అమ్మో! ఒకటి కాదు... ఐదు అట!
అమ్మో! ఒక్కటి కాదు... ఇకపై ఐదు! ప్రోస్టేట్ క్యాన్సర్‌లో కొత్త రకాలు...! ఇప్పటివరకూ ఒక్క రకం అంటేనే ఎంతో అందోళన. కానీ ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఐదుగా వర్గీకరించారు సైంటిస్టులు. ఇందుకోసం 259 మంది పురుషులపై పరిశోధనలు నిర్వహించి, వారిలో సాధారణంగా లేని అనేక క్రోమోజోములను పరిశీలించారు. ఈ పరిశీలనల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దోహదపడే 100 వేర్వేరు రకాల జన్యువులను పరిశీలించి, వాటి జెనెటిక్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ ఐదు రకాల ప్రోస్టేట్ క్యాన్సర్లను వర్గీకరించారు.
‘‘గతంతో పోలిస్తే దీని వల్ల ఇందులో ఏ రకం ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా తీవ్రమైనదో, ఏది కాస్తంత తీవ్రత తక్కువదో... ఇలా గుర్తించి, దానికి అనుగుణంగా ట్యూమర్ తీవ్రతను బట్టి చేయాల్సిన నిర్దిష్టమైన చికిత్సను నిర్ణయించే సౌలభ్యం డాక్టర్లకు కలుగుతుంద’’ని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లోని ఈ ఐదు రకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ‘ఇ-బయో మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరచినట్లు పరిశోధకులు వెల్లడించారు.
మెడి క్షనరీ
Published Wed, Aug 26 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement