పెరిగే బరువు... తగ్గే ఆయువు! | increase the longevity of the weight loss | Sakshi
Sakshi News home page

పెరిగే బరువు... తగ్గే ఆయువు!

Published Mon, May 4 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

పెరిగే బరువు...  తగ్గే ఆయువు!

పెరిగే బరువు... తగ్గే ఆయువు!

హిట్ బై ఫ్యాట్
 
ఒక వ్యక్తి ఉండాల్సినదాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయాణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో 9,564 మంది స్థూలకాయం ఉన్నవారితో పాటు 3,04,011 మంది సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు.

ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement