బీబీసీ (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కేన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన తోపాటు బయటపడేల ఛారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రోగ్రాంకి మంచి స్పందన రావడమే గాక దిగ్విజయంగా జయప్రదమయ్యింది. వంద మందికి పైగా పురుషులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో భాగంగా ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి ఎనిమిదివేల పౌండ్స్‌కి పైగా సేకరించామని అన్నారు నిర్వాహకులు. నవంబరు నెల ప్రోస్టేట్ కేన్సర్‌కు సంబంధించి కావడంతో దీనిపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి..ఛారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రోస్టేట్ కేన్సర్ బాధితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికి గర్వకారణమని పలువురు ప్రసంశించారు.
ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు :
సత్యనారాయణ నోముల,సంజీవ్ అంకిరెడ్డి,రామ్ జయనతి,రవి మంచిరాజు,రవి మేకల,సత్యనారాయణ ఆవుల,శ్రీధర్ బేటి,రమేష్ బుక్క,తిరుమల కాగిత,గోవర్ధన వడ్లపంట్ల,సతీష్ చింతపండు,విశి మాణిక్ రెడ్డి తదితరులు. అలాగే ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు .
(చదవండి: న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్)
Comments
Please login to add a commentAdd a comment