచ్చేశారు. కన్నకొడుకు పోయాడన్న దుఃఖం.. తన చివరి కోరిక తీర్చలేకపోయామన్న ఆవేదన నుంచే ‘మేక్ ఎ విష్’ ఆలోచన పుట్టింది. గాంధార్ వంటి చిన్నారులకు ఆనందాన్ని అందించాలన్న లక్ష్యంతో 1996లో ముంబైలో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి ముఖాముఖి వరంగల్‌కు చెందిన శరత్‌కు హార్ట్ ప్రాబ్లమ్. ఈ కుర్రాడికి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. బెడ్ మీదున్న ఈ పిల్లాడు తనకు సీఎం కేసీఆర్‌ను కలవాలనుందని కోరాడు. విషయం తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’.. శరత్ సీఎంను కలవడానికి చకచకా ఏర్పాట్లు చేసేసింది. అయితే ఈ పరిస్థితుల్లో పిల్లాడ్ని కదల్చడం సరికాదన్నారు డాక్టర్లు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేసీఆర్ తానే స్వయంగా ఆస్పత్రికి చేరుకుని శరత్ కళ్లలో ఆనందం నింపారు. పవర్ స్టార్ కోసం.. ఖమ్మంలోని కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 13 ఏళ్ల శ్రీజ ‘బ్రెయిన్ ట్యూమర్’తో బాధపడుతోంది. ఈ చిన్నారికి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్‌ను కలిపించే ప్రయత్నం చేస్తోంది మేక్ ఎ విష్. శ్రీజను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్యులు వద్దనడంతో ఆ ప్రయత్నం విరమించింది. దీంతో పవన్‌కల్యాణే శ్రీజ దగ్గరికి రావాలని రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో పవర్ స్టార్ పాజిటివ్‌గా స్పందిస్తారని అనుకుంటున్నామని పుష్ప దేవీ జైన్ తెలిపారు. సెలిబ్రిటీలు ముందుకు రావాలి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న మూడు నుంచి 18 ఏళ్లలోపు వారి కోరికలను తీర్చేందుకు శ్రమిస్తున్నాం. వారికిష్టమైన వస్తువులను ఇస్తున్నాం.సెలిబ్రిటీలను కలిపిస్తున్నాం. తీర్థయాత్రలతో పాటు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. విమానంలో చక్కర్లు కొట్టిస్తున్నాం. ఆ సమయంలో వారి ముఖాల్లో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేం. ఈ చిన్నారుల సంతోషం కోసం సెలిబ్రిటీలు ముందుకు రావాలి. అప్పుడు ఆ చిన్నారుల కోరిక తీర్చినవారు అవుతారు. ఆనంద పరవశం.. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పదమూడేళ్ల స్వర్ణాంజలి.. సింగర్ శ్రావణభార్గవిని కలవాలనుందని ‘మేక్ ఎ విష్’తో షేర్ చేసుకుంది. అంతే ఆ చిన్నారి చికిత్స పొందుతున్న ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చి మరీ శ్రావణభార్గవి స్వర్ణాంజలికి తన మధుర గానాన్ని వినిపించింది. - డాక్టర్ పుష్ప దేవీ జైన్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్