Medical Journal
-
కదలండి బాస్!
నగరంతో పాటు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన తాజా సమాచారం ప్రకారం.. గత 2022లో ప్రతీ ఇద్దరు వయోజనులలో ఒకరు ఆరోగ్యానికి అవసరమైన కనీసపు శారీరక శ్రమ స్థాయిని కూడా అందుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా, శారీరక శ్రమ లేని పెద్దల శాతం 31% కాగా మన దేశంలో మాత్రం ఇది 49.4% గా ఉంది. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో 57 శాతం మంది కనీసపు శారీరక శ్రమకు సైతం దూరంగా ఉన్నారని అధ్యయనం తేల్చింది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి 59.9%కి చేరుతుందని రోగాల నిలయంగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిజికల్ యాక్టివిటీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలి కారణంగా పలు రకాల వ్యాధులకు చిరునామాగా నగరం మారబోతోందని గతంలోనే జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. నగరంలో 53.6 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని ఉస్మానియా ఆసుపత్రి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం అప్పట్లో ఇండియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురితమైంది. అదే విధంగా అబ్డామినల్ ఒబెసిటీ (పొత్తికడుపు పైన కొవ్వు పేరుకుపోవడం) అనేది మన నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోందని గత ఏడాది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. 15–49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు, పురుషుల్లో ఈ పరిస్థితికి కారణం నిశ్చల జీవన శైలేనని స్పష్టం చేసింది.శ్రమనోచని శరీరం.. వ్యాధుల కుటీరంఏదైనా సరే శారీరక కదలికను శారీరక శ్రమగా పరిగణిస్తారు. శరీరాన్ని కాకుండా మెదడుకు అధికంగా కలి్పంచే పని ఒత్తిడితో నగర జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీసుల్లో గంటల తరబడి పని, ఇంటికి ఆఫీసులకు మధ్య ప్రయాణం, వారాంతపు విరామంలో విశ్రాంతి.. ఇది శారీరక శ్రమ తగ్గిపోవడానికి పోషకాహార లోపాలకు దారితీసింది. శారీరక శ్రమ లోపం.. ప్రపంచ ఆరోగ్యానికి నిశ్శబ్ద ముప్పు, ఇది దీర్ఘకాలిక వ్యాధుల భారానికి గణనీయంగా దోహదం చేస్తుంది. అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రూడిగర్ క్రెచ్ అన్నారు. గుండెపోటు స్ట్రోక్‌లతో సహా çహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాక మధుమేహం, చిత్తవైకల్యం, రొమ్ము పెద్దపేగు క్యాన్సర్లు ముప్పు వీటన్నింటికీ దారి తీస్తుందంటున్నారు.అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ..దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు రక్త పరీక్షలు పోషకాహార మార్గదర్శకాల కోసం ప్రతిరోజూ దాదాపు 5–10 మంది నగర ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ ధోరణి పేలవమైన ఆహారపు అలవాట్లు అధిక ఒత్తిడి స్థాయిల కలయిక కారణమని, వీటన్నింటికీ మూలం నిశ్చల జీవనశైలి అని చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం ఆమ్లత్వంతో సహా రోగులలో జీర్ణాశయ సమస్యలు సర్వసాధారణంగా మారా యని చెప్పారు. అలాగే.. అధిక ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటు, డైస్లిపిడెమియా అధిక బరువుతో కూడిన మెటబాలిక్ సిండ్రోమ్ కేసులలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఈ పరిస్థితులకు అనారోగ్య జీవనశైలి, ఒత్తిడి క్రమరహిత నిద్ర విధానాలు కారణమని పేర్కొన్నారు. సరైన పోషకాహారం, వ్యాయామం ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.వర్కవుట్.. వ్యాధులు అవుట్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కథనం ప్రకారం.. వారానికి 150 నిమిషాల మితమైన–తీవ్రతతో కూడిన శారీరక శ్రమ లేదా 75 నిమిషాల తీవ్రమైన–తీవ్రతతో కూడిన శారీరక వ్యాయామంలో పెద్దలు పాల్గొనాలి. నడక, సైక్లింగ్, ఆటలు మాత్రమే కాదు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులు చేయడం కూడా శారీరకంగా చురుగ్గా ఉండటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. సాధారణ శారీరక శ్రమ మధుమేహం ప్రమాదాన్ని 17%, గుండె జబ్బులు, పక్షవాతం 19%, డిప్రెషన్, చిత్తవైకల్యం 28–32% అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాలను 8–28% తగ్గిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల్లో చురుకుదనం అవసరమైనంత పెరిగితే , ఏటా 4–5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా. కదలికల లోపానికి కారణాలెన్నో.. కోవిడ్ తర్వాత ఒక విధానంగా మారిపోయిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో వండిన భోజనం కంటే ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఇష్టపడటానికి ఫుడ్ డెలివరీ సేవల సౌలభ్యం దారితీసింది దాంతో విపరీతంగా పెరిగిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల వినియోగం, పెరిగిన రెడీ–టు–ఈట్ మీల్స్‌కు ప్రాధాన్యం వంటివి నిశ్చల జీవనశైలి పెరగడానికి కారణమని నగర వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు సిటీజనుల ఆహారపు అలవాట్లను తద్వారా ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయని నగరానికి చెందిన పోషకాహార నిపుణురాలు రుచికా చెప్పారు. ఇటీవల రకరకాల ఆరోగ్య సమస్యలు, శారీరక చురుకుదనం లోపించిన కారణంగా నిపుణులను సంప్రదించే వారిలో యువకుల సంఖ్య గణనీయంగా ఉండడం గమనార్హం అంటున్నారామె. 100 కిలోలకు దగ్గరగా ఉన్న 17–19 సంవత్సరాల నగర యువతకు ట్రీట్ చేశానని తెలిపారు. ఈ భయంకరపరిస్థితికి తీవ్రమైన నిశ్చల జీవనశైలి కారణమని స్పష్టం చేశారు. వీరిలో కొందరు ప్రీ–డయాబెటిస్ పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.కనీస నడక లేకుంటే కష్టాలే.. ప్రస్తుతం నగరవాసుల్లో చాలా మందికి కనీసపు శారీరక శ్రమ ఉండడం లేదు. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. మేం ప్రిస్క్రిప్షన్‌లో మందులు మాత్రమే కాదు వాకింగ్, వ్యాయామాల గురించి కూడా చెబుతున్నాం. ఓ వ్యక్తి రోజుకు కనీసం 5వేల నుంచి 6వేల అడుగులు నడవాలి. యుక్త వయసు్కలు 2వేల అడుగులు కూడా నడవడం లేదు. మరి రోగాలు రాకుండా ఎలా ఆపగలం? ముఖ్యంగా హృద్రోగాలు, హార్ట్ ఎటాక్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోవడానికి కదలిక లేని జీవనశైలే కారణం. ముందుగా 15 నుంచి 20 నిమిషాల నడకతో ప్రారంభించి ఏదైనా ఆసక్తి ఉన్న ఆటలు ఆడడం.. ఇలా శారీరక కదలికల్ని రోజువారీ జీవితంలో భాగం చేయాల్సిందే దీనికి ప్రత్యామ్నాయం లేదని అందరూ గుర్తించాలి. – డా.కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇనిస్టిట్యూట్ -
శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు. నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు. పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు. ‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు. కొసమెరుపు ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే! -
అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఉండాల్సిన దాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో సుమారు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు మూడు లక్షలమందికి పైగా సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: కూల్‌డ్రింక్స్ తాగితే.. శరీరం చల్లబడుతుందా? -
చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి.. ఆపరేషన్ సక్సెస్!
అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో వైద్య శాస్తంలో చోటు చేసుకున్న మార్పులు మాతృత్వం పొందలేని మహిళలకు సంతాన భాగ్యాన్ని కల్పిస్తున్నాయి. సరోగసి, గర్భసంచి మార్పిడి పద్ధతుల ద్వారా ఎంతో మందికి తల్లులుగా మారే అవకాశం లభిస్తోంది. అయితే ఇప్పటివరకు బతికి ఉన్న మహిళల నుంచి సేకరించిన గర్భసంచిని అవసరమైన మహిళలకు అమర్చడం ద్వారా వైద్యులు విజయం సాధించారు. ఇలాంటి కొన్ని కేసుల్లో బిడ్డ పుట్టగానే మరణించడమో, లేదా గర్భంలోనే చనిపోవడమో జరిగేది. ఈ క్రమంలో ఇటువంటి సమస్యలను అధిగమించడంతో పాటుగా... చనిపోయిన మహిళ నుంచి సేకరించిన గర్భసంచిని ఓ మహిళకు అమర్చి విజయం సాధించారు బ్రెజిల్ వైద్యులు. ఆమెకు జన్మించిన బిడ్డకు ప్రస్తుతం ఏడాది వయసు నిండటంతో పాటు.. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని.. వైద్య చరిత్రలోనే ఇది ఓ కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ‘ద లాన్సెట్ మెడికల్ జర్నల్’ ప్రచురించింది. పుట్టుకతోనే గర్భసంచి లేదు.. జన్యు లోపం కారణంగా ఓ మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. 4500 మందిలో ఒకరికి వచ్చే మేయర్-రాకిటాన్స్‌కీ-కస్టర్- హాసర్ అనే సిండ్రోమ్ కారణంగా ఆమెకు తల్లి అయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె వైద్యులను సంప్రదించారు. గర్భసంచి మార్పిడి చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చనిపోయిన 40 ఏళ్ల మహిళ నుంచి గర్భసంచిని సేకరించి 2016లో సదరు మహిళకు అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన ఆమె అదే ఏడాది డిసెంబరు 15న ఆడ శిశువుకు(సిజేరియన్ సెక్షన్) జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువు పెరిగిందని..పూర్తి ఆరోగ్యంతో ఉందని జర్నల్ పేర్కొంది. ఇది నిజంగా అద్భుతం.. చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి ద్వారా జన్మించిన బిడ్డ ఆరోగ్యంగా ఉండటం వైద్య చరిత్రలో చోటు చేసుకున్న గొప్ప పరిణామమని సావో పౌలో యూనివర్సిటీ హాస్పటల్ డాక్టర్ డానీ ఈజెన్‌బర్గ్ పేర్కొన్నారు. తాము నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో చనిపోయిన తర్వాత గర్భసంచిని దానం చేసే దాతల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా గతంలో అమెరికాలో ఇటువంటి ఆపరేషన్లు చేపట్టిన వైద్యులు విఫలమయ్యారు. చనిపోయిన మహిళల గర్భసంచి అమర్చడం ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం లభించినా పుట్టిన శిశువులంతా మరణించారు. ఇక గర్భసంచి మార్పిడుల ద్వారా మహిళలకు సంతానం పొందే అవకాశం విదేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆసియాలోనే తొలిసారిగా గర్భసంచి మార్పిడి అనంతరం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన చికిత్స ఈ ఏడాది పుణేలోని గెలాక్సీ కేర్ ఆస్పత్రిలో జరిగింది. అది కూడా తల్లి ఏ గర్భసంచి నుంచి జన్మించిందో.. బిడ్డ కూడా అదే గర్భసంచి నుంచి జన్మించడం విశేషం. -
మెడి క్షనరీ
అమ్మో! ఒకటి కాదు... ఐదు అట! అమ్మో! ఒక్కటి కాదు... ఇకపై ఐదు! ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కొత్త రకాలు...! ఇప్పటివరకూ ఒక్క రకం అంటేనే ఎంతో అందోళన. కానీ ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఐదుగా వర్గీకరించారు సైంటిస్టులు. ఇందుకోసం 259 మంది పురుషులపై పరిశోధనలు నిర్వహించి, వారిలో సాధారణంగా లేని అనేక క్రోమోజోములను పరిశీలించారు. ఈ పరిశీలనల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దోహదపడే 100 వేర్వేరు రకాల జన్యువులను పరిశీలించి, వాటి జెనెటిక్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ ఐదు రకాల ప్రోస్టేట్ క్యాన్సర్లను వర్గీకరించారు. ‘‘గతంతో పోలిస్తే దీని వల్ల ఇందులో ఏ రకం ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా తీవ్రమైనదో, ఏది కాస్తంత తీవ్రత తక్కువదో... ఇలా గుర్తించి, దానికి అనుగుణంగా ట్యూమర్ తీవ్రతను బట్టి చేయాల్సిన నిర్దిష్టమైన చికిత్సను నిర్ణయించే సౌలభ్యం డాక్టర్లకు కలుగుతుంద’’ని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లోని ఈ ఐదు రకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ‘ఇ-బయో మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లు పరిశోధకులు వెల్లడించారు. -
పెరిగే బరువు... తగ్గే ఆయువు!
హిట్ బై ఫ్యాట్ ఒక వ్యక్తి ఉండాల్సినదాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయాణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో 9,564 మంది స్థూలకాయం ఉన్నవారితో పాటు 3,04,011 మంది సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు.